SBI RBO Recruitment | 868 ఆర్బీఓ పోస్టుల భర్తీకి ఎస్బీఐ నోటిఫికేషన్
SBI Recruitment | దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ (RBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 868 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఎంపికైనవారిని బిజినెస్ కరస్పాండెంట్ ఫెసిలిటేటర్ (Business Correspondent Facilitator) పోస్టుల్లో నియమించనుంది. బ్యాంకింగ్‌లో అనుభవం ఉన్నవారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నెల 31తో ఆన్లైన్ దరఖాస్తుల గడువు ముగియనుంది. హైదరాబాద్‌లో 48 పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 868
ఇందులో జనరల్ 379, ఎస్సీ 136, ఎస్టీ 57, ఓబీసీ 216, ఈడబ్ల్యూఎస్ 80, పీడబ్ల్యూడీ 45 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగులై ఉండాలి. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నవారు, సస్పెండ్ అయినవారు, ఉద్యోగానికి రాజీనామా చేసిన వారు అప్లయ్ చేసుకోవడానికి అనర్హులు. అభ్యర్థులు 2023, మార్చి 10 నాటికి 63 ఏండ్ల లోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
రిజిస్ట్రేషన్లకు చివరితేదీ: మార్చి 31
వెబ్సైట్: sbi.co.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






