గోత్రం గురించి మొదటిసారిగా తెలిపిన వేదం?
![](https://s3.ap-south-1.amazonaws.com/media.nipuna.com/wp-content/uploads/2022/05/vittala-temple-stone-chariot-hampi-wiki.jpg)
1. సీజర్ అనే బిరుదు కలిగిన చక్రవర్తి?
1) అలెగ్జాండర్ 2) కనిష్కుడు
3) అశోకుడు 4) సముద్ర గుప్తుడు
2. తమిళంలో మొదటి వ్యాకరణ గ్రంథంగా పేరుగాంచింది?
1) తోల్కాప్పియం 2) శిలప్పాధికారం
3) మణిమేఖలై 4) తిరుకురల్
3. గాంధార శిల్పకళ ఎవరి కాలంలో ప్రసిద్ధిచెందింది?
1) కుషాణులు 2) శుంగులు
3) గ్రీకులు 4) మౌర్యులు
4. కింది వాటిలో సరైనవి?
1) ప్రాచీన చోళరాజుల్లో ‘కరికాల చోళుడు’ గొప్పరాజు
2) ఇతడు పుహార్ లేదా కావేరి పట్టణాన్ని నిర్మించాడు
3) కావేరి నదిపై ఆనకట్టను నిర్మించాడు. దీని కోసం శ్రీలంక నుంచి 12,000 మంది బానిసలను తీసుకువచ్చాడు 4) పైవన్నీ
5. సింహళ రాజైన మేఘవర్ణుడు బుద్ధగయలో బౌద్ధ విహారాన్ని నిర్మించేందుకు ఏ చక్రవర్తి అంగీకారం పొందాడు?
1) మొదటి చంద్రగుప్తుడు 2) కుమారగుప్తుడు
3) సముద్ర గుప్తుడు 4) స్కంధగుప్తుడు
6. ‘మిళింద పన్హా’ ఎవరి మధ్య జరిగిన బౌద్ధ సంభాషణల ఆధారంగా రచించారు?
1) అశోకుడు-ఉపగుప్తుడు
2) మీనాండర్-నాగసేనుడు
3) కనిష్కుడు-అశ్వఘోషుడు
4) హర్షుడు-్యయాన్త్సాంగ్
7. కింది వాటిని జతపర్చండి.
1. బృహత్ సంహిత ఎ. వరాహమిహిరుడు
2. రుతుసంహారం బి. కాళిదాసు
3. మృచ్ఛకటికం సి. శూద్రకుడు
4. హస్తాయుర్వేదం డి. పాలకావ్యుడు
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
3) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
8. సతీసహగమనాన్ని గురించి తెలుపుతున్న మొదటి శాసనం?
1) బిదారి 2) అలహాబాద్ ప్రశస్తి
3) ఎరాన్ 4) ఏదీకాదు
9. విచిత్రగుప్తుడు, చిత్రకార పులి అనే బిరుదులుగల
పల్లవరాజు?
1) మహేంద్ర వర్మన్
2) మొదటి నరసింహ వర్మన్
3) నందివర్మన్ 4) రెండో నరసింహవర్మన్
10. కింది వాటిలో హర్షుడు వేయించిన శాసనాలు?
1) సోంపట్ 2) బన్సిఖేరా
3) మధుబని 4) పైవన్నీ
11. మహాబలిపురంలో ఏకశిలపై పాండవ రథాలను నిర్మించిన రాజు?
1) మొదటి నరసింహవర్మన్
2) రెండో నరసింహవర్మన్
3) మహేంద్రవర్మన్ 4) నందివర్మ
12. ‘సమాధుల పితామడు’ అని ఏ ఢిల్లీ సుల్తాన్‌ను పిలుస్తారు?
1) మహ్మద్‌బిన్ తుగ్లక్ 2) ఇల్టుట్మిష్
3) కుతుబుద్దీన్ ఐబక్ 4) ఫిరోజ్ షా తుగ్లక్
13. పర్షియా ‘అఫ్రషియాబ్’ వంశానికి చెందినవాడినని ప్రకటించుకున్న ఢిల్లీ సుల్తాన్?
1) బాల్బన్ 2) అల్లాఉద్దీన్ ఖిల్జీ
3) మహ్మద్‌బిన్ తుగ్లక్ 4) కుతుబుద్దీన్ ఐబక్
14. హర్షుడు ప్రతి ఐదేండ్లకోసారి మహామోక్ష పరిషత్‌ను ఎక్కడ నిర్వహించేవాడు?
1) కనోజ్ 2) స్థానేశ్వరం
3) ప్రయాగ 4) పాటలీపుత్రం
15. హరప్పా నాగరికతలోని ఏ పట్టణాన్ని ‘కాస్మోపాలిటన్’ సిటీ అని కూడా అంటారు?
1) మొహంజదారో 2) లోథాల్
3) చన్హుదారో 4) కాళీబంగన్
16. గోత్రం గురించి మొదటిసారిగా తెలిపిన వేదం?
1) రుగ్వేదం 2) అధర్వణవేదం
3) సామవేదం 4) యజుర్వేదం
17. వీణ వాయించే ప్రతిమగల బంగారు నాణేలను ముద్రించిన చక్రవర్తి?
1) చంద్రగుప్త మౌర్యుడు 2) కనిష్కుడు
3) సముద్ర గుప్తుడు
4) గౌతమీపుత్ర శాతకర్ణి
18. ‘గజభేటకార’ అనే బిరుదు కలిగిన విజయనగర రాజు?
1) రెండో దేవరాయలు
2) మొదటి దేవరాయలు
3) శ్రీకృష్ణ దేవరాయలు 4) అచ్చుత దేవరాయలు
19. కింది వాటిలో సరైనవి.
1) రామానుజాచార్యులు భక్తి ఉద్యమ స్థాపకులు
2) ఈయన విశిష్టాద్వైతాన్ని బోధించారు
3) బి సరైనది 4) ఎ, బి సరైనవి
20. తన బోధనలను హిందీ భాషలో బోధించిన మొదటి భక్తి ఉద్యమకారుడు?
1) కబీర్ 2) రామానందుడు
3) నామ్‌దేవ్ 4) సమర్థ రామదాసు
21. జియాఉద్దీన్ బరౌనీ, అమీర్ ఖుస్రో ఏ సూఫీ మత గురుశిశ్యులు?
1) మొయినుద్దీన్ చిస్థీ 2) కుతుబుద్దీన్ భక్తియార్కాకి
3) బాబా ఫరీద్ 4) నిజాముద్దీన్ ఔలియా
22. కింది భక్తి ఉద్యమకారులు, వారు బోధించిన ప్రాంతాలను జతపర్చండి.
ఎ. శంకర్‌దేవ్ 1. మహారాష్ట్ర
బి. మీరాబాయి 2. కశ్మీర్
సి. తుకారాం 3. చిత్తోర్
డి. లల్లా 4. అస్సాం
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-1, బి-2, సి-4, డి-3
23. స్వీయ చరిత్రల రాకుమారులుగా ప్రసిద్ధిచెందినవారు?
1) బాబర్, అక్బర్ 2) బాబర్, జహంగీర్
3) బాబర్, షాజహాన్ 4) జహంగీర్, ఔరంగజేబ్
24. పూర్తిగా పాలరాతితో నిర్మితమైన మొదటి కట్టడం?
1) ఇతముద్దౌలా సమాధి 2) తాజ్‌మహల్
3) పద్మ మహల్ 4) మాయున్ సమాధి
25. రసగంగాధరం, గంగాలహరి కావ్యాలను రచించిన జగన్నాథ పండితుడు ఏ మొగల్ చక్రవర్తి ఆస్థానానికి చెందినవాడు?
1) అక్బర్ 2) జహంగీర్
3) షాజహాన్ 4) బాబర్
26. మొగల్ రాకుమారుడు ‘దారాషుకో’ని ఉరితీయడం గురించి వివరించిన ఫ్రెంచి యాత్రికుడు?
1) బెర్నియార్ 2) ట్రావెర్నియర్
3) పీటర్ ముండి 4) పైవారందరూ
27. ‘మధ్యయుగంలో నౌకాదళ నిర్మాణపు అవసరాన్ని గుర్తించిన మొదటి భారతీయ పాలకుడు శివాజీ’ అని పేర్కొన్నవారు?
1) జేఎన్ సర్కార్ 2) జియావుద్దీన్ బరౌనీ
3) ఏసీ శ్రీవాస్తవ 4) లేన్పూల్
28. ‘సేనకరై’ అనే బిరుదు కలవారు?
1) బాలాజీ విశ్వనాథ్ 2) మొదటి బాజీరావు
3) బాలాజీ బాజీరావు 4) రాజారాం
29. గ్రీకు రచయితలతో ‘అగ్రమిస్’గా వర్ణింపబడినవారు?
1) చంద్రగుప్త మౌర్యుడు 2) ధననందుడు
3) మహా పద్మనందుడు 4) బిందుసారుడు
30. మగధ సామ్రాజ్యాన్ని పాలించిన రాజవంశాల క్రమం?
1) హర్యాంక, శిశునాగ, నంద
2) శిశునాగ, హర్యాంక, నంద
3) నంద, హర్యాంక, శిశునాగ
4) హర్యాంక, నంద, శిశునాగ
31. కిందివాటిలో సరైనది?
1) జైనమత గ్రంథాలు ‘అర్ధమాగధి’ భాషలో ఉన్నాయి
2) బౌద్ధ గ్రంథాలను పాలీ భాషలో రచించారు
3) 1 మాత్రమే సరైనది
4) 1, 2 సరైనవి
32. బింబిసారుడు ఏ వంశానికి చెందిన రాజు?
1) మౌర్య 2) హర్యాంక
3) శుంగ 4) నంద
33. రుగ్వేదంలో ప్రస్తావించిన జైనమత తీర్థంకరులు?
1) పార్శనాథుడు, వర్ధమాన మహావీరుడు
2) రుషభనాథుడు, మహావీరుడు
3) రుషభనాథుడు, అరిష్టనేమి
4) అరిష్టనేమి, పార్శనాథుడు
34. ప్రజల సంతోషమే రాజుకు సంతోషమని పేర్కొన్న గ్రంథం?
1) అర్థశాస్త్రం 2) నీతిసారం
3) దశకుమార చరిత్ర 4) ఇండికా
35. చంద్రగుప్త మౌర్యుడు జైనమతాన్ని స్వీకరించాడని తెలిపే గ్రంథం?
1) అర్థశాస్త్రం 2) ముద్రా రాక్షసం
3) ఇండికా 4) పరిశిష్టపర్వన్
36. కిందివాటిని జతపర్చండి.
ఎ. బాద్షా నామా 1. ఉస్తాద్-హమీద్ లహోరి
బి. షాజహాన్ నామా 2. ఇనాయత్షా
సి. మజ్మ-ఉల్-బహ్రయిన్ 3. దారాషుకో
డి. మాయున్ నామా 4. గుల్బదన్ బేగం
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-1, బి-3, సి-2, డి-4
4) ఎ-4, బి-3, సి-2, డి-1
37. కిందివాటిలో సరైనవి?
1) భగవద్గీతను పర్షియాలోకి అబుల్ ఫైజీ అనువాదం చేశాడు
2) మహాభారతం, రామాయణాన్ని పర్షియాలోకి అనువదించినవారు బదౌనీ
3) అధర్వణ వేదాన్ని పర్షియాలోకి అనువాదం చేసినవారు హాజీ ఇబ్రహీం
4) పైవన్నీ
38. సిక్కులు, మొగలులకు మొదటిసారి వైరం ఏ చక్రవర్తి
కాలంలో ఏర్పడింది?
1) ఔరంగ జేబ్ 2) జహంగీర్
3) షాజహాన్ 4) అక్బర్
39. హిందువుల జ్యోతిషం, సాముద్రిక శాసా్త్రలను నమ్మిన మొగల్ చక్రవర్తి?
1) మాయున్ 2) అక్బర్
3) బాబర్ 4) జహంగీర్
40. కిందివాటిలో శివాజీ మొదటి ఆక్రమణ?
1) జావళీ 2) తోరణ
3) కొంకణ 4) పురందర్
41. విజయనగర కాలంలో సతీసహగమనం గురించి పేర్కొన్న విదేశీ యాత్రికుడు?
1) డొమింగోపేస్ 2) న్యూనిజ్
3) నికోలోకాంటి 4) పెరిస్టా
42. దక్కన్ ‘గుంటనక్క’ అని ఎవరిని పిలిచారు?
1) అమీర్ అలీ బదీద్
2) యూసఫ్ ఆదిల్ షా
3) ఇబ్రహీం ఆదిల్ షా
4) మాలిక్ అహ్మద్
జవాబులు
1-2 2-1 3-1 4-4 5-3 6-2 7-1 8-3 9-1 10-4 11-1 12-2 13-1 14-3 15-2 16-2 17-3 18-1 19-4 20-2 21-1 22-3 23-2 24-1 25-3 26-1 27-3 28-1 29-2 30-1 31-4 32-2 33-3 34-1 35-4 36-1 37-4 38-2 39-1 40-2 41-3 42-1
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
పెద్దపల్లి డిగ్రీ కాలేజీ
9492 575 006
- Tags
- competitive exams
- TSPSC
- upsc
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు