రాష్ట్రపతి సొంతంగా ప్రకటించే అత్యవసర పరిస్థితి?
కేంద్ర ప్రభుత్వం
1. ప్రతిపాదన (ఎ): కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పాండిచ్చేరి సభ్యులకు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనే అవకాశాన్ని 1992లో 70వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచారు.
ప్రతిపాదన (ఆర్): ఇది 1995, జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది.
1) ఎ, ఆర్ రెండూ సరైనవే, ఎ కు ఆర్ సరైన వివరణ
2) ఎ, ఆర్ రెండూ సరైనవే, ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
3) ఎ సరైనది, ఆర్ తప్పు
4) ఎ తప్పు, ఆర్ సరైనది
2. కింది వాటిని జతపర్చండి.
1. ఆర్టికల్ 57 ఎ. రాష్ట్రపతి పునర్ ఎన్నిక
2. ఆర్టికల్ 58 బి. రాష్ట్రపతి అర్హతలు
3. ఆర్టికల్ 60 సి. రాష్ట్రపతి పదవీ ప్రమాణ స్వీకారం
4. ఆర్టికల్ 56 డి. రాష్ట్రపతి పదవీకాలం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
3. మహాభియోగ తీర్మానంలోని లోపాలకు సంబంధించి సరికానిది?
1) రాష్ట్రపతి మీద అభియోగాలు విచారణ దశలో ఉన్నప్పుడు ఆ సమయంలో రాష్ట్రపతి తన పదవిలో కొనసాగవచ్చు
1) రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనని నామినేటెడ్ సభ్యులు కూడా తొలగింపు ప్రక్రియలో పాల్గొనవచ్చు
3) రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనే రాష్ట్ర విధాన సభ సభ్యులు కూడా తొలగింపు ప్రక్రియలో పాల్గొనవచ్చు
4) మహాభియోగ తీర్మానం ద్వారా తొలగిం చబడిన రాష్ట్రపతి తిరిగి పోటీచేసే విషయంపై స్పష్టత లేదు
4. రాష్ట్రపతి జీతభత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. రాష్ట్రపతి జీతభత్యాల గురించి తెలిపే ఆర్టికల్?
1) 57 2) 58 3) 59 4) 60
5. వీటో అధికారానికి సంబంధించి సరైనది?
1) వీటో అనే పదం లాటిన్ భాష నుంచి గ్రహించబడింది
2) వీటోని ఆంగ్లంలో ఫర్బిడ్ అంటారు
3) వీటో అంటే తిరస్కరించే అధికారం అని అర్థం
4) పైవన్నీ సరైనవే
6. అఖిల భారత సర్వీసులపై చేయబడిన ప్రధాన, విస్తృత విమర్శ?
1) వాటిని నిర్వహించడం అతి భారం
2) రాష్ట్ర సర్వీసుల ప్రాముఖ్యతను క్షీణిం పజేస్తుంది
3) దేశంలో ఉన్న సమాఖ్య విధాన పద్ధతికి సరైనవి కావు
4) అఖిల భారత స్థాయిలో భర్తీ చేయ బడినందున ఈ అధికారాలకు స్థానిక భాష అరుదుగా రావడం లేదు
7. కింది వాటిలో ఏ బిల్లులను బడ్జెట్‌తో కలిపి పార్లమెంట్లో ప్రవేశపెడతారు?
1) ఆర్థిక బిల్లు, కంటింజెన్సీ బిల్లు
2) ఆర్థిక బిల్లు, అప్రోప్రియేషన్ బిల్లు
3) ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు
4) కంటింజెన్సీ బిల్లు, అప్రోప్రియేషన్ బిల్లు
8. రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా మార్చే అధికారాన్ని లోక్‌సభకు కల్పించిన రాజ్యాంగ సవరణ?
1) 42వ రాజ్యాంగ సవరణ
2) 44వ రాజ్యాంగ సవరణ
3) 24వ రాజ్యాంగ సవరణ
4) 39వ రాజ్యాంగ సవరణ
9. ఒక బిల్లు ఎప్పుడు చట్టం అవుతుంది?
1) లోక్‌సభ ఆమోదించిన తరువాత
2) పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన తరువాత
3) పార్లమెంట్ ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదం పొందిన తరువాత
4) బిల్లును ప్రధానమంత్రి రాష్ట్రపతికి నివేదించిన తరువాత
10. కింది వాటిలో ఏ రిట్/అధిలేఖనం ‘మేము ఆదేశిస్తున్నాము’ అనే అర్థం ఇస్తుంది?
1) హెబియస్ కార్పస్/బందీ హాజరు ఉత్తర్వు
2) మాండమస్/ప్రధాన న్యాయస్థానం
3) కోవారెంటో/అధికార పృచ్ఛ
4) సెర్షియోరరీ/పెద్ద కోర్టు ఉత్తర్వు
11. కింది ప్రకటనలను పరిశీలించి సరైనది గుర్తించండి?
ఎ. భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పార్లమెంట్ ఉభయ సభల తీర్మానంతో తొలగించబడతాడు
బి. భారత సంఘటిత నిధికి సంబంధించిన నగదుపై భారత కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్‌కు ఎలాంటి నియంత్రణ ఉండదు
1) ఎ 2) బి 3) ఎ, బి 4) రెండూకాదు
12. కింది వాటిని పరిశీలించి సరైనది గుర్తించండి?
ఎ. రాజ్యాంగం మంత్రిమండలి సభ్యులను మూడు రకాలుగా వర్గీకరించింది
బి. ఒక రాజ్యసభ సభ్యుడిని కేంద్రమంత్రిగా తీసుకోవడం వల్ల అతడు లోక్‌సభలో ఓటుహక్కు పొందుతాడు
1) ఎ 2) బి 3) ఎ, బి 4) రెండూకాదు
13. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సుకు సంబంధించి కింది వాటిలో వాస్తవం కానిది?
1) సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు 65 సంవత్సరాలు
2) హైకోర్టు న్యాయమూర్తులకు 62 సంవత్సరాలు
3) హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అందరికీ 65 సంవత్సరాలు
4) సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు పదవీ విరమణ వయస్సులో తేడాలున్నాయి
14. కింది వ్యాఖ్యల్లో వాస్తవం కానిది?
1) రాష్ట్రపతి ప్రధానమంత్రిని ఎంపిక చేస్తాడు
2) ప్రధానమంత్రి సిఫారసుపై రాష్ట్రపతి ఇతర మంత్రులను నియమిస్తాడు
3) రాష్ట్రపతి మంత్రులకు శాఖలను కూడా కేటాయిస్తాడు
4) ఆయనకు ఇష్టమైన మంత్రులకు కొందరి కి ‘క్యాబినెట్ హోదా’ కూడా రాష్ట్రపతి కల్పిస్తాడు
15. లోక్‌సభ సమావేశాలకు ‘కోరమ్’ ఎంత?
1) సభ్యుల్లో ఆరోవంతు లేదా 80 మంది
2) సభ్యుల్లో నాలుగోవంతు లేదా 140 మంది
3) సభ్యుల్లో పదోవంతు లేదా 55 మంది
4) సభ్యుల్లో ఇరవయ్యోవంతు లేదా 28 మంది
16. పార్లమెంట్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది?
1) దీనిలో లోక్‌సభ సభ్యులు 22 మంది, రాజ్యసభ సభ్యులు 15 మంది ఉంటారు
2) పార్లమెంట్ ఉభయసభల సభ్యులు ఇందులో ఉంటారు
3) లోక్‌సభ సభ్యులు మాత్రమే ఇందులో ఉంటారు
4) రాజ్యసభ సభ్యులు మాత్రమే ఇందులో ఉంటారు
17. సుప్రీంకోర్టు న్యాయ సమీక్షాధికారానికి నిదర్శనం?
1) అమెరికా కంటే తక్కువగా ఉంటుంది
2) అమెరికా రాజ్యాంగంలో ఉన్నట్టుగానే ఉన్నది
3) అమెరికా రాజ్యాంగం కంటే విస్తృతమైనది
4) ఏదీకాదు
18. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ఏదైనా రాష్ట్రం అమలు చేసేటప్పుడు రాష్ట్రపతి ఏమి చేయగలడు?
1) ఆదేశాలు అమలు చేయడానికి రాష్ట్రపతి ఆ రాష్ట్రానికి రిజర్వ్ పోలీస్ దళాలను పంపవచ్చు
2) అక్కడ రాజ్యాంగ యంత్రాంగం విఫలమై నట్లు ప్రకటించి రాష్ట్రపతి పాలన చేపట్టవచ్చు
3) రాష్ట్ర శాసనసభను రద్దుచేసి ఎన్నికలను నిర్వహించడానికి ఆదేశించవచ్చు
4) ఏదీకాదు
19. కింది వారిలో రాష్ట్రపతి అయ్యే ముందు ఉపరాష్ట్రపతిగా చేయనివారు ఎవరు?
1) ఎస్ రాధాకృష్ణన్ 2) జాకీర్ స్సేన్
3) నీలం సంజీవరెడ్డి
4) ఆర్ వెంకట్రామన్
20. జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య ఎప్పుడు భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు?
1) 12-2-1993 నుంచి 24-10-1994 వరకు
2) 25-2-1994 నుంచి 24-3-1997 వరకు
3) 25-3-1997 నుంచి 17-1-1998 వరకు
4) 10-10-1998 నుంచి 31-10-2001 వరకు
21. 15వ లోక్‌సభలో వీవీటీ, వీవీఎం రెండింటిలో పూర్వ విద్యార్థిగా ఉన్న ఏకైక పార్లమెంట్ సభ్యుడు?
1) సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్‌కు చెందిన బనిషైక్ చామ్లింగ్
2) సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్‌కు చెందిన పీడీ రాయ్
3) సిక్కిం కాంగ్రెస్‌కు చెందిన బాసుదేవ్ చీకో
4) సిక్కిం కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన సుధేశ్వర్ యాపుంగ్
22. పార్లమెంట్‌లోని అడ్హాక్ కమిటీలు?
1) డ్రాఫ్ట్ పంచవర్ష ప్రణాళికపై కమిటీ
2) రాష్ట్రపతి ప్రసంగం జరిగేటప్పుడు కొంత మంది సభ్యుల ప్రవర్తనకు సంబంధించింది
3) బిల్స్‌పై సెలక్ట్ లేదా జాయింట్ కమిటీ
4) పైవన్నీ
23. కింది వాటిలో సరైనది కానిది గుర్తించండి?
1) రెండో సాధారణ ఎన్నికలు- 494 లోక్‌సభ సీట్లు
2) ఐదో సాధారణ ఎన్నికలు- 518 లోక్‌సభ సీట్లు
3) ఎనిమిదో సాధారణ ఎన్నికలు- 542 లోక్‌సభ సీట్లు
4) తొమ్మిదో సాధారణ ఎన్నికలు- 520 లోక్‌సభ సీట్లు
24. కింది వాటిలో ఏది సరైనది?
1) భారత రాష్ట్రపతి తను రాష్ట్రపతిగా చేరిన ప్పుటి నుంచి 3 సంవత్సరాలు పదవిలో ఉంటారు
2) రాష్ట్రపతి ప్రధాన ఎన్నికల అధికారిని నియమిస్తారు
3) రాష్ట్రపతి జాతీయ రక్షణ కమిటీకి నాయ కత్వం వహిస్తారు
4) రాష్ట్రపతి అటార్నీ జనరల్‌ను తన కార్యాలయం నుంచి తొలగించడు
25. లోక్‌సభ స్పీకర్ లేని పక్షంలో పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు?
1) లోక్‌సభ సభ్యుల్లో అతి సీనియర్ సభ్యుడు
2) రాజ్యసభ డిప్యూటీ చైర్మన్
3) రాజ్యసభ చైర్మన్
4) లోక్‌సభ డిప్యూటీ స్పీకర్
26. ఏ యంత్రాంగం ఏర్పాటు కోసం లోక్‌సభ జ్యుడీషియల్ స్టాండర్డ్ అండ్ అకౌంటబిలిటీ బిల్ (న్యాయ పరిపాలన ప్రమాణాలు, జవాబుదారీ బిల్లు)- 2010 ఆమోదించింది?
1) న్యాయమూర్తులకు వ్యతిరేకంగా అపరాధ శోధనం కోసం
2) న్యాయమూర్తుల తొలగింపునకు
3) న్యాయమూర్తుల నియామకం
4) న్యాయమూర్తులకు శిక్ష వేయడం కోసం
27. రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టేది?
1) మార్షల్ కోర్టు విధించిన అన్ని శిక్షల్లో
2) కేంద్ర, ఉమ్మడి జాబితాల్లోని అన్ని అంశాలకు చెందిన అన్ని కేసుల్లో
3) మరణ శిక్ష పడిన అన్ని నేరాల్లో
4) పైవన్నీ సరైనవే
28. రాష్ట్రపతి ద్వారా నిర్వహించే ఆర్థిక అధికారాలు?
1) రాష్ట్రపతి అనుమతితో మాత్రమే ఆర్థిక బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి
2) భారత సంఘటిత నిధి నుంచి ముందస్తుగా డబ్బు కేటాయించవచ్చు
3) కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల పంపకాన్ని నిర్ణయించేందుకు ఫైనాన్స్ కమిషన్‌ను రాష్ట్రపతి నియమిస్తాడు
4) పైవన్నీ సరైనవే
29. రాష్ట్రపతి సొంతంగా ప్రకటించే అత్యవసర పరిస్థితి?
1) సైనిక తిరుగుబాటు లేదా విదేశీ దురాక్రమణ సమయంలో
2) రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధ పాలన విఫలమైనప్పుడు
3) భారతదేశంలో ఆర్థిక వ్యత్యాసాలు ఏర్పడినప్పుడు
4) ఏదీకాదు
30. రాష్ట్రాల్లో రాష్ట్రపతి రాజ్యాంగ సంక్షోభ అత్యవసర పరిస్థితిని విధించేది?
1) కేంద్ర మంత్రి వర్గ సూచన మేరకు
2) గవర్నర్ సూచన మేరకు
3) రాష్ట్ర మంత్రివర్గ సూచన మేరకు
4) రాష్ట్రపతి రాజ్యాంగబద్ధ పరిస్థితి రాష్ట్రంలో సమర్థవంతంగా లేదని భావించి తృప్తిచెందేది?
31. కింద పేర్కొన్న మూడు రకాల అత్యవసర పరిస్థితుల్లో ఎక్కువసార్లు విధించినది ఏది?
1) జాతీయ అత్యవసర పరిస్థితి
2) రాష్ట్ర అత్యవసర పరిస్థితి
3) ఆర్థిక అత్యవసర పరిస్థితి
4) పై మూడు సమానంగా విధించబడ్డాయి
32. జాతీయ అత్యవసర పరిస్థితి పార్లమెంట్ ఆమోదించిన ఎన్నిరోజులు అమల్లో ఉంటుంది?
1) ఎన్ని రోజులైనా
2) ఎక్కువలో ఎక్కువగా 3 సంవత్సరాలు
3) ఎక్కువలో ఎక్కువగా సంవత్సరం
4) ఎక్కువలో ఎక్కువగా 6 నెలలు
33. పార్లమెంట్ చట్టానికి రాష్ట్రపతి జారీచేసే ఆర్డినెన్స్నకు మధ్య వ్యత్యాసం?
1) ఇది రాజ్యాంగాన్ని సవరణ చేయడానికి ఉపయోగపడదు
2) ఆర్డినెన్స్ కేవలం తాత్కాలిక అంశం మాత్రమే
3) ఆర్డినెన్స్ పార్లమెంట్ చట్టం ద్వారా తిరిగి పునర్వ్యవస్థీకరించబడుతుంది
4) పైవన్నీ సరైనవే
34. రాష్ట్రపతి తన విచక్షణాధికారాలను ఉపయోగించేది?
ఎ. ప్రధానమంత్రి, క్యాబినెట్ మంత్రుల మధ్య వచ్చిన వివాద సమయంలో
బి. లోక్‌సభలో ఏ పార్టీకి మెజారిటీ రానప్పుడు ప్రధాన మంత్రిని నియమించే సమయంలో
సి. రూలింగ్ పార్టీ లోక్‌సభలో మెజారిటీని కోల్పోయినప్పుడు
డి. క్యాబినెట్‌ను పునర్ సమీక్షించాలని సలహాలను ఇవ్వడం
1) ఎ 2) ఎ, బి
3) బి, డి 4) బి, సి, డి
సమాధానాలు
1-1, 2-1, 3-3, 4-3, 5-4, 6-3, 7-1, 8-3, 9-3, 10-2, 11-3, 12-4, 13-3, 14-4, 15-3, 16-2,
17-1, 18-2, 19-3, 20-1, 21-2, 22-4, 23-4, 24-4, 25-4, 26-1, 27-4, 28-4, 29-4, 30-4, 31-2, 32-1, 33-2, 34-3
సత్యనారాయణ
ఏకేఆర్ స్టడీసర్కిల్, వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు