-మానవుని జీవన విధానంలో తక్కువగా ఉపయోగపడే వాటిని చిరు ధాన్యాలు అంటారు.
ఉదా-1: జొన్నలు (జావర్)-సోర్గం వల్గేర్
-వీటిని గ్రేట్ మిల్లెట్ అంటారు.
ఉదా-2: సజ్జలు (బాజ్రా)-పెన్నిసెటం టైఫాయిడం
-ఇవి పురాతన ధాన్యపు మొక్కలు.
-వీటిని పెరల్ మిల్లెట్ అంటారు.
ఉదా-3: రాగులు – ఇల్యుసైన్ కొరకానా
-వీటిని ఫింగర్ మిల్లెట్ అంటారు.
గమనిక: కలుషిత ధాన్యాలను ఆహారంగా తీసుకోవడంవల్ల ఎర్గాటిజమ్ అనే వ్యాధి కలుగుతుంది. క్లావిసెప్స్ అనే శిలీంధ్రం ఈ వ్యాధిని కలుగజేస్తుంది.
2. పప్పు దినుసులు/అపరాలు
-ఇవి ప్రధాన ప్రొటీన్ వనరులు.
-పప్పు దినుసులు ఎక్కువగా ఫాబేసి, లెగ్యుమినేషి కుటుంబపు మొక్కల నుంచి లభిస్తాయి.
ఉదా: 1. కందులు (కజానస్ కజాన్), 2. పెసర్లు, 3. మినుములు, 4. కేసరి పప్పు (లాథిరస్ సటైవస్), 5. బఠానీ, 6. చిక్కుడు, 7. సోయాబీన్స్ (ైగ్లెసిన్ మాక్స్) మొదలైనవి.
గమనిక: కేసరిపప్పు గింజలు తింటే ఎముకలు, నాడుల క్షీణత వస్తుంది. దీన్నే లాథిరిజం అంటారు.
3. నూనెలు
-నూనె గింజలను గానుగ పట్టి నూనె తీస్తారు.
-నూనె తీయగా మిగిలిన పదార్థాన్ని గానుగ చెక్క అంటారు. దీన్ని పశువులకు దాణాగా వాడుతారు.
-పామె, లెగ్యుమినేషి, బ్రాసికేసి, ఆస్టరేసి, యుఫర్బియేసి కుటుంబాలకు చెందిన మొక్కల నుంచి నూనె గింజలు లభిస్తాయి.
ఉదా: 1. పామాయిల్ (ఇల్యుసైన్ గైనెన్సిస్), 2. వేరుశనగ (అరాఖిస్ హైపోజియా), 3. ఆవ (బ్రాసికా నైగ్రా), 4. పొద్దుతిరుగుడు (హీలియాంథస్ అన్యువస్), 5. కొబ్బరి (కోకస్ న్యూసిఫెరా), 6. ఆముదం (రిసినస్ కమ్యూనస్), 7. పత్తి (గాసీపియం హెర్బేషియం), 8. వేప (అజడరిక్టా ఇండికా), 9. కుసుమ (కార్డిమమ్ టింక్టోరియస్).
గమనిక: వేరుశనగ నూనెను వంటలతోపాటు సబ్బుల తయారీలో వాడుతారు.
-పొద్దుతిరుగుడు నూనెలో విటమిన్-A ఉండటంవల్ల లేత పసుపు వర్ణంలో కనిపిస్తుంది. దీనిలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండటంవల్ల గుండె జబ్బులు ఉన్నవారికి మంచిది.
-ఆముదం గింజల అంకురఛ్చదం నుంచి కాస్టర్ ఆయిల్ లభిస్తుంది. దీన్ని యంత్ర భాగాల్లో ఉపయోగిస్తారు.
-వేప నూనెను సూక్ష్మజీవనాశినిగా వాడుతారు. కుసుమ నూనెను వంటకాల్లో ఉపయోగిస్తారు.
-పత్తి నూనెను సబ్బుల తయారీలో ఉపయోగిస్తారు.