ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించారు?
కోల్కతా ప్రధాన కేంద్రంగా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ 1914లో ఏర్పడింది. బ్రిటిష్ పాలనాకాలంలో రసాయన శాస్త్రవేత్తలైన జేఎల్ సిమన్సన్, పీఎస్ మెక్మోహన్ చొరవతో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ రూపుదిద్దుకుంది. బ్రిటిష్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ తరహాలో భారతదేశంలోనూ ఒక సంస్థను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో సైన్స్ కాంగ్రెస్ను స్థాపించారు. దేశంలోని శాస్త్ర, విజ్ఞాన, సాంకేతిక రంగాల్లోని పరిశోధనలను ప్రోత్సహించాలనేది ఈ సంస్థ ఉద్దేశం. ప్రతి ఏటా జనవరి మొదటి వారంలో దేశంలోని ఏదైనా ఒక పట్టణంలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశాలకు ప్రముఖ వ్యక్తి లేదా శాస్త్రవేత్త అధ్యక్షత వహిస్తారు. మొదటి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 1914లో కోల్కతాలో జరిగింది. దీనికి అధ్యక్షుడిగా శాస్త్రవేత్త అశుతోష్ ముఖర్జీ వ్యవహరించారు.
తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1947లో ఢిల్లీలో జరిగిన 34వ సమావేశాలకు అధ్యక్షత వహించాడు. 1976లో వాల్లేర్లో జరిగిన సమావేశానికి ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ అధ్యక్షత వహించాడు. ప్రముఖ శాస్త్రవేత్తలైన మోక్షగుండం విశ్వేశ్వరయ్య, శాంతి స్వరూప్ భట్నాగర్, మహలనోబిస్, కస్తూరీరంగన్, ఎంజీకే మీనన్, పీసీ రాయ్ తదితర ప్రముఖులు సైన్స్ కాంగ్రెస్కు అధ్యక్షత వహించారు. ప్రస్తుతం 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం మణిపూర్ రాజధాని ఇంఫాల్లో నిర్వహిస్తున్నారు. అధ్యక్షుడిగా అచ్యుత సమంత వ్యవహరిస్తున్నారు. ఈ సైన్స్ కాంగ్రెస్ ఇతివృత్తం శాస్త్ర, సాంకేతికత ద్వారా ఇప్పటికీ చేరుకోలేని వర్గాలను చేరుకోవడం. దాదాపు 5వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు