Telangana Revenue act | తెలంగాణ నూతన రెవెన్యూ చట్టం -2020

తెలంగాణ నూతన రెవెన్యూ చట్టం -2020
- తెలంగాణ భూ హక్కుల రికార్డు (రికార్డ్ ఆఫ్ రైట్స్- ROR)ను నిర్వహించడం 1936 నుంచి ప్రారంభమైంది.
- నిజాం పరిపాలన కాలంలో హక్కుల రికార్డు నిర్వహణ కోసం భూమి హక్కుల రికార్డు చట్టం 1346 ఫస్లీని రూపొందించారు.
- హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1948లో హైదరాబాద్ భూ హక్కుల రికార్డు రెగ్యులేషన్ 1358 ఫస్లీ పేరుతో మరో కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు.
- ఈ చట్టాన్ని రద్దు చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1971లో భూ హక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల చట్టం చేశారు. ఈ చట్టం కింద ‘1బి’ పేరుతో హక్కుల రికార్డును రూపొందించి నిర్వహిస్తున్నారు.
- ఈ చట్టానికి 1989లో ఒక సవరణ తీసుకొచ్చారు. ఈ చట్టం స్థానంలో మార్పులు చేర్పులతో ఉన్నతీకరిస్తూ సవరణ చట్టం రికార్డు ఆఫ్ రైట్స్-2020ను రూపొందించారు.
- పాత చట్టాల ప్రకారం భూమికి ఒకసారి హక్కులు మాత్రమే కల్పించే వీలుంది.
- కానీ నూతన చట్టంలో నిత్యావసరాలకు వీలుగా హక్కుల మార్పిడి కలుగుతుంది. అలాగే సాంకేతిక ఆధారంగా రెవెన్యూ పరిపాలనను నిర్వహించటానికి కొత్త చట్టం వీలు కల్పిస్తుంది.
- తెలంగాణ ప్రభుత్వం ‘ధరణి’లో నిర్వహిస్తున్న ఆన్లైన్ రికార్డులనే భూ హక్కుల రికార్డుగా ప్రకటిస్తూ భూమి హక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల చట్టం-2020ను తీసుకొచ్చింది.
Next article
MATHS | J.R INTER MATHS MODEL PAPERS
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు