Indian Polity | గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేసేందుకు ఎవరి అనుమతి కావాలి?
ఫిబ్రవరి 4 తరువాయి
16. భారతదేశంలో రాష్ట్ర గవర్నర్ ఎవరికి బాధ్యత వహిస్తాడు?
1) రాష్ట్ర శాసన వ్యవస్థకు
2) భారత రాష్ట్రపతికి
3) రాష్ట్ర శాసన సభకు
4) మంత్రిమండలికి
17. రాష్ట్రంలో ప్రస్తుతమున్న శాసన పరిషత్తును రద్దు చేయడానికి అనుసరించాల్సిన ప్రొసీజర్ ఏంటి?
1) ఆ మేరకు రాజ్యసభ ఒక తీర్మానం ఆమోదించాలి
2) రాజ్యాంగంలో నిర్ణయించిన విధంగా ప్రత్యేక మెజారిటీతో ఆ మేరకు రాష్ట్ర శాసనసభ ఒక తీర్మానం ఆమోదించాలి
3) శాసన పరిషత్తును రద్దు చేస్తూ పార్లమెంటు శాసనం చేయాలి
4) బిల్లు విషయంలో మాదిరిగానే సాధారణ మెజారిటీతో రాష్ట్ర శాసనసభ ఒక తీర్మానం ఆమోదించాలి
18. కింది వాటిలో కేంద్రంచే విధించబడి రాష్ర్టాలచే వసూలు చేసుకోబడే పన్నులు ఏవి?
1) స్టాంప్ డ్యూటీలు
2) ప్రయాణికులు, సరకులపై పన్ను
3) ఎస్టేట్ డ్యూటీ
4) పత్రికలపై పన్ను
19. కింది వాటిని జతపరచండి అధికరణ అంశం
ఎ. 221 1. హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు
బి. 222 2. న్యాయమూర్తుల బదిలీలు
సి. 223 3. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి
1) ఎ-1, బి-3, సి-2
2) ఎ-3, బి-2, సి-1
3) ఎ-1, బి-2, సి-3
4) ఎ-2, బి-1, సి-3
20. ఏ రాష్ట్రంలో మత ప్రాతిపదిక మీద శాసనసభ లో రిజర్వు అయిన స్థానం ఉంది?
1) గోవా 2) సిక్కిం
3) మిజోరం 4) జమ్ముకశ్మీర్
21. కింది స్టేట్మెంట్లలో దేశంలోని రాష్ర్టాల ఫైనాన్స్ కమిషన్ సంబంధించి సరైన అంశం కానిది ఏది?
1) 74వ రాజ్యాంగ సవరణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు, మున్సిపాలిటీల్లో ఫైనాన్స్ పొజిషన్ రివ్యూ
2) రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్, చైర్మన్‌ను నామినేట్ చేసే విషయంలో ముఖ్యమంత్రి కీలకపాత్ర
3) రాష్ట్రంలోని అంశాలు, మున్సిపాలిటీల్లో ఫైనాన్స్ కమిషన్ అంశాల వివరణ
4) రాష్ట్ర సంఘటిత నిధి నుంచి పంచాయతీలకు వచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్‌లను ఫైనాన్స్ కమిషన్ రెకమెండ్ చేస్తుంది
22. కింది స్టేట్మెంట్లలో సరైంది ఏది?
1) భారత రాజ్యాంగ పరిషత్తును 1946లో రాష్ట్ర శాసనసభలు ఎన్నుకొన్నాయి
2) జవహర్లాల్ నెహ్రూ, మహ్మద్ అలీజిన్నా, సర్దార్ వల్లభాయ్‌పటేల్ రాజ్యాంగ పరిషత్తులో సభ్యులు
3) రాజ్యాంగ పరిషత్తు ప్రథమ సమావేశం 1947, జనవరిలో జరిగింది
4) రాజ్యాంగాన్ని జనవరి 26 నుంచి అమల్లోకి తెచ్చారు
23. భారతదేశంలో అడ్వకేట్ జనరల్‌కు సంబంధించి సరైనవి?
ఎ. అతడిని/ఆమెను భారత రాష్ట్రపతి నియమిస్తారు
బి. అతను/ఆమె రాష్ట్ర శాసనసభ ప్రొసీడింగ్స్‌లో పాల్గొంటారు
సి. అతడి/ ఆమె వేతనాన్ని భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు
డి. అతడు/ఆమె న్యాయపరమైన విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇస్తారు
1) బి, డి 2) సి
3) ఎ 4) ఎ, బి, సి, డి
24. రాష్ర్టాల ఆర్థిక మంత్రుల స్టాండింగ్ కమిటీ ఏ విషయమై 2000, జనవరిలో దేశమంతటా ఒకే విధమైన పన్ను విధించాలని సిఫారసు చేసింది?
1) విలువ ఆధారిత సుంకం
2) అమ్మకపు పన్ను
3) స్టాంపు, రిజిస్ట్రేషన్ సుంకం
4) వ్యవసాయ ఆదాయ పన్ను
25. ఏ అంశాల సవరణకు సగానికి తక్కువ కాకుండా రాష్ట్ర శాసనసభలు ఆమోదం తెలపాలి?
ఎ. రాష్ట్రపతి ఎన్నిక విధానం
బి. పార్లమెంట్లో రాష్ర్టాల ప్రాతినిధ్యం
సి. 7వ షెడ్యూల్లోని ఏ అంశం పైనైనా
డి. రాష్ట్ర శాసనమండళ్ల రద్దు
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) ఎ, సి, డి 4) బి, సి, డి
26. గవర్నర్ నియామకానికి కింద పేర్కొన్న అర్హతల్లో తప్పుగా ఉన్నది?
1) అతడు (లేదా) ఆమె భారత పౌరులై ఉండాలి
2) అతడు (లేదా) ఆమె వయస్సు 30 సంవత్సరాలకు తక్కువ ఉండరాదు
3) అతడు (లేదా) ఆమె పార్లమెంటులోని ఏ సభలో గాని, రాష్ట్ర శాసనసభల్లో గాని సభ్యులై ఉండరాదు
4. అతడు (లేదా) ఆమె ఆదాయం లభించే ఏ ఇతర పదవి కలిగి ఉండరాదు
27. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును గవర్నర్ తన వద్ద రిజర్వు చేసుకున్నప్పుడు?
1) అతడిని తొలగించవచ్చు
2) అతడే దాన్ని రాష్ట్రపతికి పంపవచ్చు
3) అపరిమిత కాలం ఆ బిల్లును పెండింగ్‌లో ఉంచవచ్చు
4) అతడు తరువాత ఆ బిల్లుకు తన ఆమోదాన్ని ఇవ్వవచ్చు
28. రాష్ట్ర కార్యనిర్వహణాధిపతి ఎవరు?
1) గవర్నర్ 2) ముఖ్యమంత్రి
3) రాష్ట్ర కేబినెట్
4) రాష్ట్ర శాసనమండలి
29. గవర్నర్‌ను సాధారణంగా ఎక్కడి నుంచి తీసుకుంటారు?
1) సంబంధిత రాష్ట్రం నుంచి
2) బయటి రాష్ట్రం నుంచి
3) సంబంధిత జోన్ నుంచి
4) మెజారిటీ పార్టీ నుంచి
30. రాష్ట్ర శాసన వ్యవస్థలో ఎగువ సభలో ఇతర సభ్యులతో పాటు..?
1) ఉపాధ్యాయుల నియోజకగణం ద్వారా ఎన్నికైనవారు పన్నెండో వంతు, పురపాలక సంఘాల ద్వారా ఎన్నికైనవారు మూడో వంతు, రిజిస్టర్ పట్టభద్రుల ద్వారా ఎన్నికైనవారు పన్నెండోవంతు మంది ఉంటారు
2) రిజిస్టర్ పట్టభద్రుల ద్వారా ఎన్నికైన వారు పన్నెండో వంతు, మహిళల ద్వారా ఎన్నికైన వారు పన్నెండో వంతు, కార్మిక సంఘాలు, సహకార సంస్థల ద్వారా ఎన్నికైన వారు మూడో వంతు సభ్యులు ఉంటారు
3) మహిళల ద్వారా ఎన్నికైన వారు పన్నెండో వంతు, పురపాలక సంఘాలు ఇతర స్థానిక సంస్థల ద్వారా ఎన్నికైనవారు పన్నెండో వంతు, ఉపాధ్యాయ నియోజకగణం ద్వారా ఎన్నికైనవారు మూడో వంతు సభ్యులు ఉంటారు
4) ప్రజలు నేరుగా ఎన్నుకునేవారు మూడోవంతు, రిజిస్టర్ పట్టభద్రుల ద్వారా ఎన్నికైనవారు పన్నెండోవంతు, సహకార బ్యాంకులు, మహిళా సంఘాలు ఇతర సహకార సంస్థలు ఎన్నుకొన్నవారు పన్నెండోవంతు మంది సభ్యులుంటారు
31. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం భారత యూనియన్ నుంచి రాష్ట్రం ఏర్పాటును నిషేధించారు?
1) 16వ రాజ్యాంగ సవరణ చట్టం 1963
2) 22వ రాజ్యాంగ సవరణ చట్టం 1969
3) 29వ రాజ్యాంగ సవరణ చట్టం 1972
4) 35వ రాజ్యాంగ సవరణ చట్టం 1974
32. దేశంలో ఏదైనా రాష్ట్ర శాసన వ్యవస్థలో ఆ రాష్ట్రంలోని హైకోర్టు అధికార పరిధి?
1) పెరుగుతుంది
2) పరిమితమవుతుంది
3) రద్దవుతుంది
4) పెరగదు, పరిమితం కాదు, రద్దు కాదు
33. పదవీ బాధ్యతలు స్వీకరించేటప్పుడు గవర్నర్ ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తాడు?
1) భారత రాష్ట్రపతి
2) భారత ప్రధాన న్యాయమూర్తి
3) రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
4) పైవారందరు
34. ప్రతిపాదన ఎ: గవర్నర్ తన విచక్షణాధికారంతో బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపవచ్చు
హేతువు ఆర్: రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి పునఃపరిశీలించవచ్చు
1) ఎ, ఆర్ సరైనవి.. ఆర్, ఎ కు సరైన వివరణ
2) ఎ, ఆర్ సరైనవి.. ఆర్, ఎ కు సరైన వివరణ కాదు
3) ఎ సరైంది, ఆర్ సరైంది కాదు
4) ఎ సరైంది కాదు, ఆర్ సరైంది
35. అధికరణ 156 ప్రకారం రాష్ట్ర గవర్నర్ పదవీ కాలం 5 ఏళ్లు. ఈ సందర్భంలో సరైంది?
ఎ. పదవీకాలం పూర్తయ్యే వరకు ఏ గవర్నర్‌నూ తమ పదవి నుంచి తొలగించడానికి వీలు కాదు
బి. ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం ఏ గవర్నర్ తన పదవిలో కొనసాగలేడు
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
36. మంత్రి వ్యవహార శైలి బాగా లేనట్లయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి..?
1) అతడిని రాజీనామా చేయమని అడుగుతాడు
2) అతడిని తొలగించమని గవర్నర్‌ను అడుగుతాడు
3) అతడిని తొలగించి వేరే అతడిని నియమిస్తాడు
4) పైవన్నీ
37. రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేసేందుకు ఎవరి అనుమతి కావాలి?
1) రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
2) భారత రాష్ట్రపతి
3) ముఖ్యమంత్రి
4) పార్లమెంటు
38. రాష్ట్ర గవర్నర్‌ను ఎవరు నియమిస్తారు?
1) ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిఫారసు
మేరకు రాష్ట్రపతి
2) రాష్ట్రపతి, కేంద్ర మంత్రిమండలి
3) రాష్ట్రపతి
4) ప్రధానమంత్రి
39. ఒక రాష్ట్ర గవర్నర్ నియామకానికి సంబంధించి కింది సంప్రదాయాల్లో ఏది వాస్తవం?
1) ఆ వ్యక్తి ఆ రాష్ర్టానికి చెందినవాడు కాకుండా బయటి ప్రాంతానికి చెందినవాడై ఉండాలి
2) ఆ వ్యక్తి వయస్సు 60 సంవత్సరాలకు మించి ఉండరాదు
3) ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నియమిస్తాడు
4) ఆ వ్యక్తి న్యాయవాద సంబంధ వృత్తిలో ఉండాలి
40. గవర్నర్ జీతం ఎక్కడి నుంచి చెల్లిస్తారు?
1) భారత సంఘటిత నిధి నుంచి
2) రాష్ట్ర సంఘటిత నిధి నుంచి
3) భారత సంఘటిత నిధి నుంచి సగం, రాష్ట్ర సంఘటిత నిధి నుంచి సగం
4) రాష్ట్ర అత్యవసర నిధి నుంచి
41. రాష్ట్ర గవర్నర్ మరణించినప్పుడు ఆ బాధ్యతలు ఎవరు నిర్వర్తిస్తారు?
1) భారత రాష్ట్రపతిచే నియమించబడిన ఎవరైనా
2) రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి
3) ప్రధాన కార్యదర్శి
4) ముఖ్యమంత్రి
జవాబులు
16. 2 17. 2 18. 1 19. 3
20. 1 21. 2 22. 1 23. 1
24. 2 25. 1 26. 2 27. 2
28. 1 29. 2 30. 1 31. 1
32. 4 33. 3 34. 2 35. 4
36. 4 37. 3 38. 3 39. 1
40. 2 41. 1
మార్కండేయ
పాలిటీ ఫ్యాకల్టీ
టాపర్స్ ఇన్స్టిట్యూట్
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు