నూతన విద్యావిధానం ముసాయిదా అంటే..?
వ్యక్తి వికాసానికి, సమాజ ప్రగతికి, మానవజాతి పురోగతికి తోడ్పడే అద్భుతమైన సాధనం విద్య. విద్య శక్తిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలంటే విద్యా విధానం సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి. అంతేకాదు భవిష్యత్ అవసరాలని ముందే అంచనావేసి ఆ మేరకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి. అందుకే 1986 నాటి జాతీయ విద్యావిధానం స్థానంలో సరికొత్త విద్యావిధానాన్ని ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ జాతీయ విద్యావిధానం ముసాయిదాను ఇప్పటికే కేంద్రానికి అందించింది. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖను విద్యామంత్రిత్వ శాఖగా మార్చాలన్న ఈ ముసాయిదా.. పాఠశాల విద్య, ఉన్నత విద్యతోపాటు సంస్థాగత మార్పులు కూడా సూచించింది. అందులో ముఖ్యమైన వాటిని పరిశీలిద్దాం..
-అరిస్టాటిల్ అందించిన విద్య అలెగ్జాండర్‌ను ప్రపంచ విజేతగా తీర్చిదిద్దింది.
-రామకృష్ణుడి బోధనలు నరేంద్రుడిని వివేకానందుడిగా మార్చివేశాయి.
విజన్
-జాతీయ విద్యావిధానం లక్ష్యం అందరికీ నాణ్యమైన విద్యను అందించడం ద్వారా మన దేశాన్ని సుస్థిరమైన, శక్తిమంతమైన జ్ఞాన సమాజంగా మార్చడానికి దోహదపడే భవిష్యత్‌ను ఊహించి భారతీయ కేంద్రీకృత విద్యావ్యవస్థని రూపొందించడం.
పాఠశాల విద్యలో మార్పులు :1. పూర్వబాల్య సంరక్షణ, విద్యను (Early Childhood Care and Education) పాఠశాల విద్యలోనే భాగంగా పరిగణించాలని సూచించింది.2. విద్యార్థుల అభ్యసన సామర్థ్యం, మేధోపరమైన అభివృద్ధి ఆధారంగా పాఠశాల విద్యలో 5+3+3+4 విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించింది. అంటే పాఠశాల విద్యలోని వయసును నాలుగు దశలుగా విభజిస్తారు. ఆ మేరకు తరగతులుంటాయి.
-పునాది దశ (Foundation Stage) (3-8 ఏండ్లు): ఇందులో మూడేండ్లు ప్రీప్రైమరీతో పాటు ఒకటి, రెండు తరగతులుంటాయి.
-సంసిద్ధతా దశ (Preparatory Stage) (8-11 ఏండ్లు): మూడు, నాలుగు, ఐదు తరగతులు
-మధ్య దశ (11-14 ఏండ్లు): ఇందులో 6,7,8 తరగతులు
-ద్వితీయ దశ (14-1 ఏండ్లు): 9 నుంచి 12 తరగతుల వరకు ఉంటాయి.
3. పాఠ్యాంశాలను పిల్లలపై ఒత్తిడి తగ్గించే విధంగా మార్పులు చేయాలి
4. కళలు, సంగీతం, ఆటలు, యోగా, సామాజిక సేవ వంటివి కూడా పాఠ్య ప్రణాళికల్లో భాగంగానే పరిగణించాలని సూచించింది. అంతేకాదు నిజ జీవితంలో ఉపయోగపడే వివిధ నైపుణ్యాలు కూడా ఇందులో భాగమే.
5. విద్యా హక్కు చట్టం 2009 విస్తరణ : ఈ చట్టం ప్రస్తుతం 6 నుంచి 14 ఏండ్ల వయసు వారికి వర్తిస్తుంది. దీన్ని 3 నుంచి 18 ఏళ్ల వయసు వారికి కూడా విస్తరించాలని సూచించింది.
6. బోధన విద్యలో మార్పులు: నాణ్యతలేని బోధన అందించే విద్యాసంస్థలని మూసివేయలని సూచించింది.
-బోధన వృత్తిలోకి రావాలనుకునే వాళ్లకు 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ బీఎడ్ డిగ్రీ కనీస విద్యార్హతగా నిర్ణయించాలని సూచించింది.
వ్యవస్థాపరమైన మార్పులు
1. రాష్ట్రీయ శిక్షా ఆయోగ్ ఏర్పాటు. ప్రధానమంత్రి నేతృత్వంలో ఏర్పడే ఈ సంస్థ భారతదేశంలో విద్యాప్రగతి సంరక్షకుని గా వ్యవహరిస్తుంది. విద్యా సంబంధ విషయాల్లో కేంద్ర రాష్ర్టాల మధ్య సమన్వయకర్తగా పనిచేస్తుంది.
2. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యలో పరిశోధన సంస్కృతిని విస్తరించడానికి ఈ సంస్థ తోడ్పడుతుంది.
3. జాతీయ ఉన్నతవిద్యా నియంత్రణ సంస్థ ఒక్కటే అన్ని రకాల విద్యాసంస్థలని (వృత్తి నిపుణత కలిగిన సంస్థలతో కలిపి) నియంత్రిస్తుంది.
4 . ప్రస్తుతం ఉన్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌ను హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ గా మారుస్తారు.
5. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సమాన ప్రాధాన్యం
జాతీయ విద్యా విధానంలోని మరికొన్ని అంశాలు
-ఉన్నత విద్య అంతర్జాతీయీకరణ
-దూరవిద్యలో నాణ్యత పెంచడం
-అన్ని విద్యాస్థాయిల్లో సాంకేతికతను అనుసంధానించడం
-విద్యా ఫలితాల్లో లింగ, సామాజిక అసమానతలని తొలగించడం మొదలైనవి.
-త్రిభాషా సూత్రం- వివాదం-సవరణలు
-కస్తూరి రంగన్ కమిటీ 1968 నాటి త్రిభాషా సూత్రాన్ని నిర్ధిష్టంగా అమలు చేయాలని సూచించింది. ఇందులో భాగంగానే హిందీయేతర రాష్ర్టాల్లోని పాఠశాల పాఠ్యాంశాల్లో హిందీ భాషని తప్పనిసరి చేసింది. అయితే హిందీయేతర రాష్ర్టాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కేంద్రం ఆ అంశాన్ని తొలగించింది.
ముగింపు
-వ్యక్తి గమనాన్ని, ప్రపంచ గమ్యాన్ని సమూలంగా మార్చివేయగలిగేది విద్య. అలాంటి విద్యను అందరికి అందేలా రూపొందించే విద్యా విధానమేదైనా విద్యార్థుల బంగారు భవిష్యత్ కి బాటలు వేయగలగాలి.
ఉన్నత విద్యకు సంబంధించినవి
-ఉన్నత విద్యా వ్యవస్థ పుర్నిర్మాణంతోపాటు స్థూలంగా మూడు రకాల విద్యా సంస్థలు ఉండాలని సూచించింది.
మొదటిరకం: అన్ని స్థాయిల్లో ప్రపంచ స్థాయి పరిశోధన- అధిక నాణ్యత గల బోధనపై దృష్టిపెడుతుంది.
రెండో రకం: పరిశోధనలో సహకారంతోపాటు అధిక నాణ్యతగల బోధన పై దృష్టి పెడుతుంది.
మూడో రకం: అండర్ గ్రాడ్యుయేట్ విద్యపై దృష్టి సారించిన విభాగాలలో అధిక నాణ్యత గల బోధనపై దృష్టి పెడుతుంది.
-ఉన్న విద్యా వ్యవస్థలలోని ఈ సరికొత్త సంస్థాగత నిర్మాణాన్ని ప్రోత్సహించడానికి మిషన్ నలంద, మిషన్ తక్షశిల ప్రారంభిస్తారు. ప్రస్తుతం ఉన్న అండర్ గ్రాడ్యూయేట్ ప్రోగ్రామ్స్ అయిన బీఏ, బీఎస్సీ, బీకాం వంటి కోర్సులలో కూడా మార్పు చేయాలని కస్తూరి రంగన్ కమిటీ సూచించింది.
ఉండాలి. అంతేకాదు భవిష్యత్ అవసరాలని ముందే అంచనావేసి ఆ మేరకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి. అందుకే 1986 నాటి జాతీయ విద్యావిధానం స్థానంలో సరికొత్త విద్యావిధానాన్ని ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ జాతీయ విద్యావిధానం ముసాయిదాను ఇప్పటికే కేంద్రానికి అందించింది. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖను విద్యామంత్రిత్వ శాఖగా మార్చాలన్న ఈ ముసాయిదా.. పాఠశాల విద్య, ఉన్నత విద్యతోపాటు సంస్థాగత మార్పులు కూడా సూచించింది. అందులో ముఖ్యమైన వాటిని పరిశీలిద్దాం..
-అరిస్టాటిల్ అందించిన విద్య అలెగ్జాండర్‌ను ప్రపంచ విజేతగా తీర్చిదిద్దింది.
-రామకృష్ణుడి బోధనలు నరేంద్రుడిని వివేకానందుడిగా మార్చివేశాయి.
విజన్
-జాతీయ విద్యావిధానం లక్ష్యం అందరికీ నాణ్యమైన విద్యను అందించడం ద్వారా మన దేశాన్ని సుస్థిరమైన, శక్తిమంతమైన జ్ఞాన సమాజంగా మార్చడానికి దోహదపడే భవిష్యత్‌ను ఊహించి భారతీయ కేంద్రీకృత విద్యావ్యవస్థని రూపొందించడం.
పాఠశాల విద్యలో మార్పులు :1. పూర్వబాల్య సంరక్షణ, విద్యను (Early Childhood Care and Education) పాఠశాల విద్యలోనే భాగంగా పరిగణించాలని సూచించింది.2. విద్యార్థుల అభ్యసన సామర్థ్యం, మేధోపరమైన అభివృద్ధి ఆధారంగా పాఠశాల విద్యలో 5+3+3+4 విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించింది. అంటే పాఠశాల విద్యలోని వయసును నాలుగు దశలుగా విభజిస్తారు. ఆ మేరకు తరగతులుంటాయి.
-పునాది దశ (Foundation Stage) (3-8 ఏండ్లు): ఇందులో మూడేండ్లు ప్రీప్రైమరీతో పాటు ఒకటి, రెండు తరగతులుంటాయి.
-సంసిద్ధతా దశ (Preparatory Stage) (8-11 ఏండ్లు): మూడు, నాలుగు, ఐదు తరగతులు
-మధ్య దశ (11-14 ఏండ్లు): ఇందులో 6,7,8 తరగతులు
-ద్వితీయ దశ (14-1 ఏండ్లు): 9 నుంచి 12 తరగతుల వరకు ఉంటాయి.
3. పాఠ్యాంశాలను పిల్లలపై ఒత్తిడి తగ్గించే విధంగా మార్పులు చేయాలి
4. కళలు, సంగీతం, ఆటలు, యోగా, సామాజిక సేవ వంటివి కూడా పాఠ్య ప్రణాళికల్లో భాగంగానే పరిగణించాలని సూచించింది. అంతేకాదు నిజ జీవితంలో ఉపయోగపడే వివిధ నైపుణ్యాలు కూడా ఇందులో భాగమే.
5. విద్యా హక్కు చట్టం 2009 విస్తరణ : ఈ చట్టం ప్రస్తుతం 6 నుంచి 14 ఏండ్ల వయసు వారికి వర్తిస్తుంది. దీన్ని 3 నుంచి 18 ఏళ్ల వయసు వారికి కూడా విస్తరించాలని సూచించింది.
6. బోధన విద్యలో మార్పులు: నాణ్యతలేని బోధన అందించే విద్యాసంస్థలని మూసివేయలని సూచించింది.
-బోధన వృత్తిలోకి రావాలనుకునే వాళ్లకు 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ బీఎడ్ డిగ్రీ కనీస విద్యార్హతగా నిర్ణయించాలని సూచించింది.
వ్యవస్థాపరమైన మార్పులు
1. రాష్ట్రీయ శిక్షా ఆయోగ్ ఏర్పాటు. ప్రధానమంత్రి నేతృత్వంలో ఏర్పడే ఈ సంస్థ భారతదేశంలో విద్యాప్రగతి సంరక్షకుని గా వ్యవహరిస్తుంది. విద్యా సంబంధ విషయాల్లో కేంద్ర రాష్ర్టాల మధ్య సమన్వయకర్తగా పనిచేస్తుంది.
2. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యలో పరిశోధన సంస్కృతిని విస్తరించడానికి ఈ సంస్థ తోడ్పడుతుంది.
3. జాతీయ ఉన్నతవిద్యా నియంత్రణ సంస్థ ఒక్కటే అన్ని రకాల విద్యాసంస్థలని (వృత్తి నిపుణత కలిగిన సంస్థలతో కలిపి) నియంత్రిస్తుంది.
4 . ప్రస్తుతం ఉన్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌ను హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ గా మారుస్తారు.
5. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సమాన ప్రాధాన్యం
జాతీయ విద్యా విధానంలోని మరికొన్ని అంశాలు
-ఉన్నత విద్య అంతర్జాతీయీకరణ
-దూరవిద్యలో నాణ్యత పెంచడం
-అన్ని విద్యాస్థాయిల్లో సాంకేతికతను అనుసంధానించడం
-విద్యా ఫలితాల్లో లింగ, సామాజిక అసమానతలని తొలగించడం మొదలైనవి.
-త్రిభాషా సూత్రం- వివాదం-సవరణలు
-కస్తూరి రంగన్ కమిటీ 1968 నాటి త్రిభాషా సూత్రాన్ని నిర్ధిష్టంగా అమలు చేయాలని సూచించింది. ఇందులో భాగంగానే హిందీయేతర రాష్ర్టాల్లోని పాఠశాల పాఠ్యాంశాల్లో హిందీ భాషని తప్పనిసరి చేసింది. అయితే హిందీయేతర రాష్ర్టాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కేంద్రం ఆ అంశాన్ని తొలగించింది.
ముగింపు
-వ్యక్తి గమనాన్ని, ప్రపంచ గమ్యాన్ని సమూలంగా మార్చివేయగలిగేది విద్య. అలాంటి విద్యను అందరికి అందేలా రూపొందించే విద్యా విధానమేదైనా విద్యార్థుల బంగారు భవిష్యత్ కి బాటలు వేయగలగాలి.
ఉన్నత విద్యకు సంబంధించినవి
-ఉన్నత విద్యా వ్యవస్థ పుర్నిర్మాణంతోపాటు స్థూలంగా మూడు రకాల విద్యా సంస్థలు ఉండాలని సూచించింది.
మొదటిరకం: అన్ని స్థాయిల్లో ప్రపంచ స్థాయి పరిశోధన- అధిక నాణ్యత గల బోధనపై దృష్టిపెడుతుంది.
రెండో రకం: పరిశోధనలో సహకారంతోపాటు అధిక నాణ్యతగల బోధన పై దృష్టి పెడుతుంది.
మూడో రకం: అండర్ గ్రాడ్యుయేట్ విద్యపై దృష్టి సారించిన విభాగాలలో అధిక నాణ్యత గల బోధనపై దృష్టి పెడుతుంది.
-ఉన్న విద్యా వ్యవస్థలలోని ఈ సరికొత్త సంస్థాగత నిర్మాణాన్ని ప్రోత్సహించడానికి మిషన్ నలంద, మిషన్ తక్షశిల ప్రారంభిస్తారు. ప్రస్తుతం ఉన్న అండర్ గ్రాడ్యూయేట్ ప్రోగ్రామ్స్ అయిన బీఏ, బీఎస్సీ, బీకాం వంటి కోర్సులలో కూడా మార్పు చేయాలని కస్తూరి రంగన్ కమిటీ సూచించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు