పరిశ్రమలకు నెలవు హైదరాబాద్ స్టేట్
1945లో 11 కమతాలు 5000 ఎకరాలకు పైన విస్తీర్ణం కలిగి ఉండగా, 49 కమతాలు 2500-5000 ఎకరాలకు పైన విస్థీరాన్ని, 444 కమతాలు 100-2500 విస్తీర్ణంలో ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలోని వరంగల్ జిల్లాలో 1945లో అత్యధిక పట్టాదార్లు 60 శాతం మంది 5-10 ఎకరాలు తరగతిలో ఉండగా, 100-5000 ఎకరాల పైబడిన విస్తీర్ణం గల పట్టాదార్లు కేవలం 4 శాతం మాత్రమే.
సంస్కరణలకు ముందు పారిశ్రామిక అభివృద్ధి
-హైదరాబాద్ స్టేట్లో కుతుబ్షాహీల కాలం నుంచి పారిశ్రామికరంగం అభివృద్ధి చెందింది. పారిశ్రామికంగా అభివృద్ధిని అడ్డుకునే వ్యవస్థ ఇక్కడ లేకపోవడంతో హైదరాబాద్ పారిశ్రామికంగా అత్యంత వైభవంగా ఉంది. 1929లోనే ప్రభుత్వం ఇండస్ట్రియల్ ట్రస్ట్ ఫండ్ (ఐటీఎఫ్)ను ఏర్పాటు చేసింది. దీనిద్వారా పెట్టుబడిని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేది. ప్రపంచ మార్కెట్లో పారిశ్రామికంగా హైదరాబాద్కు ప్రత్యేక స్థానం ఉంది.
-గ్రామీణ చేతివృత్తుల వారు స్థానికావసరాల ఉత్పత్తిలో వ్యవసాయ రంగంతో మమేకమై ఉండేవారు. ఆ కాలంలో పారిశ్రామికోత్పత్తులు మూడు రకాలు. అవి…
1. యుద్ధ సామాగ్రి
2. ఎగుమతులకు సంబంధించిన వస్ర్తాలు, వజ్రాలు, నౌకా నిర్మాణం
3. స్వదేశ డిమాండ్కు అవసరమైన విలాస వస్తువులు
-ఆ కాలంలో పట్టు, బంగారం, వెండి, కలప మొదలైన వస్తువులు ఎగుమతి అయ్యేవి.
-హైదరాబాద్ స్టేట్లో ఉత్పత్తి అంతా గ్రామీణ చేతి వృత్తులు పనివారి మీద ఆధారపడి ఉండేది. అందువల్ల దీన్ని జీవనాధార గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అని చెప్పవచ్చు. దీంట్లో కులవృత్తుల మీద ఆధారపడి, వారి ఉపయోగం కోసం అంటే స్థానిక గ్రామీణ మార్కెట్ కోసం జరిగే ఉత్పత్తి. మార్క్స్ భాషలో అయితే కొనడం కోసం అమ్మే (సరుకు-ద్రవ్యం-సరుకు) వినిమయ ఆర్థిక ఉత్పత్తి. నిజాం కాలంలో అయితే ఎగుమతుల కోసం ఉత్పత్తి జరిగేది. మొత్తం మీద కులచక్రంలో బందింపబడిన ఉత్పత్తి విధానం ఉండేది.
-1881 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ వ్యవస్థలో ఉత్పత్తి కులాలు
5 కులాలు- నేత వృత్తిలో
5 కులాలు- ఆహారోత్పత్తిలో
7 కులాలు- లోహ ఉత్పత్తిలో
2 కులాలు- వడ్రంగిలో
2 కులాలు- కుండల తయారీలో
2 కులాలు- రాతి పనిలో
-ఇలా 1881 జనాభా లెక్కల్లో మొత్తం ఉత్పత్తి కులాల వాటా 10 శాతం
-పత్తి వస్తాల ఉత్పత్తితోపాటు ఇతర 7 రకాల వస్ర్తాల ఉత్పత్తులు పట్టు, ఉన్ని, రంగుల అద్దకం మొదలైనవి, గనుల పరిశ్రమలు ముఖ్యమైనవిగా ఉండేవి.
-కత్తులు, బేళ్లు, తుపాకులు మొదలైనవాటిని నిజాం సైన్యం కోసం, జాగీర్ధార్ల ప్రైవేట్ సైన్యాల కోసం తయారు చేసేవారు.
-ఉత్తర తెలంగాణలో దొరికే కలప ఉత్పత్తి అతిముఖ్యమైనది. పేపర్ ఉత్పత్తి, బూట్ల తయారీ, ఫిలిగ్రీ తదితర ఉత్పత్తు కూడా ఉండేవి. సర్కార్ జిల్లాల్లో నౌకా నిర్మాణం ఉండేది.
ముఖ్యమైన 20 పరిశ్రమలు
-వజ్రాల తవ్వకం, నౌకా నిర్మాణం, ఇనుప ఖనిజ గనులు, ఇనుప ఖనిజాన్ని కరిగించే పరిశ్రమ, స్టీలు, యుద్ధ సామాగ్రి, బంగారు, రాగి గనులు, సున్నపు రాళ్లు, ఇత్తడి, రాగి వస్తువులు, బిద్రి, వెండి వస్తువులు, షారంజ్, కలప వస్తువులు, పేపర్, నిర్మాణ రాళ్లు, మట్టి పాత్రలు, గాజులు, తోళ్ల వస్తువులు.
-మిలటరీ ప్రభుత్వ కాలంలో కుటీర పరిశ్రమల వస్తువుల ఎగుమతుల కోసం ఢిల్లీలో సెంట్రల్ సేల్స్ ఎంపోరియంను స్థాపించారు.
కాలువల నిర్లక్ష్యం నీటిపారుదల వ్యవస్థ అస్తవ్యస్థం
-జమీందార్లు, నిజాం ప్రభుత్వం ఇద్దరూ రైతుల నుంచి శిస్తు వసూలు చేసే దానిపై పెట్టిన శ్రద్ధ, చెరువుల మరమ్మతులో చూపించలేదు. శిస్తులను ప్రతి ఏటా పెంచుతూ రైతులపై భారం మోపి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం మరిచారు. 1867 వరకు ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న నీటిపారుదల వ్యవస్థ, ప్రభుత్వం చేతికి వచ్చాక కూడా ఎలాంటి మార్పు జరగలేదు. గోదావరి, తుంగభద్ర, కృష్ణా నదులపై కొత్త ఆనకట్టలు నిర్మించి, ఆయా నదుల నీటిని వినియోగించడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఎన్ని సలహాలు ఇచ్చినా నిజాం సర్కార్ పట్టించుకోలేదు.
రైతుల పరిస్థితి
-1920 తరువాత ఆహారేతర పంటల విస్తీర్ణం పెరిగినప్పటికీ 1929లో వచ్చిన ఆర్థిక మాంద్యం వల్ల రైతుల ఆదాయం విపరీతంగా పడిపోయింది. ఎక్కువమంది రైతులు వ్యవసాయేతర పంటలకు మల్లడం వల్ల ఆయా పంటలకు గిరాకీ తగ్గి వారి పరిస్థితి దయనీయంగా మారింది.
-1882-83లో 179.01 లక్షలుగా ఉన్న భూ రెవెన్యూ భారీగా పెరిగి 1943-44 నాటికి అది 333.37 లక్షలకు చేరింది.
-రెండో ప్రపంచ యుద్ధం ముగిసే సమయంలో బర్మా బియ్యం దిగుమతులు తగ్గడం, బెంగాల్లో కరువు, శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టి దాన్ని మరింత పెంచడం వంటివాటివల్ల రైతులు దివాళాతీసే పరిస్థితికి వచ్చారు. పెద్ద మొత్తంలో భూమి మధ్యవర్తుల చేతుల్లో ఉండటంతో రైతాంగం అంతా అప్పుల్లో కూరుకుపోయింది.
-1921-22లో 15.3 మిలియన్ ఎకరాలుగా ఉన్న వ్యవసాయ పంటల విస్తీర్ణం 1925-26 నాటికి 26.9 మిలియన్ ఎకరాలకు పెరిగింది. అయితే ఇది 1934-35 వరకు క్రమంగా పెరిగి తరువాత తగ్గింది.
-భూమి కమతాల రూపంలోకి వెళ్లడం, ఆధునిక పద్ధతిలో కాకుండా మూస విధానంలో పటలు సాగుచేయడం, భూ హక్కులపై ఓ స్థిరమైన చట్టం లేకపోవడం, భూస్వామ్య వ్యవస్థ అభివృద్ధి చెందుతుండటం, సాగునీటి వ్యవస్థ సరైన స్థాయిలో లేకపోవడంతో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. వీటన్నింటిని అధిగమించడానికి సాలార్జంగ్ సంస్కరణలు అవసరమయ్యాయి.
భూ కమతాల పరిస్థితి
-1945లో 11 కమతాలు 5000 ఎకరాలకు పైన విస్తీర్ణం కలిగి ఉండగా, 49 కమతాలు 2500-5000 ఎకరాలకు పైన విస్థీరాన్ని, 444 కమతాలు 100-2500 విస్తీర్ణంలో ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలోని వరంగల్ జిల్లాలో 1945లో అత్యధిక పట్టాదార్లు 60 శాతం మంది 5-10 ఎకరాలు తరగతిలో ఉండగా, 100-5000 ఎకరాల పైబడిన విస్తీర్ణం గల పట్టాదార్లు కేవలం 4 శాతం మాత్రమే.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు