Lok Adalats | సత్వర న్యాయానికి లోక్ అదాలత్‌లు
న్యాయస్థానాల్లో కొన్ని కారణాల వల్ల కేసులు పరిష్కరించడానికి ఎక్కువ జాప్యం జరుగుతుంది. దీనికితోడు వాది, ప్రతివాదులు కూడా కొన్ని సందర్భాల్లో పరిష్కారాలకు సుముఖంగా ఉండక కాలయాపన చేస్తుంటారు.
-కేసుల శీఘ్ర పరిష్కారం కోసం శాశ్వత ప్రాతిపదికన లోక్ అదాలత్‌లను ఏర్పాటు చేయడానికి వీలుగా లీగల్ సర్వీసెస్ ఆర్బిట్రేషన్ చట్టాన్ని 2002లో చేశారు.
-లీగల్ సర్వీస్ అథారిటీ చట్టం-1987 కింద లోక్ అదాలత్‌లను ఏర్పాటు చేశారు.
-సులభంగా పరిష్కరించదగిన కొన్ని రకాల కేసులను పెద్ద మనుషుల మధ్యవర్తిత్వంలో పరిష్కరించడానికి చట్టబద్ధమైన ప్రతిపత్తిని కల్పిస్తూ లోక్ అదాలత్ అనే పేరుతో ప్రజా న్యాయ స్థానాలనే ఒక వ్యవస్థను ఏర్పాటుచేశారు.
-లోక్ అదాలత్ ఇంచుమించు సివిల్ కోర్టుకు సమాన హోదా కలిగి ఉంటుంది. లోక్ అదాలత్‌లు రాష్ట అథారిటీ, జిల్లా అథారిటీ, సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ లేదా హైకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ నిర్వహణలో పనిచేస్తాయి.
-ఈ వ్యవస్థ పేదలకు ఉచితంగా న్యాయం అందిస్తుంది. ప్రస్తుతం మన రాష్ట్రంలో 70కిపైగా లోక్ అదాలత్‌లు ఉన్నాయి.
-సాధారణ న్యాయస్థానాల్లో పనిచేస్తున్న న్యాయమూర్తి, లోక్ అదాలత్ న్యాయాధిపతిగా కూడా వ్యవహరిస్తారు. ఈ విధానం వల్ల కేసులను పరిష్కరించడంలో ఆలస్యాన్ని నివారించవచ్చు.
నోట్:
శాశ్వత లోక్ అదాలత్‌ల ఏర్పాటు రాజ్యంగబద్ధమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వీటి ఏర్పాటు కోసం న్యాయసేవల సాధికార సంస్థ చట్టానికి చేసిన సవరణను సవాలు చేస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీని తీర్పులకు కక్షిదారులు కట్టుబడి ఉండాలని, వాటిని కోర్టుల్లో సవాలు చేయడం కుదరదని జస్టిస్ ఆర్ఎం లోథా, జస్టిస్ అనిల్ దవేలతో కూడిన ధర్మాసనం 2012, ఆగస్టు 3న తీర్పు ఇచ్చింది. న్యాయయంత్రాంగం కంటే శక్తిమంతమైన ప్రత్యామ్నాయ సంస్థాగత యంత్రాంగాలను పార్లమెంట్ ఏర్పాటు చేయవచ్చునని, అలాంటివి రాజ్యాంగ విరుద్ధం కావని బెంచ్ ఈ సందర్భంగా పేర్కొంది.
ఉదా:
మోటార్ వాహనాలకు సంబంధించిన వివాదాలు, సివిల్ కేసులు, కాంట్రాక్టులకు సంబంధించిన వివాదాలు, ఉభయవర్గాల అంగీకారంతో లోక్ అదాలత్‌ల ద్వారా సత్వరగా, సంతృప్తికరంగా పరిష్కారమవుతున్నాయి. ఈ తీర్పుల ద్వారా సంతృప్తి పొందినవారికి సాధారణ న్యాయస్థానాలకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఇవి ప్రత్యేక తరహాలో రూపొందించిన న్యాయస్థానాలు. ప్రజలకు సత్వరమే న్యాయాన్ని అందించడమే ఈ లోక్‌అదాలత్‌ల ముఖ్య ఉద్దేశం.
-బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు లోక్ అదాలత్ నిర్వహణలో బాధ్యత తీసుకోవాలి. ఈ సంస్థలు లోక్ అదాలత్‌ల నిర్వహణ విషయంలో రాష్ట్ర, జిల్లా, తాలూకా స్థాయి లీగల్ సర్వీస్ అథారిటీలతో తరచూ సంప్రతింపులు జరుపుతుండాలి. బ్యాంకులు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆర్బీఐకి ప్రగతి నివేదిక సమర్పించాలి. జూన్, సెప్టెంబర్, డిసెంబర్, మార్చి నెలల్లో ముగిసే త్రైమాసికాలకు సంబంధించిన ప్రగతి నివేదికలను.. ప్రతి త్రైమాసికం ముగిసిన నెలలోపు ఆర్బీఐకి అందజేయాలి. లోక్ అదాలత్‌లలో కేసుల ద్వారా నిధుల రికవరీలో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సాధించే ప్రగతిని ఆర్బీఐ పర్యవేక్షిస్తుంటుంది.
నేషనల్ లోక్ అదాలత్
-జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు తాలూకా స్థాయి నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రతి కోర్టులోను 2013 నవంబర్ 23న లోక్ అదాలత్ కార్యక్రమాలు నిర్వహించారు.
-ఈ కార్యక్రమాన్ని ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు.
-లోక్ అదాలత్‌ల ద్వారా 39 లక్షల పెండింగ్ కేసులను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నా 28.26 లక్షల కేసులను పరిష్కరించారు.
నోట్: ఒక్క లోక్పాల్తోనే అవినీతి అంతమవుతుందని చెప్పలేం. లోక్‌పాల్‌తో పాటు కింది 6 అవినీతి వ్యతిరేక బిల్లులు చట్టం రూపం సంతరించుకుంటేనే అవినీతిపై పోరాటం చేయవచ్చు. వీటిని రాహుల్ మానస పుత్రికలుగా చెప్పుకుంటారు. అవి..
1. ప్రజావేగుల రక్షణ బిల్లు- 2011
2. న్యాయప్రమాణాలు, జవాబుదారీ బిల్లు- 2010
3. నిర్దిష్ట గడువులోగా వస్తు సేవల పంపిణీకి సంబంధించి పౌరుల హక్కులు, పరిష్కారాల కోసం ఫిర్యాదుల బిల్లు- 2011
4. విదేశీ అధికారులు, విదేశీ అంతర్జాతీయ సంస్థల అధికారుల అవినీతి నిరోధక బిల్లు- 2011
5. అవినీతి నిరోధక (సవరణ) బిల్లు – 2013
6. పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ బిల్లు – 2012
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు