ఎనిమిది ఆటవిక తెగలతో ఏర్పడిన గణరాజ్యం?
మగధ సామ్రాజ్యం, భారతదేశంపై విదేశీయుల దండయాత్ర
1. కింది వాటిని జతపరచండి.
మహాజనపదాలు ముఖ్య పట్టణాలు
ఎ. మగధ 1. మాహిష్మతి
బి. కోసల 2. గిరివ్రజ
సి. అవంతి 3. శ్రావస్తి
డి. వత్స 4. కౌసాంబి
సరైన జతలను ఎంపిక చేయండి.
1) ఎ-1, బి-3, సి-1, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-2, బి-4, సి-3, డి-1
4) ఎ-4, బి-2, సి-1, డి-3
2. 16 జనపదాల్లో ‘శుక్తిమతి’ రాజధానిగా పేరొందిన రాజ్యం ఏది?
1) మగధ 2) కాశీ
3) చేది 4) వత్స
3. ‘కుణిక’ అనే పేరుతో ప్రసిద్ధి చెంది, గౌతమ బుద్ధుడికి సమాకలీనుడు అయిన రాజు ఎవరు?
1) బింబిసారుడు 2) అజాతశత్రువు
3) బిందుసారుడు 4) ఉదయనుడు
4. కింది వాటిలో మగధ సామ్రాజ్య కాలం ఏది?
1) క్రీ. పూ 6-4 శతాబ్దాలు
2) క్రీ.పూ 5-3 శతాబ్దాలు
3) క్రీ.పూ 3-2 శతాబ్దాలు
4) క్రీ.పూ 2-1 శతాబ్దాలు
5. పాటలీపుత్ర నగర నిర్మాత ఎవరు?
1) అశోకుడు 2) బింబిసారుడు
3) బిందుసారుడు 4) అజాత శత్రువు
6. ‘16 షోడశ మహాజనపదాలు’ గురించి మొదటిసారి వివరాలు అందించిన బౌద్ధ గ్రంథం?
1) దివ్యవదన 2) బుద్ధచరిత్రం
3) అంగుట్టనికాయ 4) లలిత విస్తారం
7. ‘పితృ హంతకులు’ అని ఏ రాజ్య వంశానికి పేరు?
1) హర్యంక 2) బృహద్రద
3) శిశునాగ 4) మౌర్య
8. కింది వాటిని జతపరచండి.
వంశం స్థాపకులు
1. బృహద్రద వంశం ఎ. బింబిసారుడు
2. హర్యాంక వంశం బి. జరాసంధుడు
3. శిశునాగ వంశం సి. శిశునాగుడు
4. నంద వంశం డి. మహా పద్మనం
దుడు
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
9. కింది వాటిలో వాస్తవానికి సుదూరమైనవి?
1) హర్యంక వంశం-బింబిసారుడు
2) నంద వంశం-మహాపద్మనందుడు
3) శిశునాగ వంశం-శిశునాగుడు
4) మౌర్యవంశం-అశోకుడు
10. రెండు సముద్రాల మధ్య ప్రాంతాన్ని జయించిన వాడిగా బిందుసారుణ్ని గురిచి పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు?
1) మెగస్తనీస్ 2) తార్నాథ్
3) కౌటిల్యుడు 4) విశాఖదత్తుడు
11. ‘అవంతి’ జనపదాన్ని మగధ సామ్రాజ్యంలో విలీనం చేసినవాళ్లు?
1) శిశునాగుడు 2) కాల అశోకుడు
3) అజాతశత్రువు 4) ధననందుడు
12. మగధ రాజ్యంలో జీవకుడు ఏ వైద్యంలో ప్రసిద్ధుడు?
1) శస్త్ర చికిత్స 2) క్యాన్సర్ నివారణ
3) కామెర్ల వ్యాధి 4) హస్త ఆయుర్వేదం
13. కళింగ రాజ్యంపై దండయాత్ర చేసి జైన విగ్రహాలు పాటీపుత్రానికి తరలించిన వాళ్లు?
1) అశోకుడు 2) ధననందుడు
3) అజాతశత్రువు
4) మహాపద్మనందుడు
14. కింద పేర్కొన్న జంతువుల్లో అశోకుని స్థూపం లో కనిపించనిది?
1) గుర్రం 2) ఎద్దు
3) ఏనుగు 4) జింక
15. కింది వాటిని జతపరచండి.
జాబితా-1 జాబితా-2
ఎ. కోసల 1. వైశాలి
బి. లిచ్ఛలి 2. కౌశాంబి
సి. వత్స 3. విరాటనగరం
డి. మత్స్య 4. శ్రావస్థి
1) ఎ-4, బి-1, సి-2, డి-3
2) ఎ-3, బి-2, సి-4, డి-1
3) ఎ-1, బి-3, సి-2, డి-4
4) ఎ-2, బి-4, సి-1, డి-3
16. షోడశ మహాజన పదాల్లో శ్రావస్తి ఏ జనపదం రాజధాని?
1) కోసల 2) వత్స
3) అవంతి 4) గాంధార
17. అశోకుని దమ్మ విధానంలో కీలక అంశం?
1) స్వయం నియంత్రణ 2) దయ
3) ధార్మికత 4) ధమము
18. తండ్రిని చంపినందుకు ప్రాయశ్చిత్తం కోరుతూ బుద్ధుడిని వేడుకున్న మగధ రాజు ఎవరు?
1) అశోకుడు 2) బింబిసారుడు
3) బిందుసారుడు 4) అజాతశత్రువు
19. విదేశీ దాడులకు గురికాని రాజ్యం మగధ. విదేశీ దాడులు ఎక్కువగా జరిగిన రాజ్యం?
1) అస్మక 2) గాంధార
3) శూరసేన 4) కురు
20. ‘శుక్తిమతి’ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన రాజ్యం?
1) అవంతి 2) వత్స
3) చేది 4) అంగ
21. కింది వాటిలో సరికాని జత ఏది?
1) అనాథ పిండకుడు జేతవనాన్ని బుద్ధుడికి బహూకరించాడు
2) దక్షిణ భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ స్థూపం నేలకొండపల్లిలో ఉంది
3) బుద్ధుడిని హిందూ మత దశావతారాల్లో విష్ణువు ఏడో అవతారంగా శిల్పీకరించారు
4) బుద్ధుడి జీవితంలో ప్రధాన ఘట్టాలను ‘పంచ కల్యాణాలు’ అంటారు.
22. అలెగ్జాండర్ భారతదేశంపై (క్రీ.పూ 327-326) దండయాత్ర సమయంలో మగధను పాలిస్తున్న రాజ వంశం ఏది?
1) మౌర్యులు 2) హర్యంక
3) నంద 4) శిశునాగ
23. మగధను పాలించిన ఏ వంశం శ్రీకృష్ణుడికి సమకాలీకం?
1) బృహద్రదులు 2) హర్యంకులు
3) మౌర్యులు 4) నందులు
24. ఉత్తరప్రదేశ్‌లోని ‘సరయు’ నదీ తీరంలో వెలిసిన షోడశ మహాజనపద రాజ్యం?
1) మత్స్య 2) కోసల
3) వజ్జి 4) వత్స
25. ఎనిమిది ఆటవిక తెగలతో ఏర్పడిన గణరాజ్యం?
1) మల్ల 2) మత్స్య
3) మగధ 4) వజ్జి
26. ‘కాశీ’ జనపదాన్ని కట్నంగా పొందిన రాజవంశం?
1) మౌర్య 2) హర్యంక
3) నంద 4) శిశునాగ
27. అశోకుడు తన రాతి ఫలకాల్లో కిందగల ఏ సూత్రాన్ని సూచించలేదు?
1) తల్లిదండ్రులు, గురువులు, పెద్దల పట్ల విధేయత
2) జీవహింసకు దూరంగా ఉండటం
3) ధనార్జన
4) నైతిక విలువలకు కట్టుబడి ఉండటం
28. ఇండియాపై దండెత్తినవారిలో ప్రథములు?
1) గ్రీకులు 2) శాకలు
3) పార్థియన్లు 4) కుషాణులు
29. ఇండియా మీద అలెగ్జాండర్ దండెత్తిన కాలం?
1) 324 B.C 2) 326 B.C
3) 328 B.C 4) 330 B.C
30. కింది వారిలో అర్థశాస్త్ర రచయిత ఎవరు?
1) నాగార్జునుడు 2) మెగస్తనీస్
3) ప్లీనీ 4) కౌటిల్యుడు
31. పాండ్యుల్లో గొప్పరాజు ఎవరు?
1) నెడుంజెళియాన్ 2) కరికాలుడు
3) తొండైమాన్ చక్రవర్తి
4) సెంగుత్తువాన్
32. భారతదేశంపై దండెత్తి, ఆక్రమించిన తొలి పారశీక చక్రవర్తి?
1) మొదటి డేరియస్ 2) జెర్కసీజ్
3) మూడో డేరియస్ 4) రెండో ఖుస్రూ
33. అలెగ్జాండర్ తర్వాత భారతదేశ లోపలి ప్రాంతాలపై దండయాత్ర చేసిన గ్రీకు రాజు?
1) యూథిడియస్ 2) యూకటైడస్
3) డెమిట్రియస్ 4) మినాండర్
34. ఏ సంవత్సరంలో అలెగ్జాండర్ ఇండియాపై దండెత్తినాడు?
1) క్రీ.పూ 326 2) క్రీ.పూ 336
3) క్రీ.పూ 346 4) క్రీ.పూ 316
35. గ్రీకు గ్రంథాల్లో అమిత్రోఖేటస్గా పేర్కొన్న మౌర్యరాజు?
1) చంద్రగుప్తుడు 2) బిందుసారుడు
3) అశోకుడు 4) సంప్రతి
36. అలెగ్జాండర్ భారత్ జైత్రయాత్రలో విజయం పొందడానికి ఆయనకు అనుకూలించిన అంశం?
1) స్వదేశీ రాజుల మధ్య అనైక్యత
2) అంభి అనే రాజు లొంగిపోవడం
3) పురుషోత్తముడు ఓడిపోవడం
4) అలెగ్జాండర్ గొప్ప సైన్యాన్ని కలిగి ఉండటం
37. గంగా-సోన్ నదుల మధ్య ఉండి ‘జల దుర్గం’గా ప్రసిద్ధి చెందిన పట్టణం?
1) పాటలీపుత్రం 2) రాజగృహ
3) వైశాలి 4) వారణాసి
38. సెల్యూకస్ నికేటర్‌కు ఏనుగులను బహూకరించిన భారత రాజు?
1) అశోకుడు 2) అజాతశత్రువు
3) చంద్రగుప్తుడు
4) శ్రీకృష్ణదేవరాయలు
39. చంద్రగుప్త మౌర్యుడు, అలెగ్జాండర్‌ను ప్రత్యక్షంగా కలిసినట్లు తెలిపింది?
1) ఫ్లూటార్క్ 2) జస్టిన్
3) మెగస్తనీస్ 4) అరియన్
40. మౌర్యుల కాలంలో వడ్డీ ఎంత ఉండేది?
1) 10 శాతం 2) 12 శాతం
3) 14 శాతం 4) 15 శాతం
41. మౌర్య సామ్రాజ్య పతనానంతరం భారతదేశంలో రాజ్యస్థాపన చేసిన విదేశీయులెవరు?
1) పరిష్యనులు 2) గ్రీకులు
3) ఇండోగ్రీకులు
4) సెల్యూసిడే వంశస్థులు
42. అశోకుడి ఎన్నో పాలనా సంవత్సరంలో కళింగ యుద్ధం జరిగింది?
1) ఒకటో సంవత్సరం
2) రెండో సంవత్సరం
3) 13వ సంవత్సరం
4) ఎనిమిదో సంవత్సరం
43. మౌర్యుల కాలంలో విష్టి అంటే?
1) ఒక రాష్ట్రం 2) ఒక జిల్లా
3) బలవంతపు శ్రమ 4) ఒక నాణెం
44. పన్నుల వ్యవస్థను ప్రస్తావించిన అశోకుడి శాసనం?
1) రుమ్మిందై శాసనం
2) నిగాలిసాగర్ శాసనం
3) కాందహార్ శాసనం
4) బరాబర్ శాసనం
45. మౌర్యుల కాలంలో గొప్ప విద్యాకేంద్రం?
1) తక్షశిల 2) ఉజ్జయినీ
3) నలంద 4) వల్లభి
46. రాణి శాసనంలో పేర్కొన్న అశోకుడి రాణి ఎవరు?
1) విదీష మహాదేవి 2) అసంధిమిత్ర
3) కారువాకి 4) తిస్యరక్షిత
47. ‘ఒకే చక్రంతో బండి ఏవిధంగా నడవలేదో పరిపాలన కూడా ఒకే వ్యక్తి ద్వారా నడవలేదు’ అని వ్యాఖ్యానించినవారు?
1) మెగస్తనీస్ 2) కౌటిల్యుడు
3) చంద్రగుప్తుడు 4) వి.ఎ.స్మిత్
48. అశోకుడు ఏటా తన పట్టాభిషేక దినోత్సవం సందర్భంగా మానవతా దృక్పథంతో కొంతమంది ఖైదీలను విడుదల చేసేవారని తెలిపే శాసనం?
1) 5వ స్తంభ శాసనం
2) మొదటి శిలాశాసనం
3) 13వ శిలాశాసనం
4) 4వ స్తంభ శాసనం
49. భారతదేశంలో తొలిసారిగా నౌకాదళాన్ని ఏర్పాటు చేసిన పాలకులు?
1) నందరాజులు 2) మౌర్యులు
3) కుషాణులు 4) గుప్తులు
50. షోడశజన మహాపదాల రాజధాని విషయం లో సరికానిది ఏది?
1) కోసల- శ్రావస్తి 2) అంగ- చంప
3) వత్స- కౌశాంబి
4) కాంబోజ- గాంధార
సునామీ హెచ్చరిక వ్యవస్థ
- హైదరాబాద్‌లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS)లో ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ (ITEWC)ని ఏర్పాటు చేసింది. జాతీయ స్థాయిలో సునామీ హెచ్చరికలను అధికారికంగా జారీ చేస్తుంది. ప్రపంచ సునామీ హెచ్చరిక వ్యవస్థ అయిన గ్లోబల్ సునామీ వార్నింగ్ అండ్ మిటిగేషన్ సిస్టమ్‌లో భాగమైన ITEWC, హిందూ మహాసముద్రంలో సంభవించే సునామీల గురించి హెచ్చరికలను అధికారికంగా జారీ చేస్తుంది.
- పసిఫిక్ సముద్రం, కరీబియన్ సముద్రం, హిందూ మహాసముద్రం, మెడిటరేనియన్ సముద్రానికి సంబంధించిన నాలుగు ఇంటర్ గవర్న్మెంట్ కో ఆర్డినేషన్ గ్రూపులను యునెస్కో ఏర్పాటు చేసింది. సముద్రంలో సంభవించే సునామీలను గుర్తించడం, పెరిగే సముద్ర మట్టాల గురించిన సమాచారాన్నీ, సునామీ గురించి అవగాహన పెంచడానికి అవసరమైన సమాచారాన్నీ, సంభవించినప్పుడు తీసుకోవలసిన చర్యలనూ ఈ గ్రూపులు ఆ ప్రాంతంలో ఉన్న దేశాలకు పంపుతాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు