సముద్ర ప్రవాహాలు- కారణాలు
ఎక్కువ మొత్తంలో సముద్ర జలం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి స్థిరంగా నిర్ణీత దిశలో చలించడాన్ని సముద్ర ప్రవాహాలు అంటారు.
సముద్ర ప్రవాహాలు ఏర్పడటానికి కారణం
భూభ్రమణం: సముద్ర ప్రవాహాలు భూభ్రమణం వల్ల ప్రభావితమై వివిధ దిశలలో ప్రయాణిస్తాయి. భూ భ్రమణం వల్ల పవనాలు ఉత్తరార్ధ గోళంలో కుడి వైపునకు, దక్షిణార్ధగోళంలో ఎడమ వైపునకు వీస్తాయని ఫెరల్స్ అనే శాస్త్రవేత్త సూత్రీకరించారు. ఈ పవనాలను అనుసరించి సముద్ర తరంగాలు ఏర్పడి కదులుతాయి.
గురుత్వాకర్షణ శక్తి: గురుత్వాకర్షణ శక్తి అధికంగా ఉన్న భూమధ్యరేఖపై సముద్ర ప్రవాహాలు కదులుతాయి. కాబట్టి సముద్ర ప్రవాహాల పుట్టుక, చలనాలపై గురుత్వాకర్షణ ప్రభావం ఉంటుంది.
పవనాలు: భూగోళంపై ఏర్పడే పశ్చిమ, తూర్పు వ్యాపార పవనాలు అవి వీచే దిశలో సముద్ర ప్రవాహాలను ఏర్పరుస్తాయి.
ఖండాల ఆకృతి: సముద్ర ప్రవాహాల మార్గంలో ఖండాలు ఎదురైనప్పుడు ఖండ భాగాలను ప్రవాహాములు తాకి వాటి వేగంలోను, దిశలోనూ మార్పు చెందుతాయి. అంతేగాక, ఎత్తైన తరంగాలు, ఖండ భాగాలను తాకి వాటి దిశను మార్చుకొని సముద్ర ప్రవాహాలుగా మారుతాయి.
ఉష్ణోగ్రతా వ్యత్యాసం: ఉష్ణోగ్రతా వ్యత్యాసాల తరంగాల స్వభావాన్ని మారుస్తాయి. భూగోళం మీద అంతా ఒకే ఉష్ణోగ్రత ఉండదు. భూమధ్యరేఖ నుంచి ధృవాల వైపు పోయే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఖండ భాగంపై అధిక ఉష్ణోగ్రత సముద్రభాగంపై తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. ఫలితంగా పీడనంలో తేడా వస్తుంది. ఈ మార్పులు సముద్ర ప్రవాహాలపై ప్రభావాన్ని చూపుతాయి. అధిక ఉష్ణోగ్రత ఉన్న చోట సముద్రపు నీరు వేడెక్కి, ఉష్ణప్రవాహాలు ఏర్పడి, అల్ప ఉష్ణోగ్రతా మండలాల వైపు అంటే ధృవాల వైపు పయనిస్తాయి. అతిశీతల మండలమైన ధృవ ప్రాంతాల నుంచి భూమధ్యరేఖ వైపునకు ధృవపు ప్రవాహాలు పయనిస్తాయి.
పీడనం: ఉష్ణోగ్రత వ్యత్యాసాల వల్ల పీడనంలో మార్పు వస్తుంది. ఫలితంగా అధిక అల్ప పీడన మండలాలు ఏర్పడుతాయి. పవనాలను అనుసరించి సముద్ర ప్రవాహాలు కూడా అల్పపీడన ప్రాంతాల నుంచి అధిక పీడన ప్రాంతాల వైపు ప్రయాణిస్తాయి.
సముద్ర లవణీయత: సముద్రజల విస్తరణలో ఒకేరీతి లవణీయత కనిపించదు. ఉష్ణోగ్రతా వ్యత్యాసాల వల్ల లవణీయతలో తేడా వస్తుంది. ఎక్కువ లవణీయత ఉన్న ప్రాంతాలకు సముద్ర నీటి సాంద్రతలో మార్పు వల్ల సముద్ర ప్రవాహాలు దిశలను మార్చుకుంటాయి. ఉదాహరణకు అట్లాంటిక్ మహాసముద్ర ఉపరితల ప్రవాహాలు మధ్యధరా సముద్రం వైపు పయనిస్తాయి. ఉపరితల అంతర్గత సముద్ర ప్రవాహాలు సముద్ర జల లవణీయత, సాంద్రత, ఉష్ణోగ్రత వ్యత్యాసాల వల్ల ఏర్పడుతాయి.
వర్షపాతం: వర్షపాతం వల్ల సముద్ర జల లవణీయతలో మార్పు వస్తుంది. సముద్ర మట్టంలో కూడా తేడా వస్తుంది. ఈ వ్యత్యాసాల వల్ల సముద్ర ప్రవాహాలు ఏర్పడుతాయి.
రుతుపవన ప్రభావం: రుతుపవనాల ప్రభావం వల్ల కూడా సముద్ర ప్రవాహాలు ఏర్పడుతాయి. వీటి దిశను అనుసరించి సముద్ర ప్రవాహాలు పయనిస్తాయి.
ఉష్ణోగ్రతను ఆధారంగా చేసుకొని సముద్ర ప్రవాహాలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.
1. ఉష్ణ ప్రవాహాలు: ఇది భూమధ్యరేఖా ప్రాంతంలో జనించి ఎల్లప్పుడూ ఖండాల తూర్పు తీరం వెంబడి ఉపరితల ప్రవాహంగా ధృవాల వైపు కదులుతాయి. వీటి కారణంగానే ఖండాల పశ్చిమ తీర ప్రాంతాలతో పోలిస్తే తూర్పుతీర ప్రాంతాల్లో వర్షపాతం అధికంగా ఉంటుంది.
2. శీతల ప్రవాహాలు: ఇది ధృవ ప్రాంతాల్లో జనించి ఎల్లప్పుడూ ఖండాల పశ్చిమతీరం వెంబడి అంతరప్రవాహంగా భూమధ్యరేఖ వైపు కదులుతాయి. వీటి కారణంగా ఖండాల తూర్పు తీర ప్రాంతంతో పోలిస్తే, ఖండాల పశ్చిమ తీర ప్రాంతాల్లో వర్షపాతం అతి తక్కువగా ఉంటుంది.
అట్లాంటిక్ సముద్ర ప్రవాహ వ్యవస్థ
-దీనిని రెండు భాగాలుగా విభజించి పరిశీలించవచ్చు.
-ఉత్తర అట్లాంటిక్ సముద్ర ప్రవాహ వ్యవస్థ: కొరియాలిస్ ప్రభావం వల్ల ఇది సవ్యదిశలో తిరుగుతుంది. ఇందులోని ఉష్ణప్రవాహాలు, శీతల ప్రవాహాలను కింది విధంగా పేర్కొనడమైంది.
ఉష్ణప్రవాహాలు
1. ఉత్తర భూమధ్యరేఖా ప్రవాహం
2. ఏంటలీస్ ప్రవాహం
3. గల్ఫ్ స్టీమ్
4. ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్
శీతల ప్రవాహాలు
1. గ్రీన్లాండ్ లేదా ఇరమింజల్ ప్రవాహం
2. కెనరీ శీతల ప్రవాహం సహార ఎడారి ఏర్పడటానికి కారణం)
3. లాబ్రడార్ శీతల ప్రవాహం
-దక్షిణ అట్లాంటిక్ సముద్ర ప్రవాహ వ్యవస్థ : కొరియాలిస్ ప్రభావం ల్ల ఇది అపసవ్యదిశలో తిరుగుతుంది. ఇందులోని ఉష్ణ, శీతల ప్రవాహాలను కింది పట్టికలో పేర్కొనడమైంది.
ఉష్ణప్రవాహాలు
1. దక్షిణ అట్లాంటిక్ భూమధ్యరేఖా ప్రవాహం
2. బ్రెజీలియన్ ఉష్ణప్రవాహం
శీతల ప్రవహాలు
1. పశ్చిమపవన డ్రిఫ్ట్
2. ఫాక్లాండ్ ప్రవాహం
3. బెనిగ్వుల ప్రవాహం(కలహరి ఎడారి ఏర్పడటానికి కారణమైన ప్రవాహం)
పసిఫిక్ మహా సముద్ర ప్రవాహ వ్యవస్థ
-పసిఫిక్ మహాసముద్ర ప్రవాహ వ్యవస్థను రెండు రకాలు విభజించి పరిశీలించవచ్చు.
-ఉత్తర పసిఫిక్ మహాసముద్ర ప్రవాహ వ్యవస్థ: కోరియాలిస్ ప్రభావం వల్ల ఈ ప్రవాహ వ్యవస్థ సవ్యదిశలో తిరుగుతుంది. ఇందులో ఉష్ణ, శీతల ప్రవాహాలను కింది తెలిపిన పట్టికలో పేర్కొనడమైంది.
ఉష్ణప్రవాహాలు
1. ఉత్తర పసిఫిక్ భూమధ్యరేఖా ప్రవాహం
2. ఒయాషియా లేదా కాంచెట్కా ప్రవాహం
3. శుషిమా ప్రవాహం
4. కురిషివో ఎక్స్టెన్షన్ ప్రవాహం
శీతల ప్రవాహాలు
1. ఉత్తర పసిఫిక్ ట్రిఫ్ట్
2. కురుషినో ప్రవాహం
3. ఏలూషియన్ ప్రవాహం
4. కాలిఫోర్నియా ప్రవాహం( మొజావే, సోనారన్ ఎడారి ఏర్పడటానికి కారణం)
-దక్షిణ పసిఫిక్ మహాసముద్ర ప్రవాహ వ్యవస్థ: కోరియాలిస్ ప్రభావం వల్ల ఈ ప్రవాహ వ్యవస్థ అపసవ్యదిశలో తిరుగుతుంది. ఇందులో ఉష్ణ,శీతల ప్రవాహాలను కింది విధంగా పేర్కొనడమైంది.
ఉష్ణప్రవాహాలు
1. దక్షిణ పసిఫిక్ భూమధ్యరేఖా ప్రవాహం
2. తూర్పు ఆస్ట్రేలియన్ ప్రవాహం
3. క్రామ్వెల్ ప్రవాహం
4. ఎల్నినో ప్రవాహం
శీతల ప్రవాహాలు
1. పశ్చిమ పవన డ్రిఫ్ట్
2. పెరూవియన్ లేదా హంబోల్ట్ ప్రవాహం( అటకామ ఎడారి ఏర్పడటానికి కారణం)
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు