పద్దులలో కోరిన మొత్తాన్ని ఒక రూపాయికి తగ్గించాలనే తీర్మానం ఏది?
1. 104వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
1) 2020, జనవరి 25
2) 2020, జనవరి 1
3) 2020, ఫిబ్రవరి 10
4) 2020, మార్చి 1
2. తెలంగాణ హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
1) కోకా సుబ్బారావు
2) నూతలపాటి వెంకటరమణ
3) సతీష్ చంద్రశర్మ
4) హిమకోహ్లి
3. కింది భాషలకు ప్రాచీన హోదా కల్పించిన సరైన వరుస క్రమాన్ని గుర్తించండి?
1) తమిళం-మలయాళం-సంస్కృతం-తెలుగు
2) మలయాళం-తమిళం-తెలుగు- సంస్కృతం
3) తమిళం-సంస్కృతం-తెలుగు-మలయాళం
4) తెలుగు -తమిళం-సంస్కృతం – మలయాళం
4. ప్రస్తుతం ఎన్ని రాష్ర్టాల్లో స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఏర్పాటై ఉన్నాయి?
1) 7 2) 8 3) 9 4) 10
5. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ప్రధాన బెంచ్ ఎక్కడ ఉంది?
1) ముంబై 2) హైదరాబాద్
3) ఢిల్లీ 4) కోల్‌కతా
6. అడ్వకేట్ జనరల్ జీతభత్యాలు ఎవరు నిర్ణయిస్తారు?
1) రాష్ట్ర అసెంబ్లీ 2) పార్లమెంట్
3) రాష్ట్రపతి 4) గవర్నర్
7. జోనల్ కౌన్సిల్ ఉత్తర ప్రాంతీయ మండలి ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు?
1) పంజాబ్ 2) న్యూఢిల్లీ
3) చండీగఢ్ 4) హర్యానా
8. భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని హైకోర్టులు ఉన్నాయి?
1) 28 2) 25 3) 23 4) 22
9. రాజకీయ పార్టీ జారీచేసే విప్ కింది వారిలో ఎవరికి వర్తించదు?
1) పార్టీ అధ్యక్షుడు 2) సభాధ్యక్షుడు
3) ప్రధానమంత్రి 4) ముఖ్యమంత్రి
10. ప్రస్తుత లోక్‌సభ 17వ ప్రోటెం స్పీకర్ ఎవరు?
1) వీరేంద్ర కుమార్ 2) శ్రీ కమల్ నాథ్
3) సోమనాథ్ చటర్జీ 4) ఓంబిర్లా
11. 2003లో చేసిన 91వ రాజ్యాంగ సవరణ ప్రకారం కేంద్ర మంత్రివర్గంలోని మంత్రుల సంఖ్య ప్రధాన మంత్రితో కలిపి లోక్‌సభ సభ్యుల సంఖ్యలో ఎంత శాతానికి మించరాదు?
1) 20% 2) 15% 3) 25% 4)10 %
12. కింది వారిలో ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్‌నకు ఎక్స్ అఫీషియో చైర్మన్ ఎవరు?
1) రాజ్యసభ చైర్మన్ 2) లోక్‌సభ స్పీకర్
3) ప్రోటెం స్పీకర్ 4) రాష్ట్రపతి
13. ఈ కింది జాతీయ మహిళ కమిషన్ చైర్మన్ల సరైన వరుస క్రమాన్ని గుర్తించండి?
1) జయంతి పట్నాయక్ – పూర్ణిమా అద్వాని – మమతా శర్మ – లలిత కుమార మంగళం
2) పూర్ణిమా అద్వాని- జయంతి పట్నాయక్ మమతా శర్మ – లలిత కుమారమంగళం
3) మమతా శర్మ – పూర్ణిమా అద్వాని – జయంతి పట్నాయక్ – లలిత కుమారమంగళం
4) లలిత కుమార మంగళం- జయంతి పట్నాయక్- పూర్ణిమా అద్వాని- మమతా శర్మ
14. జోనల్ కౌన్సిల్లో దక్షిణ ప్రాంతీయ మండలి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1) అమరావతి 2) హైదరాబాద్
3) తిరువనంతపురం 4) చెన్నై
15. మొదటి పాలనా సంస్కరణల కమిషన్ తన నివేదికలోని 20 భాగాల్లో ఎన్ని సిఫార్సులను చేసింది?
1) 637 సిఫార్సులు 2) 537 సిఫార్సులు
3) 437 సిఫార్సులు 4) 480 సిఫార్సులు
16. ఎవరి నివేదికను శవపరీక్ష (Post mortem Report) తో పోలుస్తారు?
1) యూపీఎస్సీ నివేదిక
2) కాగ్ నివేదిక
3) ఎన్హెచ్ఆర్సీ నివేదిక
4) ఎన్నికల సంఘం నివేదిక
17. కేంద్ర రాష్ట్ర సంబంధాలను పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి కమిషన్?
1) మదన్ మోహన్ పూంచి
2) ఎం.సి. సెథల్వాడ్
3) కె. హనుమంతప్ప
4) రంజిత్‌సింగ్ సర్కారియా
18. కింది వాటిలో రాజ్యాంగేతర సంస్థ కానిది ఏది?
1) జాతీయ సమైక్యతా మండలి
2) జాతీయ మానవ హక్కుల కమిషన్
3) ఆర్థిక సంఘం 4) నీతి ఆయోగ్
19. రాజ్యాంగంలో న్యాయ సమీక్షకు అవకాశం కల్పించే ఆర్టికల్స్ ఏవి?
1) ఆర్టికల్ 13 2) ఆర్టికల్ 32
3) ఆర్టికల్ 226 4) పైవన్నీ
20. కిందివాటిలో సుప్రీంకోర్టు వ్యవహారాలు ఏవి?
1) రాజ్యాంగ పరిరక్షణ
2) రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలు
3) పునఃసమీక్షాధికారం 4) పైవన్నీ
21. విధాన పరిషత్ లేని రాష్ర్టాన్ని గుర్తించండి?
1) ఉత్తరప్రదేశ్ 2) పంజాబ్
3) కర్ణాటక 4) బీహార్
22. రాష్ట్ర పరిస్థితిని సమన్వయ పరిచేది ఎవరు?
1) గవర్నర్ 2) కేంద్ర ప్రభుత్వం
3) ముఖ్యమంత్రి 4) రాష్ట్ర క్యాబినెట్
23. ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి కిందివా టిలో తప్పుగా ఉన్న దానిని గుర్తించండి?
1. తీవ్ర ఆర్థిక సంక్షోభానికి గురైన సందర్భంలో విధిస్తారు
2. రాష్ట్రపతి ప్రకటించిన 2 నెలల్లోపు పార్లమెంటు ఉభయ సభలు సాధారణ మెజారిటీతో ఆమోదించాలి
3. ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించినా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతాలు తగ్గించరాదు
4. ఆర్థిక అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి తగిన ఆదేశాలను జారీ చేయవచ్చు
24. 1977లో జాతీయ అత్యవసర పరిస్థితులను రద్దు చేసిన తాత్కాలిక రాష్ట్రపతి ఎవరు?
1) మహ్మద్ హిదయతుల్లా
2) వి.వి. గిరి
3) బి.డి. జెట్టి
4) ఫక్రుద్దీన్ అలీ అహ్మద్
25. రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి విధించాలంటే?
1) రాష్ట్రపతి విచక్షణాధికారం
2) కేంద్ర క్యాబినెట్ లిఖిత పూర్వక సలహా
3) ప్రధాని సలహా మేరకు
4) ఉపరాష్ట్రపతి సలహా మేరకు
26. ఖైదీలు కూడా ప్రాథమిక హక్కులకు అర్హులే అని పేర్కొన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు?
1) పి. ఎస్. భగవతి 2) ఎన్. వి. రమణ
3) పి. సదాశివం 4) రంగనాథ్ మిశ్ర
27. కింది వారిలో ఎవరికి పదవీ విరమణ ప్రయోజనాలు ఉండవు?
1) ఎన్నికల కమిషనర్
2) రాష్ట్రపతి
3) గవర్నర్
4) త్రివిధ దళాల అధిపతి
28. 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల వరకు దిగువసభలో (లోక్ సభలో) ఎస్సీ/ఎస్టీల రిజర్వేషన్లు కొనసాగుతాయని మార్పు చేసారు?
1) 60 2) 80 3) 90 4) 100
29. పార్లమెంట్ సమావేశాల్లో అతి తక్కువ కాలం జరిగే సెషన్ ఏది?
1) వర్షాకాల సమావేశాలు
2) శీతాకాల సమావేశాలు
3) బడ్జెట్ సమావేశాలు 4) ఏదీకాదు
30. ఒక సంవత్సర కాలంలో పార్లమెంట్ అత్యధికంగా ఎన్నిసార్లు సమావేశం కావొచ్చు?
1) మూడు సార్లు 2) నాలుగు సార్లు
3) ఆరు సార్లు 4) పరిమితి లేదు
31. ప్రైవేట్ బిల్లుకు సంబంధించి కింది వాటిలో తప్పుగా ఉన్నది గుర్తించండి?
1) ఇవి మంత్రులు కాకుండా ఇతర సభ్యులు ప్రవేశ పెడతారు
2) ఇవి శుక్రవారం మాత్రమే ప్రవేశ పెట్టాలి.
3) పబ్లిక్ బిల్లుల వలె ప్రభుత్వ ప్రతిష్ఠతో ముడి పడి ఉండవు.
4) ప్రైవేట్ బిల్లులకు సమష్టి బాధ్యతా సూత్రం వర్తిస్తుంది
32. ఒక రాష్ట్రంలో విధాన పరిషత్ ఏర్పాటు చేయాలంటే?
1. రాష్ట్ర శాసనసభకు హాజరైన మొత్తం సభ్యులలో 2/3 వంతు ఓటింగ్ ద్వారా తీర్మానాన్ని అమోదించాలి.
2) ఆ విధంగా ఆమోదించిన వారి సంఖ్య మొత్తం సభ సభ్యుల్లో సగం కంటే ఎక్కువగా ఉండాలి
3) ఆ తీర్మానాన్ని పార్లమెంట్ కూడా సాధారణ మెజార్టీతో ఆమోదించాలి
4) పైవన్నీ సరైనవే
33. పార్లమెంట్లో బడ్జెట్ ప్రక్రియ ఎన్ని దశలలో ఉంటుంది?
1) 4 2) 7 3) 8 4) 6
34. పార్లమెంట్ ఆర్థిక సంబంధమైన అధికారాల్లో కింది వాటిలో లేనిది?
1) కేంద్ర ఆగంతుక నిధిని ఏర్పాటు చేయటం
2) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌ను తొలగించటం
3) కాగ్ నివేదికను పరిశీలించటం
4) బడ్జెట్‌ను ఆమోదించటం
35. భారత రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఉండే నిధి ఏది?
1) భారత అగతుక నిధి
2) భారత సంఘటిత నిధి
3) భారత ప్రభుత్వ ఖాతా
4) పీ.ఎం. ఆర్
36. బిల్లులను గిలిటెన్ చేసి అన్ని బిల్లులను మూకుమ్మడిగా ఆమోదిస్తే దానిని ఏమంటారు?
1) సమాపన ఓటింగ్
2) ఈల్డింగ్ ది ఫ్లోర్
3) గ్యాలిప్ పోల్
4) గెర్రి మాండరింగ్
37. పద్దుల్లో కోరిన మొత్తాన్ని ఒక రూపాయికి తగ్గించవలసిందిగా ఏ తీర్మానం ద్వారా కోరుతారు?
1) విధాన కోత తీర్మానం
2) నామమాత్రపు కోత తీర్మానం
3) ఆర్థిక కోత తీర్మానం 4) ఏదీకాదు
38. ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ ఏర్పడటానికి కారణమైన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అధ్యక్షుడు?
1) పి.సి. ఛాఖో 2) శరద్ పవార్
3) ప్రకాశ్మణి త్రిపాఠి
4) రాంనివాస్ మీర్ధా
39. విజ్ఞాపన (లేదా) అంబుడ్స్‌మన్ పార్లమెంటరీ కమిటీలో ఎంత మంది సభ్యులు ఉంటారు?
1) 20 2) 15 3) 30 4) 25
40. ఉభయ సభల సంయుక్త సమావేశానికి లోక్‌సభ స్పీకర్ అందుబాటులో లేకపోతే …?
1) సంయుక్త సమావేశం రద్దవుతుంది
2) సంయుక్త సమావేశం వాయిదా వేస్తారు.
3) సమావేశంపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారు
4) లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు
41. లోక్‌సభలో ప్రతిపక్షహోదా కావాలంటే ఎంత శాతం సీట్లు సాధించాలి?
1) 5% 2) 10% 3) 15% 4) 20%
42. రాజ్యమనే నౌకకు ప్రధాన మంత్రి కెప్టెన్ అని అన్నది ఎవరు?
1) మన్రో 2) ఐవర్ జెన్నింగ్స్
3) రామ్సే మ్యూర్ 4) బి.ఆర్. అంబేద్కర్
43. ఎవరి సలహా మేరకు రాష్ట్రపతి లోక్‌సభను రద్దు చేస్తారు?
1) ప్రధాని 2) కేంద్ర క్యాబినెట్
3) పార్లమెంట్
4) రాష్ట్రపతి విచక్షణ మేరకు
44. ప్రధాని రాజీనామా చేయవలసిన సందర్భాల్లో తప్పుగా ఉన్నది గుర్తించండి?
1) లోక్‌సభలో ద్రవ్యబిల్లును తిరస్కరించినపుడు
2) బడ్జెట్‌పై కోత తీర్మానం ఓడినపుడు (వీగిపోయినపుడు)
3) లోక్‌సభలో మంత్రి మండలిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు
4) లోక్‌సభలో విశ్వాసం పొందగోరిన ఆ తీర్మానం మెజారిటీ లభించినపుడు
45. ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్రపతి ఎవరు?
1) జ్ఞానీ జైల్‌సింగ్
2) ఏపీజే అబ్దుల్ కలాం
3) కె.ఆర్. నారాయణ్
4) నీలం సంజీవరెడ్డి
46. రాష్ట్రపతి పదవి దేశ సమైక్యతకు ప్రతీక అని అభిప్రాయపడ్డ రాష్ట్రపతి ఎవరు?
1) ఆర్. రాజేంద్ర ప్రసాద్
2) డా. సర్వేపల్లి రాధాకృష్ణన్
3) జాకీర్ హుస్సేన్ 4) వి.వి. గిరి
47. పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణి సంరక్షణ చేయాలని చెబుతున్న ఆర్టికల్ ఏది?
1) 39 (A) 2) 39 (F)
3) 43 (A) 4) 48 (A)
48. 97వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించినది?
1) జంతువుల సంరక్షణ
2) ఉచిత న్యాయసహాయం
3) సహకార సంఘాలు
4) వస్తుసేవల పన్ను
49. ఆదేశిక సూత్రాల గురించి తప్పుగా ఉన్నదానిని గుర్తించండి?
1) సామాజిక ఆర్థిక పరిరక్షణను పెంపొందిస్తాయి
2) సమాజ సమష్టి ప్రయోజనాలకు ఉద్దేశించినవి
3) రాజకీయ ప్రజాస్వామ్యాన్ని పెంపొందిస్తాయి
4) వీటిపై అత్యవసర పరిస్థితి ప్రభావం ఉండదు
50. ప్రాథమిక హక్కుల గురించి సరైనవి గుర్తించండి?
1) వ్యక్తి వికాసానికి దోహదం చేస్తాయి
2) దేశాన్ని ప్రజాస్వామ్య రాజ్యంగా మార్చడానికి తోడ్పడుతాయి
3) వీటి కోసం న్యాయస్థానాలకు వెళ్లి న్యాయం పొందవచ్చు
4) పైవన్నీ సరైనవే.
51. న్యాయమూర్తులను తొలగించే ప్రక్రియను నియంత్రించే అధికారం ఎవరికి కలదు?
1) రాష్ట్రపతి 2) పార్లమెంట్
3) ప్రధాని 4) కేంద్ర మంత్రిమండలి
52. 6 సంవత్సరాల్లోపు బాలలకు రాజ్యం సంరక్షణతోపాటు విద్యను కూడా అందిం చాలని చేసిన రాజ్యాంగ సవరణ?
1) 86వ రాజ్యాంగ సవరణ
2) 97వ రాజ్యాంగ సవరణ
3) 44వ రాజ్యాంగ సవరణ
4) 85వ రాజ్యాంగ సవరణ
53. కింది వాటిలో 12వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చని ఆర్టికల్?
1) ఆర్టికల్ 39(A) 2) ఆర్టికల్ 39(F)
3) ఆర్టికల్ 48(A) 4) ఆర్టికల్ 16 (4A)
54. అగ్రవర్ణ పేదల్లో ఆర్థికంగా వెనుకబడిన తర గతులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతానికి మించకుండా రిజర్వేషన్లు కల్పించిన రాజ్యాంగ సవరణ ఏది?
1) 99వ రాజ్యాంగ సవరణ
2) 101వ రాజ్యాంగ సవరణ
3) 102వ రాజ్యాంగ సవరణ
4) 103వ రాజ్యాంగ సవరణ
55. ప్రాతిపదికపై విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది?
1) చంపకం దొరైరాజన్
2) ఎం.ఆర్. బాలాజి
3) చిరంజిత్ లాల్
4) బిన్నెట్ కోల్మెన్
56. ప్రభుత్వ ఉద్యోగాల్లో పౌరులందరికి సమాన అవకాశాలు అని తెలుపుతున్న ఆర్టికల్?
1) 16(5) 2) 15(1)
3) 16(1) 4) 17
57. అస్పృశ్యతా దురాచారాన్ని నిషేధిస్తూ దానిని నేరంగా పరిగణిస్తూ పార్లమెంటు ఏ సంవత్స రంలో చట్టం చేసింది?
1) 1951 2) 1953
3) 1955 4) 1957
సమాధానాలు
1-1 2-3 3-3 4-3 5-3 6-4 7-2 8-2 9-2 10-1 11-2 12-2 13-1 14-4 15-2 16-2 17-4 18-3 19-4 20-4 21-2 22-3 23-3 24-3 25-2 26-1 27-3 28-2 29-2 30-4 31-1 32-4 33-4 34-2 35-1 36-1 37-1 38-2 39-4 40-4 41-2 42-1 43-1 44-2 45-4 46-2 47-4 48-3 49-3 50-4 51-2 52-1 53-4 54-4 55-1 56-3 57-3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు