విద్యుత్ ఘటాలున్న వలయాలను ఏ పరికరాల్లో ఉపయోగించవచ్చు?
భౌతికశాస్త్రం
1. కింది వాటిలో విద్యుత్ బంధకం?
1) రబ్బరు 2) ఇనుము
3) రాగి 4) అల్యూమినియం
2. ఎలక్ట్రిసిటీని కనుగొన్న శాస్త్రవేత్త?
1) థేల్స్ 2) న్యూటన్
3) గిల్బర్ట్ 4) ఎవరూ కాదు
3. వస్తువులపై విద్యుదావేశం ఏర్పడిన చోట స్థిరంగా ఉండటాన్ని ఏమంటారు?
1) అస్థిర విద్యుత్ 2) స్థిర విద్యుత్
3) వాహక విద్యుత్ 4) పైవేవీ కాదు
4. ధన విద్యుదావేశాన్ని రుణ విద్యుదావేశాన్ని ఏవిధంగా సూచిస్తారు.
1) +v, -v 2) +t, -t
3) +s, -s 4) +q, -q
5. విద్యుదావేశాన్ని కొలిచే ప్రమాణాలేవి?
1) మీటర్లు 2) వోల్ట్లు
3) కూలూంబ్‌లు 4) ఆంపియర్లు
6. విద్యుత్ ప్రవాహం i= ?
1) q/t 2) t/q
3) v/q 4) పైవేవీ కాదు
7. మన రాష్ట్రంలోని విద్యుదుత్పత్తి కేంద్రం ఏది?
1) శ్రీహరి కోట 2) హైదరాబాద్
3) నల్లగొండ 4) రామగుండం
8. ఆంపియర్=?
1) సెకన్/కూలూంబ్స్
2) కూలూంబ్స్/సెకన్
3) 1, 2 4) పైవేవీ కాదు
9. విద్యుత్ ఘటాలున్న వలయాలను ఏ పరికరాల్లో ఉపయోగించవచ్చు?
1) టి.వి 2) రేడియో
3) టేప్‌రికార్డర్
4) రేడియో, టేప్‌రికార్డర్
10. ఘటాల్లో ఉన్న విద్యుత్ పీడన భేదాన్ని ఏమంటారు?
1) విద్యుత్ బలం
2) విద్యుదావేశం
3) విద్యుచ్ఛాలక బలం
4) పైవేవీ కాదు
11. విద్యుత్ ప్రవాహానికి ప్రమాణం?
1) సెకను 2) ఆంపియర్
3) కూలూంబ్ 4) పైవన్నీ
12. వలయంలో విద్యుత్ జనకం?
1) స్విచ్ 2) వైరు
3) బల్బు 4) ఘటం
13. టార్చ్లైట్లోని భాగం?
1) స్విచ్ 2) బల్బు
3) బ్యాటరీలు 4) పైవన్నీ
14. తెరిచి ఉంచిన వలయంలో విద్యుత్ ప్రవాహం?
1) జరగదు 2) జరుగుతుంది
3) మార్పు ఉండదు 4) పైవేవీ కాదు
15. కింది వాటిలో విద్యుత్ ప్రవాహం జరిగేవాటికి ఉదాహరణ?
1) దారం 2) రబ్బరు
3) ఇనుప తీగ 4) పైవేవీ కాదు
16. విద్యుత్‌ను తమగుండా ప్రసరింపనీయని పదార్థాలను ఏమంటారు?
1) విద్యుత్ బంధకాలు
2) విద్యుత్ అవాహకాలు
3) విద్యుత్ వలయాలు
4) 1, 2
17. ఒక సెకనులో ప్రవహించే విద్యుదావేశం?
1) కూలూంబ్ 2) కరెంట్
3) వోల్టేజీ 4) పైవన్నీ
18. ధ్రువకరణం నివారణకు దేన్ని ఉపయోగిస్తారు?
1) పాదరసం పూత 2) ఇత్తడి టోపీ
3) ఆక్సీకరణి 4) జింక్
19. నిర్జల ఘటం కింది వాటిలో దేని రూపాంతరం?
1) వోల్టాఘటం 2) బైక్రోమేట్ ఘటం
3) సచ్ఛిద్ర పాత్ర 4) ఏదీ కాదు
20. యాంత్రిక శక్తి నుంచి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి దేన్ని ఉపయోగిస్తారు?
1) టర్బైన్లు 2) డైనమోలు
3) ఘటాలు 4) అయస్కాంతం
21. జింకు ఆమ్లంలో కలిసేటప్పుడు ఏ వాయువు విడుదలవుతుంది?
1) నైట్రోజన్ 2) ఆక్సిజన్
3) హైడ్రోజన్ 4) కార్బన్ డై ఆక్సైడ్
22. వోల్టా ఘటం విద్యుచ్ఛాలక బలం ఎంత?
1) 61 వోల్టులు 2) 1.46 వోల్టులు
3) 2 వోల్టులు 4) 1.5 వోల్టులు
23. ప్రమాణ కాలంలో ప్రయాణించిన దూరాన్ని ఏమంటారు?
1) వేగం 2) కాలం
3) సమవేగం 4) త్వరణం
24. లెక్లాంచి ఘటంలో డీపోలరైజర్ ఏది?
1) అమ్మోనియం క్లోరైడ్
2) మాంగనీస్ డై ఆక్సైడ్
3) సచ్ఛిద్ర పాత్ర
4) కార్బన్ పొర
25. విద్యుత్ నుంచి గల పలక గాడుల్లో ఉండే తీగను తయారు చేస్తారు?
1) రాగి 2) అల్యూమినియం
3) ఇనుము 4) నిక్రోమ్
26. విద్యుత్ కుంపటిలో విద్యుత్‌శక్తి ఏ శక్తిగా మార్పు చెందుతుంది?
1) యాంత్రిక శక్తి 2) ఉష్ణశక్తి
3) గతి శక్తి 4) అయస్కాంత శక్తి
27. సమాంతరంగా ఉన్న బల్బులో ఒక బల్బును తొలగిస్తే మిగిలిన బల్బుల స్థితి ఏంటి?
1) ఆరిపోతాయి
2) వెలుగుతూనే ఉంటాయి
3) వెలిగి ఆరిపోతాయి
4) ఆరి వెలుగుతుంటాయి
28. మన ఇళ్లలో బల్బులను అమర్చే పద్ధతి?
1) శ్రేణి పద్ధతి
2) సమాంతర పద్ధతి
3) ఎదురెదురు పద్ధతి
4) ఏదీకాదు
29. విద్యుత్ ఉష్ణ ఫలితంపై ఆధారపడి పనిచేసేది ఏది?
1) విద్యుత్ విశ్లేషణం
2) టెలిఫోన్ 3) ఎలక్ట్రిక్ బెల్
4) ఇస్త్రీ పెట్టె
30. విద్యుత్ ప్రవాహం వల్ల రసాయన ఫలితాలు కలుగుతాయి. వాటికి ఉదాహరణ?
1) విద్యుద్దీపాలు 2) ఇస్త్రీ పెట్టె
3) ఎలక్ట్రిక్ బెల్ 4) విద్యున్మలామా
31. మొట్టమొదట విద్యుత్‌ను కనుగొన్నది ఎవరు?
1) థామస్ 2) థేల్స్
3) ఎడ్వర్ 4) గెలీలియో
32. విద్యుదావేశ కణాలు ఎలా ప్రవహిస్తాయి?
1) తక్కువ నుంచి ఎక్కువ స్థాయికి
2) కణాలు ఒకేస్థాయిలో ఉంటాయి
3) ఎక్కువ నుంచి తక్కువ స్థాయికి
4) మార్పు ఏమీ ఉండదు
33. వైద్యరంగంలో మానసిక పరిపక్వతను కలిగించేందుకు అయస్కాంత పదార్థాలను ఉపయోగించే పద్ధతి?
1) ఫిజియోథెరపి 2) డయాథెరపి
3) మాగ్నటోథెరపి 4) ఫెర్రోథెరపీ
34. ప్రాథమిక ఘటంలో ఏ శక్తి ఏ శక్తిగా మారుతుంది?
1) రసాయన శక్తి ఉత్పత్తి అవుతుంది
2) విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అవుతుంది
3) రసాయన శక్తి విద్యుచ్ఛక్తిగా ఉత్పత్తి
అవుతుంది
4) మార్పు ఏమీ ఉండదు
35. లెక్లాంచి ఘటాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
1) థామస్ 2) థేల్స్
3) జార్జిలెక్లాంచి 4) పైవేవీ కాదు
36. ఘన వాహకం నుంచి కొంచెం విద్యుత్ ప్రవహించినపుడు ఏమవుతుంది?
1) రసాయన ఫలితం ఏర్పడుతుంది
2) ఉష్ణ ఫలితం ఏర్పడుతుంది
3) అన్ని ఫలితాలు కలుగుతాయి
4) అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది
37. సల్ఫ్యూరిక్ ఆమ్లంతో గాని, అమ్మోనియం క్లోరైడ్‌తో చర్య జరిపి జింక్ ఏ అయాన్లను ఏర్పరుస్తుంది?
1) రుణ అయాన్లు 2) ధన అయాన్లు
3) పై రెండూ 4) ఏదీ కాదు
38. కాపర్ ఎలక్ట్రోడ్, జింక్ ఎలక్ట్రోడ్ మధ్యనున్న పొటెన్షియల్ భేదాన్ని ఏమంటారు?
1) అయస్కాంత బలం
2) ఘర్షణ బలం
3) విద్యుచ్ఛాలక బలం
4) ఏదీ కాదు
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






