ఫాసియో అనే పదానికి అర్థం ఏమిటి?
పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం : పరిశ్రమలను స్థాపించి, వస్తువుల ఉత్పత్తి, సరఫరా, సేవలను అధిక లాభాల ధ్యేయంతో నిర్వహించడం.
మైత్రి ఒప్పందాలు: యుద్ధ వాతావరణాన్ని తగ్గించి, స్నేహపూర్వక సంబంధాలతో అవగాహన కుదుర్చుకోవడం.
దురహంకారపూరిత జాతీయతావాదం : నూతనంగా బలీయమైన రాజ్యాలుగా ఎదిగిన దేశాలు తమ ప్రజల్లో తీవ్ర, దురాక్రమణపూర్వక జాతీయవాదాన్ని ప్రేరేపించడం.
సైనికవాదం : భద్రతకు, సమస్యలకు పరిష్కారానికి యుద్ధమే సరైన విధానమని నమ్మడమే సైనికవాదం. సైనిక నియంత్రణలో, సైనిక ప్రభుత్వ ఆధీనంలో పరిపాలన కొనసాగింపు, నిర్బంధ సైనిక శిక్షణ.
ఫాసిజం : ఫాసియో అనే రోమన్ పదం నుంచి ఉద్భవించింది. ఫాసియో అనగా కడ్డీల కట్ట అని అర్థం. దీన్ని ముస్సోలిని స్థాపించాడు.
సామ్రాజ్యవాదం : వలసరాజ్య విస్తరణలో ఏర్పడ్డ శత్రుత్వమే సామ్రాజ్యవాదం.
వర్సెయిల్స్ సంధి : మొదటి ప్రపంచయుద్ధం అనంతరం ఏర్పడ్డ శాంతి ఒప్పందం.
నాజీలు : హిట్లర్ ప్రారంభించిన నాజీయిజాన్ని అనుసరించేవారు. నేషనల్ సోషలిస్టు పార్టీకి చెందినవారు.
బ్రిటన్ : పారిశ్రామికంగా అగ్రదేశం
ఎరిక్ : 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగంగా పేర్కొన్నాడు.
ఫాసిజం : ముస్సోలిని ద్వారా స్థాపన.
నాజీయిజం : హిట్లర్ ద్వారా ప్రారంభం
ఆర్థికమాంద్యం : ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం
నాగసాకి, హిరోషిమా : అమెరికా అణుబాంబులకు అతలాకుతలమైన నగరాలు (జపాన్‌లోని నగరాలు)
కేంద్రరాజ్యాల కూటమి : జర్మనీ, ఇటలీ, జపాన్
మిత్రరాజ్యాల కూటమి : అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా
నానాజాతి సమితి: మొదటి ప్రపంచయుద్ధం అనంతరం ఏర్పడ్డ శాంతి సంస్థ.
ఐక్యరాజ్యసమితి : మొదటి ప్రపంచ యుద్ధానంతరం ఏర్పడ్డ శాంతి సంస్థ.
రహస్య ఒప్పందాలు : ఇతర దేశాల సహకారంతో శత్రుదేశాలను ఓడించడానికి ఆయా దేశాలతో చేసుకునే తెర వెనుక ఒప్పందాలు.
సోషలిజం: స్వేచ్ఛ, సమానత్వం, ప్రకృతి వనరులు, సామాజిక నియంత్రణలో ఉండాలనే సిద్ధాంతం సోషలిజం.
కమ్యూనిజం : ఉత్పత్తి, పంపిణీ, వినియోగాల్లో కార్మికులను భాగస్వాములను చేస్తూ లాభ, నష్టాల్లో కార్మికులకు ప్రాధాన్యమిచ్చే సిద్ధాంతం.
విప్లవం : ప్రగతి కోసం నిరసనలు, ఆందోళనలు చేస్తూ ఉద్యమాలు చేరుకునే అత్యున్నత దశ విప్లవం.
అధికార వికేంద్రీకరణ : అధికారం కొద్దిమంది చేతుల్లో కాకుండా అనేకులను భాగస్వాములను చేస్తూ చేసే అధికారాల పంపిణీ.
బోల్షవిక్: రష్యా విప్లవాన్ని బోల్షవిక్ అంటారు. రష్యాలో శాంతిని నెలకొల్పి, సంక్షేమాన్ని అమలుచేసి, లెనిన్ ద్వారా స్థాపించిన రష్యా కమ్యూనిస్టు పార్టీలో ఒక బృందం.
భూముల ఏకీకరణ: భూములు, పరికరాలు, యంత్రాలు, పశువులను ఉమ్మడి సొత్తుగా భావించి చిన్న, పెద్ద రైతుల భూములను కలిపి చేసే ఉమ్మడి వ్యవసాయ విధానం.
పునరావాసం: తమ సొంత నివాసాలను, ఆస్తులను ఆక్రమించి, వాటికి బదులుగా వేరే ప్రాంతంలో ఆశ్రయం కల్పించడం.
సంస్కరణ-స్వాధీనత: ప్రస్తుతమున్న విధానాలను మార్పుచేసి, తమకనుకూలంగా అమలుచేసి, తమ ఆధీనంలో ఉంచుకోవడం.
సంక్షేమ రాజ్యం : ప్రజల ఇక్కట్లు, బాధలు తొలగించి, వారు ఆనందంగా, సంతోషంగా ఉపాధి అవకాశాలతో జీవించేందుకు పథకాలు అమలుచేసి, ప్రజలను సుఖశాంతులతో ఉంచేదాన్ని సంక్షేమ రాజ్యం అంటారు.
సిద్ధాంత బోధన : ఇప్పుడున్న కార్యక్రమాలకు అదనంగా జీవన విధానంలో మార్పు తెచ్చేందుకు, తమ సంఘం, సంస్థ ద్వారా అమలుచేసే కార్యాచరణను వివరించి, ప్రజల్లో మార్పు తీసుకురావడం.
ప్రచారం : ప్రజా సంక్షేమానికి తదుపరి చేపట్టబోయే పథకాలు లేదా ప్రస్తుతం తాము చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, అవగాహన కల్పించడం.
జాతి ఆధిపత్యం : అన్ని దేశాలకంటే తమ దేశమే గొప్పదని, తామే అందరికీ ఆదర్శమని, తామే విశ్వ విజేతలమని తమకు తాము అహంకారంతో మెలిగే విధానం.
రష్యాలో ప్రణాళికలు : స్టాలిన్
రష్యా విప్లవం : బోల్షవిక్
రష్యా పాలకుడు : జార్
రష్యాలో రాజీ ధోరణి అవలంబించేవారు : మెన్షవిక్లు
రష్యా పార్లమెంటు : డ్యూమా
రష్యన్ విప్లవం : మార్చి విప్లవం
రష్యన్ సమాజంలో మార్పు కోరే సంఘాలు : సోవియట్లు
రష్యన్ మహిళా విప్లవ నాయకురాలు : మర్ఫావాసిలేవా
రష్యాలో మూడేండ్లలో ఉక్కు కర్మాగారం నెలకొల్పిన ప్రదేశం : మాగ్నిటోగోర్క్స్
వలస పాలిత ప్రాంతాల్లో జాతి విముక్తి ఉద్యమాలు
భూసంస్కరణలు : భూ పంపిణీలో ఉన్న అసమానతలు తొలగించి, భూమిలేని వారికి భూమిని పంచడం.
భూస్వామ్యవాదం : భూమి అంతా కొంతమంది వ్యక్తుల ఆధీనంలో కేంద్రీకరింపబడటం.
నూతన ప్రజాస్వామ్యం : భూస్వామ్యవాదానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అన్ని వర్గాలతో కలిపి ఏర్పడింది.
వెట్టి కార్మికులు: తక్కువ వేతనంతో పని చేయించడ, ప్రతిఫలం ఏమీ ఇవ్వకుండా బానిసలుగా పని చేయించడం.
రసాయనిక ఆయుధాలు : విషపూరిత మందులు, ఒకేసారి వేలమందిని చంపే అత్యంత విషపూరిత పదార్థం కలిగిన ఆయుధాలు.
బలహీన ప్రజాస్వామ్యం : అవినీతి, మానవహక్కులు ఉల్లంఘన, సైనిక పాలనగల దాన్ని బలహీన ప్రజాస్వామ్యం అంటారు.
ఖండాంతర ఆఫ్రికావాదం : దేశ, తెగ తేడాలు లేకుండా ఆఫ్రికా ప్రజలందరినీ ఏకం చేయడం.
సంప్రదాయ పాలకులు : రాజులు, చక్రవర్తులు
యూరప్‌లో కొత్త భావనలు : జాతీయవాదం, ప్రజాస్వామ్యం, సోషలిజం.
ప్రాభవ ప్రాంతాలు : చట్టాలు వర్తించక, పన్ను చెల్లించక, సైనిక దళాలను కలిగి ఉండటం.
సన్, మిన్, చుయి : జాతీయవాదం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం
మే 4 ఉద్యమం : వర్సెయిల్స్ శాంతి సమావేశం నిర్ణయాలను నిరసిస్తూ బీజింగ్‌లో నిరసన ప్రదర్శన (1919 మే 4)
ఆడపిల్లల పాదాలు కట్టివెయ్యడం : ఆడపిల్లల పాదాలు పూర్తిగా పెరగకుండా నిరోధించే క్రూరమైన సంప్రదాయం.
చైనాలోని రెండు సంక్షోభాలు : 1) నేలలు నిస్సారం, అడవుల నరికివేత 2) దోపిడీపూరిత కౌలు, రుణభారం.
గ్రామీణ మహిళా సంఘాలు : గ్రామీణ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే కమిటీలు.
రైతాంగ సైన్యం : భూస్వామ్యాన్ని అంతం చేయడానికి పోరాడే రైతుల సమ్మేళనం.
రైతాంగ పాఠశాలలు : రాజకీయ విద్య, అక్షరాస్యతను వ్యాప్తిచేసే రైతుల పాఠశాలలు.
నాపాలం: మనుషులకు తీవ్ర నష్టం కలిగించే ప్రమాదకరమైన బాంబు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు