సతతం హరితం
అడవులను ఆంగ్లంలో ‘ఫారెస్ట్’ అని పిలుస్తారు. ఇది లాటిన్ భాషా పదం ఫారిస్ (Foris) నుంచి ఏర్పడింది. లాటిన్ భాషలో ఈ పదానికి అర్థం ‘గ్రామ సరిహద్దు వెలుపలి ప్రాంతం’ అని అర్థం. అడవులను సాధారణంగా ‘మానవ ప్రభావానికి లోనుకాని సహజ వృక్షప్రాంతం’గా నిర్వచించవచ్చు. అడవులు పునర్వినియోగిత వనరులు. ఇవి దేశ ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తాయి. కాబట్టి అడవులను ‘జాతీయ సంపద’గా పేర్కొంటారు.
అడవులు-ఉపయోగాలు
-అడవులు మానవ మనుగడకు చాలా ఉపయోగమైనవి. ఇవి మనకు వంట చెరుకు, వనమూలికలు, సహజసిద్ధమైన రంగులను, భవన, గృహోపకరణ వస్తువులకు, పేపర్ తయారీలో కావాల్సిన కలపను అందించడమేగాక నేలల భూసార పరిరక్షణకు, వర్షాలు కురిసేందుకు, వరదలను అరికట్టేందుకు, కాలుష్యనివారణకు ఎంతో దోహదం చేస్తున్నాయి. కానీ ఇలాంటి వనరులు ఉండాల్సిన నిష్పత్తిలో లేకపోవడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి.
-సహజ వనరుల నిర్వహణ, పరిరక్షణ అనేవి దేశ, రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధిలో కీలకమైనది. ప్రభుత్వం పర్యావరణ డిపార్ట్మెంట్, అడవులు, శాస్త్రసాంకేతిక (EF S&T) వ్యవస్థల ద్వారా రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తున్నాయి.
– తెలంగాణ రాష్ట్ర కాలుష్య బోర్డు (టీపీసీబీ) వాయు, నీటి, ధ్వని కాలుష్యాన్ని నియంత్రించడానికి పర్యావరణ చట్టాలను అమలు చేస్తున్నది. దీనిలో వ్యర్థపదార్థాల నిర్వహణ, కాలుష్యాన్ని అరికట్టడానికి అనేక చర్యలు చేపడుతున్నాయి.
-రాష్ట్రంలో గొప్ప జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వం 12 సంరక్షణ ప్రాంతాలను వెల్లడించింది.(తొమ్మిది వన్యసంరక్షణ కేంద్రాలు, మూడు జాతీయ పార్కులు) వీటిని రెండు ఏజెన్సీలు-తెలంగాణ రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డు& తెలంగాణ జీవ వైవిధ్య సంరక్షణ సొసైటీలు నిర్వహిస్తున్నాయి.
– భారత రాజ్యాంగం ఆర్టికల్ 48A ద్వారా అన్ని స్థాయిల్లోని ప్రభుత్వాలను ‘పర్యావరణాన్ని రక్షించడానికి, మెరుగుపర్చడానికి, దేశంలోని అడవులు, వన్యప్రాణులను రక్షించడానికి కృషిచేయాలని నిర్దేశిస్తుంది. ఆర్టికల్ 51A (g) ప్రతి పౌరునిపై ‘అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో సహా సహజ పర్యావరణాన్ని రక్షించడం, మెరుగపర్చడం, జీవుల పట్ల కరుణ కలిగిఉండటం’ విధిగా సూచిస్తుంది.
– రాష్ట్రంలో అడవులను మూడు గ్రూపులుగా వర్గీకరించారు.
1. అయనరేఖా, పొడి రుతుపవన (ఆకురాల్చు) అరణ్యాలు
– దక్షిణ, మిశ్రమ, పొడి, ఆకురాల్చే అడవులు
– పొడి రుతుపవన ఆకురాల్చే పొదలు
-పొడి టేకు అడవులు
-ద్వితీయశ్రేణి పొడి ఆకురాల్చే అడవులు
-పొడి వెదురు అడవులు
-హార్డ్వికియా అడవులు
– బోస్విల్లె అడవులు
– పొడి సవన్నా అడవులు
-పొడి గడ్డి భూములు
2. అయనరేఖా ముళ్ల అడవులు
-దక్షిణ ముళ్లపొదలు
– దక్షిణ ముళ్ల అడవులు
3. అయనరేఖా ఆర్థ ఆకురాల్చు రుతుపవన అరణ్యాలు
-దక్షిణ ఆర్థ మిశ్రమ ఆకురాల్చే రుతుపవన అరణ్యాలు
– అడవుల్లో లభించే ముఖ్య ఉత్పత్తులు, వాటి ఉపయోగం
– తునికాకు- బీడీల తయారీ
-తంగేడు – తోళ్ల శుభ్రత
-పునికి- కొయ్యబొమ్మల తయారీ
– రూసా గడ్డి- సుగంధ ద్రవ్యాల తయారీ
– కుష్కుష్ గడ్డి- కూలర్లను చల్లబరిచే సాధనం
– సబాయి గడ్డి- పేపరు తయారీ
-రోజ్ఉడ్- రైల్వే స్లీపర్స్ తయారీ
అటవీ ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన జిల్లాలు
టేకు- గోదావరి పరీవాహక జిల్లాలైన నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం.
వెదురు– ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్.
రూసాగడ్డి- నిజామాబాద్, కామారెడ్డి.
బీడి ఆకు- ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, కుమ్రంభీం అసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు.
తెలంగాణ రాష్ట్రంలోని అటవీ విస్తీర్ణం 26,669.54 చ.కి.మీ. ఇది రాష్ట్ర భౌగోళిక వైశాల్యంలో 24% ఆక్రమిస్తుంది. ఇది జాతీయ సరాసరి 21.3 శాతం కంటే ఎక్కువ. రాష్ట్రంలో 33 శాతం అడవుల విస్తరణకు ప్రభుత్వం చొరవ తీసుకుంటూ అనేక పథకాలను రూపొందించి అమలుచేస్తున్నది.
– రాష్ట్రంలోని మొత్తం అటవీ విస్తీర్ణంలో 50శాతం కంటే ఎక్కువ విస్తీర్ణాన్ని ఐదు జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నాగర్‌కర్నూ ల్, కుమ్రం భీం, మంచిర్యాల కలిగి ఉన్నాయి. రాష్ట్ర మొత్తం అటవీ విస్తీర్ణంలో 16 శాతం విస్తీర్ణాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలిగిఉంది.
-తెలంగాణ రాష్ట్రం గర్వించదగ్గ వృక్ష, జంతుజాలాలతో పర్యావరణం పరంగా గొప్ప వైవిధ్యాన్ని కలిగి ఉంది. ఇందులో 2,939 వృక్షజాతులు, 365 పక్షిజాతులు, 103క్షీరద జాతులు, 28 సరీసృపాల జాతులు పెద్దసంఖ్యలో అకశేరుక జాతులు ఉన్నాయి.
తెలంగాణకు హరితహారం
-రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ సంరక్షణ కోసం ప్రధానమైన తెలంగాణకు హరితహారం (Greenland for Telangana) కార్యక్రమాన్ని 2015-16లో ప్రారంభించింది. రాష్ట్రంలోని మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో చెట్లను 24 నుంచి 33 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో పాటు ప్రాజెక్ట్ టైగర్, పట్టణ అడవుల ప్రత్యేక భాగాలను ఏర్పాటు చేయడం జరిగింది.
-1952 జాతీయ అటవీ విధానం ప్రకారం మొత్తం భూభాగంలో 33శాతం అటవీ ప్రాంతం ఉండాలి.
-తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అటవీ విస్తీర్ణం 26,999 చ.కి.మీ. భౌగోళిక విస్తీర్ణంలో 24శాతంగా ఉంది.
– 2020-21 AE స్థిర ధరల్లో రాష్ట్రస్థూల సమకూరిన విలువ (జీవీఏ)లో అడవుల కలప పరంగా 0.3 శాతం వాటా కలిగి ఉన్నాయి.
— 2020-21 రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో అడవులు, కలప రంగం వృద్ధిరేటు 2.7 శాతం.
l–2020-21 రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో స్థిర ధరల్లో (ముందస్తు అంచనాల ప్రకారం) అటవీ- రూ. 1.885 కోట్లు
l రాష్ట్రంలో అత్యధిక (మొత్తం అటవీ విస్తీర్ణం)అడవులు విస్తరించిన జిల్లాలు వరుసగా…
1. భద్రాద్రి కొత్తగూడెం (16శాతం) 4,31,252 హెక్టార్లు
2. ములుగు (11శాతం) 3, 00,580 హెక్టార్లు
3. నాగర్ కర్నూల్ (9.25శాతం) 2,49,668 హెక్టార్లు
4. కుమ్రం భీం ఆసిఫాబాద్ 2, 44, 540 హెక్టార్లు
5. మంచిర్యాల 1, 76, 473 హెక్టార్లు
జిల్లాల్లోని మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో ఉన్న అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లాలు
జిల్లా మొత్తం భౌగోళిక విస్తీర్ణం
1.ములుగు 71.81శాతం
2. భద్రాద్రి కొత్తగూడెం 60.95శాతం
3. కుమ్రంభీం ఆసిఫాబాద్ 54.41శాతం
అత్యల్ప అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లాలు
హైదరాబాద్ 1.43 చ.కి.మీ
కరీంనగర్ 3.47 చ.కి.మీ
జోగులాంబ గద్వాల 6.79 చ.కి.మీ
వరంగల్ అర్బన్ 28. 76 చ.కి.మీ
తెలంగాణకు హరితహారం కింద నాటిన మొక్కలు (2020-21)
వివరణ మొక్కల సంఖ్య (లక్షల్లో)
అడవుల లోపల (కృత్రిమ పునరుత్పత్తి ద్వారా) 205.4
అడవుల లోపల (పునరుద్ధరణ ద్వారా) 615.0
అడవుల వెలుపల 1,980.1
జీహెచ్ఎంసీ 211.9
హెచ్ఎండీఏ 333.8
మొత్తం 3,346.2
ప్రాక్టీస్ బిట్స్
1. తెలంగాణలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అడవులు ఏవి?(1)
1) నల్లమల అడవులు
2) శేషాచలం అడవులు
3) నీలగిరి అడవులు
4) విక్టోరియా అడవులు
2. కింది వాటిలో అటవీ పరిధిలోకి వచ్చేవి ఏమిటి?(4)
1) చెట్ల సాంద్రత, ఎత్తు
2) భూవినియోగం
3) పర్యావరణ సౌకర్యాలు
4) పైవన్నీ
3. భూమధ్యరేఖ వద్ద ఉండే అడవులు ఏమిటి?(2)
1) శీతోష్ణ అడవులు
2) ఉప శీతోష్ణ అడవులు
3) సమ శీతోష్ణ అడవులు
4) ఉష్ణమండల అడవులు
4. మధ్య అక్షాంశం వద్ద ఎక్కువగా ఏ అడవులు ఉంటాయి?(3)
1) శీతోష్ణ అడవులు
2) ఉప శీతోష్ణ అడవులు
3) సమ శీతోష్ణ అడవులు
4) ఉష్ణమండల అడవులు
5. అడవులు, భూమి జీవావరణంలోని ప్రాథమిక స్థూల ఉత్పత్తిలో ఎంత శాతం ఆక్రమించాయి?(4)
1) 45 శాతం 2) 55 శాతం
3) 65 శాతం 4) 75 శాతం
6. అడవి అనే పదం ఏ విధంగా వాడుకలో ఉంది?(4)
1) పరిపాలన 2) భూమి వినియోగం
3) భూ వైశాల్యం 4) పైవన్నీ
7. తెలంగాణ ఆర్థికసర్వే 2019-20 ప్రకారం రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం ఎంత?(1)
1) 26,969.48 చ.కి.మీ
2) 28,405.73.చ.కి.మీ
3) 29,726.32చ.కి.మీ
4) 32, 546.14చ.కి.మీ
8. తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అడవులు ఎంత శాతం విస్తరించి ఉన్నాయి? (2)
1) 21.10 శాతం 2) 24.0 శాతం
3) 27.21 శాతం 4) 29.27 శాతం
9. దక్కన్ పీఠభూమిలో ఏ అడవులు ఎక్కువగా ఉన్నాయి?(1)
1) ఆకురాల్చే అడవులు
2) మడ అడవులు
3) ఉష్ణమండల ముళ్లజాతి అడవులు
4) ఆల్ఫైన్ అడవులు
10. దక్కన్ పీఠభూమిలో అడవుల విస్తీర్ణం తగ్గడానికి కారణం ఏమిటి?(3)
1) కలప 2) పశువుల మేత 3) 1, 2
4) ప్రాజెక్టుల నిర్మాణం
11. అడవుల ప్రధాన లక్ష్యం ఏమిటి?(1)
1) పచ్చదనం పెంచి జీవనోపాధిని సమగ్రపర్చడం
2) పశువుల మేతకోసం
3) ఆహారం కోసం 4) కలప
12. రాష్ట్రంలోని అడవుల్లో రిజర్వ్ అడవుల విస్తీర్ణం ఎంత?(1)
1) 20,353 చ.కి.మీ
2) 11, 324.31 చ.కి.మీ
3) 21, 024.46 చ.కి.మీ
4) 29,242.10 చ.కి.మీ
13. రాష్ట్రంలోని అటవీశాఖ ఆధ్వర్యంలో గల అడవుల్లో రక్షణ అడవుల విస్తీర్ణం ఎంత?(3)
1) 4,527.01 చ.కి.మీ
2) 6,341.3 చ.కి.మీ
3) 5, 939 చ. కి.మీ
4) 8, 621.41 చ.కి.మీ
14. రాష్ట్ర అటవీశాఖ ఆధ్వర్యంలో ఉన్న వర్గీకరించని అడవుల విస్తీర్ణం ఎంత?(4)
1) 450.2 చ.కి.మీ
2) 550 చ.కి.మీ
3) 650.36 చ.కి.మీ
4) 612 చ.కి.మీ
15.జిగురు శుద్ధికేంద్రం ఏ జిల్లాలో ఉంది?(1)
1) ములుగు
2) నారాయణ్‌పేట
3) హన్మకొండ 4) ఖమ్మం
16. తెలంగాణలోని గడ్డిభూములను ఏమని పిలుస్తారు?(4)
1) పంపాలు 2) స్టెప్పీలు
3) రాంచీలు 4) కంచాస్
17. శివరాం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది?(2)
1) ములుగు 2) మంచిర్యాల
3) నాగర్ కర్నూల్ 4) కరీంనగర్
18. జీవవైవిధ్య వారసత్వకట్టడంగా గుర్తించబడిన అమీన్పూర్ చెరువు ఏ జిల్లాలో ఉంది?(2)
1) హైదరాబాద్ 2) సంగారెడ్డి
3) రంగారెడ్డి 4) వికారాబాద్
19. దేశంలో అటవీ విస్తీర్ణం పరంగా తెలంగాణ రాష్ట్రం ఎన్నవ స్థానంలో ఉంది?(2)
1) 12 2) 13
3) 10 4) 9
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు