Indian Polity | కేంద్ర విజిలెన్స్ కమిషన్ తన నివేదికను ఎవరికి సమర్పిస్తుంది?
పాలిటీ
16. జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం గురించి సరైనది?
1) జమ్మూకశ్మీర్ మంత్రి మండలిలో శాసనసభలోని మొత్తం సభ్యుల్లో 10 శాతం మించరాదు
2) జమ్మూకశ్మీర్ మంత్రి మండలిని ముఖ్యమంత్రి సలహా మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ నియమిస్తాడు
3) జమ్మూకశ్మీర్ లడక్లకు ఉమ్మడి హైకోర్టు ఉంటుంది
4) పై వాక్యాలన్నీ సరైనవే
17. జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం గురించి సరైనది?
1) జమ్మూకశ్మీర్, లడఖ్ హైకోర్టు ఖర్చులను జనాభా ప్రాతిపదికన భరిస్తాయి
2) జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌ను అడ్వకేట్ జనరల్ నియమిస్తాడు
3) లెఫ్టినెంట్ గవర్నర్ ముఖ్య న్యాయ సలహాదారునిగా వ్యవహరిస్తాడు
4) పైవన్నీ సరైనవే
18. జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం గురించి సరైనది?
1) లెఫ్టినెంట్ గవర్నర్‌ను రాష్ట్రపతి నియమిస్తాడు
2) లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే పదవిలో ఉంటాడు
3) పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి వర్తించే 239A అధికరణ ఈ ప్రాంతానికి విస్తరించారు
4) పైవన్నీ సరైనవే
19. జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం గురించి సరికానిది?
1) జమ్మూకశ్మీర్ నుంచి 4 రాజ్యసభ సభ్యులు ఎన్నికవుతారు
2) జమ్మూకశ్మీర్ నుంచి ఆరుగురు లోక్‌సభ సభ్యులు ఎన్నికవుతారు
3) జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక పబ్లిక్ కమిషన్ ఉంటుంది
4) 14వ భాగంలో రాజ్యాంగంలో పేర్కొన్న విషయం ఈ ప్రాంతానికి వర్తిస్తుంది
20. జమ్మూకశ్మీర్‌కు సంబంధించి సరైనది?
1) రాష్ట్రపతి అనుమతితో జమ్మూకశ్మీర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లడఖ్ ప్రాంతానికి కూడా సేవలందించవచ్చు
2) 356 నిబంధన జమ్మూకశ్మీర్‌కు కూడా వర్తిస్తుంది.
3) జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక కాగ్ ఉంటుంది
4) పైవన్నీ సరైనవే
21. కిందివాటిలో సరికానిది?
1) కేంద్ర ప్రభుత్వ చట్టాలన్నీ జమ్మూకశ్మీర్, లడఖ్‌లకు వర్తిస్తాయి.
2) దాదాపు 108 చట్టాలు వర్తిస్తాయి
3) గతంలో 153 చట్టాలను రద్దు చేశారు
4) కొన్నింటిని సవరించారు
22. కిందివాటిలో సరికానిది?
1) 35A ప్రకరణను 1934లో రద్దు చేశారు
2) రాజ్యాంగంలో ఏదైనా చేర్చాలన్నా, తొలగించాలన్నా 368 ప్రకరణ ద్వారా సాధ్యమవుతుంది
3) 370(1)(d) 1970లో చేర్చారు.
4) 1961లో పురాన్లాల్ లకన్పాల్ Vs ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ధర్మాసనం ముందుకు వచ్చింది
23. 370వ అధికరణంలోని అంశాలు రద్దు కావడంతో ఏ నిబంధనలోని అధికరణలు ఉపసంహరించబడతాయి?
1) 35ఎ 2) 36ఎ
3) 37ఎ 4) 48ఎ
24. సలహా సంఘం నియామకం గురించి సరైనది
1) జమ్మూకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ తర్వాత అన్ని అంశాలు 90 రోజుల్లో రద్దవుతాయి.
2) ఈ కమిటీ 6 నెలల్లో తన నివేదికనులెఫ్టినెంట్ గవర్నర్‌కు అందించాలి
3 ) లెఫ్టినెంట్ గరవ్నర్ నివేదిక వచ్చిన నెలరోజుల్లో లెఫ్టినెంట్ గవర్నర్ చర్చలు తీసుకోవాలి 4) పైవన్నీ సరైనవే
25. కిందివాటిలో సరైనవి.
1) 10వ షెడ్యూల్లోని పార్టీ ఫిరాయింపుల చట్టం జమ్మూకశ్మీర్‌కు కూడా వర్తిస్తుంది
2) ఆస్థిహక్కు ప్రాథమిక హక్కుగా రద్దుచేశారు
3) జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక పథకం ఉండదు
4) పైవన్నీ సరైనవే
26. లడఖ్ గురించి సరైనవి?
1) లడఖ్ ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతం
2) దీనికి శాసనసభ లేదు
3) ఇది సాధారణ కేంద్రపాలిత ప్రాంతం
4) పైవన్నీ సరైనవే
27. లడఖ్ గురించి సరైనది?
1) దీనికి అధిపతిని లెఫ్టినెంట్ గవర్నర్ అంటారు
2) లెఫ్టినెంట్ గవర్నర్‌ను రాష్ట్రపతి నియమిస్తాడు
3) దీనికి రాష్ట్రపతి 204వ అధికరణ ప్రకారం ఆదేశాలను జారీ చేస్తారు
4) పైవన్నీ సరైనవే
28. కింది స్టేట్మెంట్లను పరిశీలించండి?
1) జాతీయ మానవ హక్కుల కమిషన్, హక్కుల రక్షణ కర్తగా పనిచేస్తుంది
2) ఈ కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంటుంది
3) ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటుంది
4) స్వతంత్రంగా దర్యాప్తు చేస్తుంది
1) 1, 2, 3, 4 2) 1, 2, 4
3) 1, 2, 3 4) 3, 4
29. జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఎక్కువగా వస్తున్న ఫిర్యాదులు?
1) వరకట్న వేధింపులు
2) బాలల హక్కుల ఉల్లంఘన
3) పోలీసుల అతి ప్రవర్తన
4) ప్రభుత్వ అధికారుల అలసత్వం
30. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు సంబంధించి సరికానిది?
1) తన నివేదికను పార్లమెంటుకు సమర్పిస్తుంది
2) పార్లమెంటు స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థ
3) స్వతంత్ర, స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థ
4) వీరి జీతభత్యాలు యూపీఎస్సీ చైర్మన్‌తో సమానంగా ఉంటాయి.
31. కింది స్టేట్మెంట్లను పరిశీలించండి?
ఎ) సెంట్రల్ విజిలెన్స్ కమిషన్
బి) లోక్‌పాల్
సి) సెంట్రల్ బ్యూరోఆఫ్ ఇన్వెస్టిగేషన్
డి) స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్
1) ఎ, సి, డి 2) ఎ, డి
3) సి, డి 4) బి, సి, డి
32. కింది ఏ కమిషన్ల పదవీకాలం మూడు సంవత్సరాలు ఉంటుంది.
1) జాతీయ మహిళా కమిషన్
2) జాతీయ మైనారిటీ కమిషన్
3) జాతీయ సఫాయి కర్మచారి కమిషన్
4) పైవన్నీ
33. కిందివాటిలో సరైనది.
1) కేంద్రస్థాయిలో అవినీతిని అరికట్టడానికి అతి ముఖ్యమైన ఏజెన్సీ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్
2) 1964లో కె. సంతానం కమిటీ దీన్ని సూచించింది
3) ప్రస్తుతం కేంద్ర విజిలెన్స్ కమిషన్ చట్టపర సంస్థ 4) పైవన్నీ సరైనవే
34. కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఎవరు తొలగిస్తారు?
1) పార్లమెంటు తీర్మానం మేరకు రాష్ట్రపతి
2) సుప్రీంకోర్టు సలహా మేరకు రాష్ట్రపతి
3) కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు రాష్ట్రపతి
4) పైవేవీకాదు
35. కిందివాటిలో సరైనది?
1) కేంద్ర విజిలెన్స్ కమిషన్ బహుళ సభ్య సంస్థ
2) ఇందులోని కమిషనర్ రాష్ట్రపతి అధికార ముద్ర ద్వారా నియమించబడతారు
3) వీరి ఎంపిక కమిటీకి ప్రధాన మంత్రి చైర్మన్‌గా ఉంటారు
4) పైవన్నీ సరైనవే
36. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ పరిధిలోకి రానివారు?
1) అఖిలభారత సర్వీసు ఉద్యోగులు
2) కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు
3) లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సీనియర్ ఉద్యోగులు
4) పైఎవరూ కాదు
37. కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఏ హోదాలో ఉంది?
1) రాజ్యాంగ హోదా
2) డిజిగ్నేటెడ్ ఏజెన్సీ హోదా
3) క్వాజీ జ్యుడీషియర్ హోదా
4) 2 ,3
38. కేంద్ర విజిలెన్స్ కమిషన్ తన నివేదికను ఎవరికి సమర్పిస్తుంది?
1) రాష్ట్రపతి 2) కేంద్ర ప్రభుత్వం
3) పార్లమెంటు 4) కేంద్ర హోంశాఖ
39. కేంద్ర విజిలెన్స్ కమిషనర్ తొలగింపునకు కారణాలు
1) దివాలా తీయడం
2) నేరారోపణ రుజువు కావడం
3) లాభదాయక పదవులు చేపట్టడం
4) పైవన్నీ
40. కేంద్ర విజిలెన్స్ కమిషన్ విధి కానిది?
1) ఢిల్లీ స్పెషల్ పోలీసు వ్యవస్థకు విధి విధానాలు సూచించడం
2) ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై విచారణ చేయడం
3) సీబీఐ డైరెక్టర్ నియామకంలో సలహా ఇవ్వడం
4) తప్పు చేసిన ఉద్యోగులపై శిక్షలను ఖరారు చేయడం
41. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు
1) లోకాయుక్త పరిధిలోకి రారు
2) లోకాయుక్త పరిధిలోకి వస్తారు
3) గవర్నర్ అనుమతితో విచారణ
4) చట్టంలో ఎలాంటి ప్రస్తావన లేదు
42. కింది కారణం వల్ల లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందలేదు?
1) ప్రధానమంత్రిని ఎం.పి.లను బిల్లు పరిధిలోకి తేవడం
2) స్వతంత్ర విచారణ వ్యవస్థను ఏర్పాటు చేయడం
3) న్యాయవ్యవస్థను దీని పరిధిలోకి తీసుకురావడం 4) పైవన్నీ
43. కిందివాటిలో అంబుడ్స్‌మన్ తరహా వ్యవస్థను భారతదేశంలో ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ?
1) సంతానం కమిటీ
2) మొదటి పాలనా సంస్కరణల సంఘం
3) రెండో పాలనా సంస్కరణల సంఘం
4) పైవన్నీ
44. భారతదేశంలో అంబుడ్స్‌మన్ వ్యవస్థను మొదటిసారిగా సూచించిన కమిషన్?
1) పాలనా సంస్కరణ సంఘం -1966
2) పాలనా సంస్కరణ సంఘం- 2007
3) రాజ్యాంగ జాతీయ సమీక్ష కమిషన్ 2000 4) పైవేవీకావు
45. స్కాండినేవియన్ దేశాలు అంటే?
1) స్వీడన్, డెన్మార్క్
2) ఫిన్లాండ్, నార్వే
3) స్పెయిన్, పోలాండ్ 4) 1, 2
46. మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం ఏ వ్యవస్థను రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేయాలని సూచించింది?
1) లోక్‌పాల్ 2) లోకాయుక్త
3) అంబుడ్స్‌మన్
4) పౌరకేసుల నివారణ సంఘం
47. పౌరకేసుల నివారణ కోసం ప్రజా ప్రతినిధుల తరుపున పనిచేసే వ్యవస్థను ఈ విధంగా పిలుస్తారు?
1) పౌరకేసుల నివారణ సంఘం
2) స్కాండినేవియన్ ఏజెన్సీ
3) అంబుడ్స్‌మన్ 1, 3
48. నీతి ఆయోగ్ రెండో సీఈవో?
1) అరవింద్ పనగారియా
2) అమితాబ్‌కాంత్
3) సింధుశ్రీ కుల్లర్ 4) సారస్వత్
49. కిందివాటిలో నీతి ఆయోగ్ విధి కానిది?
1) నూతన ఆలోచనల బాంఢాగారంగా వ్యవహరించడం
2) సహకార సమాఖ్యను రూపొందించడం
3) వివిధ పథకాల అమలుకు నిధులు కేటాయించడం 4) పైవన్నీ
50. ప్రస్తుతం నీతి ఆయోగ్ పాలకమండలిలో ఏ కేంద్రపాలిత ప్రాంత లెఫ్టినెంట్ గవర్నర్ సభ్యుడిగా ఉన్నాడు
1) లక్షదీవులు
2) అండమాన్ నికోబార్ దీవులు
3) ఢిల్లీ 4) పుదుచ్ఛేరి
51. కింది ఏ సంస్థలు సమాచార హక్కు కిందకి రావు?
1) కేంద్ర నిఘా సంస్థలు
2) కేంద్ర సాయుధ బలగాలు
3) రెవెన్యూ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
4) పైవన్నీ
52. కిందివాటిలో సరైనది?
1) సాధారణ సమాచారాన్ని 30 రోజుల్లోపల ఇవ్వాలి
2) వ్యక్తిగత స్వేచ్ఛకు, జీవించే స్వేచ్ఛకు సంబంధించిన సమాచారాన్ని 48 గంటలలోపు ఇవ్వాలి
3) మూడోవ్యక్తి ప్రయోజనాలు ఇమిడి ఉంటే 40 రోజుల లోపల సమాచారాన్ని ఇవ్వాలి
4) పైవన్నీ సరైనవే
53. కిందివాటిలో సరైనది?
1) ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక పర్యాయాలు రాష్ట్రపతి పాలన విధించారు
2) ఛత్తీస్‌గఢ్‌లో రాష్ట్రపతి పాలన అస్సలు విధించలేదు
3) అతి ఎక్కువ కాలం పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన విధించారు 4) పైవన్నీ సరైనవే
54. కిందివాటిలో సరైనది
1) జాతీయ అత్యవసర పరిస్థితి గరిష్ఠ కాలపరిమితి
2) ఆర్థిక అత్యవసరం పరిస్థితి – గరిష్ఠకాల పరిమితి
3) రాష్ట్రపతి పాలన – సాధారణంగా ఒక సంవత్సరం గరిష్ఠ కాలపరిమితి
4) పైవన్నీ సరైనవే
55. ఒక పర్యాయం విధిస్తే పదేపదే పొడిగించాల్సిన అవసరం లేని అత్యవసర పరిస్థితి ఏది?
1) జాతీయ అత్యవసర పరిస్థితి
2) రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి
3) ఆర్థిక అత్యవసర పరిస్థితి
4) పైవేవీకాదు
56. కిందివాటిలో ఏది సరిగా జతపరచలేదు?
1) రాష్ట్రపతి పాలన – భారత ప్రభుత్వ చట్టం -1935
2) ఆర్థిక అత్యవసర పరిస్థితి – స్వీడన్
3) జాతీయ అత్యవసర పరిస్థితి- జర్మనీ
4) అత్యవసర అధికారాలు విశిష్ట సమాఖ్య
57. కిందివాటిలో సరైనవి?
1) సివిల్ సర్వీసులు బ్రిటిష్ వారి వారసత్వం
2) అఖిలభారత సర్వీసులు- భారతీయ సృష్టి
3) పబ్లిక్ సర్వీసులకు సంబంధించి రాజ్యాంగంలో స్పష్టమైన ప్రస్తావన ఉంది
4) పైవన్నీ సరైనవే
58. కింది స్టేట్మెంట్లను పరిశీలించండి.
1) పబ్లిక్ సర్వీసుల నియాయకాలకు సంబంధించి సంబంధిత శాసన సభలు చట్టాలను రూపొందిస్తాయి
2) పబ్లిక్ సర్వీసుల నియామకాలకు సంబంధించి రాజ్యాంగంలో స్పష్టమైన ప్రకరణలు లేవు
3) పైరెండూ సరైనవి
4) పై రెండూ సరికావు
సమాధానాలు
16-4 17-4 18-4 19-2
20-4 21-2 22-3 23-1
24-4 25-4 26-4 27-4
28-2 29-3 30-1 31-1
32-4 33-4 34-2 35-4
36-4 37-4 38-1 39-4
40-4 41-2 42-1 43-4
44-1 45-4 46-2 47-4
48-2 49-3 50-2 51-4
52-4 53-4 54-4 55-3
56-2 57-4 58-3
ఆంజనేయులు
ఫ్యాకల్టీ, ఏకేఆర్ స్టడీ సర్కిల్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు