సరస్వతి నదీ తీర ప్రాంతాల్లో అభివృద్ధి చెందిన సంస్కృతి?
భారతదేశ చరిత్ర, సంస్కృతి
1. కుండలను తయారుచేయడం ఏ యుగంలో ప్రారంభమైంది?
1) ప్రాచీన శిలాయుగం
2) మధ్య శిలాయుగం
3) నవీన శిలాయుగం
4) తామ్ర శిలాయుగం
2. మానవ జాతి చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణ చక్రాన్ని ఏ యుగంలో కనుగొన్నారు?
1) తామ్ర శిలాయుగం
2) నవీన శిలాయుగం
3) ఇనుప యుగం
4) ప్రాచీన శిలాయుగం
3. దక్షిణ భారతదేశంలో పెద్దసంఖ్యలో బయటపడ్డ రాక్షస గూళ్లను నిర్మించింది?
1) ఆర్యులు 2) మంగోలులు
3) ద్రావిడులు 4) నీగ్రిటోలు
4. మానవజాతి ప్రప్రథమంగా ఉపయోగించిన లోహం?
1) రాగి 2) బంగారం
3) వెండి 4) ఇనుము
5. సింధూ నాగరికత ఏ యుగానికి చెందింది?
1) కంచు యుగం 2) రాగి యుగం
3) శిలా యుగం 4) ఇనుపయుగం
6. మధ్యశిలాయుగపు మానవుడు ఉపయోగించిన పరికరాలు ?
1) రాగి పనిముట్లు
2) ఇనుప పనిముట్లు
3) కంచు పనిముట్లు
4) చిన్నరాతి పనిముట్లు
7. నవీన శిలాయుగానికి చెందిన డోల్మెన్స్ నిర్మాణాలు ?
1) ధాన్యపు గిడ్డంగులు 2) సమాధులు
3) పూజామందిరాలు 4) సమావేశ స్థలాలు
8. భారతదేశంలో మొట్టమొదటి మానవుని ఆనవాళ్లు ఏ ప్రాంతంలో లభించాయి?
1) నీలగిరి 2) శివాలిక్
3) నల్లమల 4) నర్మదాలోయ
9. హరప్పా ప్రజలు ఏ పక్షిని పవిత్రమైనదిగా పూజించారు?
1) కాకి 2) నెమలి 3) పావురం 4) గద్ద
10. సింధూ నాగరికత కాలం నాటి ప్రజల కళారూపాలు?
1) ముద్రికలు 2) టెరాకోట బొమ్మలు
3) లోహబొమ్మలు 4) పైవన్నీ
11. మధ్యప్రదేశ్లోని భోపాల్ దగ్గర ఉన్న భింబెట్కా గుహల్లో కనుగొన్న పరికరాలు, చిత్రాలు ఏ కాలానికి చెందినవి?
1) ప్రాచీన శిలాయుగం
2) మధ్య శిలాయుగం
3) నవీన శిలాయుగం
4) తామ్రయుగం
12. వేట, చేపలు పట్టడం ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉన్న నవీన శిలాయుగ నాగరికత ప్రదేశం ?
1) బుర్జహామ్ 2) గుఫ్కారాల్
3) నవదాతోలి 4) భింబెట్కా
13. రాగి వస్తువులు ఎక్కువగా లభించిన తామ్ర శిలాయుగ స్థానం?
1) మాల్వా, కయథ, ఎరాన్ 2) అహర్
3) జోర్వే 4) దైమాబాద్
14. తామ్ర శిలాయుగానికి చెందిన హరప్పా ప్రజలకు తెలియని లోహం?
1) ఇనుము 2) బంగారం, వెండి 3) రాగి 4) కంచు
15. సింధూ నాగరికత కాలం నాటి ప్రజల ప్రధాన ఎగుమతులు?
1) పత్తి 2) కాటన్ టెక్స్టైల్స్
3) ధాన్యాలు 4) పైవన్నీ
16. నలుపు, ఎరుపు మృణ్మయ పాత్రలు ముఖ్యంగా ఏ యుగంలో ప్రాచుర్యం పొందాయి?
1) కంచు యుగం 2) నవీన యుగం
3) తామ్ర యుగం 4) పైవన్నీ కాదు
17. ఆధునిక మానవుడు మొదటిసారిగా ఏ యుగంలో భూమిపై సంచరించాడు?
1) మధ్యప్రాచీన శిలాయుగం
2) పూర్వ ప్రాచీన శిలాయుగం
3) ఉత్తర ప్రాచీన శిలాయుగం
4) సూక్ష్మ శిలాయుగం
18. తామ్ర శిలాయుగానికి చెందిన నాగరికత ఏ రకమైన ఆర్థిక వ్యవస్థపై ఆధారపడింది?
1) గ్రామీణ 2) పశుపాలన
3) పట్టణ 4) వేట
19. వేద సంస్కృతి ఏ నదీ తీర ప్రాంతాల్లో అభివృద్ధి చెందింది?
1) రావి 2) గంగా
3) సరస్వతి 4) సింధూ
20. ప్రపంచంలో మొట్టమొదటగా ఇనుము ఏ ప్రాంతంలో కనుగొన్నారు?
1) ఆసియా 2) యూరప్
3) ఈజిప్టు 4) యూరేసియా
21. మానవ నాగరికతా పరిణామ క్రమంలో వర్తక వాణిజ్యాలు ఏ యుగంలో ప్రారంభమయ్యాయి?
1) ఇనుపయుగం 2) రాతి యుగం
3) నవీన శిలాయుగం 4) కంచు యుగం
22. మహాభారతం అసలు పేరు ?
1) వ్యాసగీతం 2) బ్రహ్మసంహిత
3) జయ సంహిత 4) బృహత్కథ
23. ఉపఖండంలో వరి, గోధుమ, బార్లీ పంటలను ఏ యుగం నుంచి పండించారు?
1) సింధూ నాగరికత
2) నవీన శిలాయుగం
3) ప్రాచీన శిలాయుగం
4) 1500 బీసీ
24. భారతదేశంలో మొదటిసారి ఏ జాతి ప్రజలు నివసించారు?
1) నీగ్రిటో 2) మెడిటరేనియన్
3) ఆస్ట్రలాయిడ్ 4) మంగోలాయిడ్
సమాధానాలు
1.3 2.2 3.3 4.1 5.1 6.4 7.2 8.2 9.3 10.4 11.1 12.1 13.2 14.1 15.4 16.3
17.3 18.1 19.3 20.4 21.4 22.3 23.2 24.1
- Tags
- competitive exams
- Groups
- upsc
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు