తొమ్మిదో ప్రణాళిక మొత్తం వ్యయం?
రాజకీయ అనిశ్చితి మూలంగా ఏడో ప్రణాళిక అనంతరం వార్షిక ప్రణాళికలను ప్రవేశపెట్టారు. ఎనిమిదో పంచవర్ష ప్రణాళికకు ముందు తీవ్ర ద్రవ్యోల్బణం, ప్రభుత్వ ద్రవ్యలోటు, ప్రతికూల వ్యాపార చెల్లింపుల శేషం, కనిష్ట స్థాయి పెట్రోలు నిల్వలు, దిగుమతుల చెల్లింపులకు, విదేశీ మారక ద్రవ్యనిల్వల కొరత తదితర సమస్యలను దేశం ఎదుర్కొంటుంది. ఈ పంచవర్ష ప్రణాళిక ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ లాంటి నినాదాలతో ప్రారంభమైంది. మానవవనరుల అభివృద్ధికి విశేష ప్రాధాన్యమిచ్చారు. ఈ ప్రణాళిక 1992, ఏప్రిల్ 1న ప్రారంభమై 1997 మార్చి 31న ముగిసింది.
ప్రధానమంత్రి పీవీ నరసింహారావు
ఉపాధ్యక్షులు ప్రణబ్ ముఖర్జి
ప్రణాళిక నమూనా పీవీ నరసింహారావు,
మన్మోహన్సింగ్ నమూనా
లక్ష్యం మానవ వనరుల అభివృద్ధి
నిర్ణయించిన వృద్ధిరేటు 5.6 శాతం
సాధించిన వృద్ధిరేటు 6.8 శాతం
తలసరి ఆదాయవృద్ధిరేటు 4.6 శాతం
మొత్తం పెట్టుబడి రూ .4,85,860 కోట్లు
ప్రభుత్వ పెట్టుబడి 50 శాతం
ప్రైవేట్ పెట్టుబడి 50 శాతం
-ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక కేటాయింపులు
రంగం శాతాల్లో రూ.కోట్లలో
శక్తి రంగం 26.6 1,15,561
రవాణా సమాచారం 18.7 81,036
సామాజిక సేవలు 18.2 79,012
పరిశ్రమలు 10.8 46,922
గ్రామీణాభివృద్ధి 7.9 34,425
నీటిపారుదల 7.5 32,525
వ్యవసాయం 5.2 22,467
శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం 2.1 9,042
ప్రత్యేక ప్రాంత పథకం 1.6 6,750
ఆర్థిక సేవాపథకం 1.5 6,360
మొత్తం 100 4,85,860
ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక ఫలితాలు
-ఈ పంచవర్ష ప్రణాళికలో ఎక్కువగా శక్తి రంగానికి నిధులు కేటాయించారు.
ఎంప్లాయ్మెంట్ అస్యూరెన్స్ పథకం
-1972-73లో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన Employment Guarantee Schemeను ఆదర్శంగా తీసుకుని ఎంప్లాయ్మెంట్ అస్యూరెన్స్ పథకాన్ని 1993లో ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారికి 100 రోజులు పని దినాలు కల్పించాలి. దీన్ని జిల్లాగ్రామీణాభివృద్ధి అనే ఏజెన్సీ (డీఆర్డీఏ) అమలుపర్చింది.
ప్రధానమంత్రి రోజ్‌గార్ యోజన (PMRY)
-1993, అక్టోబర్ 2న ప్రధానమంత్రి రోజ్‌గార్ యోజన (పీఎంఆర్‌వై)ను ప్రారంభించారు. 18 నుంచి 35 ఏండ్ల మధ్య ఉన్న యువకులకు స్వయం ఉపాధిని కల్పించడానికి ఎనిమిదో తరగతి చదివిన నిరుద్యోగులకు రూ. 2 లక్షల రుణాన్ని మంజూరు చేస్తారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది ప్రాజెక్ట్ ఏర్పాటుకు ముందుకు వస్తే రూ.10 లక్షల రుణాన్ని మంజూరు చేస్తారు.
MP LADS (Member of Parliament Local Area Development Scheme): దీన్ని 1993, డిసెంబర్ 23న ప్రారంభించారు. పార్లమెంటు లో ప్రతి సభ్యుడికి తన నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏడాదికి కోటి రూపాయలు కేటాయిస్తుంది. దీన్ని 1998లో రెండు కోట్లకు, 2011లో ఐదు కోట్లకు పెంచింది.
-గంగా కల్యాణ యోజన పథకం: ఈ పథకాన్ని 1997, ఫిబ్రవరి 1న దేశంలోని అన్ని జిల్లాల్లో ప్రవేశపెట్టారు. సన్న, చిన్నకారు రైతులకు నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించడానికి సబ్సిడీ రుణాన్ని రైతులకు అందిస్తారు. ఈ పథకాన్ని దేశంలోని అన్ని జిల్లాల్లో ప్రవేశపెట్టారు. దీనికయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 80:20 నిష్పత్తిలో కేటాయిస్తాయి. ఈ పథకాన్ని 1999లో స్వర్ణజయంతి గ్రామ్ స్వరాజ్ యోజనలో విలీనం చేశారు.
తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక 1997-2002
-తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక సమానత్వం, సాంఘిక న్యాయంతో కూడిన ఆర్థికవృద్ధి అనే లక్ష్యాలతో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ ప్రణాళిక 1992, ఏప్రిల్ 1న ప్రారంభమై 2002, మార్చి 31న ముగిసింది. దేశం ఎదుర్కొంటున్న పేదరిక సమస్య, వ్యవసాయాభివృద్ధి, ఉపాధి కల్పనకు కృషి చేయాలని, ఈ సమస్యలను 15 ఏండ్లలో రూపుమాపాలని నిర్ణయించారు. ఈ ప్రణాళిక కాలంలో కేంద్రంలో ప్రధానులు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు మారారు. ప్రధానులు దేవెగౌడ 1997, ఏప్రిల్ 21 వరకు, ఐకే గుజ్రాల్ 1997, ఏప్రిల్ 21 నుంచి 1998, మార్చి 19 వరకు, అటల్ బిహారీ వాజ్‌పేయి 1998, మార్చి 19 నుంచి, 2004, మే 22 వరకు పనిచేశారు. అదేవిధంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా మధు దండావతే, జస్వంత్‌సింగ్, కేసీ పంత్‌లు పనిచేశారు.
ప్రధానమంత్రి దేవెగౌడ
ఉపాధ్యక్షులు మధు దండావతే
(ప్రణాళిక ప్రారంభంలో )
లక్ష్యం సమానత్వం, సాంఘిక
న్యాయంతో కూడిన
ఆర్థికవృద్ధి
నిర్ణయించిన వృద్ధిరేటు 6.5 శాతం
సాధించిన వృద్ధిరేటు 5.4 శాతం
తలసరి ఆదాయవృద్ధిరేటు 0.2 శాతం
మొత్తం పెట్టుబడి రూ. 8,59,200 కోట్లు
ప్రభుత్వ పెట్టుబడి 48 శాతం
ప్రైవేటు పెట్టుబడి 52 శాతం
రంగం శాతాల్లో రూ.కోట్లలో
శక్తి రంగం 25.1 2,15,545
సాంఘిక సేవలు 21.2 1,82,005
రవాణా 14.1 1,21,324
గ్రామీణాభివృద్ధి 8.5 73,439
పరిశ్రమలు,
వరద నియంత్రణ 8.1 69,972
నీటి పారుదల 6.5 55,598
సమాచారం 5.5 7,616
వ్యవసాయం,
అనుబంధ రంగాలు 4.4 37,546
శాస్త్ర , సాంకేతిక పరిజ్ఞానం 3.0 25,529
ఆర్థిక సేవలు 1.8 15,038
సాధారణ సేవలు 1.4 11,940
ప్రత్యేక ప్రాంత పథకం 0.4 3,649
మొత్తం 100 8,59,200
తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక సాధించిన ఫలితాలు
-స్వర్ణ జయంతి షహరీ రోజ్‌గార్ యోజన (SJSRY)ను 1997, డిసెంబర్ 1న ప్రారంభించారు. దీని ముఖ్య ఉద్దేశం పట్టణ ప్రాంతాల్లోని దారిద్రరేఖకు దిగువన ఉన్న వారికి స్వయం ఉపాధి కల్పించడం కోసం ఉద్దేశించింది. దీనికయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 75:25 నిష్పత్తిలో భరిస్తాయి. ఈ పథకంలో IRDP (1978), TRYSEM (1979), DWACRA (1982), MWS (1988-89), SITRA (1992), GKY (1997-98).
-1998లో రాజరాజేశ్వరి మహిళా ఆరోగ్య యోజన, భాగ్యశ్రీ బాలిక కల్యాణ యోజన పథకాలు ప్రారంభం.
-అంత్యోదయ అన్నపూర్ణ యోజనను 2000, డిసెంబర్ 25న ప్రవేశపెట్టారు. దీని ముఖ్య ఉద్దేశం దేశంలోని నిరుపేదలకు ప్రతి నెల 35 కేజీల ఆహార ధాన్యాలను అందజేయాలి. కేజీ బియ్యం రూ.3లకు, గోధుమలు రూ.2 చొప్పున అందజేయాలి.
-ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనను 2000, డిసెంబర్ 25న ప్రారంభించారు. దీని ముఖ్య ఉద్దేశం 500 జనాభా గల గ్రామాలకు కొత్తగా రహదారులు నిర్మించడం, ఉన్నవాటిని పునరుద్దరించడం.
-2000లో నూతన జనాభా విధానాన్ని రూపొందించారు.
-2000లో నూతనంగా మూడు రాష్ర్టాలు ఏర్పాటయ్యాయి. 2000, నవంబర్ 1న ఛత్తీస్‌గఢ్, 2000, నవంబర్ 9న ఉత్తరాచంల్, 2000, నవంబర్ 15న జార్ఖండ్ రాష్ర్టాలను ఏర్పాటు చేశారు.
-సంపూర్ణ రోజ్‌గార్ యోజనను 2001, సెప్టెంబర్ 25న ప్రారంభించారు. దీనిలో గతంలో ఉన్న Employment Assurance Scheme (EAS), Jawahar Gram Samridhi Yojana (JGSY) విలీనం చేశారు. దీని ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతంలో దారిద్రరేఖకు దిగువన ఉన్న పేదవారికి ఉపాధి అవకాశాలు కల్పించడం.
-సర్వశిక్ష అభియాన్‌ను 2002లో ప్రారంభించారు. 6 నుంచి 14 ఏండ్ల మధ్య ఉన్న బాల, బాలికలకు ప్రాథమిక విద్యను ప్రాథమికహక్కుగా మార్చారు.
తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక వైఫల్యాలు
-వరుసగా ప్రధానులు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మారడం, కార్గిల్ యుద్ధం (999), పోఖ్రాన్లో అణుపరీక్షలు, ఒడిశాలో తుపాను, ఆసియా కరెన్సీ సంక్షోభం, గుజరాత్లో భూకంపం వంటి సమస్యలు తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక కాలంలో సంభవించాయి.
ఏడో ప్రణాళిక సాధించిన విజయాలు
ఏడో పంచవర్ష ప్రణాళికలో శక్తి రంగానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చారు.
ఏడో పంచవర్ష ప్రణాళిక కాలంలో ఉద్యోగ కల్పనకు విస్తృత ప్రాధాన్యతను కల్పించారు.
1985లో నవోదయ పాఠశాలలను ఏర్పాటు చేశారు. 1986లో నూతన విద్యా విధానాన్ని ప్రకటించారు.
వివిధ మతాల మధ్య సామరస్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో 1986లో జాతీయ సమైక్య మండలిని ఏర్పాటు చేశారు.
పాఠశాలల్లో కనీస వసతులు కల్పించడానికి జాతీయ అక్ష్యరాస్యత మిషన్‌ను 1988, మే 5న ఏర్పాటు చేశారు. దీని ముఖ్య ఉద్దేశం 15 నుంచి 35 ఏండ్ల మధ్య ఉన్న 80 మిలియన్ల వయోజనులకు ఎనిమిదో ప్రణాళికాంతానికి అక్ష్యరాస్యులుగా మార్చాలి. 1986 లో గ్రామీణ ప్రాంతాల్లో సంపూర్ణ పారిశుద్ధ్యాన్ని సాధించడానికి Central Rural Sanitation Programmeను ప్రారంభించారు.
-జవహర్ రోజ్‌గార్ యోజన: గతంలో ఉన్న National Rural Employment Programme (NREP), Rural Landless Employment Guarantee Programme (RLEGP) పథకాలను కలిపి జవహర్ రోజ్‌గార్ యోజన పథకాన్ని 1989, ఏప్రిల్ 1న ప్రారంభించారు. దీనికయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 80:20 నిష్పత్తిలో భరిస్తాయి. దీని ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు, అల్ప ఉద్యోగితగల వారికి ఉపాధి కల్పించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడం.
కుటీర జ్యోతి
-పేదరిక రేఖకు దిగువన నివసించే కుటుంబాలకు ఒక విద్యుత్ బల్బ్ ఉండే విధంగా కుటీరజ్యోతి పథకాన్ని 1988-89లో ప్రారంభించారు.
నేషనల్ హైవే అథారిటీ
-జాతీయ రహదారులను అభివృద్ధి చేయడానికి 1988 లో నేషనల్ హైవే ఆథారిటీని ఏర్పాటు చేశారు.
-భూ సమస్యలను పరిష్కరించడానికి 1988-89లో Computerized Land Recordను, బంజర భూములను అభివృద్ధి చేయడానికి సమగ్ర బంజర భూముల అభివృద్ధి పథకాన్ని 1988-89లో ప్రారంభించారు.
ఏడో పంచవర్ష ప్రణాళిక వైఫల్యాలు
-ఈ ప్రణాళిక కాలంలో గల్ఫ్ సంక్షోభం, విద్యుత్ కోత, లోటు బడ్జెట్, విదేశీ వ్యాపారంలో ఎగుమతులతో లభించే ఆదాయం తగ్గడం తదితర కారణాలను ఈ ప్రణాళిక ప్రధానంగా ఎదుర్కొన్నది.
వార్షిక ప్రణాళికలు 1990-92
-రాజకీయ అనిశ్చితి కారణంగా ఏడో ప్రణాళిక తర్వాత వార్షిక ప్రణాళికలు ప్రవేశపెట్టారు. వీటిని 1990-92ల మధ్య అమలు పర్చారు. కేంద్రంలో అనిశ్చితి ఉండటంతో వార్షిక ప్రణాళికలను ప్రవేశపెట్టారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు