సమూహాల సంబంధాలే బంధుత్వం
- బంధుత్వం
బంధుత్వం భావన, ప్రాథమిక అంశాలు
- సర్ హెన్రీ మెయిన్ తొలిసారి భారతీయ పితృస్వామ్య విస్తృత కుటుంబాలని అధ్యయనం చేసి, రాసిన Ancient Law అనే గ్రంథంలో మొదటిసారి 1861న బంధుత్వం అనే పదాన్ని ఉపయోగించారు. 1865లో మెక్లెన్నిన్ తన ఆదిమ వివాహం అనే గ్రంథంలో సమాజంలో మనుషుల మధ్య బంధుత్వం దాని ప్రాముఖ్యతను తెలిపారు.
- వివాహం ద్వారా గాని, రక్త సంబంధం వల్ల గాని, దత్తత వల్ల గాని ఏర్పడే సంబంధాన్నే బంధుత్వం అంటారు.
- బంధుత్వం, కులం, కుటుంబం అనే సమూహాల్లో వ్యక్తి తన ప్రమేయం లేకుండానే సభ్యుడవుతాడు. రక్త సంబంధం, వైవాహిక సంబంధాల వల్ల ఏర్పడిన సాంఘిక బంధాన్ని బంధుత్వం అని ‘అబర్ కోంబై’ తెలిపాడు.
- మానవ శాస్త్రవేత్తలు బంధుత్వాన్ని ప్రాథమికంగా రెండు విధాలుగా గుర్తించారు.
1. వైవాహిక బంధుత్వం
ఉదా. భార్య, భర్త, అత్త, మామ
2. ఏకరక్త బంధుత్వం
ఉదా. తల్లి, తండ్రి, సోదరుడు - మేనరిక వివాహాలు, సమాంతర పితృ సంతతి వివాహాల్లో భార్యాభర్తలు వైవాహిక, ఏకరక్త బంధువులు అవుతారు.
- ఒకే తల్లిదండ్రుల సంతానాన్ని ‘సంపూర్ణ రక్త సంబంధీకులు’ అంటారు.
- తండ్రి ఒక్కడే ఉండి సంతానం తల్లులు వేరువేరయినప్పుడు సవతి తల్లి పిల్లలు అంటారు.
- విభిన్న భర్తల ద్వారా స్త్రీకి జన్మించిన వారిని సహోదరులు లేదా ఏక గర్భ జనితులు అంటారు
- సహోదరులు, సవతి తల్లి పిల్లలను సాధారణంగా ‘అసంపూర్ణ రక్త సంబంధీకులు’ అంటారు.
- బంధుత్వ స్థానం/స్థాయిలు
- ‘గ్లుకమాన్’ బంధువులను గుర్తించడానికి కింది ఆంగ్ల అక్షరాలను ఉపయోగించాడు.
F – Father
M – Mother
E – Siblings
H – Husband
W – Wife
C – Child
+ – Elder
++ – Eldest
P – Parent
B – Brother
Z – Sister
E – Spouse
S – Son
– – Smaller/Younger
— – Youngest/Smallest
పై అంశాలతో పాటు కింది అక్షరాలను కూడా ఉపయోగిస్తారు
- సోదరుడు – సోడు
- కుమారుడు – కు
- తండ్రి – తం
- భర్త – భ
- సోదరి – సోరి
- కూతురు – కూ
- తల్లి – త
- భార్య – భా
- బంధువుల రూపాలు
- బంధుత్వాన్ని పంచుకున్న వ్యక్తులంతా ఒకే మూల పురుషుడికి చెందిన వారైతే వారిని ‘సజాతీయ బంధువులు’ అంటారు.
ఉదా-
1. మాతృవంశ సజాతీయ బంధువులు
2. పితృవంశ సజాతీయ బంధువులు
3. ఒకే కుటుంబంలోని పిల్లల మధ్య మాతృవంశ, పితృవంశ సజాతీయ బంధుత్వం
ఉంటుంది. ఏకరక్త బంధుత్వం - వ్యష్టి కుటుంబంలోని వ్యక్తుల మధ్య ఎనిమిది రకాలైన ప్రాథమిక బంధుత్వ సంబంధాలు ఉంటాయి.
1. భార్య – భర్త
2. తండ్రి – కొడుకు
3. తండ్రి – కూతురు
4. తల్లి – కొడుకు
5. తల్లి – కూతురు
6. సోదరుడు – సోదరుడు
7. సోదరి – సోదరి
8. సోదరుడు – సోదరి - ఒక వ్యక్తికి తన కేంద్రక కుటుంబంలోని వారు దగ్గరి బంధువులని మిగతావారు, దూరపు బంధువులని పరిగణిస్తారు. కానీ శాస్త్రీయ దృక్పథాన్ని బట్టి బంధువులు
1. ప్రాథమిక బంధువులు
2. ద్వితీయ/గౌణ బంధువులు
3. తృతీయ బంధువులు
1. ప్రాథమిక బంధువులు
- వివాహం ద్వారా లేదా రక్త సంబంధం ద్వారా ఏర్పడే తొలి బంధువులు
- ఒక వ్యక్తికి వివాహం ద్వారా ప్రాథమిక వైవాహిక బంధువులు, జన్మ ద్వారా ప్రాథమిక ఏకరక్త బంధువులు ఏర్పడుతారు
- ప్రాథమిక బంధుత్వంలో ముఖాముఖి సంబంధాలు నిరంతరంగా ఉంటాయి. ప్రతి వ్యక్తికి గరిష్ఠంగా ఏడు రకాల ప్రాథమిక బంధుత్వాలు ఉంటాయి
- తల్లి
- తండ్రి
- సోదరుడు
- సోదరి
- భార్య
- కొడుకు
- కూతురు
2. ద్వితీయ బంధువులు
- ఒక వ్యక్తికి తన ప్రాథమిక బంధువు ప్రాథమిక బంధువులందరు ద్వితీయ బంధువులవుతారు.
- వివాహం లేదా రక్త సంబంధం వల్ల ఏర్పడిన మలి బంధువులు. ప్రతి వ్యక్తికి గరిష్ఠంగా 33 రకాల ద్వితీయ బంధువులంటారు.
3. తృతీయ బంధువులు
- ఒక వ్యక్తికి తన ప్రాథమిక బంధువు ద్వితీయ బంధువు తనకు తృతీయ బంధువు అవుతాడు
- ద్వితీయ బంధువు ప్రాథమిక బంధువు కూడా తృతీయ బంధువు అవుతాడు
- ప్రతి వ్యక్తికి గరిష్ఠంగా 151 మంది తృతీయ బంధువులుంటారు
బంధుత్వ ఆచరణలు
- బంధుత్వ సమూహంలోని వ్యక్తులు ఒకరితో మరొకరు పరస్పర చర్యలు జరిపినప్పుడు కొన్ని నిర్దిష్టమైన ప్రమాణాలను, ప్రవర్తనలను, విలువలను పాటిస్తారు. వీటినే బంధుత్వ ఆచరణలు అంటారు.
1. పరిహాస సంబంధాలు
- పరిహాసం, హేళనతో కూడిన ప్రవర్తనలు, బంధువుల మధ్య చనువుని, చొరవని, సాన్నిహిత్యాన్ని పెంపొందిస్తాయి.
- గోండులు, ఇతర తెగల్లో మితిమీరిన పరిహాసం, ఆస్తి నష్టాలకు కూడా దారి తీస్తుంది.
- రాఢ్ క్లిఫ్ బ్రౌన్ పరిహాస సంబంధాలను
- 1. సౌష్ఠవ పరిహాస సంబంధాలు – బావ, బావామరదలు చేసుకునే పరస్పర పరిహాసాలు
2. అసౌష్ఠవ పరిహాస సంబంధాలు – తాత, మనుమడిపై చేసే పరిహాస, తిరిగి మనుమడు
(అసౌష్టవ పరిహాసం) పరిహాసం చేయడు. అసౌష్టవ పరిహాసంతో పెద్దవాళ్లు చిన్నవారి ప్రవర్తనని తీర్చి దిద్దుతారు. - పరిహాస సంబంధాలతో బంధుత్వం ‘ప్రాతికుల్య క్రియాశీల భావన’ అనే రూపంలో వ్యక్తం అవుతుంది.
2. సంకేత బోధన
- ఇద్దరు బంధువులు నేరుగా మాట్లాడుకోకుండా మరోవ్యక్తి ద్వారాగాని, సంకేత అక్షరాలతోగాని మాట్లాడటమే సంకేత బోధన. పిలిచినప్పుడు, ప్రస్తావించేటప్పుడు కూడా సంకేతాలనే ఉపయోగిస్తారు.
ఉదా. సంతాలులలో భర్తను పెద్దకొడుకు పేరుతో పిలవడం జరుగుతుంది. భార్యని కూతురు పేరుతో పిలుస్తారు.
3. వైదొలుగుడు నడవడి
- బంధువుల్లో నిర్దిష్ట వ్యక్తుల మధ్య సంభాషణ ఎదురవడంవంటివి పాటించడం జరుగదు
ఉదా. గోండులు, ఇతర భారతీయ సమాజాలలో బావ, తమ్ముడి భార్య మధ్య, మామ-కోడలి మధ్య, అత్త-అల్లుడు మధ్య ఈ ప్రవర్తన కనపడుతుంది. శ్రీలంకలోని ‘వెడ్డాల’ యందు సోదర సోదరీమణుల మధ్య కూడా ఈ ప్రవర్తన కనబడుతుంది. వధువు ఇబ్బందులను తొలగించడానికి ఆచరిస్తారని ‘RH లువీ’ తెలిపాడు. - నిర్దిష్ట వ్యక్తుల మధ్య వ్యతిరేకతను తగ్గించడానికి ఈ ఆచరణ పాటిస్తారని రాడ్క్లిఫ్ బ్రౌన్ తెలిపాడు.
- కుటుంబ సభ్యుల మధ్య అగమ్యాగమన నిషేధాన్ని పాటించేందుకే ఈ ప్రవర్తన చూపిస్తారని ‘సిగ్మండ్ ఫ్రాయిడ్, ఫ్రేజర్లు’ పేర్కొన్నారు.
4. కుహనా ప్రసూతి
- ఈ బంధుత్వ ప్రవర్తనా విధానం కేవలం భార్య భర్తల మధ్య మాత్రమే ఉంటుంది. భార్య ప్రసవ సమయంలో భర్త కూడా మాయాపురిటినొప్పులు ప్రదర్శిస్తాడు.
ఉదా. మలారులు, కాశీలు, తోడాలు, ఆఫ్రికాలోని కరీబాలు
- భార్య కష్టసమయంలో ఉన్నప్పుడు భర్త కూడా ఆమెతో సమానంగా కష్టపడుతూ తమ దాంపత్య జీవనాన్ని పటిష్టం చేసుకోవడానికి ఉద్దేశించినదే కుహనా ప్రసూతి అని ‘మలినోవోస్కి’ తెలిపాడు.
5. మాతులాధికారం
- బంధుత్వ సంబంధాల్లో తల్లిదండ్రులకంటే మేనమామకి ఎక్కువ అధికారం, ప్రాముఖ్యతని ఇచ్చేటువంటి ఆచరణ మాతులాధికారం అంటారు.
6. పితృశ్వాధికారం
- మేనత్తకి అధికమైన ప్రాముఖ్యతను, అధికారాన్ని ఇచ్చే ఆచరణని పితృశ్వాధికారం అంటారు. ఉదా. తోడాలు
7. మన్నన
- బంధుత్వంలో ఒక వర్గం వారికి అధిక ప్రాధాన్యత, మరో వర్గం వారికి తక్కువ ప్రాధాన్యత ఉండటాన్ని మన్నన అంటారు.
ఉదా. మగపెళ్లివారు, ఆడపెళ్లివారికి మధ్య ఉన్న ఆచరణ, పెద్దన్న-చిన్నతమ్ముడు మధ్య ఉన్న ఆచరణలు, పైన కూర్చోవడం, కింద కూర్చోవడం, పెద్దవారు రాగానే లేచి నిల్చోవడం
- మన్నన భారతదేశం, చైనాలలో అధికంగా గోచరిస్తుంది
- మన్నన అనేది బంధువుల మధ్య గౌరవం, విధేయత, అణకువ వంటి ప్రవర్తనని చూపిస్తుంది.
- మన్నన బంధువుల మధ్య హెచ్చు అంతస్థు, తక్కువ అంతస్థు అనే ప్రవర్తనలను తెలుపుతుంది.
ప్రాక్టీస్ బిట్స్
1. కింది వాటిలో సరికాని వ్యాఖ్య ?
1. వివాహం ప్రాథమిక సామాజిక సంస్థ
2. వివాహం గౌణ సామాజిక సంస్థ
3. వివాహం విశ్వవ్యాప్తమైనది
4. విశ్వవ్యాప్తమైనది కాదు
ఎ) 1, 2 బి) 2, 4
సి) 1, 2, 3, 4 డి) 2, 3, 4
2. వివాహానికి సంబంధించి మూడు సూత్రాలను తెలిపింది?
ఎ) ముల్లర్ బి) వెస్టర్న్ మార్క్
సి) ముర్డోక్ డి) మలినవ్స్కి
3. ఎవరి నిర్వచనాన్ని వివాహానికి సంబంధించి సంపూర్ణ నిర్వచనంగా భావిస్తారు?
ఎ) ముల్లర్ బి) వెస్టర్న్ మార్క్
సి) ముర్డోక్ డి) ఎడ్మండ్ లీచ్
4. మనిషి జీవితాన్ని వివాహానికి ముందు జీవితం, వివాహం తర్వాత జీవితం అని వర్గీకరించినది ఎవరు?
ఎ) కూన్స్ బి) వెస్టర్న్ మార్క్
సి) ముర్డోక్ డి) ఎడ్మండ్ లీచ్
5. వివాహ పరిణామ క్రమాన్ని వివరించింది ఎవరు?
ఎ) మోర్గాన్ బి) ముర్డోక్
సి) పీపోన్ డి) సీషోర్
6. కింది వాటిలో అత్యంత పురాతన వివాహ చట్టం?
ఎ) ప్రత్యేక వివాహచట్టం
బి) భారతీయ విడాకుల చట్టం
సి) శారద చట్టం
డి) పార్శీ వివాహ చట్టం
7. వివాహాలు మూడు రూపాల్లో ఉంటాయని తెలిపింది ఎవరు?
ఎ) మోర్గాన్ బి) ముర్డోక్
సి) పీపోన్ డి) మలినవ్స్కి
8. అన్ని వివాహాల్లోకెల్లా ఏక వివాహమే పురాతనమైనదని తెలిపినదెవరు?
ఎ) మోర్గాన్ బి) ముర్డోక్
సి) పీపోన్ డి) వెస్టర్న్మార్క్
9. కింది వాటిలో ఏ వివాహ రూపం వల్ల జనాభా అతితీవ్రంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది?
ఎ) బహుభార్యత్వం బి) బహుభర్తృత్వం
సి) ఏకవివాహం
డి) బహుభార్యభర్తృత్వం
10. కింది వాటిలో ఏ వివాహ రూపంలో జన్మించిన పిల్లలకు సరైన మూర్తిమత్వం కలిగే అవకాశం ఉంటుంది?
ఎ) బహుభార్యత్వం బి) బహుభర్తృత్వం
సి) ఏకవివాహం
డి) బహుభార్యభర్తృత్వం
11. సామాజిక తండ్రి అనే ఆచారం ఏ వివాహ రూపం ఫలితంగా కనిపించే అవకాశం ఉంది?
ఎ) బహుభార్యత్వం బి) బహుభర్తృత్వం
సి) ఏకవివాహం డి) బహుభార్యభరృ్తత్వం
- Tags
- English letters
- Gluckman
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం