ఫ్లోరోసిస్ వ్యాధి తీవ్రతను తగ్గించేవి ఏవి?
1. పంట సాగుకు ఉపయోగపడే సాధారణ భూమి PH విలువ?
1) 3 2) 6 లేదా 7 3) 9 లేదా 10 4) 4
2. దేశంలో సహజవాయువు ఆధారిత పరిశ్రమలను స్థాపించారు. అయితే సహజవాయువును దేని ఉత్పత్తికి ఉపయోగిస్తారు?
1) కార్బైడ్ 2) ఎరువులు
3) గ్రాఫైట్ 4) కృత్రిమ పెట్రోలియం
3.భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాధులకు, మరణానికి కారణమయ్యే మూడు ప్రధాన కారకాలు?
1) కలుషితమైన నీరు, వాయు కాలుష్యం, ఆహార ధాన్యాల కల్తీ
2) వాయు కాలుష్యం, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, భూసార కొరత
3) గ్లోబల్ వార్మింగ్, ఆహార కల్తీ, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్
4) పురుగు మందుల వినియోగం, ఓజోన్ పొర క్షీణత, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్
4. కింది వాటిలో జీవ వైవిధ్యానికి దేనివల్ల ఎక్కువ నష్టం?
1) జీవ ఆవరణ రిజర్వుల ఏర్పాటు
2) పోడు వ్యవసాయం, సహజ ఆవాస స్థలాలను నాశనం చేయడం
3) మాంగ్రూవ్లు, తడి నేలల వంటి సున్నిత పర్యావరణ వ్యవస్థలు
4) ఏదీకాదు
5. ఒంటె తన మోపురాన్ని దేనికి ఉపయోగిస్తుంది?
1) కొవ్వును నిల్వ ఉంచేందుకు
2) నీటిని నిల్వ ఉంచేందుకు
3) ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు
4) ఎడారిలో నడిచేటప్పుడు శరీరాన్ని సమతుల్యంలో ఉంచేందుకు
6. సముద్ర ఆవరణ వ్యవస్థలో ఎక్కువ కాంతి లభించకపోవడం వల్ల కొంత చీకటిగా ఉండే మండలం?
1) అబైసల్ మండలం 2) బెథియల్ మండలం
3) యూఫోటిక్ మండలం 4) ప్రొపండల్ మండలం
7. జీవులు సుప్తావస్థను ప్రదర్శించడానికి కారణం?
1) అతిశీతల పరిస్థితులు 2) అత్యూష్ణ పరిస్థితులు
3) జీవక్రియా రేటులో మార్పులు 4) 1, 2
8. జీవ, నిర్జీవ అంశాల మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని పోషణ, శక్తి రూపంలో సూచించేవి?
1) ఆహారపు గొలుసు 2) నిచ్
3) ఆహారపు గొలుసు, ఆహారపు జాలకం 4) పైవన్నీ
9. కీటక నాశనుల వల్ల కలిగే దుష్పలితాలపై సైలెంట్ స్ప్రింగ్ పుస్తకాన్ని రచించిందెవరు?
1) వందనా శివ 2) అరుంధతీరాయ్
3) రేచల్ కార్సన్ 4) జుంపా లాహిరి
10. ఆస్ట్రేలియా నుంచి గోధుమలతోపాటు దిగుమతి చేయబడి, మన దేశంలో విపరీతంగా విస్తరిస్తూ పంట మొక్కలకు, పర్యావరణానికి, జీవుల (మానవులు)కు హానికలిగిస్తున్న ప్రమాదకర కలుపుమొక్క?
1) పొంగామియా పిన్నేటా 2) క్రైసాంథిమం ఇండికం
3) పార్ధీనియం హస్టిరోఫోరస్ 4) ఐకార్నియా
11. పటాన్చెరువు భారతదేశంలోని అతి ప్రమాదకర కాలుష్య ప్రాంతాల్లో ఒకటి. దీని కాలుష్యాన్ని తగ్గించడానికి మన సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు?
1) వెంటనే కాలుష్య పదార్థాల విడుదలను చేయడం ఆపడం
2) పరిసర ప్రాంతాల్లో మొక్కలు విస్తారంగా పెంచడం
3) పరిశ్రమలు కాలుష్య కారకాలను విడుదల చేయకుండా నిరంతర తనిఖీ చేయడం
4) పైవన్నీ
12. నీరు కలుషితం కావడం వల్ల కలిగే వ్యాధులు?
1) టైఫాయిడ్, కామెర్లు 2) కలరా, రక్తవిరేచనాలు
3) అతిసారం, కలరా 4) పైవన్నీ
13. వాయు కాలుష్యాన్ని కలిగించే ముఖ్య కారకాలు?
1) పెస్టిసైడ్స్ 2) కార్బన్‌మోనాక్సైడ్
3) సల్ఫర్, నత్రజని, కార్బన్‌డై ఆక్సైడ్ 4) భార లోహాలు
14. ఫ్లోరోసిస్ వ్యాధి తీవ్రతను తగ్గించేవి?
1) పాలు, ఆకు కూరలు 2) టూత్ పేస్ట్‌లు
3) మొక్క జొన్నలు 4) ఆవాలు, అల్లం
15. సాధారణంగా ఎడారి మొక్కల్లో కనిపించే లక్షణాలు?
1) రసభరితంగా ఉంటాయి
2) నీటితో నిండి ఆకులు లేకుండా ఉంటాయి
3) కాండాలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి
4) పైవన్నీ
16. భౌమ కాలుష్యం పెరగడానికి కారణం?
1) పురుగుమందులు, కీటక నాశనులు అతిగా వాడటం
2) ఘనరూప వ్యర్ధాలు తక్కువ మోతాదులో పార వేయడం
3) నేల క్రమక్షయాన్ని అరికట్టడం 4) పైవన్నీ
17. అనేక ఏండ్లుగా NPK ఎరువులను అధికంగా ఉపయోగించడం వల్ల కలిగే నష్టం?
1) ఆ నేలలో కూరగాయలు, పంటల దిగుబడి తగ్గుతుంది
2) మాంసకృత్తుల పరిమాణం తగ్గుతుంది
3) వ్యాధి తీవ్రత పెరుగుతుంది 4) పైవన్నీ
18. DDTని విస్తరించండి.
1) Dichloro Diphenyl Trichloro Ethane
2) Diphenyl Dichloro Trichloro Methane
3) Dichloro Diphenyl Trichloro Propane
4) Dichloro Deoxy Tetrachloro Ethanc
19. కుంటలు, చెరువులు, సరస్సులు, ట్యాంక్‌లను కలిపి ఏమని పిలుస్తారు?
1) బెంథిక్ ఆవాసం 2) స్థిరజల ఆవాసం
3) ప్రవాహజల ఆవాసం 4) వేలాంచల ఆవాసం
20. జీవావరణ వ్యవస్థలో ప్రాథమికంగా శక్తిని అందించేవి?
1) ఉత్పత్తిదారులు 2) ప్రాథమిక వినియోగదారులు
3) విచ్ఛిన్నకారులు 4) ద్వితీయ వినియోగదారులు
21. రెండు జీవసమాజాల మధ్యగల పరివర్తన ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు?
1) మీసోసియర్ 2) వెక్టోటైప్ 3) ఎకోటోన్ 4) ఎకాడ్
22. బయోడైవర్సిటీ పునరుత్పత్తి తగ్గిపోవడానికి ముఖ్యకారణం?
1) జాతుల విలుప్తత 2) కాలుష్యం
3) ప్రపంచ వాతావరణంలోని మార్పులు
4) అడవులు నిప్పుకు గురికావడం
23. కొన్ని వ్యాధి సంక్రమణ కారకాల్లో కణం ఉండదు. కేవలం న్యూక్లియో ప్రొటీన్లు మాత్రమే. కానీ ప్రపంచాన్ని భయానికి గురిచేసే తీవ్ర ప్రభావం గల వ్యాధులను కలుగజేస్తాయి. ఆ వ్యాధుల విస్తరణకు కారణం?
1) జీవ సంబంధ కారకాలు 2) నిర్జీవ సంబంధ కారకాలు 3) కాలుష్య కారకాలు 4) జీవ, నిర్జీవ సంబంధ కారకాలు
24. అడవులను నరికివేయడం వల్ల విడుదలయ్యే హరితగృహ వాయు శాతం ఎంతం?
1) 16 శాతం 2) 3 శాతం 3) 15 శాతం 4) 20 శాతం
25. పంట మార్పిడి, జన్యు ఉత్పరివర్తన రకాలు, వంధ్యత్వం వంటి పద్ధతుల ద్వారా చీడ పీడలను నియంత్రించడమనేది?
1) రసాయన నియంత్రణ 2) పర్యావరణ నైతికత
3) జైవిక వృద్ధీకరణ 4) జైవిక నియంత్రణ
26. జీవ జాలంపై ప్రభావం చూపే జీవ, భౌతిక రసాయన కారకాల సంబంధాన్ని ఏమని పిలుస్తారు?
1) ఆహార జాలకం 2) పర్యావరణం
3) వాతావరణం 4) ఆవరణ వ్యవస్థ
సమాధానాలు
1) 2 2) 2 3) 1 4) 2 5) 1 6) 2 7) 4 8) 3 9) 3 10) 3 11) 4 12) 4 13) 3 14) 1 15) 4 16) 1 17) 4 18) 1 19) 2 20) 1 21) 3 22) 3 23) 4 24) 3 25) 4 26) 4
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు