హైదరాబాద్‌లో ఉర్దూ అధికార భాషగా ఎప్పుడు మారింది? (తెలంగాణ చరిత్ర)
సాలార్జంగ్ సంస్కరణలు
రవాణా సంస్కరణలు
# బ్రిటీష్ పరిపాలనలో దేశంలోని ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ముగ్దుడైన మొదటి సాలార్జంగ్ రవాణా సంస్కరణల్ని హైదరాబాద్ రాజ్యంలో కల్పించాలని నిర్ణయించాడు.
# టెలిగ్రాఫ్ వ్యవస్థ ఏర్పాటు: క్రీ. శ 1856-57లో హైదరాబాద్-బొంబాయిని కలుపుతూ కర్నూల్ మీదుగా టెలిగ్రాఫ్ రవాణాను ఏర్పాటు చేశాడు.
#పోస్టల్ వ్యవస్థ ఏర్పాటు: క్రీ.శ 1862లో హైదరాబాద్‌లో పోస్టల్ వ్యవస్థను స్థాపించాడు.
# రైలు మార్గం: బ్రిటీష్ వారు క్రీ.శ 1868లో నిజాం రాజ్యం ద్వారా మద్రాసు-బొంబాయి రైలు మార్గం వేస్తే, దానికి సాలార్జంగ్ సహకరించాడు. ఈ మార్గాన్ని వాడి, గుల్బర్గాలను కలుపుతూ నిర్మించాడు.
# రోడ్డుమార్గం: హైదరాబాద్-షోలాపూర్ రోడ్డును నిర్మించాడు. రోడ్ల నిర్మాణానికి పబ్లిక్ వర్క్ డిపార్ట్ మెంట్‌ను స్థాపించాడు.
రవాణా సంస్కరణలు- ఫలితాలు
#రవాణా సంస్కరణలతో వర్తక, వాణిజ్య సంబంధాలు అభివృద్ధి చెందాయి. హైదరాబాద్ రాజ్యానికి మిగిలిన ప్రాంతాల్లో రవాణా మార్గాలు ఏర్పడి, ఆర్థిక సంబంధాలు బలపడ్డాయి.
పోలీసు సంస్కరణలు
# హైదరాబాద్ సంస్థానంలో ప్రజలకు రక్షణ కల్పించి, శాంతిభద్రతల్ని పరిరక్షించడానికి మొదటి సాలార్జంగ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. దీనికోసం పోలీసు వ్యవస్థను పటిష్టం చేశాడు.
# క్రీ.శ 1865 వరకు హైదరాబాద్ సంస్థానంలో పోలీసు విధానం అమలుకాలేదు. వంశ పారంపర్యంగా వచ్చే గ్రామ, కాపలాదార్ల వ్యవస్థ తెలంగాణ ప్రాంతంలో ఉండేది. ఔరంగాబాద్, హైదరాబాద్‌లో కొత్వాల్ (పోలీసు కమిషనర్లు) అనే అధికారులుండేవారు.
# మహాకాయ- ఇ- కొత్వాలీ: ఇది పోలీస్ డిపార్ట్ మెంట్. దీన్ని మొదటి సాలార్జంగ్ స్థాపించాడు.
# నిజామత్: ఇది పోలీస్ దళం. పోలీస్ దళాన్ని నిజాం ఈ విధంగా వ్యవహరించాడు.
# మహతామీన్ : ఇతడే పోలీస్ సూపరింటెండెంట్.
competitive exams, tspsc, groups
# ప్రతి జిల్లాకు ఒక పోలీస్ సూపరింటెండెంట్‌ను నియమించాడు.ఇతనికి సహకరించేందుకు సబ్- ఇన్స్పెక్టర్లు- హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను నియమించాడు.
# కీలు: పోలీస్ స్టేషన్లను కీలంటారు.
# క్రీ.శ. 1867లో పోలీస్, రెవెన్యూ శాఖల్ని వేరు చేశాడు.
విద్యా సంస్కరణలు
# రాజ్యపరిపాలనను సజావుగా నడిపేందుకు విద్యావంతులు అవసరమని మొదటి సాలార్జంగ్ గుర్తించాడు. సుశిక్షితులైన ఉద్యోగుల్ని నియమించేందుకు విద్యావిధానంలో మార్పులు చేశాడు
#ఆధునిక వైద్య పాఠశాల: క్రీ.శ 1846లో సర్జన్ బ్రిటీష్ రెసిడెంట్ ప్రోత్సాహంతో హైదరాబాద్‌లో ఆధునిక వైద్య పాఠశాలను స్థాపించాడు.
# జిల్లా, తాలూకా కేంద్రాల్లో పాఠశాలలు: క్రీ.శ. 1860లో జిల్లా, తాలూకా కేంద్రాల్లో ఒక్కొక్క పాఠశాలను స్థాపించాడు.
#దార్-ఉల్-ఉలూమ్ ఉన్నత పాఠశాల: క్రీ.శ. 1865 లో దీన్ని స్థాపించాడు. ఈ పాఠశాలలో ఆంగ్లం, ఉర్దూ, పర్షియన్ భాషల్లో విద్యాబోధన జరిగింది. ఈ పాఠశాల స్థాపనతో పాశ్చాత్య విద్యాబోధన ప్రారంభమైంది.
# సిటీ హైస్కూల్: క్రీ.శ. 1870లో నగర ఉన్నత పాఠశాల (సిటీ హైస్కూల్) స్థాపించాడు.
# చాదర్‌ఘాట్ స్కూల్: క్రీ.శ. 1872లో దీన్ని స్థాపించాడు.
# ఇంజినీరింగ్ కళాశాల స్థాపన: ప్రజాపనుల శాఖకు కావాల్సిన సిబ్బంది కోసం ఇంజినీరింగ్ కళాశాలను స్థాపించి శిక్షణ ఇచ్చారు.
# మదర్సా- ఇ- ఆలియా: క్రీ.శ. 1873లో నవాబుల పిల్లల చదువు కోసం దీన్ని స్థాపించాడు.
# మదర్సా- ఇ-ఐజా: క్రీ.శ. 1878లో ‘మదర్సా-ఇ-ఐజా’ (రాజకుటుంబంలోని పిల్లలకోసం)ను ప్రారంభించాడు.
సాలార్జంగ్-I కాలంలో హైదరాబాద్ రాజ్యంలో 162 పాఠశాలలు (ఉర్దూ, పర్షియన్, ఆంగ్లం, స్థానిక భాషలు) స్థాపించబడ్డాయి.
#నిజాం కాలేజీ ఏర్పాటు: సాలార్జంగ్ మరణానంతరం 1887లో చాదర్‌ఘాట్ హై స్కూల్లోని ఇంటర్మీడియట్ తరగతులను మదర్సా-ఇ- ఆలియాలో విలీనం చేసి ‘నిజాం కళాశాల’ను ఏర్పాటు చేశాడు.
# అలీఘడ్ విద్యాసంస్థకు సహాయం: అలీఘడ్‌లో సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్ స్థాపించిన ‘అలీఘడ్ విద్యాసంస్థకు’ సాలార్జంగ్ ధన సహాయం చేశాడు.
# గ్లోరియో గర్ల్ హై స్కూల్: క్రీ.శ. 1881లో స్థాపించాడు. ఇది హైదరాబాద్‌లో బాలికల మొదటి పాఠశాల.
స్థానికేతరుల్ని దిగుమతి చేసుకునేందుకు, ప్ర భుత్వ పరిపాలనా సామర్థ్యం పెంచేందుకు నిజాం సంస్థానంలో తెలివితేటలు గల వ్యక్తుల్ని నియమించాడు. అయితే వీరిని దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చారు. అంటే స్థానికేతరుల్ని దిగుమతి చేసుకున్నాడు. వీరిలో ముఖ్యలు…
#సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామి
# మోహిద్హు స్సేన్
# సయ్యద్ మోహిది అలీ
# ముల్లా అబ్దుల్ ఖయ్యూం
# మోయిన్- ఉల్- ముల్క్
ఇతర సంస్కరణలు
పారిశ్రామిక వస్తు ప్రదర్శన ఏర్పాటు
# క్రీ.శ 1856లో మొదటిసారిగా పారిశ్రామిక వస్తు ప్రదర్శన ఏర్పాటు చేశాడు
# హైదరాబాద్ రాజ్యంలో సతీసహగమనాన్ని నిషేధించాడు.
#ఉర్దూను రాజభాషగా ప్రకటించాడు.
# బీరార్ విషయంలో మొదటి సాలార్జంగ్ ఇంగ్లండ్‌కు వెళ్లి నాటి విక్టోరియా మహారాణితో చర్చించాడు.
సాలార్జంగ్ సంస్కరణలు- ఫలితాలు
# మొదటి సాలార్జంగ్ తన దూర దృష్టితో చేసిన ఆర్థిక, రెవెన్యూ, పోలీస్, విద్య, న్యాయ సంస్కరణలు హైదరాబాద్ రాజ్యంలో పరిపాలనా మార్పులకు కారణమయ్యాయి. తత్ఫలితంగా పరిపాలనా రంగం సంస్కరించబడి క్రమబద్ధీకరించబడింది. సాలార్జంగ్ ప్రవేశపెట్టిన సంస్కరణలతో ముఖ్యంగా విద్యా సంబంధమైన సంస్కరణలతో హైదరాబాద్ సంస్థానంలో విద్యావంతులు, మేధావులు తయారయ్యారనేది చారిత్రక సత్యం. వీరి తర్వాతి కాలంలోనే సంస్థానంలో స్వాతంత్య్రసమరం చేశారు. అదే విధంగా రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక మొదలైన రంగాల్లో కూడా ప్రభావం చూపాడు.
# ప్రభుత్వ పరిపాలనా సామర్థ్యం పెంచేందుకు అనేక మంది స్థానికేతరుల్ని ప్రభుత్వోద్యోగాల్లో నియమించాడు. తత్ఫలితంగా స్థానికులకు, స్థానికేతరులకు మ ధ్య అనేక వివాదాలు తలెత్తినాయి. ఇవే తర్వాతి కాలంలో స్థానికులు ముల్కీ ఉద్యమం చేయడానికి మార్గాన్ని సుగమం చేశాయి.
మొదటి సాలార్జంగ్ ఘనత
# చిన్న వయస్సులోనే ప్రధానమంత్రి అయిన మొదటి సాలార్జంగ్ తన మేధోశక్తితో, ఇతర విద్యావేత్తల సహకారంతో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టి, హైదరాబాద్ సంస్థాన ఆధునీకరణకు కృషి చేశాడు.
# 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో బ్రిటీష్వారికి మద్దతుపలికి వారి నుంచి హైదరాబాద్ సంస్థానానికి ప్రయోజనాలను కలిగించాడు. క్రీ.శ. 1876లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం గౌరవ బిరుదునిచ్చి మొదటి సాలార్జంగ్ను గౌరవించింది. 1883లో కలరా వ్యాధి తో మొదటి సాలార్జంగ్ మరణించాడు.
మీర్ మహబూబ్ అలీఖాన్ (1869-1911)
# అఫ్జల్-ఉద్-దౌలా క్రీ.శ. 1869లో మరణించాడు. అతని మరణానంతరం అఫ్జల్ ఉద్-దౌలా కుమారుడైన మూడేండ్ల మహబూబ్‌అలీఖాన్ అధికారపగ్గాలను చేపట్టాడు. ఇతడినే ఆరో నిజాం అంటారు.
# జననం: 1866, ఆగస్టు 17న జన్మించాడు.
# సంరక్షకులు: దివాన్ సాలార్జంగ్-I, నవాబు రషీద్ ఉద్దీన్ ఖాన్ (మూడో షమ్స్-ఉల్-ఉమ్రా)లు సంరక్షకులుగా వ్యవహరించారు.
# ప్రజలు ఇతన్ని పాషా (సర్వజన ప్రేమికుడు) అని పిలిచేవారు.
# నిజాంకు ఆంగ్ల విద్యను కెప్టెన్ జాన్ క్లార్క్ నేర్పించాడు.
సంయుక్త పాలకులు
# మహబూబ్ అలీఖాన్ కాలంలో క్రీ.శ. 1869 నుంచి మరణించేవరకు (1883 వరకు) ప్రధానమంత్రిగా మొదటి సాలార్జంగ్ పనిచేశాడు. మొదటి సాలార్జంగ్ ఆకస్మికంగా మరణించడంతో రాజా బహదూర్, మీర్ లాయక్ అలీ సంయుక్త పాలకులుగా రాజ్య పాలన నడిపించారు. వీరు చిన్న వయస్సులో ఉన్న ఆరో నిజాంకు పరిపాలనలో సహకరించారు.
# క్రీ.శ. 1877లో ఢిల్లీలో జరిగిన బ్రిటీష్ దర్బారును సాలార్ జంగ్‌తో కలిసి ఆరో నిజాం సందర్శించాడు.
రాజుగా మహబూబ్ అలీఖాన్
# 1884 నాటికి ఆరో నిజాంకు 18 ఏండ్లు వచ్చాయి. దీంతో నాటి బ్రిటీష్ ఇండియా వైస్రాయ్ లార్డ్ రిప్పన్ హైదరాబాద్‌కు వచ్చాడు. ఈ సందర్భంగా 1884, ఫిబ్రవరి 5న ‘మొహల్లా ప్యాలెస్’లో ఆరో నిజాంకు హైదరాబాద్ సంస్థానం పూర్తి పాలనాధికారాలను లార్డ్ రిప్పన్ అప్పగించాడు.
గమనిక: నిజాం రా జ్యాన్ని సందర్శించిన మొదటి వైస్రాయ్ లార్డ్ రిప్పన్.
దివాన్‌గా రెండో సాలార్జంగ్
# రెండో సాలార్జంగ్ అసలు పేరు మీర్ లాయక్ అలీ. ఇతని తండ్రి సాలార్జంగ్. లాయక్ అలీకి ఆరో నిజాం రెండో సాలార్ జంగ్ అని బిరుదు ఇచ్చాడు. తన తండ్రి ప్రారంభించిన సంస్కరణలను ముందుకు తీసుకుపోవడానికి రెండో సాలార్జంగ్ కృషి చేశాడు.
#ఇతడి కాలంలోనే పర్షియన్ భాష స్థానంలో ఉర్దూను (1884)రాజభాషగా ప్రకటించి, అమలు చేశాడు.
ముల్కీ, నాన్ ముల్కీ వివాదం
#ముల్కీ (స్థానికులు)ల ఒత్తిడి మేరకు అప్పటిదాకా ప్రభుత్వం నియమించిన అధికారుల సివిల్ లిస్టును తయారు చేశాడు సాలార్జంగ్. దానిని అప్పటి ప్రభుత్వానికి సమర్పించాడు.
# ఈ సివిల్ లిస్ట్ ప్రకారం నాటివరకు ప్రభుత్వంలో నియమించబడిన ముల్కీలు, నాన్ ముల్కీల వివరాలు..
ప్రాంతాల పేర్లు ఉద్యోగులు శాతాల్లో జీతంలోశాతం
హైదరాబాదీయులు 246 52 42
స్థానికేతరులు 230 (మొత్తం 476) 48 58
ఉత్తర భారతీయులు
(హిందుస్థానీలు) 97 20 24
మద్రాసీయులు 66 14 11
బొంబాయి వాసులు 36 8 8
యూరప్ వాసులు 24 5 13
ఇతరులు 7 1 1
# దీనిని గమనిస్తే 476 మంది సివిల్ అధికారుల్లో కేవలం 52 శాతం మాత్రమే ముల్కీలు (అంటే స్థానికులు) మొత్తం జీతంలో వారి శాతం 42. కాగా 48 శాతం నాన్ ముల్కీ (స్థానికేతరులు)లు తీసుకునే జీతం 58. 5 శాతం ఉన్న ఐరోపా ఉద్యోగులు 13 శాతం జీతం తీసుకుంటున్నారు. పై పట్టిక నిజాం ప్రభుత్వ సివిల్ అధికారుల లిస్టు 1886 ఆధారంగా ఇచ్చారు.
ముల్కీ-నాన్ ముల్కీ నిబంధనలు
# నాన్ ముల్కీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించే నిమిత్తమే ముల్కీ-నాన్‌ముల్కీ నిబంధనలు జారీచేసింది. ఈ నిబంధనల ప్రకారం
#15 ఏండ్లు హైదరాబాద్‌లో నివాసం ఉండాలి.
# 12 ఏండ్లు ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నవారు, వారి వారసులు ముల్కీలు
# నాన్ ముల్కీలు హైదరాబాద్‌లో ఉద్యోగంలో చేరాలంటే ప్రభుత్వ అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. (అలా చదువుకున్న వ్యక్తి హైదరాబాద్‌లో లేరని, అలాంటి ఉద్యోగి అవసరమని లోకల్ సర్టిఫికెట్ పొందాలనే నియమం) అయితే ఈ నియమం ఉన్నప్పటికీ, లోపభూయిష్టమైన నిబంధనల వల్ల అవి సరిగా అమలు కాలేదు. ఫలితంగా ముల్కీల్లో (స్థానికుల్లో) అసంతృప్తి పెరిగింది.
గమనిక: ముల్కీ అంటే స్థానికుడు,నాన్ ముల్కీ-స్థానికేతరుడు.
పదవిని త్యజించిన సాలార్ జంగ్
# రెండో సాలార్జంగ్ నిజాంకు ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చేవాడుకాదు. నిజాంతో అనేకసార్లు అమర్యదగా వ్యవహరించాడు. దీంతో ఆరో నిజాం, దివాన్ల మధ్య రోజు రోజుకీ సంబంధాలు క్షీణించగా, దివాన్ తన పదవిని క్రీ.శ. 1887లో త్యజించాడు.
మధుసూదన్ బోయిన
నారాయణ ఐఏఎస్ అకాడమీ
హైదరాబాద్.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు