The Kakatiya period | కాకతీయ కాలం కవి పండిత యుగం

అమోఘమైనది, అంతరించనిది కాకతీయ రాజుల మహాసామ్రాజ్య చరిత్ర. దక్షిణాపథమే కాకుండా ఉత్తర పథం వరకూ మార్మోగిందని, చరిత్రపరంగా ఘంటాపదంగా చెప్పవచ్చు.
-వీరి పరిపాలన మొదటి బేతరాజుతో క్రీ.శ. 1000వ సంవత్సరం నుంచి ప్రారంభమై క్రీ.శ. 1323లో రెండో ప్రతాపరుద్ర చక్రవర్తితో అంతమైందని చరిత్ర చెపుతుంది. దాదాపుగా 280-300 ఏండ్లు (3 శతాబ్దాలు) ఏకచ్ఛత్రాధిపత్యంగా పరిపాలన సాగించిన మహోన్నత ఘనత కాకతీయులది.
-పూర్వకాలపు నిర్మాణావశేషాలు, కవులు, సాహిత్యం వారి సామ్రాజ్యంలో విలసిల్లినాయి. ప్రత్యేకంగా కళలపట్ల, దేవాలయ నిర్మాణాల పట్ల, ప్రజల సుఖశాంతుల పట్ల ఎంతో శ్రద్ధ వహించి వారు పరిపాలన సాగించినారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఊట చెరువుల తవ్వకాలు వీరి కాలంనుంచే ప్రారంభమయ్యాయి. ప్రాచీన ఏకశిలా నగరం (ఓరుగల్లు) నేడు వరంగల్గా ప్రసిద్ధిచెందింది. రుద్రమదేవి (రుద్రమాంబ)కి పాలంపేట-చందుపట్ల గ్రామాలు ఎంతో ఇష్టమని చరిత్ర చెపుతుంది.
-పాలంపేటలోని రామప్ప దేవాలయం, చందుపట్లలోని శివశాక్తికేయాలయాలు అత్యంత ప్రాచీనమైనవని, కాకతీయ ఎనిమిదో మహారాజు గణపతిదేవ చక్రవర్తి కంటే ముందు రాజులు కట్టించారని చరిత్రకారుల అభిప్రాయం.
అంతేకాకుండా కాకతీయ మహాసామ్రాజ్యం ఉత్తరాన సింహాచలం నుంచి దక్షిణాన కాంచీపురం వరకు, తూర్పున బంగాళాఖాతం నుంచి పడమర కల్యాణ కటకం వరకు, నైరుతి నుంచి మైసూరు రాజ్యంలోని కోలారు మండలంలో చింతామణి తాలూకాకు చెందిన మార్జవాడి (కైవారము) వరకు కాకతీయ సామ్రాజ్యం వ్యాపించిందని కాశీపీఠ చరిత్రకారులు నిర్ధారించారు. ఇది వాస్తవమని ప్రముఖ శాసన చరిత్రకర్త అయిన చిలుకూరి వీరభద్రరావు కూడా తెలిపారు.
-గీర్వాణాంధ్ర వాజ్ఞయ పోషణ.. ఎంతోమంది కవులు, విద్వత్ శిఖామణులు వివిధ శాస్ర్తాల భాషా నూతనాలంకారాల చర్చలు జరిపేవారని కాకతీయ యుగ రాజ్య చరిత్ర తెలుపుతుంది. విదేశీయుల దాడుల్లో కొంతపోయినను చాలా శాసనాలు, గ్రంథాలు ఉన్నాయి.
-బ్రాహ్మణులకు అగ్రహారదానాలు చేయడంలో కాకతీయ రాజులు చెప్పుకోదగ్గవారు. కాకతి వీరరుద్రుని బంధువైన ఇందుశేఖరుడు రుద్రదేవుడను పండితునికి ఉత్తరేశ్వరం అనే గ్రామాన్ని దానంగా ఇచ్చినట్లు చరిత్ర తెలుపుతుంది (ఉత్తరేశ్వర తామ్ర శాసనం నకలు కాశీలో ఉన్నది. ఇందులో 67మంది బ్రాహ్మణులకు దానమిచ్చినట్టుగా ఉంది).
-ఏమైనప్పటికీ కాకతీయ మహాసామ్రాజ్యం వెలుగులో వెలుగై వెలిగినది. ఆయుర్వేద రసవాద ప్రక్రియ, పరుసవేది, జారణ (జారణే) మారణే చైవ సిద్ధాంత ప్రక్రియ సమస్త జనావళి ముంగిట ఉండేది. సామాన్య జనానికి అందేది. చివరి కాకతీయ ప్రతాపరుద్రుని కాలంలోనూ ఎంతో వైభవోపేతంగా సాగిన కాకతీయ సామ్రాజ్యంలో శివదేవయ్య-శరభాంకుడు, మల్లికార్జునుడు, రంగనాథుడు తదితర 200మంది కవీశ్వరులు ఉన్నారు.
RELATED ARTICLES
-
Current Affairs | SBI నాలుగో స్టార్టప్ బ్రాంచిని ఎక్కడ ఏర్పాటు చేశారు?
-
Scholarship 2023 | Scholarships for Students
-
General Studies | అరుదైన వ్యాధులు.. అసాధారణ లక్షణాలు
-
BIOLOGY | మొక్కలనిచ్చే కణుపులు.. దుంపలుగా మారే వేర్లు
-
Scholarships 2023
-
Current Affairs March 15 | National Women`s Day celebrated on?
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?