విత్తనాభివృద్ధి- వ్యవసాయ ప్రగతి
వ్యవసాయం-రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు
-పెద్ద, మధ్యతరహా, చిన్నసాగునీటి ప్రాజెక్టుల కోసం చేసిన ప్రయత్నం…
1. సాగునీటి ప్రాజెక్టుల కోసం బడ్జెట్ కేటాయించారు. గత రెండేండ్లుగా సాగునీటి ప్రాజెక్టుల కోసం సుమారు 25 కోట్ల బడ్జెట్ను కేటాయించారు.
2. సాగునీటి ప్రాజెక్టుల డిజైన్ను రీ-ఇంజినీరింగ్ చేశారు.
3. పెద్ద, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల సామర్థ్యం పెంచడానికి వాటిని ఆధునీకరించడం
4. ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న అంతర్రాష్ట్ర సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించడం
5. చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయను రాష్ట్రంలో ప్రవెశపెట్టారు.
6. వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్ సదుపాయం కల్పించారు.
వడ్డీలేని పంట రుణాలు, పావుల వడ్డీ
-రైతులకు ఆర్థికభారం తగ్గించడానికి, వ్యవస్థాగత రుణాలు తక్కువ వడ్డీరేటుకు అందించడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.
-దీని ప్రకారం రైతుకు లక్ష రూపాయల పంట రుణం వరకు ఎలాంటి వడ్డీ లేకుండా, లక్ష నుంచి 3 లక్షల రూపాయల వరకు ఏడాదికి పావుల వడ్డీని మాత్రమే వసూలు చేశారు.
-ఈ రుణ భారం రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం, కేంద్ర ప్రభుత్వం 3 శాతం భరిస్తుంది.
రుణ మాఫీ పథకం
-దీని ప్రకారం 2014-15లో తెలంగాణ ప్రభుత్వం రూ. లక్ష వరకు రుణాలున్న రైతులకు ఈ పథకాన్ని వర్తింపచేసింది.
-దీనికింద 2014-15, 2015-16, 2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాల్లో సమ భాగాలుగా విడుతల వారీగా నిధులు విడుదల చేసింది.
-మొత్తంగా 35.30 లక్షల రైతులకు 16,24.37 కోట్లు అందించింది.
వ్యవసాయ సంబంధిత పరికరాలను అందించడం
-ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రాథమిక సహకార సంఘాల ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు, క్రిమీసంహారక మందుల వంటి వాటిని సరైన సమయంలో అందించే ప్రయత్నం చేస్తున్నది.
విత్తన భాండాగారం
-వ్యవసాయ ఉత్పాదకత పెంచడంలో విత్తనానిది ప్రముఖ పాత్ర.
-రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులు, నాణ్యతగల విత్తన ఉత్పత్తికి తోడ్పడుతుంది.
-దేశానికి మధ్యభాగంలో తెలంగాణ ఉండటంతో అన్ని దిశల్లో మౌళిక సదుపాయాలు అభివృద్ధి చెందడంతో విత్తన భాండాగారంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది.
-ఇప్పటివరకు 37.42 లక్షల క్వింటాళ్ల విత్తనాలను తెలంగాణ ఉత్పత్తి చేసింది. అందులో వరి, హైబ్రిడ్ వరి, మొక్కజొన్న, పత్తి, శనగలు వంటివి ఉన్నాయి.
-హైబ్రిడ్ వరి విత్తనాలు దేశంలో 90 శాతం వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి సప్లయ్ అవుతున్నాయి.
-దేశానికి కావాల్సిన హైబ్రిడ్ జొన్న, సజ్జ విత్తనాలు నిజామాబాద్ జిల్లాల్లో ఉత్పత్తి అవుతున్నాయి.
-రాష్ట్రంలో విత్తనరంగాన్ని బలోపేతం చేసేందుకు విత్తన రైతులందరికి గుర్తింపు కార్డులు జారీ చేయనున్నారు.
-విత్తన రైతులకు సంబంధించిన వివరాలు సేకరించి, కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తారు. దీని ఆధారంగా గ్రామాలు, జిల్లాలు, పంటల వారీగా విత్తనాలు సాగుచేసే రైతులకు సాంకేతిక శిక్షణ అందించాలని తీర్మానించారు.
-విత్తన పరిశ్రమ అభివృద్ధి చెందడానికి కింది సౌకర్యాలు కలిగి ఉండటం కారణం…
1. దేశానికి కావాల్సిన విత్తన సప్లయ్లో 60 శాతం తెలంగాణ నుంచి అందుతున్నది.
2. అన్ని జిల్లాలు విత్తన ఉత్పత్తికి అనుకూలంగా ఉన్నాయి. అందువల్ల అన్ని ప్రధనా పంటల విత్తనాల ఉత్పత్తి జరుగుతున్నది.
3. చల్లని, పొడి వాతావరణం విత్తనాల మన్నికకు ఉపయోగపడుతుంది.
4. సామర్థ్యమున్న విత్తన ఉత్పత్తి కేంద్రాలు ఉండటం, విత్తనాల నిల్వకు కావాల్సిన సౌకర్యాలు ఉండటం.
5. నేషనల్ సీడ్ కార్పొరేషన్ (ఎన్ఎస్సీ), ఇంటర్ నేషనల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీఎరిడ్ ట్రోపిక్స్ (ఇక్రిశాట్), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రిసెర్చ్ (ఐఆర్ఆర్), తెలంగాణ రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ (టీఎస్ఎస్డీసీ), తెలంగాణ స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ (టీఎస్ఎస్సీఏ), రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మొదలైన జాతీయ, అంతర్జాతీయ సంస్థలు విత్తన అభివృద్ధిలో నిమగ్నమై ఉన్నాయి.
-విత్తన గ్రామ కార్యక్రమాన్ని మెరుగు పరచడం. సామాజిక బాధ్యతగా జొన్న, నూనె గింజలు, పశుగ్రాసం మొదలైన పంటల విత్తనాల ఉత్పత్తిని ప్రోత్సహించడం.
-విత్తన పరిశ్రమ కోసం ప్రాంతాల అన్వేషణ, అన్ని రాష్ర్టాల విత్తన సంస్థలను పునరుద్ధరించడం.
-పంటకోత తర్వాత ఉండే విత్తన తయారీ ప్లాంట్లలో నిల్వ, రవాణ మొదలైన వాటికి మద్దతు అందించడం.
-అదనపు ఎగుమతి సామర్థ్యాన్ని గమనించడం.
-విత్తనాల కార్యక్రమాలన్నింటిని సమన్వయం చేసే అంకితభావం కలిగిన విత్తన సంస్థలుండటం
-విత్తన ఉత్పత్తి చేసే సహకార సంస్థలను ప్రోత్సహించడం
-విత్తనాల ఉత్పత్తిలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం ఉండేట్లు చూడటం
-వ్యవసాయ విభాగం విత్తన ఉత్పత్తి కోసం పంచవర్ష ప్రణాళికలను విత్తన ప్రత్యామ్నాయ నిష్పత్తి కోసం 100 శాతం సాధించే భాగంలో రచించారు.
విత్తన సబ్సిడీ
-వివిధ రకాల పంటల విత్తనాలను చిన్న, సన్నకారు రైతులకు సబ్సిడీకి ప్రభుత్వం అందిస్తున్నది.
-తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 16.01 లక్షల క్వింటాళ్ల విత్తనాలను 21.33 లక్షల రైతులకు అందించింది.
-ఖరీఫ్ కాలంలో 3.41 లక్షల విత్తనాలు, రబీ కాలంలో 5.83 లక్షల క్వింటాళ్ల విత్తనాలను 2017-18కిగాను అందించింది.
విత్తన పరిశ్రమల ఎగుమతి సామర్థ్యం పెంచడం
-300 ఉత్తర అక్షాంశాల నుంచి 300 దక్షిణ అక్షాంశాల మధ్య ఒకే రకమైన వాతావరణం ఉండటం వల్ల విత్తనాలను దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్ అయిన ఆఫ్రికా, ఇండోనేషియా, వియత్నాం, బంగ్లాదేశ్, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎగుమతి చేసే అవకాశం పెంచవచ్చు.
వ్యవసాయ బలోపేతానికి ప్రభుత్వ పథకాలు
-వ్యవసాయంపై చేసే పరిశోధన రైతులకు అందించడం వల్ల వ్యవసాయరంగ అభివృద్ధికి ఎంతో దోహద పడుతుంది. ఇది ఎక్కువగా ల్యాబ్ టు ల్యాండ్ అంటే ప్రయోగశాలల్లో అభివృద్ధిపరచిన కొత్త కొత్త వ్యవసాయ టెక్నాలజీ సంబంధించిన పద్ధతులు రైతులకు వివరించి పంట ఉత్పత్తికి సహాయం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం వరంగల్, రంగారెడ్డి జిల్లాలతోపాటు కొత్తగా ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఎరువుల పరీక్షల ల్యాబ్లను ఏర్పాటు చేసింది. ఇవన్నీ కింది పథకం ద్వారా అమలు చేయవచ్చు.
1. నకిలీ ఎరువులపై ఉక్కుపాదం
-నాసిరకం విత్తనాలు, ఎరువులను సప్లయ్ చేసిన వారిపై పీడీ యాక్ట్ కింద అక్రమార్కులను శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
2. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడం
-వ్యవసాయ రంగంలో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1302 కోట్లు విడుదల చేసింది.
3. తెలంగాణ రాష్ట్ర విత్తన, ఆర్గానిక్ సర్టిఫికెట్ ఆథారిటీ
-విత్తన నాణ్యత పరీక్షించడానికి దేశంలో నేషనల్ సీడ్ కార్పొరేషన్, ఎనాక్ట్మెంట్ ఆఫ్ ఇండియన్ సీడ్ యాక్ట్-1956 ప్రారంభమైంది.
-విత్తన నాణ్యతను పరీక్షించడానికి, దృవీకరించడానికి తెలంగాణ రాష్ట్ర విత్తన, ఆర్గానిక్ సర్టిఫికెట్ ఆథారిటీ పనిచేస్తుంది.
-ఈ సంస్థ కింద ప్రధాన పంటలైన వరి, వేరుశనగ, సోయాబీన్, పప్పులు, మక్కజొన్న, జొన్న, బాజ్రా, కూరగాయలను చేర్చారు.
పథకం సాధించిన విజయాలు
-విస్తీర్ణంలో పెరుగుదల: ఈ పథకం కింద 2014-15కిగాను 1.89 లక్షల ఎకరాల నుంచి 2016-17కు 2.28 లక్షల ఎకరాలకు పెంచారు.
-ఆన్లైన్ సీడ్ సర్టిఫికేషన్ విధానం: విత్తన ఉత్పతిదారుల్లో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని, తొందరగా విత్తనాలను చేర్చే విధంగా దీన్ని ప్రారంభించారు. ఈ ఆన్లైన్ సీడ్ సర్టిఫికేషన్ విధానం దేశంలోనే మొదటిసారి.
-అంతర్జాతీయ సీడ్ సర్టిఫికేషన్: సుమారు 17 క్వింటాళ్ల మైబ్రీడ్ వరి విత్తనాలు, సోర్గం విత్తనాలను ఈజిప్టు, సూడాన్, ఫిలిప్పైన్స్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. సోర్గం విత్తనాలను సూడాన్, ఈజిప్టు దేశాలకు ఎగుమతి చేయడంలో దేశంలోనే తెలంగాణ మొదటిస్థానంలో ఉంది.
4. మన తెలంగాణ, మన వ్యవసాయం
-దీన్ని 2015 ఖరీఫ్ కాలానికి ముందే ప్రారంభించారు.
-ఈ కార్యక్రమంలో భాగంగా పశుసంపద, వ్యవసాయం మొదలైన విభాగాలకు చెందిన వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.
-ఈ శిక్షణలో 9 జిల్లాలవారు పాల్గొన్నారు. వీరంతా వ్యవసాయ సంక్షేమానికి తీసుకున్న చర్యలు, ఖరీఫ్, రబీ సీజన్లకు కావాల్సిన సరైన ప్రణాళికలను సమర్థవంతంగా వివరించారు.
5. శిక్షణ, సందర్శించడం
-ఈ రెండింటి ద్వారా ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పరిశోధన సంస్థలను గుర్తించి అక్కడ ట్రెయినింగ్, విజిటింగ్ నెలవారి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
-ఇందులో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు ప్రస్తుత పంటల గురించి చర్చించి ఏవైనా సమస్యలు వస్తే వాటిని అధిగమించడానికి తగిన చర్యలు తీసుకోవాలి.
సీడ్ విలేజ్ ప్రోగామ్
-దీని ప్రధాన లక్ష్యం అన్ని పంటలకు చెందిన నాణ్యత కలిగిన విత్తనాలను అభివృద్ధిచేసి రైతులకు గిట్టుబాటు ధరల్లో అందుబాటులో ఉంచి కావాల్సిన విత్తన ప్రత్యామ్నాయ నిష్పత్తిని సాధించడం.
-రాష్ట్రంలో 10 విత్తన ఫార్మ్స్ 536 హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి.
-ఇవి ఈ కార్యక్రమానికి కావాల్సిన విత్తనాలను సరఫరా చేస్తున్నాయి.
-ఈ కార్యక్రమం ద్వారా రైతులకు 50 శాతం సబ్సిడీపై తృణ ధాన్యాల విత్తనాలు, 60 శాతం సబ్సిడీపై పప్పు ధాన్యాలు, నూనెగింజల విత్తనాలను పంపిణీ చేస్తున్నారు.
-3.22 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ పంటలకు సంబంధించి 37.42 లక్షల క్వింటాళ్ల విత్తనాలు ఉత్పత్తి అవుతున్నాయి.
-ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా హైబ్రిడ్ పత్తి విత్తనాల ఉత్పత్తి, ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలు హైబ్రిడ్ ఎర్రజొన్న ఉత్పత్తి, కరీంనగర్, వరంగల్ జిల్లాలు హైబ్రిడ్ వరి విత్తనాలు ఉత్పత్తి చేస్తున్నాయి.
-ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్లగొండ, మహబూబ్నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో హైబ్రిడ్ వరి, సోయాబీన్, పప్పు ధాన్యాలు, కూరగాయల వంటి వంగడాలను ఉత్పత్తి చేసే క్షేత్రాలు ఉన్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు