సింధు పట్టణాల్లో కోటగోడలేని ఏకైక పట్టణం ఏది?
– ప్రపంచంలో మొట్టమొదట పత్తిని పండించిన వారు?
# సింధువాసులు
#కాల్చిన ఇటుకల పరిశ్రమ, ముద్రికల పరిశ్రమ, పూసల పరిశ్రమ, నౌకా నిర్మాణ పరిశ్రమ
-సింధు ప్రజలకు తెలియని విషయాలు?
# సింధు ప్రజలకు ఇనుము, గుర్రం, చెరుకు పంట గురించి తెలియదు
-పశుపతి ముద్రికలో ఉన్న జంతువులు ఏమిటి?
# ఏనుగు, పులి, దున్నపోతు, ఖడ్గమృగం, మనిషి
-సింధు నాగరికతలో కుమ్మరి చక్రం ఏ పట్టణంలో బయటపడినది?
# హరప్పా పట్టణంలో..
-సింధు పట్టణాల్లో కోటగోడలేని ఏకైక పట్టణం ఏది?
# చాన్హుదారో
-సింధు ప్రజల ఆరాధ్యదైవం ఏమిటి?
# అమ్మతల్లి. సింధు ప్రజలు అమ్మతల్లితోపాటు రావిచెట్టు, మూపురం కలిగిన ఎద్దు, పశుపతి, పావురం, పామును పూజించారు.
-సింధునాగరికత పట్టణాల్లో నౌకాశ్రయంగా ప్రసిద్ధి చెందిన పట్టణం ఏది?
#లోథాల్. దీంతోబాటు సర్కటోడలో కూడా నౌకాకేంద్రం ఉన్న ఆనవాళ్లు బయటపడ్డాయి.
-సింధు ప్రజల లిపి ఏమిటి?
#చిత్రలిపి (బొమ్మల లిపి). దీనినే హిలియోగ్రాఫిక్, పిక్టోగ్రఫిక్ లిపి అని కూడా పిలుస్తారు. దీనిని ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు సర్పలేఖన ఆకారంలో రాస్తారు.
-మానవుడు మొట్టమొదట ఉపయోగించిన లోహం?
# రాగి
-సింధూ నాగరికతలో వరి పండించిన ఆధారాలు ఎక్కడ లభించాయి?
# లోథాల్, రంగాపూర్
-తొలివేద కాలంలో గ్రామ సముదాయాన్ని ఏమనేవారు?
# విస్ అని పిలిచారు
-ప్రసిద్ధి చెందిన గాయత్రీ మంత్రం ఎందులో ఉంది?
# రుగ్వేదం. దీనిని రాసినది విశ్వామిత్రుడు.
-ఆర్యుల కాలానికి సంబంధించిన ఆధారాలేవి?
# వేదాలు
-రుగ్వేద కాలంలో తెగనాయకుడిని ఏమనేవారు?
#రాజన్
-యాగాల సమయంలో పాటించాల్సిన నియమాలు ఏ వేదంలో ఉన్నాయి?
# యజుర్వేదం
-రుగ్వేద కాలంలో తెగలోని ప్రజలందరూ సభ్యులుగా ఉన్న సమూహం ఏది?
# సమితి. సభలోని సభ్యులు గ్రామంలోని పెద్దలు
-రుగ్వేద కాలంలో ప్రధాన దేవతలు ?
# పురంధరుడు (ఇంద్రుడు). రెండో దేవత అగ్ని. మూడో దేవత వరుణుడు.
-రుగ్వేద కాలంలో ప్రజలు స్వచ్ఛందంగా రాజుకు సమర్పించే పన్ను?
# బలి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు