కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మోడల్ టెస్ట్ -2022
101. కింది వాటిని జతపరచండి?
ఎ) పూనా సార్వజనిక సభ i) వీరరాఘవాచారి
బి) ఇండియన్ అసోసియేషన్ ii) ఫిరోజ్షామెహతా
సి) మద్రాస్ మహాజన్ సభ iii) ఏజీ రనడే
డి) బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ iv) యస్.యస్. బెనర్జీ
సరైన జవాబు ఏది?
ఎ బి సి డి
1) i ii iii iv
2) iii iv i ii
3) ii iii iv i
4) iv i ii iii
102. కింద ఇచ్చిన వైస్రాయ్‌లను వరుస క్రమంలో అమర్చండి?
i) లార్డ్ లిన్లిత్గో ii) లార్డ్ ఇర్విన్
iii) లార్డ్ వెల్లింగ్టన్ iv) లార్డ్ వేవెల్
v) లార్డ్ రీడింగ్ కోడ్లు
1) i, iii, i, v, iv
2) iii, ii, iv, v, i
3) v, ii, iv, i, iii
4) v, ii, iii, i, iv
103. కిందివాటిని జతపరచండి?
ఎ) నద్వతుల్ ఉలేమా 1. బాంబే
బి) మహమ్మదీన్ ఎడ్యుకేషనల్ 2. దేవ్‌బంద్
సి) దారుల్ ఉలూమ్ 3. అలీగఢ్
డి) రహనుమయ్ మజ్దయాసనన్ సభ 4. లక్నో
సరైన జవాబును ఎంపిక చేయండి
1) ఎ-4, బి-2, సి-1, డి-3
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-3, బి-4, సి-1, డి-2
4) ఎ-2, బి-4, సి-3, డి-1
104. కింది వాటిని కాలక్రమానుగతంగా అమర్చండి?
ఎ) దక్కన్ తిరుగుబాట్లు
బి) నీలిమందు తిరుగుబాట్లు
సి) బార్డోలి సత్యాగ్రహం
డి) అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె
కోడ్లు:
1) ఎ, బి, సి, డి 2) బి, ఎ, డి, సి
3) డి, సి, బి, ఎ 4) ఎ, బి, డి, సి
105. జాబితా-ఎలో ఉన్న వాటిని జాబితా-బిలోని వాటితో జతపరచి ఇచ్చిన జవాబుల్లో సరైన దానిని ఎంపిక చేసుకోండి?
జాబితా-ఎ జాబితా – బి
ఎ) దుర్గాబాయి దేశ్‌ముఖ్ 1. హైదరాబాద్, రాజకీయ సభ
బి) ఎంవీ భాగ్యరెడ్డి వర్మ 2. ఆంధ్ర మహిళా సభ
సి) కొండా వెంకట రంగా రెడ్డి 3. ఆది హిందువులు
డి) వైఎం కాలేజీ 4. ఆంధ్రమహాసభ
కోడ్లు :
1) ఎ-3, బి-1, సి-2, డి-4 2) ఎ-4, బి-2, సి-1, డి-3
3) ఎ-2, బి-3, సి-4, డి-1 4) ఎ-1, బి-3, సి-2, డి-4
106. కింద ఇచ్చిన కమిషన్లను వాటిని ఏర్పాటు చేసిన సంవత్సరాలకు సంబంధించి మొదటి లిస్ట్‌ను రెండవ లిస్టుకు జతపరచండి. సరైన జవాబును కింద ఇచ్చిన కోడ్ ద్వారా సూచిచండి?
లిస్ట్-1 లిస్ట్-2
ఎ) సైమన్ కమిషన్ 1. 1946
బి) క్యాబినెట్ మిషన్ 2. 1932
సి) మూడవ రౌండ్‌టేబుల్ సమావేశం 3. 1927
డి) క్రిప్స్ మిషన్ 4. 1942
కోడ్లు
1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-3, బి-1, సి-2, డి-4
3) ఎ-3, బి-2, సి-2, డి-1 4) ఎ-4, బి-1, సి-2, డి-3
107. కింది వాక్యాలను పరిశీలించండి?
ఎ) మొఘలుల కాలంలో జమీందారీ వ్యవస్థ ఉండేది
బి) లార్డ్ విలియం బెంటింగ్ రైత్వారీ విధానాన్ని ప్రవేశ పెట్టాడు
1) ఎ, బి సరైనవి
2) ఎ సరైనది, బి తప్పు
3) ఎ తప్పు, బి సరైనది
4) ఎ, బి రెండూ తప్పు
108. కింద పొందుపరిచిన కోడ్ ఆధారంగా లిస్ట్-1ను లిస్ట్-2తో జతపరచండి?
లిస్ట్ -1 లిస్ట్-2
ఎ) బాణభట్టు 1. రాజతరంగిణి
బి) వాకృతి 2. విక్రమాంక దేవ చరిత్ర
సి) బిల్హణుడు 3. గౌడవాహ
డి) కల్హణుడు 4. హర్షచరిత్ర
కోడ్లు
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-3, బి-1, సి-4, డి-2
4) ఎ-2, బి-4, సి-1, డి-3
109. కింద ఇచ్చిన ఢిల్లీ సుల్తాన్లను వారి పాలనా కాలాన్ని అనుసరించి సరైన క్రమంలో
తెలపండి?
ఎ) ఇబ్రహీంలోడి బి) అల్లా ఉద్దీన్ ఖిల్జీ
సి) ఇల్‌టుట్ మిష్ డి) ఫిరోజ్ షా తుగ్లక్
1) బి, ఎ, డి, సి 2) ఎ, సి, డి, బి
3) సి, బి, ఎ, డి 4) సి,బి, డి, ఎ
110. కింది వాటిని జతపరచండి.
లిస్ట్ –ఎ లిస్ట్-బి
ఎ) ఎరవాడ జైలు 1. బాల గంగాధర్ తిలక్
బి) డెహ్రాడూన్ జైలు 2. ఎంకే గాంధీ
సి) అలీపూర్ జైలు 3. సీఆర్ దాస్
డి) మాండలే జైలు 4. జేఎల్ నెహ్రూ
5) రాజగోపాలాచారి
1) ఎ-2, బి-3, సి-4, డి-1
2) ఎ-1, బి-4, సి-3, డి-2
3) ఎ-2, బి-1, సి-5, డి-3
4) ఎ-2, బి-4, సి-3, డి-1
111. జతపరచండి
ఎ. జలియన్‌వాలా బాగ్ ఉదంతం 1. డబ్ల్యూ డబ్ల్యూ హంటర్
బి. ఇండియన్ యూనివర్సిటీస్ చట్టం 2. కల్నల్ డయ్యర్
సి. మొదటి భారత విద్యా కమిషన్ 3. లార్డ్ కర్జన్
డి. ఇండియన్ స్టాట్యుటరీ కమిషన్ 4. జాన్ సైమన్
1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-2, బి-3, సి-1, డి-4
3) ఎ-3, బి-4, సి-2, డి-1 4) ఎ-4, బి-1, సి-3, డి-2
112. సరికాని వాక్యాన్ని గుర్తించండి
1) రుగ్వేదంలో గంగానది గురించి ప్రస్తావిం చినప్పటికీ ఆనాటి ఆర్యులకు గంగానది తెలియదు
2) రుగ్వేదంలో సముద్ర అనే పదమున్న ఆనాటి ఆర్యులకు సముద్రాలు తెలియవు
3) రుగ్వేదంలో కుల వ్యవస్థ ప్రస్తావించి నప్పటికీ ఆనాటి ఆర్యులకు కుల వ్యవస్థ తెలియదు
4) రుగ్వేదంలో హిమాలయాల ప్రస్తావన ఉన్నప్పటికీ ఆనాటి ఆర్యులకు హిమాల యాలు తెలియవు
113. బౌద్ధ సంఘ సమావేశాలు జరిగిన ప్రదేశాలను క్రమ సంఖ్యలో రాయండి
ఎ. రాజగృహ బి. కుందలవనం
సి. పాటలీపుత్ర డి. వైశాలి
1) ఎ, బి, సి, డి 2) బి, ఎ, సి, డి
3) డి, సి, బి, ఎ 4) ఎ, డి, సి, బి
114. కౌటిల్యుడి అర్థశాస్త్రం మౌర్యుల కాలంలో సైన్యానికి అనుబంధంగా అంబులెన్స్ విభాగాన్ని గుర్తించి ప్రస్తావిస్తుంది. ఈ ప్రస్తావన వల్ల మనకి తెలిపే అంశాలు?
ఎ. యుద్ధంలో గాయపడినవారి సంరక్షణ పట్ల మౌర్యులు తీసుకునే జాగ్రత్త
బి. మౌర్యుల సేనా సామర్థ్యం
సి. మౌర్య చక్రవర్తుల ఆసక్తి
డి. కేంద్రీకృతమైన మౌర్యుల సైనిక వ్యవస్థ
1) ఎ, బి 2) బి, సి
3) సి, డి 4) ఎ, డి
115. కింది వాటిలో సరైన వ్యాఖ్యలను గుర్తించండి
ఎ. పాణిని రాసిన అష్టాధ్యాయి
సంస్కృతంలో తొలి వ్యాకరణ గ్రంథం
బి. తొల్కప్పియార్ రచించిన తొల్కప్పియం తమిళంలోని తొలి వ్యాకరణ గ్రంథం
సి. అమోఘవర్షుడు రచించిన కవిరాజు మార్గ కన్నడంలోని తొలి వ్యాకరణ గ్రంథం
డి. కేతన రచించిన ఆంధ్రభాషా భూషణం తెలుగులో రచించిన తొలి వ్యాకరణ గ్రంథం
1) ఎ 2) ఎ, బి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
116. రాజ్యాంగంలోని నిబంధనల్లో ఏది నవంబరు 26, 1949 నుంచి అమల్లోకి వచ్చింది?
1. పౌరసత్వపు నిబంధనలు
2. ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు
3. తాత్కాలిక పార్లమెంటుకు సంబంధించిన నిబంధనలు
4. ప్రాథమిక హక్కులకు సంబంధించినవి
1) 1, 2 2) 1, 3, 4
3) 1, 2, 3 4) ఏదీకాదు
117. ఏ పరిస్థితుల్లో కో వారెంట్ అనే రిట్ జారీ చేస్తారు?
ఎ. కార్యాలయం ప్రభుత్వానిదైయుండి రాజ్యాంగం లేదా శాసనం ద్వారా రూపొందించబడాలి
బి. కార్యాలయం యథార్థమైనదైయుండి దాంతోపాటు ఇతరుల ఇచ్ఛ ప్రకారం మాత్రమే నడుచుకోకుండా ఉండాలి
సి. ఒక వ్యక్తి నియామకం రాజ్యాంగం లేదా శాసనానికి విరుద్ధంగా జరిగినట్లెతే (డౌట్)
1) ఎ, బి, సి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి
118. భారతదేశంలో వివిధ లోక్‌సభల కాల పరిమితి స్వభావాన్ని పరిశీలించండి
ఎ. ఐదో లోక్‌సభ కాలపరిమితి ఎక్కువ
బి. 11వ లోక్ సభ కాలపరిమితి తక్కువ
సి. మొదటి లోక్‌సభ అర్థాంతరంగా రద్దు అయ్యింది
డి. 16వ లోక్‌సభ కాలపరిమితి సంపూర్ణం
1) ఎ 2) సి, డి 3) బి, సి 4) ఎ, బి, డి
119. భారత ఉప రాష్ట్రపతికి సంబంధించిన ప్రవచనాల్లో సరైన వాటిని గుర్తించండి
ఎ. రాష్ట్రపతి మరణించినప్పుడు, రాజీనామా చేసినప్పుడు లేదా పదవి నుంచి తొలగించినప్పుడు ఉపరాష్ట్రపతి ఆరు నెలలు మించకుండ రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు
బి. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ చేసినపుడు ఉపరాష్ట్రపతి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తాడు
సి. ప్రధానమంత్రి రాజీనామా చేసినచో, ఉపరాష్ట్రపతి రాజ్య సభకు పదవిరీత్యా ఛైర్మన్‌గా వ్యవహరిస్తాడు
1) ఎ 2) బి, సి
3) ఎ, డి 4) బి, సి, డి
120. జతపరచండి
ఎ. శాసనసభ్యులకు బడ్జెట్‌పై చర్చించేందుకు పరిపాలనాంశాల మీద ప్రశ్నించే అధికారం ఇవ్వబడింది 1. 1935 చట్టం
బి. మతపరమైన నియోజకవర్గాల ఏర్పాటు 2. 1892 కౌన్సిళ్ల చట్టం
సి. రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వం 3. 1919 చట్టం
డి. సమాఖ్య ప్రభుత్వం 4. 1909 చట్టం
1) ఎ-4, బి-3, సి-2, డి-1 2) ఎ-1, బి-4, సి-3, డి-2
3) ఎ-3, బి-2, సి-4, డి-1 4) ఎ-2, బి-4, సి-3, డి-1
121. కింది వ్యాఖ్యలను పరిశీలించండి
ఎ. రాష్ట్ర పరిధి దాటి గవర్నర్ చేసే అధికార పర్యటనల గురించి భారత గృహ మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలు ప్రకటించింది
బి. ఇప్పుడు గవర్నర్లు పర్యటనల విషయమై రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి, పర్యటనలు ఒక్క సంవత్సరం లో 73 రోజుల కన్నా మించకూడదు
1) ఎ సరైనది 2) బి సరైనది
3) ఎ, బి సరైనవి 4) ఎ, బి సరైనవి కాదు
122. కింది పదవుల్లో దేనితో ప్రధాన మంత్రి పదవిని పోల్చి చూడవచ్చు?
ఎ. క్యాబినెట్ అధినేత
బి. విదేశీ సంబంధాల విషయాలపై ముఖ్య ప్రతినిధి
సి. రాజ్య అధిపతి
డి. పార్లమెంట్ నాయకుడు
1) ఎ, సి 2) సి, డి
3) ఎ, బి, సి 4) ఎ, బి, డి
123. 73వ రాజ్యాంగ సవరణ అధికరణానికి సంబంధించిన కింది వ్యాఖ్యలను పరిశీలించి, జవాబును ఎంపిక చేయండి
ఎ. పంచాయతీల్లో మహిళలకు రిజర్వేషన్లు
బి. నిర్ణీత గడువుకు ముందే పంచాయతీలను రద్దు చేయకూడదు
సి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఫైనాన్స్ కమిషన్ నియమిస్తుంది
డి. ఆర్థిక అభివృద్ధి కోసం, సామాజిక న్యాయం కోసం ప్రణాళికలు రూపొందిచేటట్లు పంచాయతీలను పరిపుష్టి చేయడం
1) ఎ, బి 2) సి, డి
3) ఎ, బి, సి 4) ఎ, సి, డి
124. ఏ పరిస్థితుల్లో కో-వారెంట్ రిట్ జారీ చేయబడుతుంది?
ఎ. కార్యాలయం ప్రభుత్వానిదై ఉండాలి. అలాగే రాజ్యాంగం శాసనం ద్వారా లేదా రాజ్యాంగం ద్వారా రూపొందిచబడాలి
బి. కార్యాలయం అనేది కేవలం విధి, కార్యాచరణతో పాటు ఇతరుల ఇచ్ఛ, ఆమోదంతో కూడినది మాత్రమే కాకుండా యథార్థమైనదై ఉండాలి
సి. ఒక వ్యక్తి నియామకం రాజ్యాంగం లేదా శాసనానికి విరుద్ధంగా జరిగినట్లెతే
1) ఎ, బి, సి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి
సమాధానాలు
101-2 102-4 103-2 104-2 105-3 106-2 107-2 108-2 109-4 110-4 111.2 112.4 113.4 114.1 115.4 116.3 117.1 118.4 119.3 120.4 121.3 122.4 123.4 124. 1
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?