తెలంగాణ బడ్జెట్ 2019-20 ప్రాధాన్యతాంశాలు ఇవే..!

ప్రధాన కేటాయింపులు
-నీటిపారుదల శాఖకు రూ.22,500 కోట్లు
-వ్యవసాయ శాఖకు రూ.20,107 కోట్లు
-ఆసరా పింఛన్ల కోసం రూ.12,067 కోట్లు
-రైతుబంధు పథకానికి రూ.12,000 కోట్లు
-రైతు రుణమాఫీకి రూ.6,000 కోట్లు
-రైతుబీమా పథకానికి రూ.650 కోట్లు
-వైద్య ఆరోగ్య శాఖకు రూ.5,536 కోట్లు
-బియ్యం సబ్సిడీకి రూ.2,744 కోట్లు
-మైనార్టీల అభివృద్ధికి రూ.2,004 కోట్లు
-నిరుద్యోగ భృతికి రూ.1,810 కోట్లు
-కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ రూ.1,450 కోట్లు
-ఎస్సీ, ఎస్టీల ప్రగతినిధులకు రూ.26,408 కోట్లు
పల్లెలకు సొగసులు
-ప్రతి గ్రామానికి తారు రోడ్లు, ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి అనుగుణంగా గ్రామీణాభివృద్ధికి నిధులు కేటాయించారు. తాజా బడ్జెట్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 19,159 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో 15,563 కోట్లు అదనంగా కేటాయించారు. బడ్జెట్లో కేటాయించిన నిధులు బీటీ రోడ్డు, పంచాయతీ కార్యాలయాల నిర్మాణాలు, హరితహారం, శ్మశాన వాటికల నిర్మాణం, వీధిలైట్లు, డ్రైనేజీ నిర్మాణాలకు వాడనున్నారు.
ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకు
-ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టడంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎలా ఉంటాయో? ఏయే రంగాలకు కేటాయింపులు ఎంత ఉంటాయో? కేంద్ర ప్రాయోజిత పథకాలు ఎలా ఉండబోతున్నాయి? తదితర విషయాలపై స్పష్టత లేదు. అందువల్ల రాష్ట్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎన్నికల తర్వాత కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రంలో కూడా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు.
బడ్జెట్ పదజాలం
-బడ్జెట్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆదాయ, వ్యయాల వివరాలను తెలిపే ద్రవ్య సంబంధ నివేదికను బడ్జెట్ అంటారు. పన్ను విధింపు పరిధి, ప్రభుత్వ వ్యయ పరిమాణం, వివిధ ప్రభుత్వ కార్యకలాపాలకు ఇచ్చిన ప్రాముఖ్యతలు, వనరుల కేటాయింపులు, ఆర్థిక వ్యవస్థ స్థితి, కోశ విధానం ద్వారా ప్రభుత్వం సాధించాల్సిన లక్ష్యాలను బడ్జెట్ ప్రతిబింబిస్తుంది.
-లోటు బడ్జెట్: ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా చూపే ఆర్థిక నివేదికను లోటు బడ్జెట్ అంటారు.
-మిగులు బడ్జెట్: ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే ఖర్చులు తక్కువగా చూపే ఆర్థిక నివేదికను మిగులు బడ్జెట్ అంటారు.
-సంతులిత బడ్జెట్: ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు, వ్యయాలు సమానంగా ఉండే ఆర్థిక నివేదికను సంతులిత బడ్జెట్ అంటారు.
-ఓటాన్ అకౌంట్ బడ్జెట్: బడ్జెట్లోని వివిధ పద్దులను పరిశీలించి ఆమోదించడానికి కొంత వ్యవధి అవసరం. కాబట్టి ప్రభుత్వం గ్రాంట్లను ముందుగా పొందే అవకాశాన్ని ఓటాన్ అకౌంట్ అంటారు.
-ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పేదల సంక్షేమం కోసం, వ్యవసాయం కోసం అత్యధిక నిధులను కేటాయిస్తూ అన్నదాతకు దన్నుగా, కులవృత్తులకు భరోసాగా, బడుగు వర్గాలకు బాసటగా, పేదలకు ఆసరాగా, నిరుద్యోగులకు చేయూతనిస్తూ ఫిబ్రవరి 22 ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర శాసనసభలో ఆర్థిక మంత్రి హోదాలో కేసీఆర్, శాసనమండలిలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంవూతిగా ఉంటూనే ఆర్థికశాఖ బాధ్యతలను నిర్వహిస్తూ తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కింది. 76 అంశాలతో ముడిపడి ఉన్న దీన్ని కొత్తగా ఎలాంటి పన్నులు వేయకుండానే రూపొందించారు.
రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం
-సమైక్య పాలనలో 2013-14లో తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధి రేటు 4.2 శాతం కాగా, ప్రస్తుతం 201-19లో 10.6 శాతానికి చేరింది. 201-19 రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) ,66,75 కోట్లుగా అంచనా. అలాగే ప్రాథమిక రంగం 10.9 శాతం వృద్ధిరేటు, పారిక్షిశామిక, ఉత్పత్తి రంగాల్లో ప్రస్తుత ధరల్లో 14.9 శాతం వృద్ధి రేటు, సేవారంగంలో 15.5 శాతం వృద్ధిరేటు నమోదయ్యే అవకాశం ఉన్నది. రాష్ట్ర తలసరి ఆదాయంలో వృద్ధిరేటు 13. శాతంగా, ఇది జాతీయ తలసరి ఆదాయం కంటే .6 శాతం ఎక్కువ. 2017-1లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1,1,102 కాగా, 201-19లో రూ. 2,06,107కు చేరుకుంటుందని తద్వారా 13. శాతం పెరుగుదల సూచిస్తుందని అంచానా.
-అర్హులైన నిరుద్యోగులందరికీ సుమారుగా 5 లక్షల మందికి ప్రతి నెల నిరుద్యోగభృతి రూ. 3016. దీనికి బడ్జెట్లో రూ. 110 కోట్లు కేటాయింపు.
-రాష్ట్రంలోని 12,571 గ్రామాలకు రూ. లక్షలతో తారు రోడ్డు
-పంచాయతీలకు రెండు ఫైనాన్స్ కమిషన్ల కింద రూ. 3,256 కోట్లు
-ఒక్కో మనిషికి రూ.1,606 చొప్పున ఫైనాన్స్ కమిషన్ నిధులు
-టీఎస్ ఐపాస్ ద్వారా రూ.1.41 లక్షల కోట్ల పెట్టుబడులు
-టీఎస్ ఐపాస్ ద్వారా ,419 పరివూశమలకు అనుమతులు
-ఏప్రిల్ చివరినాటికి మిషన్ భగీరథ పనులు పూర్తి
-మరో రెండు నెలల్లో ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీరు
-పరిక్షిశమ ద్వారా .5 లక్షల ఉద్యోగాల భర్తీ
-బీసీలకు మరో 119 రెసిడెన్షియల్ స్కూల్స్
-డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి రూ. 4,709 కోట్లు.
రుణమాఫీ
-201, డిసెంబర్ 11లోపు తీసుకున్న రుణాలు గతంలో మాదిరిగా నాలుగు దఫాలుగా మాఫీ చేస్తామని ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే రూ. లక్ష వరకు మాఫీ చేస్తామన్న హామీకి అనుగుణంగా ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్లో రూ. 6 వేల కోట్లు కేటాయించారు. మొత్తం నాలుగు విడతలుగా రూ. 24 వేల కోట్లు అన్నదాతల రుణవిముక్తి పథకానికి కేటాయిస్తున్నారు. అర్హులైన రైతులను గుర్తించేందుకు గత ఏడాది డిసెంబర్ 11వ తేదీని కటాఫ్ గుర్తించారు. గతంలో నాలుగు విడతలుగా మొత్తం 16,124 కోట్లు విడుదల చేసి 35,29,994 మంది రైతులను రుణ విముక్తులను చేశారు. ప్రస్తుతం ఆ సంఖ్య 40 లక్షల వరకు చేరవచ్చని అంచనా.
హరితహారం
-ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్లో అటవీశాఖకు రూ. 342.47 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్ కంటే రూ. 12 కోట్లు అధికం. ప్రస్తుత బడ్జెట్ కేటాయింపుల్లో భూసార జలసంరక్షణ, అడవులు, వన్యవూపాణి సంరక్షణ, పర్యావరణం, శాస్త్రీయ పరిశోధనలన్నింటికి రూ. 342 కోట్లు కేటాయించారు. రాష్ట్ర విస్తీర్ణంలో అడవులు 26.90 వేల చ.కి.మీ. విస్తరించాయి. రాష్ట్ర వైశాల్యంలో 25 శాతం అడవులు ఉన్నాయి.
వైద్యం
-తాజా బడ్జెట్లో వైద్య ఆరోగ్యశాఖకు రూ. 5,536 కోట్లు కేటాయించారు. వీటిలో కేసీఆర్ కిట్ పథకం కింద తల్లిబిడ్డల సంక్షేమం కోసం 15 శాతం నిధులు పెంచుతున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యుత్తమ వైద్య సేవలతో మూడో స్థానంలో నిలచింది. అందరికీ వైద్యం అందుబాటులో భాగంగా రాష్ట్ర రాజధానిలో 10 వేల మందికి ఒకటి చొప్పున బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే రాష్ట్ర రాజధానిలో 40 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారు. బస్తీ దవాఖానాల్లో ప్రాథమిక వైద్యం, రోగ నిర్ధారణ పరీక్షలతోపాటు ఉచితంగా మందులు ఇస్తారు. రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలు విస్తరించేందుకు కొత్తగా నాలుగు వైద్య కళాశాలలు మంజూరు చేయగా సిద్దిపేట, మహబూబ్‌నగర్‌లో వైద్యకళాశాలలు ప్రారంభమయ్యాయి. నల్లగొండ, సూర్యాపేటలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమవుతాయి. ఉమ్మడి రాష్ట్రంలో 10 జిల్లాల్లో మందుల కొనుగోళ్లకు రూ. 146 కోట్లు కేటాయిస్తే, ప్రస్తుతం ఏటా రూ. 440 కోట్లు కేటాయిస్తున్నారు. వైద్యానికి ఇచ్చే ప్రాధాన్యత మూలంగా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య 33 నుంచి 49 శాతానికి పెరిగింది. శిశు మరణాల రేటు ప్రతి వేయి మందికి 39 నుంచి 29కి తగ్గించారు. మాతా మరణాల రేటు 91 నుంచి 70కి తగ్గింది. కంటి వెలుగు పథకంలో భాగంగా 1.52 కోట్ల మందికి పరీక్ష చేసి 50 లక్షల మందికి అద్దాలు ఇచ్చారు.
కల్యాణలక్ష్మి
-సీఎం కేసీఆర్ మానస పుత్రిక కల్యాణలక్ష్మి పథకం, పేద కుటుంబాలకు చెందిన యువతుల వివాహానికి ఆర్థిక సాయం కోసం, ముస్లిం కుటుంబాల్లోని పేద యువతుల వివాహానికి షాదీ ముబారక్ పేరుతో ప్రారంభించారు. తాజా బడ్జెట్లో ప్రతి ఒక పేద యువతికి రూ. 1,00,116లు అందించేందుకు తాజా బడ్జెట్లో కల్యాణలక్ష్మీకి, షాదీముబారక్‌కు రూ. 1,450 కోట్లు కేటాయించారు. గత ఐదేండ్ల నుంచి కల్యాణలక్ష్మి పథకంపై హెచ్చించిన మొత్తం రూ. 2,606 కోట్లు కేటాయించగా, 4.2 లక్షల మంది లబ్ధి పొందారు. ప్రస్తుతం 66 వేల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. ఈ పథకం వల్ల బాల్య వివాహాలు తగ్గి ఉన్నత విద్యను అభ్యసించే బాలికల సంఖ్య పెరిగింది.
వ్యవసాయరంగం
-నిరంతరం శ్రమించే అన్నదాతకు అండగా ఉండటంకోసం బడ్జెట్లో సింహభాగం వ్యవసాయరంగానికి కేటాయిస్తూ రైతుల పక్షపాతి అనిపించుకున్నాడు. రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాదిలో కేటాయించిన బడ్జెట్ కంటే ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు రెట్లు అధికంగా కేటాయించింది. ఈ బడ్జెట్లో రూ. 20,107 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ కంటే అదనంగా రూ. 4,596 కోట్లు పెంచారు. వీటిలో రైతుబంధు పథకానికి రూ. 12 వేల కోట్లు, రైతు బీమా పథకానికి రూ. 650 కోట్లు, రుణమాఫీ పథకానికి రూ. 6 వేల కోట్లు కేటాయించారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి సాధించేందుకు ఒక్కో రైతుకు మూడెకరాల్లో హరిత పందిరి నిర్మాణానికి రూ. 1 లక్షలు వరకు రాయితీ ఇవ్వడం ఈ పథకం ప్రత్యేకత.
-ప్రభుత్వ పథకాలను రైతులకు వేగంగా అందించడం కోసం ప్రతి ఐదు ఎకరాలకు ఒక ఏఈవో చొప్పున 1526 ఏఈవోల నియామకం, రైతు పండించిన పంటలను నిల్వ చేసుకోవడానికి 22.50 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్న గోదాములను నిర్మిచింది.
వ్యవసాయంపై ఖర్చు చేసింది ఇలా..
ఆర్థిక సంవత్సరం కేటాయింపులు (రూ. కోట్లలో)
2014-15 6,602.10
2015-16 4,709.31
2016-17 4,09.91
2017-1 6,994.15
201-19 15,511.56
శూన్య బడ్జెట్: గత సంవత్సర బడ్జెట్ అంశాలతో సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం కొత్తగా ఆ సంవత్సరం అంచనాల ప్రకారం తయారు చేసే బడ్జెట్. దీన్ని మొదట ప్రతిపాదించింది అమెరికాకు చెందిన పీటర్ పైర్. మన దేశంలో 195-7లో ప్రవేశపెట్టిన అది కొనసాగలేదు.
ప్రభుత్వ రాబడి: పౌరుల ఖర్చు కోసం, పరిపాలన కోసం, పౌరుల నుంచి గ్రహించిన మొత్తాన్ని ప్రభుత్వ రాబడి అంటారు.
ప్రభుత్వ వ్యయం: దేశ రక్షణ కోసం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం, పౌర శ్రేయస్సును రక్షించడం కోసం, అభివృద్ధి చేయడానికి పెట్టిన ఖర్చులను ప్రభుత్వ వ్యయం అంటారు.
మూలధన వ్యయం: నీటిపారుదల ప్రాజెక్టులు, పరిక్షిశమలు, విద్యుత్ ప్రాజెక్టులు, జాతీయ రహదారుల వంటి వాటి నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని మూలధన వ్యయం అంటారు.
రెవెన్యూ లోటు: రెవెన్యూ వసూళ్లకు రెవెన్యూ వ్యయానికి మధ్య ఉన్న తేడా
ద్రవ్యలోటు: ప్రభుత్వ ఖర్చులకు రుణేతర రెవెన్యూ మార్గాల ద్వారా వచ్చే ఆదాయానికి మధ్య ఉండే తేడాను ద్రవ్యలోటు అంటారు.
రెవెన్యూ లోటు: రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉంటే రెవెన్యూలోటు అంటారు.
కోశ లోటు: బడ్జెట్ లోటుకు మార్కెట్ రుణాలు కలిపితే కోశలోటు వస్తుంది.
ప్రాథమిక లోటు: కోశ లోటు, వడ్డీ చెల్లింపులకు మధ్య ఉన్న తేడానే ప్రాథమిక లోటు అంటారు.
విద్యుత్ రంగం
-ప్రస్తుతం తలసరి విద్యుత్ వినియోగంలో అగ్రస్థానంలో ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి విద్యుత్పత్తి 7,77 మెగావాట్ల సామర్థ్యం ఉన్నది. ప్రస్తుతం మన రాష్ట్రంలో విద్యుత్పత్తి సామర్థ్యం 16,503 మెగవాట్లకు చేరింది. కొత్తగూడెం-భవూదావూదిలో 41 నెలల్లో 00 మెగవాట్ల కేటీపీఎస్‌ను పూర్తిచేశారు. భద్రాద్రిలో 100 మెగావాట్లు, యాదాద్రి 4వేల మెగావాట్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. సౌరశక్తి 3,613 మెగావాట్ల ఉత్పత్తితో దేశంలోనే కర్ణాటక తర్వాత తెలంగాణ రెండో స్థానంలతో ఉంది. విద్యుత్ రంగానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కింద రూ. 4,006.92 కోట్లు కేటాయించారు. రాష్ట్ర అవతరణకు ముందు కరెంట్ కోతలతో ఇబ్బంది పడుతుంటే, ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ఏమి లేకుండానే గృహ, వాణిజ్య, పారిక్షిశామిక రంగాలకు నిరంతరాయంగా, రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్‌ను అందించి దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ రాష్ట్రం నిలిచింది. విద్యుత్ వినియోగంలో ప్రథమస్థానంలో ఉంది
-స్వీయ ఆదాయంలో 17.17 శాతం వృద్ధి రేటు సాధించి దేశంలో అగ్రస్థానంలో నిలిచింది.
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు