ఏ రకమైన పరాగ సంపర్కాన్ని హైడ్రోఫిలి అంటారు?
పుష్పవిన్యాసం (The Inflorescence)
– పుష్ప విన్యాసాక్షం (Floral axis) మీద పుష్పాలు అమరి ఉండటాన్ని పుష్పవిన్యాసం అంటారు.
– పుష్పం కాండ రూపాంతరం. అతిపెద్ద పుష్పవిన్యాసం – అమర్ఫోపాలస్ టైటానం
– అతిపెద్ద శాఖీయమొగ్గ/శాఖీయ కోరకం – క్యాబేజి
– వృక్షరాజ్యంలో పుష్పవిన్యాసాక్షంపై పుష్పాలు వివిధ రకాలుగా అమరివుంటాయి. వాటిని దిగువ పట్టికల్లో చూద్దాం..
పుష్పవిన్యాస రకం మొక్క
1. సమశిఖి (Corymb) తంగేడు (కేసియా), కాలీఫ్లవర్
2. గుచ్ఛం (Umbel) నీరుల్లి, క్యారెట్, కొత్తిమీర
3. స్పాడిక్స్ (Spadix) మ్యూసా (అరటి),కోకస్ (కొబ్బరి),కొలకేసియా (చామ
4. శీర్షావత్ (HeadInflorescence) ట్రైడాక్స్(గడ్డి చామంతి), సూర్యకాంతం (పొద్దుతిరుగుడు)
5. ఏకాంతర నిశ్చితం (Solitary cyme) హైబిస్కస్ రోజాసైనెన్సిస్ (మందార), దతూర (ఉమ్మెత్త)
6. సైమ్యూల్ (Cymule) బోగన్విల్లియా (కాగితపు పూలచెట్టు), జాస్మిన్ (మల్లె)
7. వర్టిసెల్లాస్టర్ (Verticellaster) లామియేసి కుటుంబం మొక్కలు (తులసి, రణబేరి)
8. సయాథియమ్ (Cyathium) యుఫర్బియేసి కుటుంబం (యుఫర్బియా)
9. హైపన్థోడియం (Hypanthodium) ఫైకస్ (మర్రి)
10. కాట్కిన్ మల్బరి
11. కంకి (Spike) వరి, మొక్కజొన్న
12. సామాన్య అనిశ్చితం ఆవాలు, ముల్లంగి
–పుష్పాల గురించిన అధ్యయనాన్ని ఆంథాలజీ అని, పుష్పాలను ఇచ్చే మొక్కల పెంపకాన్ని ఫ్లోరికల్చర్ అని అంటారు.
– లైంగికోత్పత్తి కోసం రూపాంతరం చెందిన ప్రకాండమే పుష్పం.
– వృక్షరాజ్యంలో అతిపెద్ద పుష్పం – రఫ్లీషియా ఆర్నాల్డె
– వృక్షరాజ్యంలో అతిచిన్న పుష్పం – ఉల్ఫియా ఆంగుస్టా
– పుష్పానికి ఉండే కాడ వంటి నిర్మాణాన్ని పుష్పవృంతం అని, దాని చివర ఉబ్బిన నిర్మాణాన్ని పుష్పాసనం అని అంటారు.
– పుష్పాసనంపై పుష్పం నాలుగు భాగాలు భిన్న వలయాలుగా ఒకదాని తర్వాత ఒకటి అమరి ఉంటాయి. అవి.. రక్షక పత్రావళి (Calyx), ఆకర్షణ పత్రావళి (Corolla), కేసరావళి (Androecium), అండకోశం (Gynoecium).
– కేసరావళి, అండకోశం ప్రత్యుత్పత్తి భాగాలు కాగా, రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి అదనపు భాగాలు.
సంపూర్ణ పుష్పం
–పుష్పంలో రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అండకోశం అనే నాలుగు భాగాలు ఉంటే ఆ పుష్పాన్ని సంపూర్ణ పుష్పం అంటారు.
ఉదా: మందార, ఉమ్మెత్త
అసంపూర్ణ పుష్పం
– నాలుగు పుష్ప భాగాల్లో ఏ ఒక్కటి లోపించినా ఆ పుష్పాన్ని అసంపూర్ణ పుష్పం అంటారు.
ఉదా: దోస, కాకర, బొప్పాయి
ద్విలింగక పుష్పాలు (Bisexual flowers)
–కేసరావళి, అండకోశం అనే రెండు రకాల ప్రత్యుత్పత్తి భాగాలు కలిగిన పుష్పాలను ద్విలింగక పుష్పాలు అంటారు.
ఉదా: మందార, ఉమ్మెత్త
ఏకలింగక పుష్పాలు
– కేసరావళిగానీ, అండకోశంగానీ ఏదైనా ఒక రకం ప్రత్యుత్పత్తి భాగాన్ని మాత్రమే కలిగిఉన్న పుష్పాలను ఏకలింగక పుష్పాలు అంటారు.
ఉదా: దోస, సొర, కాకర
– కేసరావళి మాత్రమే ఉంటే పురుష పుష్పం (Staminate flower) అని, అండకోశం మాత్రమే ఉంటే స్త్రీ పుష్పం (Pistillate flower) అని అంటారు.
ద్విలింగాశ్రయ స్థితి (Dioecious condition).
– ఒకే మొక్కపై రెండు ఏకలింగక పుష్పాలు (స్త్రీ పుష్పం, పురుష పుష్పం) ఉంటే దాన్ని ద్విలింగాశ్రయ స్థితి అంటారు.
ఉదా: కోకస్, కారా, మొక్కజొన్న
ఏకలింగాశ్రయ స్థితి (Monoecious condition)
–ఒక మొక్కపై ఏదో ఒక ఏకలింగక పుష్పం (స్త్రీ పుష్పం లేదా పురుష పుష్పం) ఉంటే దాన్ని ఏకలింగాశ్రయ స్థితి అంటారు.
ఉదా: బొరానస్, మార్కాన్షియా, బొప్పాయి, సొరకాయ
బహులింగాశ్రయ స్థితి (Polygamous condition)
–ఒకే మొక్కపై ఏకలింగక, ద్విలింగక పుష్పాలు రెండూ ఉంటే దాన్ని బలింగాశ్రయ స్థితి అంటారు.
ఉదా: మాంజిఫెరా (మామిడి)
పుష్పభాగాలు (Parts of flowers)
1. రక్షక పత్రావళి (Calyx): ఇది పుష్పం వెలుపలి వైపు నుంచి మొదటి వలయం. ఈ రక్షక పత్రావళిలోని భాగాలను రక్షక పత్రాలు (Sepals) అంటారు.
2. ఆకర్షణ పత్రావళి (Corolla): ఇది పుష్పం వెలుపలి వైపు నుంచి రెండో వలయం. ఆకర్షణ పత్రావళిలో ఆకర్షణ పత్రాలు ఉంటాయి. ఇవి పరాగ సంపర్కం కోసం కీటకాలను ఆకర్షించడానికి ప్రకాశవంతమైన రంగుల్లో ఉంటాయి.
3. కేసరావళి (Androecium): ఇది పుష్పం వెలుపలి వైపు నుంచి మూడో వలయం. కేసరావళి కేసరాలను (Stamens) కలిగి ఉంటుంది. కేసరం పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణం.
– కేసరంలో కేసరదండం/వృంతం (Fila ment/Stalk), పరాగకోశం (Anther) అనే భాగాలుంటాయి.
– పరాగకోశంలో పుప్పొడి సంచులు (Pollen sacs)/పుప్పొడి గదులు (Pollen chambers) ఉండి పరాగరేణువులను (Pollen grains) ఉత్పత్తి చేస్తాయి.
– పరాగ రేణువుల అధ్యయనం – పేలినాలజీ
4. అండకోశం (Gynoecium)
–అండకోశం పుష్పం వెలుపలి వైపు నుంచి నాలుగో వలయం. ఇది పుష్పంలో స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం.
– ఇది ఒకటి/అనేక ఫలదళాలతో (Carpels) ఏర్పడి ఉంటుంది. వీటినే స్థూల సిద్ధబీజాశయ పత్రాలు అంటారు.
–ప్రతి ఫలదళంలో కీలాగ్రం (Stigma), కీలం (Style), అండాశయం (Ovary) అనే మూడు భాగాలుంటాయి.
–పీఠంలో ఉబ్బిన భాగాన్ని అండాశయం అని, మధ్యన సాగిన నాళం వంటి భాగాన్ని కీలం అని, కీలం కొన భాగాన్ని కీలాగ్రం అని అంటారు (కీలాగ్రం పరాగ రేణువులను స్వీకరిస్తుంది).
– ప్రతి అండాశయంలో బల్లపరుపు దిండు వంటి అండన్యాస స్థానానికి (Placenta) ఒకటి/అంతకంటె ఎక్కువ అండాలు అతుక్కుని ఉంటాయి.
– ప్రతి అండంలో ఉండే పిండకోశంలో 7 కణాలు, 8 కేంద్రకాలు ఉంటాయి.
–పిండకోశాన్ని స్త్రీ సంయోగబీజదం అంటారు.
– వర్షాకాలంలో పుష్పించే మొక్కలు – గులాబి, గన్నేరు
– శీతాకాలంలో పుష్పించే మొక్కలు – బంతి, చామంతి
– ఎండాకాలంలో పుష్పించే మొక్కలు – మల్లె, మామిడి, వేప
కేసరావళిని ముష్కాలకు, పరాగరేణువులను శుక్రకణాలకు సమజాతాలుగా పరిగణిస్తారు.
–అండకోశాన్ని స్త్రీబీజ కోశాలకు, పిండకోశాన్ని అండానికి సమజాతంగా పరిగణిస్తారు.
అండన్యాసం (Placentation)
–అండాశయంలో అండాలు అమరివుండే విధానాన్ని అండన్యాసం అంటారు. అండన్యాసం ఈ కింది రకాలుగా ఉంటుంది.
–ఉపాంత అండన్యాసం (Marginal Placen tation): ఉదా: బఠానీ
–అక్షీయ అండన్యాసం (Axile Placentation): ఉదా: మందార, టమాటా, నిమ్మ.
–కుడ్య అండన్యాసం (Parietal Placentation):
–స్వేచ్ఛా కేంద్ర అండన్యాసం (Free Cen tral Placentation): ఉదా: ఆవ, ఆర్జిమోస్, డయాంథిస్, ప్రైమ్ రోజ్.
–పీఠ అండన్యాసం (Basal Placentation): ఉదా: పొద్దుతిరుగుడు, బంతి (మేరీ గోల్డ్).
పరాగ సంపర్కం (Pollination)
– పరాగ రేణువులు కీలం/కీలాగ్రాన్ని చేరడాన్ని పరాగ సంపర్కం అంటారు. దీన్ని ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి.. స్వపరాగ/ఆత్మపరాగ సంపర్కం (Self Pollination), పరపరాగ సంపర్కం (Cross Pollination).
స్వపరాగ/ఆత్మపరాగ సంపర్కం (Self Polli nation): పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పంలోని కీలం/కీలాగ్రాన్ని చేరితే స్వపరాగ/ఆత్మపరాగ సంపర్కం అంటారు.
ఉదా: Peanuts, గోధుమ, నేరేడు (Apricots), వరి, టమాటా, కామెలినా (Comme lina).
పరపరాగ సంపర్కం (Cross Pollination): పుష్పంలోని పరాగరేణువులు అదే జాతికి చెందిన వేరొక పుష్పం కీలం/కీలాగ్రాన్ని చేరితే పరపరాగ సంపర్కం అంటారు.
ఉదా: ఉమ్మెత్త, మందార, యాపిల్, గుమ్మడి.
–పరాగ సంపర్కం వివిధ రకాలుగా జరుగుతుంది. వాటిని కింది పట్టిక ద్వారా చూద్దాం.
పరాగ సంపర్కం కారకం
1. ఎనిమోఫిలి గాలి
2. హైడ్రోఫిలి నీరు
3. జూఫిలి జంతువులు
4. ఎంటమోఫిలి కీటకాలు
5. ఆర్నిథోఫిలి పక్షులు
6. ఖైరాప్టెరోఫిలి గబ్బిలాలు
7. థెరోఫిలి ఉడుతలు
8. ఒఫియోఫిలి పాములు
9. మెలకోఫిలి నత్తలు
ఫలదీకరణ (Fertilisation)
–పరాగరేణువులో రెండు ఏకస్థితిక పురుషబీజాలు (Male gametes) ఏర్పడుతాయి. ఇవి అండంలో ఉన్న పిండకోశంలోని స్త్రీబీజంతో ఒకటి, ద్వితీయ కేంద్రకాలతో ఒకటి కలవడంవల్ల రెండు ఫలదీకరణలు జరుగుతాయి. మొదటి ఫలదీకరణంవల్ల ద్వయస్థితిక సంయుక్త బీజం (సంయుక్త సంయోగం), రెండో ఫలదీకరణంవల్ల త్రయస్థితిక అంకురచ్ఛదం ఏర్పడుతాయి.
–మొక్కల్లో ద్విఫలదీకరణం, త్రిసంయోగం జరుగుతాయి.
– ఫలదీకరణం అనంతరం రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు, కీలం, కీలాగ్రం, కేసరాలు, సహాయ కణాలు, ప్రతిపాదక కణాలు నశిస్తాయి.
–ఫలదీకరణం అనంతరం అండాశయం ఫలంగా, అండాలు విత్తనాలుగా, సంయుక్తబీజం పిండంగా మారుతాయి.
– అంకురచ్ఛదం ఉన్నట్లయితే అల్బుమినస్ విత్తనం (ఆముదం, కొబ్బరి), అంకురచ్ఛదం లేకపోతే అల్బుమినస్ రహిత విత్తనం (వేరుశనగ, చిక్కుడు, కంది) అని అంటారు.
పుష్పరచన (Aestivation)
l పుష్పం మొగ్గ దశలో ఉన్నప్పుడు రక్షక, ఆకర్షణ పత్రావళి అమరి ఉండే విధానాన్ని పుష్పరచన అంటారు. పుష్పరచన ఈ కింది రకాలుగా ఉంటుంది.
పుష్పరచన రకం మొక్క
1. కవాటయుత (Vavate) పుష్పరచన జిల్లేడు (Calotropis)
2.మెలితిరిగిన (Twisted) పుష్పరచన మందార, పత్తి, బెండ
3.చిక్కైన (Imbric ate) పుష్పరచన తంగేడు, గుల్ మొహర్
4. వెక్సిల్లరీ/ పాపిలియోనేషియస్ పుష్పరచన బఠాని, చిక్కుడు
మాదిరి ప్రశ్నలు
1. మొక్కలకు సంబంధించి ఫలదీకరణం అనంతరం ఏం జరుగుతుంది? (4)
1) అండాశయం ఫలంగా మారుతుంది
2) అండాలు విత్తనాలుగా మారుతాయి
3) సంయుక్త బీజం పిండంగా మారుతుంది 4) పైవన్నీ
2. స్వపరాగ సంపర్కం/ఆత్మపరాగ సంపర్కం వేటిలో జరుగుతుంది? (4)
1) గోధుమ 2) పీ నట్
3) నేరేడు 4) పైవన్నీ
3. అక్షీయ అండన్యాసం (Axile placen tation) కలిగిన మొక్క ఏది? (1)
1) టమాటా 2) డయాంథిస్
3) బంతి 4) బఠానీ
4. పరాగ రేణువుల అధ్యయనం? (2)
1) పేలియెంటాలజీ 2) పేలినాలజీ
3) పేలిమ్నియాలజీ 4) పేలియో బాటనీ
5. ఏకలింగక పుష్పాలు కలిగిన మొక్క ఏది? (4)
1) దోస 2) సొర
3) కాకర 4) పైవన్నీ
6. అతిపెద్ద పుష్ప విన్యాసంగల మొక్క ఏది? (1)
1) అమర్ఫోపాలస్ టైటానం
2) క్యాబేజీ
3) రఫ్లీషియా ఆర్నాల్డె
4) ఉల్ఫియా అంగుస్టా
7. బలింగాశ్రయ స్థితి (Polygamous condition) ఏ మొక్కల్లో కనబడుతుంది? (1)
1) మామిడి 2) తాటి
3) బొప్పాయి 4) కొబ్బరి
8. సంపూర్ణ పుష్పం కలిగిన మొక్క ఏది? (1)
1) ఉమ్మెత్త 2) బొప్పాయి
3) కాకర 4) దోస
9. కింది పరాగసంపర్క రకాలు, కారకాలను జతపర్చండి. (2)
ఎ. ఎంటమోఫిలి 1. నీరు
బి. జూఫిలి 2. గాలి
సి. హైడ్రోఫిలి 3. కీటకాలు
డి. ఎనిమోఫిలీ 4. జంతువులు
1) ఎ-2, బి-1, సి-4, డి-3
2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-4, బి-3, సి-2, డి-1
డాక్టర్ మోదాల మల్లేష్
విషయ నిపుణులు
పాలెం, నకిరేకల్, నల్లగొండ
9989535675
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?