Market crops | మార్కెట్ పంటలు
మసాలా దినుసులు
మసాలా దినుసులను వంటల్లో ఉపయోగిస్తారు. ఇవి ఆహారానికి రుచి, వాసన, నిలువచేసే సామర్థ్యాన్ని కలిగిస్తాయి.
ఉదా:
1. మిరప (క్యాప్సికం ఫ్రూటిసెన్స్): దీన్ని రెడ్ పెప్పర్ అంటారు. దీనిలో కారానికి కారణమైన పదార్థం క్యాప్సిసిన్.
2. మిరియాలు: దీన్ని కింగ్ ఆఫ్ స్పైసెస్ అంటారు.
3. యాలకులు (ఎలటేరియా కార్డమమ్): దీన్ని క్వీన్ ఆఫ్ స్పైసెస్ అంటారు.
4. లవంగాలు (యూజీనియా కారియో ఫిల్లేటా): ఇవి పూమొగ్గలు. లవంగాల నుంచి తీసే నూనెను యూజినాల్ అంటారు.
5. కుంకుమ పువ్వు (క్రోకస్ సటైవస్): ఎండిన కీలాగ్రాన్ని ఉపయోగిస్తారు.
6. దాల్చిన చెక్క (సిమినం జెలానికా): బెరడును ఉపయోగిస్తారు.
కూరగాయలు
కూరగాయలు మొక్కల వివిధ భాగాల నుంచి లభిస్తాయి.
ఎ. ఫల కూరగాయలు: టమాట, వంకాయ, బెండకాయ, కాకరకాయ, బీరకాయ మొదలైనవి.
బి. కాండ కూరగాయలు: ఆలుగడ్డ, చేమగడ్డ, నూల్‌కోల్.
సి. వేరు కూరగాయలు: క్యారట్, బీట్రూట్, ముల్లంగి, టర్నిప్.
ఫలాలు
ఎ. మామిడి (మాంజిఫెరా ఇండికా): దీన్ని ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా, కింగ్ ఆఫ్ ఫ్రూట్స్, ఓల్డెస్ట్ ఫ్రూట్ క్రాప్ అని పిలుస్తారు.
బి. అరటి (మ్యూసా పారడైసికా): ప్రపంచంలో సాగు ద్వారా పండిస్తున్న అతిపురాతన ఫలం. దీనిలో పిలకల ద్వారా కొత్త మొక్కలు ఉత్పత్తి అవుతాయి. దీన్నే శాఖీయోత్పత్తి అంటారు.
సి. జామ: దీన్ని పేదవాని ఆపిల్ అంటారు.
ద్రాక్ష, సపోట, దానిమ్మ, బత్తాయి, బొప్పాయి, ఆపిల్, నారింజ, సీతాఫలం మొదలైనవి ఇతర ఫలాలు.
కలపనిచ్చే మొక్కలు
బాగా గట్టిగా, దృఢంగా ఉన్న కాండాన్ని కలప అంటారు. కలపనిచ్చే మొక్కల అధ్యయనాన్ని డెండ్రాలజి అంటారు. కలపనిచ్చే మొక్కల పెంపకం సిల్వి కల్చర్.
కలప నుంచి తయారుచేసే పలుచటి పొరను వెనీర్ అంటారు. 3-10 వెనీర్ పొరలను అతికించి ైప్లెవుడ్ను తయారు చేస్తారు.
కాండాన్ని కోసినప్పుడు కనిపించే వలయాలను వార్షిక వలయాలు లేదా వృద్ధి వలయాలు అంటారు. వీటి అధ్యయనం పేరు డెండ్రోక్రోనాలజి. వీటి సంఖ్యను బట్టి మొక్క వయస్సును నిర్ధారించవచ్చు.
-అతి తేలికైన కలప- ఒక్రోమా పైరామిడేల్
-అతి బరువైన కలప- గ్వాకమ్ అఫిసినేల్
-అతి బరువైన కలప- అకేషియా సుండ్రా
-గట్టిగా ఉండే తేలికైన కలప- సిడ్రస్ డియోడార్ (దేవదారు)
ఉదా:
1. టేకు (టెక్టోనా గ్రాండిస్): గట్టిగా, దృఢంగా ఉండే మన్నికైన కలప. ఎక్కువగా పండించే దేశం మయన్మార్. దీన్ని ప్రాక్ దేశపు రాజవృక్షం అంటారు. దక్షిణ భారతదేశంలోని పొడి ఆకురాల్చు అడవులు టేకు వృక్షాలకు ప్రసిద్ధి.
2. రక్త చందనం (టీరోకార్పస్ సాంటలైనస్): ఇది అతి ఖరీదైన కలప. అందుకే అధికంగా స్మగ్లింగ్‌కు గురవుతుంది. దీన్ని సంగీత పరికరాల తయారీలో ఉపయోగిస్తారు. ఇది ఎక్కువగా కర్ణాటకలోని బళ్లారి, ఏపీలోని చిత్తూరు, కడప జిల్లాల్లో పెరుగుతుంది.
3. ఇండియన్ రోజ్‌వుడ్ (డాల్బర్జియా లాటిఫోలియా): దీన్ని రైల్వే వ్యాగన్ల తయారీలో ఉపయోగిస్తారు.
4. శాండల్‌వుడ్ (సాంటాలమ్ ఆల్బా): ఈ కలపను సబ్బులు, కాస్మొటిక్స్ తయారీలో ఉపయోగిస్తారు.
5. విల్లో/సాలిక్స్: క్రికెట్ బ్యాట్లు, హాకీ హ్యాండిళ్ల తయారీకి ఉపయోగిస్తారు.
6. సుబాబుల్: ఇది బహుళార్థసాధక మొక్క. దీని కలపను అగ్గిపుల్లల తయారీకి ఉపయోగిస్తారు. ఇది నీటి ఎద్దడిలో పెరుగుతుంది. వేర్లు నత్రజని స్థాపన చేస్తాయి.
7. పునికి చెట్టు (గివోకియా మోలుసియానా): దీని కలపను కొండపల్లి (కృష్ణ), నిర్మల్ (ఆదిలాబాద్) కొయ్యబొమ్మల తయారీలో ఉపయోగిస్తారు.
8. ఐవరీ కర్ర: స్నూకర్ లేదా బిలియర్డ్స్ స్టిక్ తయారీ.
9. మగ వెదురు: పోలీస్ లాఠీ తయారీ.
కాగితాన్నిచ్చే మొక్కలు
కలపలోని లిగ్నిన్ అనే పాలీశాకరైడ్ను బ్లీచ్ చేసి రోలింగ్ కింద పెట్టడంవల్ల పేపర్ లభిస్తుంది. ఈ లిగ్నిన్ అనే పాలీశాకరైడ్ వివిధ రకాల మొక్కల్లో దొరుకుతుంది.
ఉదా: 1. వెదురు, 2. యూకలిప్టస్ (నీలగిరి), 3. పైనస్, 4. ఎబిస్, 5. సుబాబుల్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?