1. 20 శతాబ్దపు తొలి దశకంలో దేశంలోని ఏ ప్రాంతంలో ముస్లిం రైతుల మోప్లా తిరుగుబాటు చోటుచేసుకుంది?
1) ఇచ్చంపల్లి ప్రాంతం
2) మద్రాసు ప్రాంతం
3) మలబార్ కోస్తా ప్రాంతం
4) బెంగాల్ ప్రాంతం
2.భారతీయ పార్లమెంటు రూపొందించిన కొన్ని చట్టాలు ప్రజల స్వేచ్ఛను నియంత్రిస్తాయి. ఈ చట్టాలను ఏమంటారు?
1) ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలు
2) డ్రాకోనియన్ చట్టాలు
3) నేషనల్ హ్యూమన్ రైట్స్ చట్టాలు
4) ప్రివెన్షన్ ఆఫ్ టెర్రిరిజం చట్టాలు
3.రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలోని ఫ్లోరోసిస్ సమస్యను తొలిసారిగా ఎప్పుడు గుర్తించారు?
1) 1941 2) 1942
3) 1944 4) 1945
4.రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం రాజ్యం స్త్రీలు, పిల్లలకు అనుకూలంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయవచ్చు?
1) 15(2) 2) 15(3)
3) 15(4) 4) 15(5)
5.దేశంలో మాడా అనే కార్యక్రమాన్ని ఎన్నో పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభించారు?
1) 6వ పంచవర్ష ప్రణాళిక
2) 7వ పంచవర్ష ప్రణాళిక
3) 8వ పంచవర్ష ప్రణాళిక
4) 5వ పంచవర్ష ప్రణాళిక