బింబిసారుడు స్థాపించిన రాజ్యం పేరేమిటీ?
-ఆర్యులు మధ్య ఆసియా వాసులని బలపరుస్తున్న శాసనాలు?
# సిరియాలో లభించిన కాసైట్, ఇరాన్లో లభించిన మీటని శాసనాలు, ఆప్ఘనిస్థాన్‌లో లభించిన బోగజ్‌కోయి శాసనం
ప్రపంచ సాహిత్యంలో అత్యంత ప్రాచీన మత గ్రంథం?
#రుగ్వేదం. దీనినే ఆదిగ్రంథం అనికూడా పిలుస్తారు.
-ధ్యానం, శారీరక వ్యాయామం ద్వారా మోక్షం సాధించవచ్చని పేర్కొన్న దర్శనం ఏది?
# యోగశాస్త్రం-పతంజలి
-రుగ్వేద కాలంలో పచ్చిక మైదానాలపై పనిచేసే అధికారిని ఏమంటారు?
# వజ్రపతి
-మలివేద కాలంలో సంగ్రహిత్రి అంటే ఎవరు?
#కోశాధికారి (సంధివిగ్రహ- విదేశీ వ్యవహారాల మంత్రి)
-రుగ్వేద కాలంలో నిష్క అనేది ఏమిటి?
# బంగారు ఆభరణం (మలివేదకాలంలో నాణేంగా మారింది)
-గోత్ర అనేపదం గల వేదం?
# అధర్వణ వేదం
-వృత్స్యస్థ్యోమ క్రతువు అంటే ఏమిటి?
#ఆర్యులు కానివారిని ఆర్యులుగా మార్చుకునే క్రతువు
– మహాజన పదాలు వాటి సరిహద్దులు ఏవి ?
#ఉత్తరాన-కాంభోజ, దక్షిణాన-అస్మక, పడమర-అవంతి, తూర్పు-అంగ
– సైన్యంలో గజదళం ఎక్కువగా ఉన్న జనపదం ?
# మగధ జనపదం (ఈ ప్రాంతంలో ఏనుగులు ఎక్కువగా లభించడం వల్ల) మగధ సైన్యంలో గజదళం ఎక్కువగా ఉండేది.
– మహాశిలా కంటక, రధముసల అనేవి ఏమిటి ?
# అజాత శత్రువు సైన్యంలోని ప్రత్యేక ఆయుధాలు
(బరువైన రాళ్లను విసిరే యంత్రం మహాశిల కంఠక, వేగంగా బాణాలు విసిరే యంత్రం రథముసల. వీటిని బాహుబలి సినిమాలో యుద్ధ సన్నివేశంలో చూపించారు)
-శిశునాగ వంశంలో చివరివాడు ?
# కాకవర్థిన్
-ఏ రాజు కాలంలో భారతదేశం మొట్టమొదటిసారిగా సామ్రాజ్యంగా అవతరించింది ?
# మహాపద్మనందుడి కాలంలో. ఇతను నందవంశ స్థాపకుడు, ఇతనికి ఏకరాట్ అను బిరుదు కలదు.
-మొదటి జైన పరిషత్తు ఎక్కడ జరిగింది, ఎవరు అధ్యక్షత వహించారు?
#క్రీ.పూ. 300 పాటలీపుత్రంలో స్థూలభద్ర అధ్యక్షత వహించాడు.
-12 ఉపాంగాలు ఏ భాషలో రాయబడినవి ?
# అర్ధమాగధి భాషలో
-భద్రబాహు రచించిన గ్రంథం ?
#జైనకల్ప సూత్రాలు
– మొదటి బౌద్ధ సంగీతిలో రచించిన పీఠకాలు ఏవేవి ?
# సుత్తపీఠకం (ఆనందుడు), వినయపీఠకం (ఉపాలి)
-తత్వవిచారం, తార్కితకు ప్రాధాన్యత ఇచ్చిన బౌద్ధమత శాఖ ?
# హీనయానం (బుద్ధుడు బోధించినది)
– సత్యమేవ జయతే అనే ధర్మోక్తి ఏ ఉపనిషత్తులో ఉంది ?
# ముండకోపనిషత్తు
– భారతదేశంలో బానిస వ్యవస్థ ఏకాలం నుంచి ఉంది?
# రుగ్వేదకాలం నుంచి
-వేదకాలంలో జరిగిన దశరాజు యుద్ధానికి కారణం?
#పశుగణాలపై ఆధిపత్యం కోసం
-మలివేద కాలంలో ప్రసిద్ధి పొందిన రచయిత్రులు ఎవరు ?
#గార్గి, అపాల, లోపముద్ర, మైత్రేయ, విశ్వవర
-హర్యాంక రాజ్యస్థాపకుడు ఎవరు ?
# బింబిసారుడు
-16 జనపదాల గురించి తెలిపే గ్రంథం ఏది ?
#అంగుట్టరనికాయ, ఇది బౌద్ధమత గ్రంథం
-దక్షిణాపథంలో ఉన్న ఏకైక జనపదం ఏది ?
# అస్మక దీని రాజధాని-పూతన (నేటి నిజామాబాద్ జిల్లాలోని బోధన్)
-హర్యాంక వంశంలో గొప్పవాడు ?
#అజాతశత్రువు
-పాటలీపుత్రాన్ని నగరంగా తీర్చిదిద్దిన రాజధానిగా ఏలినవాడు ?
# ఉదయనుడు (పాటలీ గ్రామాన్ని అజాతశత్రువు నిర్మించాడు)
-పాటలీపుత్రాన్ని జలదుర్గం అని ఎందుకు అంటారు ?
#పాటలీపుత్రం గంగ, శోణ (సోన్), సరయూ, గండకి నదులు, సంగమస్థానంలో ఉంది కనుక జలదుర్గంగా పేర్కొన్నారు.
– శిశునాగ వంశం కాలంలో రాజధాని ?
#వైశాలి (ఇది వజ్జి జపదానికి రాజధాని నగరం)
– మహీష్మతి నగరం ఏ జనపదానికి రాజధాని ?
# అవంతి జనపదానికి దక్షిణ రాజధాని (ఉత్తరాన ఉన్న మరో రాజధాని ఉజ్జయిని)
– 16 మహాజనపదాల్లో లేని రాజ్యాలు/ప్రాంతాలు ఏవి ?
# వంగ (బెంగాల్), కళింగ (ఒడిశా) రాజ్యాలు లేవు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు