ధరిత్రి దినోత్సవం ఏ రోజున జరుపుతారు?
సుస్థిరాభివృద్ధి (గత తరువాయి)
168. నీతి ఆయోగ్ కార్యాచరణ ప్రణాళిక పత్రంలో ఎంత వ్యవధిని దీర్ఘదర్శి ప్రణాళిక కింద రూపొందించింది?
1) 3 సంవత్సరాలు
2) 7 సంవత్సరాలు
3) 20 సంవత్సరాలు
4) 15 సంవత్సరాలు
169. భారత తుక్కు విధానంలో భాగంగా ఎన్ని సంవత్సరాలకు మించిన వ్యక్తిగత, వాణిజ్య వాహనాలకు సామర్థ్య పరీక్షలు జరిపి ఉద్గారాల నిబంధనల్లో విఫలమైన వాహనాలను తుక్కుగా మార్చాలని నిర్ణయించారు?
1) 15, 20 2) 20, 15
3) 10, 15 4) 20, 25
170. కింది వాటిలో భారతదేశంలోని మొదటి గ్రీన్ ఫీల్డ్ హైవే ?
1) ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ వే
2) చెన్నై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ వే
3) హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి
4) ఢిల్లీ-అమృత్సర్ జాతీయ రహదారి
171. మొట్టమొదటి ‘వాయు నాణ్యతా సూచీ’ (AQI) ఎప్పుడు, ఎక్కడ ప్రారంభించారు?
1) 2014, బెంగళూరు
2) 2014, ఢిల్లీ
3) 2016, హైదరాబాద్
4) 2015, భోపాల్
172. సుస్థిరాభివృద్ధి 8వ లక్ష్యంలో భాగంగా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY) ద్వారా ఎప్పటివరకు 40 కోట్ల మంది శిక్షణ పొందిన యువతను తయారుచేయాలనే లక్ష్యం పెట్టుకుంది?
1) 2024 2) 2030
3) 2025 4) 2022
173. ఇటీవల ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (WIPO) జారీ చేసిన ‘ప్రపంచ నవ కల్పన సూచీ-2021’ ర్యాంకింగ్స్‌లో భారతదేశం ఏ స్థానంలో ఉంది?
1) 35 2) 48 3) 46 4) 54
174. ప్రస్తుతం (ఆగస్టు 2021) భారతదేశంలో స్టార్ట్ అప్ యూనికార్న్ (రూ.7500 కోట్ల విలువ ఉన్న కంపెనీ)ల సంఖ్య ఎంత?
1) 36 2) 51 3) 98 4) 76
175. రెరా చట్టం-2016 దేనికి సంబంధించినది?
1) వ్యవసాయం 2) స్థిరాస్తి వ్యాపారం
3) పరిశ్రమలు 4) బ్యాంకులు
176. ‘స్మార్ట్ సిటీ మిషన్’ పథకం ఏ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా ప్రవేశపెట్టారు?
1) 1వ లక్ష్యం 2) 6వ లక్ష్యం
3) 14వ లక్ష్యం 4) 9వ లక్ష్యం
177. ‘ఒకే దేశం-ఒకే రేషన్ కార్డ్’ పథకం ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) ఒడిశా 2) మహారాష్ట్ర
3) కేరళ 4) తెలంగాణ
178. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 10వ లక్ష్యమైన ‘అసమానతల తగ్గింపు’లో భాగంగా ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన’లో 42 కోట్ల బ్యాంకు అకౌంట్లు తెరిచారు. అందులో మహిళల శాతం ఎంత?
1) 42% 2) 75%
3) 55% 4) 63%
179. పగడపు దిబ్బలు (coral reefs) పోషించే పాత్ర ఏది?
1) నీటి నాణ్యతను సూచించే పర్యావరణ సూచికలు
2) సముద్ర తుఫాన్ల నుంచి తీరాలను రక్షించే కవచాలు
3) పై రెండూ 4) ఏదీ కాదు
180. ధరిత్రి దినోత్సవం ఏ రోజున జరుపుతారు?
1) ఏప్రిల్ 22 2) మార్చి 22
3) జూన్ 21 4) అక్టోబర్ 22
181. ‘మానవాభివృద్ధి సూచీ-2019’లో భారతదేశం స్థానం ఎంత?
1) 142 2) 130 3) 128 4) 131
182. భారత్‌లో బముఖ పేదరిక సూచీలో (MPI) 2005-06 నుంచి 2015-16 నాటికి తగ్గిన పేదరిక శాతం?
1) 16.2% 2) 34%
3) 23% 4) 27.5%
183. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మూడవది?
1) ఆరోగ్యం 2) పేదరికం నిర్మూలన
3) విద్య 4) లింగ సమానత్వం
184. స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఎన్నవది?
1) 7 2) 6 3) 11 4) 3
185. భారతదేశంలో 2015-16 నాటికి ఎంత శాతం భూమి భూక్షయానికి గురైంది?
1) 11 2) 15 3) 28 4) 50
186. ‘మత్స్ సంపద పెంపుదల’ ఏ సుస్థిరాభి వృద్ధి లక్ష్యాల్లో భాగం?
1) లక్ష్యం 14 2) లక్ష్యం 15
3) లక్ష్యం 9 4) లక్ష్యం 16
187. కింది వాటిని జతపరచండి?
1. నీరు, పారిశుద్ధ్యం ఎ. 6వ లక్ష్యం
2. నాణ్యమైన విద్య బి. 1వ లక్ష్యం
3. భాగస్వామ్యం సి. 4వ లక్ష్యం
4. పేదరిక నిర్మూలన డి. 17వ లక్ష్యం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
3) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
188. ప్రపంచ వాతావరణ ఆరోగ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతారు?
1) సెప్టెంబరు 26 2) అక్టోబరు 26
3) నవంబర్ 26 4) డిసెంబర్ 26
189. కింది వాటిని జతపరచండి.
ఎ. 2వ లక్ష్యం 1. సముద్రాలు, జలవనరుల సంరక్షణ
బి. 5వ లక్ష్యం 2. మౌలిక సదుపాయాల కల్పన
సి. 9వ లక్ష్యం 3. లింగ సమానత్వం సాధించడం
డి. 14వ లక్ష్యం 4. ఆకలిని అంతమొందించడం
1) ఎ-1, బి-3, సి-4, డి-2
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-2, బి-1, సి-3, డి-4
4) ఎ-4, బి-3, సి-2, డి-1
190. కింది వాటిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 2016-30ల్లో లేనిది గుర్తించండి.
1) ఆకలిని అంతమొందించడం
2) అణు పరీక్షలు నిర్వహించడం
3) సముద్రాలు, జలవనరుల్ని కాపాడటం
4) దేశంలో అసమానతలు తగ్గించటం
191. నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఇండియా ఇండెక్స్-2021లో ఎన్ని లక్ష్యాలను పరిగణనలోకి తీసుకున్నది?
1) 10 2) 15 3) 16 4) 17
192. ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ఇండియా ఇండెక్స్-2021 ఎన్నవది?
1) 3 2) 4 3) 2 4) 1
193. సుస్థిరాభివృద్ధిలో ఉన్న అంశాలు ఏవి?
1) పర్యావరణం 2) ఆర్థికాభివృద్ధి
3) సమాజం 4) పైవన్నీ
194. నీతి ఆయోగ్ 15 ఏళ్ల దీర్ఘకాల ప్రణాళికా సమయంగా పేర్కొన్నది?
1) 2021-2035
2) 2016-2030
3) 2017-2032
4) 2025-2040
195. భారతదేశ మేధో కూటమి (Think Tank)గా పేర్కొన్నది?
1) నీతి ఆయోగ్ 2) సుప్రీం కోర్టు
3) మంత్రి మండలి 4) ఉద్యోగులు
196. నీతిఆయోగ్ పాలక మండలి 6వ సమావేశం ఇటీవల ఎప్పుడు జరిగింది?
1) సెప్టెంబరు 2021
2) డిసెంబర్ 2020
3) ఫిబ్రవరి 2021
4) మార్చి 2021
197. నీతి ఆయోగ్ విడుదల చేసిన ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్-2019లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ర్యాంకులు వరుసగా గుర్తించండి.
1) 10, 4 2) 2, 7
3) 9, 11 4) 4, 10
198. నీతి ఆయోగ్ విడుదల చేసిన స్కూల్ ఎడ్యు కేషన్ క్వాలిటీ ఇండెక్స్-2019లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ర్యాంకులు వరుసగా?
1) 10, 13 2) 4, 14
3) 16, 21 4) 14, 4
199. పర్యావరణ విధ్వంసం లేకుండా జరిగే అభివృద్ధిని ఏమంటారు?
1) పర్యావరణ అభివృద్ధి
2) సుస్థిరాభివృద్ధి
3) ప్రగతితో కూడిన వృద్ధి
4) హరిత అభివృద్ధి
200. ప్రస్తుత నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (CEO) ?
1) నరేంద్ర మోదీ 2) నితిన్ గడ్కరీ
3) రాజీవ్ కుమార్ 4) అమితాబ్ కాంత్
సమాధానాలు
168.4 169.2 170.1 171.2 172.4 173.3 174.2 175.2 176.4 177.1 178.3 179.3 180.1 181.4 182.4 183.1 184.2 185.3 186.1 187.2 188.1 189.4 190.2 191.4 192.1 193.4 194.3 195.1
196.3 197.4 198.2 199.2 200.4
విజేత కాంపిటీషన్స్
బతుకమ్మకుంట,
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు