ఇనుము తుప్పుపట్టినప్పుడు బరువు పెరగడానికి కారణం?
లోహాలు
1. అన్నింటి కంటే తేలికైన లోహం?
ఎ) హైడ్రోజన్ బి) లిథియం
సి) యురేనియం డి) సోడియం
2. అత్యంత కఠినమైన లోహం?
ఎ) లిథియం బి) యురేనియం
సి) టంగ్స్టన్ డి) బంగారం
3. అత్యంత మృదువైన లోహం?
ఎ) లిథియం బి) సోడియం
సి) సీజియం డి) బంగారం
4. బంగారానికి సంబంధించి సరైన వాక్యం?
1. స్వేచ్ఛాస్థితిలో లభిస్తుంది
2. రేకులుగా సాగే గుణం అధికం
3. గీతలు పడవు
4. గట్టిదనం ఎక్కువ
ఎ) 4 బి) 1, 2
సి) 2, 3, 4 డి) 1, 2, 3
5. అత్యంత విద్యుద్వాహకత గల లోహం?
ఎ) బంగారం బి) రాగి
సి) వెండి డి) అల్యూమినియం
6. సిల్వర్ పెయింట్‌లో ఉండే లోహం?
ఎ) బంగారం బి) సోడియం
సి) రాగి డి) అల్యూమినియం
7. భూమి పొరల్లో అత్యధికంగా లభించే లోహం?
ఎ) అల్యూమినియం బి) సోడియం
సి) బంగారం డి) రాగి
8. అల్యూమినియం ముఖ్య ఖనిజం?
ఎ) కార్నలైట్ బి) లిగ్నైట్
సి) బాక్సైట్ డి) పిచ్‌బ్లెండ్
9. నిశ్చితం (A)- థర్మామీటర్లో పాదరస లోహాన్ని ఉపయోగిస్తారు
కారణం (R)- పాదరసానికి ఒకే రకంగా వ్యాపించే గుణం ఉంటుంది
ఎ) (ఎ), (ఆర్) రెండూ సరైనవి. (ఎ) కు
(ఆర్) సరైన వివరణ
బి) (ఎ), (ఆర్) రెండూ సరైనవి. (ఎ) కు
(ఆర్) సరైన వివరణ కాదు
సి) (ఎ) సరైనది కానీ (ఆర్) సరైన వివరణ
కాదు
డి) (ఎ) సరైనది కాదు కానీ (ఆర్) సరైన
వివరణ
10. విరేచనకారిగా ఉపయోగించే ఎప్సం లవణం?
ఎ) సోడియం కార్బొనేట్
బి) మెగ్నీషియం కార్బొనేట్
సి) మెగ్నీషియం సల్ఫేట్
డి) కాల్షియం కార్బొనేట్
11. జతపరచండి.
ఎ. బేకింగ్ సోడా 1. సోడియం
బైకార్బోనేట్
బి. చాకలి సోడా 2. సోడియం
కార్బోనేట్
సి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ 3. కాల్షియం సల్ఫేట్
హెమిహైడ్రేట్
డి. హైపో 4. సోడియం
థయోసల్ఫేట్
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-4, బి-3, సి-2, డి-1
సి) ఎ-4, బి-3, సి-1, డి-2
డి) ఎ-1, బి-2, సి-4, డి-3
12. ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే లోహాలు?
ఎ) బంగారం బి) ప్లాటినం
సి) ఎ, బి డి) ఏదీకాదు
13. రాగి ప్రధాన ఖనిజమైన కాపర్ పైరైటీస్ను వేడిచేయడం వల్ల ప్రధానంగా వాతావరణం లోకి విడుదలయ్యే వాయువు?
ఎ) కార్బన్ డై ఆక్సైడ్
బి) సల్ఫర్ డై ఆక్సైడ్
సి) కార్బన్ డై ఆక్సైడ్
డి) నైట్రిక్ ఆక్సైడ్
14. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ను ఏ పదార్థం నుంచి తయారు చేయవచ్చు?
ఎ) తడిసున్నం బి) జిప్సం
సి) సిమెంట్
డి) చలువరాతి ముక్కలు
15. 30 డిగ్రీల సెల్సియస్ వద్ద ద్రవరూపంలోని లోహాలు?
1. మెర్కూరీ 2. గాలియం
3. సీజియం 4. బ్రోమిన్
ఎ) 1 బి) 1, 2
సి) 1, 2, 3 డి) అన్నీ
16. మానవుడు ఉపయోగించిన మొదటి లోహం?
ఎ) రాగి బి) బంగారం
సి) వెండి డి) ఇనుము
17. ఇనుము తుప్పు పట్టకుండా గాల్వనైజేషన్ చేయడానికి ఉపయోగపడే లోహం?
ఎ) బంగారం బి) రాగి
సి) జింక్ డి) వెండి
18. ఇనుము తుప్పు పట్టినప్పుడు బరువు
పెరగడానికి కారణం?
ఎ) ఐరన్ సల్ఫైడ్‌గా మారడం
బి) ఐరన్ ఆక్సైడ్‌గా మారడం
సి) ఐరన్ కార్బోనేట్‌గా మారడం
డి) ఐరన్ బైకార్బోనేట్‌గా మారడం
19. ఇనుము తుప్పుపట్టడం ఎటువంటి రసాయన చర్య?
ఎ) క్షయకరణం బి) ఆక్సీకరణం
సి) భస్మీకరణం డి) హైడ్రోజనీకరణం
20. ఫ్యూజు వైరుకు ఉండాల్సిన లక్షణాలు?
1. తక్కువ నిరోధకత్వం
2. ఎక్కువ నిరోధకత్వం
3. అల్ప ద్రవీభవన స్థానం
4. అధిక ద్రవీభవన స్థానం
ఎ) 1, 4 బి) 2, 3
సి) 2, 4 డి) 1, 3
21. కిరోసిన్ లేదా పారాఫిన్ తైలంలో నిల్వచేసే లోహం?
ఎ) లిథియం బి) సోడియం
సి) ఎ, బి డి) ఏదీకాదు
22. లోహాలకు సంబంధించి సరైన వాక్యం?
1. లోహబంధాన్ని స్వేచ్ఛా ఎలక్ట్రాన్
సిద్ధాంతం వివరిస్తుంది
2. తాంతవత, అఘాత వర్ధనీయత
3. అయానిక సమ్మేళనాలను, క్షారాలను ఏర్పరుస్తాయి
4. తళతళా మెరుస్తాయి
ఎ) 1, 2 బి) 1, 2, 3
సి) 2, 3 డి) పైవన్నీ
23. రక్తం ప్లాస్మాలో ఉండే అయాన్లు?
ఎ) సోడియం బి) పొటాషియం
సి) కాల్షియం డి) మెగ్నీషియం
24. రక్తపోటును పెంచే అయాన్లు?
ఎ) సోడియం బి) కాల్షియం
సి) లిథియం డి) క్లోరైడ్
25. రక్తపోటు నియంత్రణకు తోడ్పడే అయాన్లు ఏవి?
ఎ) సోడియం బి) కాల్షియం
సి) పొటాషియం డి) మెగ్నీషియం
26. బాణాసంచా తయారీలో అధికంగా వినియోగించే లోహం?
ఎ) సోడియం బి) పొటాషియం
సి) బేరియం డి) మెగ్నీషియం
27. ఆహారంలో ఉప్పు పాత్ర?
ఎ) రుచిని ఇవ్వడం
బి) వంట త్వరగా కావడానికి
సి) ఉదరంలో ఆహారం జీర్ణం కావడానికి తోడ్పడే హైడ్రోక్లోరికామ్ల ఉత్పత్తికి సహకరించడం
డి) చెమట కోసం
28. ద్రవస్థితిలోని ఏ సమ్మేళనం విద్యుత్తును ప్రవహింపజేస్తుంది?
ఎ) సోడియం క్లోరైడ్ బి) చక్కెర
సి) యూరియా డి) గ్లూకోజ్
29. జతపరచండి.
ఎ. సోడాయాష్ 1. సోడియం క్లోరైడ్
బి. కాస్టిక్ సోడా 2. అనార్ద్ర సోడియం
కార్బొనేట్
సి. వాటర్ గ్లాస్ 3. సోడియం సిలికేట్
డి. రాతి ఉప్పు 4. సోడియం హైడ్రాక్సైడ్
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-2, బి-1, సి-3, డి-4
సి) ఎ-2, బి-4, సి-3, డి-1
డి) ఎ-2, బి-1, సి-4, డి-3
30. ఇనుమును సంగ్రహించే కొలిమి పేరు?
ఎ) బ్లాస్ట్ ఫర్నెస్
బి) ఓపెన్ హార్త్ ఫర్నెస్
సి) ఓపెన్ కాస్ట్ ఫర్నెస్
డి) ఎక్జాస్ట్ ఫర్నెస్
31. కార్బన్ శాతం అతి తక్కువగా ఉండే ఇనుము?
ఎ) చేత ఇనుము బి) పోత ఇనుము
సి) దుక్క ఇనుము డి) పంది ఇనుము
32. సమతుల్యతతో కూడిన సహజ ఎరువు ఏది?
ఎ) కంపోస్టు బి) అమ్మోనియా
సి) నైట్రోలిమ్ డి) సూపర్‌పాస్ఫేట్
33. మార్బుల్ రసాయన సంకేతం?
ఎ) Na2CO3 బి) CaCO3
సి) MgCO3 డి) K2CO3
34. పిచ్‌బ్లెండ్ అనేది దేని ఖనిజం?
ఎ) యురేనియం బి) థోరియం
సి) రేడియం డి) నెప్ట్యూనియం
35. ఉక్కుతో సమానమైన బలం ఉండి అందులో సగం బరువు మాత్రమే ఉండే లోహం?
ఎ) కాపర్ బి) అల్యూమినియం
సి) టిన్ డి) జింక్
36. ప్రపంచంలో తయారు చేసిన మొట్టమొదటి మిశ్రలోహం?
ఎ) స్టీల్ బి) కంచు
సి) ఇత్తడి డి) బెల్‌మెటల్
37. పంట కోతకు వచ్చాక నేలలో అధికంగా లోపించే లోహం?
ఎ) జింక్ బి) కాపర్
సి) పొటాషియం డి) పాస్ఫరస్
38. కింది వాటిలో ఉత్తమ విద్యుద్వాహకం?
ఎ) అల్యూమినియం బి) రాగి
సి) ఇనుము డి) లెడ్
39. సున్నపు రాయి ఆధారిత గుహల్లో కనిపించే స్ట్టాలక్టైట్లు, స్టాలగ్మైట్లలో ఉండే రసాయన పదార్థం?
ఎ) కాల్షియం క్లోరైడ్
బి) కాల్షియం సల్ఫేట్
సి) కాల్షియం కార్బొనేట్
డి) కాల్షియం ఫాస్ఫేట్
40. తినే సోడా ఫార్ములా?
ఎ) NaOH బి) NaHCO3
సి) NaCO3 డి) H2CO3
41. రక్తం గడ్డకట్టడానికి అవసరమైన లోహ అయాన్లు?
ఎ) సోడియం బి) కాల్షియం
సి) పొటాషియం డి) మెగ్నీషియం
42. మానవ శరీరంలో అతి తక్కువగా ఉండే మూలకం?
ఎ) ఆక్సిజన్ బి) హైడ్రోజన్
సి) నైట్రోజన్ డి) ఐరన్
43. మనం తీసుకునే ఆహారంలో నైట్రోజన్ లేకపోతే ఏవి తయారు కావడం కష్టం?
ఎ) ప్రొటీన్ బి) కార్బోహైడ్రేట్లు
సి) లిపిడ్లు డి) శక్తి
44. శాశ్వత అయస్కాంతీకరణకు అనువైన లోహం?
ఎ) నికెల్ బి) కోబాల్ట్
సి) ఇనుము డి) అన్నీ
45. నగల తయారీలో బంగారానికి కలిపే లోహం?
ఎ) రాగి బి) వెండి
సి) ఇనుము డి) పాదరసం
46. బంగారు నగల తయారీలో బంగారానికి రాగి కలపడానికి కారణం?
ఎ) మెరవడానికి
బి) గట్టిదనం కోసం
సి) పసుపుదనం కోసం
డి) చవకైనది కాబట్టి
47. స్వచ్ఛమైన బంగారం ఎన్ని క్యారట్లు?
ఎ) 20 బి) 22 సి) 24 డి) 18
48. బంగారానికి సంబంధించి సరైన వాక్యాలు?
ఎ) బంగారంపై తేలికగా గీతలు పడవు
బి) ఒక క్యారట్ 100/24 శాతం బంగారానికి సమానం
సి) 14 క్యారట్ల బంగారంలో బంగారం 58 శాతం
డి) అన్నీ సరైనవే
49. ఏ లోహం ఉన్న మిశ్రమలోహాన్ని అమాల్గం అంటారు?
ఎ) ఐరన్ బి) మెర్క్యూరీ
సి) క్రోమియం డి) లెడ్
50. ఇత్తడిలోని లోహాలు ఏవి?
ఎ) రాగి, తగరం బి) రాగి, జింక్
సి) రాగి, క్రోమియం డి) రాగి, బంగారం
51. కంచు ఏ లోహాల మిశ్రమం?
ఎ) రాగి, తగరం బి) రాగి, జింక్
సి) రాగి, బంగారం
డి) రాగి, అల్యూమినియం
52. స్టెయిన్లెస్ స్టీల్‌లో లేని లోహం?
ఎ) ఐరన్ బి) క్రోమియం
సి) కార్బన్ డి) నికెల్
53. రైలు పట్టాల తయారీలో ఉపయోగించే స్టీల్?
ఎ) క్రోమియం స్టీల్
బి) మాంగనీస్ స్టీల్
సి) టంగ్స్టన్ స్టీల్
డి) స్టెయిన్లెస్ స్టీల్
54. తక్కువ శాతం కార్బన్ ఉండే ఇనుము?
ఎ) దుక్క ఇనుము బి) చేత ఇనుము
సి) పోత ఇనుము డి) స్పాంజ్ ఇనుము
55. బెస్సెమర్ కన్వర్టర్ నుంచి వచ్చే ఇనుము?
ఎ) పోత ఇనుము బి) చేత ఇనుము
సి) దుక్క ఇనుము డి) పంది ఇనుము
56. వంట పాత్రల తయారీకి ఉపయోగించే అల్యూమినియం?
ఎ) కంచు బి) డ్యూరాలుమిన్
సి) ఇత్తడి డి) అల్యూమినియం
57. విద్యుత్ తీగలను అతకడానికి ఉపయోగించే సోల్డర్ మెటల్ లోని లోహాలు?
ఎ) తగరం, సీసం బి) రాగి, జింక్
సి) ఇనుము, జింక్ డి) తగరం, రాగి
58. ముద్రణకు ఉపయోగించే అక్షరాలు చేయడానికి ఉపయోగపడే టైప్ మెటల్‌లోని ప్రధాన లోహం?
ఎ) లెడ్ బి) తగరం
సి) వెండి డి) కాపర్
59. ఇస్త్రీపెట్టెలోని ఫిలమెంట్ తయారీకి ఉపయోగించే మిశ్రలోహం?
ఎ) నైక్రోమ్ బి) మానెల్ మెటల్
సి) గన్ మెటల్ డి) కంచు
60. విద్యుత్ క్రేన్లలో ఉపయోగించే విద్యుదయస్కాంతాలను తయారుచేయడానికి ఉపయోగించేది?
ఎ) స్టీల్ బి) చేత ఇనుము
సి) పోత ఇనుము డి) దుక్క ఇనుము
61. ఇత్తడి పాత్రలపై ఏర్పడే పొర?
ఎ) కాపర్ సల్ఫేట్ బి) టిన్ అక్సైడ్
సి) జింక్ ఆక్సైడ్ డి) కాపర్ క్లోరైడ్
62. జతపరచండి.
ఎ. సున్నపురాయి 1. కాల్షియం ఆక్సైడ్
బి. పొడి సున్నం 2. కాల్షియం
హైడ్రాక్సైడ్
సి. తడి సున్నం 3. కాల్షియం
కార్బోనేట్
డి. ఎముకలలోని కాల్షియం 4. కాల్షియం పాస్ఫేట్
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-3, బి-1, సి-2, డి-4
సి) ఎ-3, బి-1, సి-4, డి-2
డి) ఎ-1, బి-2, సి-4, డి-3
63. పరమాణు కంపనాల ఆధారంగా పనిచేసే పరమాణు గడియారాలలో ఉపయోగించే మూలకం?
ఎ) సీజియం బి) పొటాషియం
సి) రుబీడియం డి) రేడియం
64. పిప్పి పన్ను ఉన్నవారు ఉపశమనం కోసం క్రిమిసంహార గుణం ఉన్న ఏ పదార్థాన్ని నీటిలో కలిపి పుక్కిలిస్తారు?
ఎ) సోడియం క్లోరైడ్
బి) బ్లీచింగ్ పౌడర్
సి) పొటాషియం పర్మాంగనేట్
డి) అమ్మోనియం క్లోరైడ్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు