ఉప ప్రధానులుగా ఎంతమంది పనిచేశారు?
1. పార్లమెంటులోని ఏ సభలోనూ సభ్యత్వం లేకుండానే ప్రధాని పదవిని చేపట్టిన మొదటి వ్యక్తి ఎవరు?
1) దేవెగౌడ 2) పీవీ నర్సింహారావు
3) చంద్రశేఖర్ 4) ఐకే గుజ్రాల్
2. భారతదేశ మొట్టమొదటి ఉపప్రధాని ఎవరు?
1) మొరార్జీదేశాయ్ 2) చరణ్‌సింగ్
3) సర్దార్ వల్లభాయ్ పటేల్ 4) దేవీలాల్
3. ఇప్పటివరకు ఎంతమంది ఉపప్రధాని పదవిని చేపట్టారు?
1) 6 2) 7 3) 8 4) 5
4. ప్రధానమంత్రి, మంత్రిమండలి ఎవరి విశ్వాసం ఉన్నంతమేరకు పదవిలో కొనసాగుతారు?
1) రాష్ట్రపతి 2) పార్లమెంటు 3) లోక్‌సభ 4) 1, 3
5. కిందివాటిలో సరైనదాన్ని గుర్తించండి.
ఎ) రాష్ట్రపతి వాస్తవ అధికారాలు కలిగి ఉండి దేశాధినేతగా వ్యవహరిస్తాడు.
బి) ప్రధాని నామమాత్రపు అధికారాలు కలిగి ఉండి ప్రభుత్వాధినేతగా వ్యవహరిస్తాడు.
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
6. కింది వాటిలో ప్రధానమంత్రి, మంత్రిమండలికి సంబంధించని ఆర్టికల్ ఏది?
1) 75 2) 74 3) 78 4) 76
7. కిందివాటిలో సరైన దాన్ని గుర్తించండి.
ఎ) లోక్‌సభలో బడ్జెట్‌ని తిరస్కరించినప్పుడు మంత్రిమండలిని రాష్ట్రపతి తొలగిస్తాడు.
బి) లోక్‌సభలో ఆర్థిక బిల్లును తిరస్కరించినప్పుడు మంత్రిమండలిని రాష్ట్రపతి రద్దుచేస్తాడు.
సి) ప్రభుత్వం ప్రతిపాదించిన ఏదైనా బిల్లు లోక్‌సభలో వీగినప్పుడు మంత్రిమండలి రాజీనామా చేయాలి.
డి) లోక్‌సభలో కోత తీర్మానాలు ఆమోదించినప్పుడు మంత్రిమండలి రాజీనామా చేయాలి.
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి, డి 4) పైవన్నీ
8. కిందివాటిలో సరైనదాన్ని గుర్తించండి.
ఎ) రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం లోక్‌సభలో వీగినప్పుడు మంత్రిమండలి రాజీనామా చేయాలి.
బి) ఒక ప్రైవేట్ సభ్యుడు ఒక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు దాన్ని ప్రభుత్వం వ్యతిరేకించగా ఆ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే మంత్రిమండలి రాజీనామా చేయాలి.
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
9. కిందివాటిలో సరైనదాన్ని గుర్తించండి.
ఎ) లోక్‌సభలో విశ్వాసతీర్మానం వీగినప్పుడు మంత్రిమండలి రాజీనామా చేయాలి.
బి) లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు మంత్రిమండలి రాజీనామా చేయాలి.
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
10. రాజ్యాంగంలో రాష్ట్రపతికి తన విధి నిర్వహణలో సలహాలు అందించడానికి ప్రధాని నేతృత్వంలో ఒక మంత్రిమండలి ఉండాలని ఏ ఆర్టికల్ నిర్దేశిస్తుంది?
1) 74 (1) 2) 74 3) 75 4) 74 (2)
11. కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి.
ఎ) కేంద్రమంత్రిమండలి రాష్ట్రపతికి ఇచ్చిన సలహాలని ఏ కోర్టులో సవాల్ చేయరాదు.
బి) కేంద్రమంత్రి మండలి రాష్ట్రపతికి ఇచ్చిన సలహాలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావు.
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
12. కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి.
ఎ) ప్రధాని, మంత్రిమండలి వ్యక్తిగతంగా లోక్‌సభకు బాధ్యత వహించాలి.
బి) ప్రధాని, మంత్రిమండలి వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహించాలి.
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
13. కిందివాటిలో సరైనది గుర్తించండి.
ఎ) ప్రధానిని తొలగించినా, మరణించినా, రాజీనామా చేసినా మంత్రిమండలి రద్దవుతుంది.
బి) మంత్రిమండలిలో ఎవరైనా సభ్యుడు మరణించినా, రాజీనామా చేసినా, తొలగించినా మంత్రిమండలి రద్దవుతుంది.
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
14. కిందివాటిలో సరైన వాటిని గుర్తించండి.
ఎ) రాజ్యాంగం మంత్రిమండలిని మూడు రకాలుగా పేర్కొంది.
బి) గోపాలస్వామి అయ్యంగార్ కమిటీ (1949) మంత్రిమండలిని 3 రకాలుగా వర్గీకరించింది.
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
15. మంత్రిమండలి సభ్యుల సంఖ్య లోక్‌సభ సభ్యుల సంఖ్యలో 10 శాతానికి మించరాదని ఏ కమిటీ సిఫారసు చేసింది?
1) పాలన సంస్కరణల సంఘం
2) గోపాలస్వామి అయ్యంగార్ కమిటీ
3) కొఠారి కమిటీ 4) గోపాలన్ కమిటీ
16. కింది వాటిలో సరైన దాన్ని ఎంపిక చేయండి.
ఎ) 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ప్రకారం మొత్తం మంత్రిమండలి సభ్యుల సంఖ్య, లోక్‌సభ మొత్తం సభ్యుల సంఖ్యలో 15 శాతానికి మించరాదు.
బి) చిన్న రాష్ర్టాలకు పైన పేర్కొన్న నియమం వర్తించదు.
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
17. 42వ రాజ్యాంగ సవరణ చేసిన ప్రధాని ఎవరు?
1) రాజీవ్‌గాంధీ 2) ఇందిరాగాంధీ
3) నెహ్రూ 4) లాల్‌బహదూర్‌శాస్త్రి
18. జతపర్చండి.
1) థామస్ మన్రో ఎ) ప్రధాని సమానుల్లో ప్రథముడు
2) గ్రీవ్స్ బి) ప్రధాని క్యాబినెట్ అనే
సౌధానికి స్తంభం వంటివారు
3) లార్డ్మోర్లే సి) ప్రధాని ప్రభుత్వ యజమాని
4) బీఆర్ అంబేద్కర్ డి) ప్రధాని రాజ్యనౌకకు నావికుడు
1 2 3 4
1) ఎ బి సి డి
2) డి సి ఎ బి
3) డి సి బి ఎ
4) డి బి సి ఎ
19. ప్రధాని సూర్యుడు, మంత్రులందరు అతని చుట్టూ పరిభ్రమించే గ్రహాల వంటివారని అభివర్ణించింది ఎవరు?
1) ఐవర్ జెన్నింగ్స్ 2) విలియం వెర్నర్
3) రామ్సేమ్లూర్ 4) లాస్కీ
20. కింది వాటిని జతపర్చండి.
1) విలియం వెర్నర్ ఎ) ప్రధాని చుక్కల్లో చంద్రుడు
2) రామ్సేమ్లూర్ బి) ప్రధాని ప్రభుత్వమనే ఓడ చక్రాన్ని తిప్పే కెప్టెన్ లాంటివాడు
3) లాస్కీ సి) ప్రధాని అనే అక్షాంశం చుట్టూ మొత్తం ప్రభుత్వం పరిభ్రమిస్తుంది
4) అమేరి డి) ప్రధాని నాయకుడు, ప్రధాన నిర్ణయాధికారి
1 2 3 4
1) ఎ బి సి డి
2) ఎ సి బి డి
3) బి సి ఎ డి
4) ఎ సి డి బి
21. సరైన అంశాన్ని గుర్తించండి.
ఎ) భారతదేశానికి అతి ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తి జవహర్‌లాల్‌నెహ్రూ (16 ఏండ్ల 286 రోజులు)
బి) పదవిలో ఉండగా మరణించిన తొలి ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూ
సి) గుల్జారిలాల్నందా రెండుసార్లు తాత్కాలిక ప్రధానిగా పనిచేశారు
డి) ఇందిరాగాంధీ దేశానికి తొలి మహిళా ప్రధాని
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) బి, సి 4) పైవన్నీ
22. రాజ్యసభ సభ్యత్వంతో ప్రధాని పదవిని చేపట్టిన మొదటి వ్యక్తి ఎవరు?
1) దేవెగౌడ 2) ఐకే గుజ్రాల్
3) ఇందిరాగాంధీ 4) మన్మోహన్సింగ్
23. కిందివారిలో రాజ్యసభ సభ్యులుగా ఉండి ప్రధాని పదవిని చేపట్టినవారు?
ఎ) దేవెగౌడ బి) ఐకే గుజ్రాల్
సి) మన్మోహన్సింగ్ డి) ఇందిరాగాంధీ
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి, డి 4) పై అందరూ
24. కింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి.
ఎ) దేశానికి తొలి కాంగ్రెసేతర ప్రధాని మొరార్జీదేశాయ్
బి) అతి తక్కువ రోజులు పనిచేసిన ప్రధాని చౌదరి చరణ్‌సింగ్
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
25. కింది వాటిలో సరైనదాన్ని ఎంపిక చేయండి?
ఎ) దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని పదవిని అలంకరించిన మొదటి వ్యక్తి పీవీ నర్సింహారావు
బి) అతి చిన్న వయస్సులో ప్రధానమంత్రి పదవిని అలంకరించిన వ్యక్తి రాజీవ్‌గాంధీ
సి) విశ్వాస తీర్మానంలో ఓటమి పాలైన తొలి ప్రధాని వీపీ సింగ్
డి) అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్న తొలి ప్రధాని నెహ్రూ
1) ఎ, బి, సి 2) బి, డి
3) ఎ, బి, డి 4) పైవన్నీ సరైనవే
26. అత్యధికంగా అవిశ్వాస తీర్మానాలు ఏ ప్రధానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టారు?
1) నెహ్రూ 2) మొరార్జిదేశాయ్
3) ఇందిరాగాంధీ 4) పీవీ నర్సింహారావు
27. కింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి.
ఎ) 1947లో నెహ్రూ అధ్యక్షతన ఏర్పాటైన తొలి మంత్రిమండలి సభ్యుల సంఖ్య – 14
బి) 1952లో సాధారణ ఎన్నికల తర్వాత ఏర్పాటైన తొలి మంత్రిమండలి సభ్యుల సంఖ్య- 35
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
28. పార్లమెంటు సమావేశాలకు ఒక్కసారి కూడా హాజరుకాని ప్రధాని ఎవరు?
1) చంద్రశేఖర్ 2) దేవెగౌడ
3) చరణ్‌సింగ్ 4) వీపీ సింగ్
29. జతపర్చండి.
1) ఆర్టికల్ 75 (ఎ) ఎ) ప్రధానిని, మంత్రిమండలిని రాష్ట్రపతి నియమిస్తాడు
2) ఆర్టికల్ 75(బి) బి) రాష్ట్రపతి అభీష్టం మేరకు మంత్రిమండలి పదవిలో కొనసాగుతుంది
3) ఆర్టికల్ 75(సి) సి) మంత్రిమండలి సమష్టిగా లోక్‌సభకు బాధ్యత వహించాలి
4) ఆర్టికల్ 74 డి) రాష్ట్రపతికి సలహాలివ్వడానికి మంత్రిమండలి ఉంటుంది
1 2 3 4
1) ఎ బి డి సి
2) ఎ సి బి డి
3) ఎ బి సి డి
4) సి బి ఎ డి
30. జతపర్చండి.
1) ఆర్టికల్ 78 (ఎ) ఎ) పాలనకు సంబంధించిన అంశాలు ప్రధాని రాష్ట్రపతికి తెలుపుతారు
2) ఆర్టికల్ 78 (బి) బి) రాష్ట్రపతికి కావాల్సిన సమాచారాన్ని ప్రధాని నుంచి సేకరించడం
3) ఆర్టికల్ 78 (సి) సి) ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ
4) ఆర్టికల్ 78 డి) మంత్రిమండలి పరిశీలనకు పంపమని రాష్ట్రపతి కోరుట
1) ఎ బి సి డి
2) ఎ బి డి సి
3) బి సి డి ఎ
4) బి ఎ సి డి
31. జతపర్చండి.
1) ఆర్టికల్ 75 ఎ) మంత్రులకు సంబంధించిన
ఇతర నిబంధనలు
2) ఆర్టికల్ 77 బి) ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ
3) ఆర్టికల్ 78 సి) ప్రధానమంత్రి విధులు
4) ఆర్టికల్ 74 డి) రాష్ట్రపతికి సలహాలు
ఇవ్వడానికి మంత్రిమండలి
నియామకం
1 2 3 4
1) ఎ బి డి సి
2) ఎ బి సి డి
3) ఎ సి బి డి
4) బి సి ఎ బి
32. మన రాజ్యాంగంలో ప్రధానమంత్రి పదవి అమెరికా అధ్యక్షుడితో పోలి ఉంటుందని ఎవరు పేర్కొన్నారు?
1) హెచ్‌జే లాస్కీ 2) మోర్లే
3) బీఆర్ అంబేద్కర్
4) గోపాలస్వామి అయ్యంగార్
33. జతపర్చండి.
ప్రధాని ఉపప్రధాని
1) నెహ్రూ ఎ) సర్దార్ వల్లభాయ్‌పటేల్
2) ఇందిరాగాంధీ బి) మొరార్జీ దేశాయ్
3) చరణ్‌సింగ్ సి) వైబీ చవాన్
4) వీపీ సింగ్ డి) దేవిలాల్
1 2 3 4
1) ఎ బి సి డి
2) ఎ బి డి సి
3) సి ఎ బి డి
4) ఎ సి బి డి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు