Telangana Movement | ‘తెలంగాణ జాగో హైదరాబాద్‌కో బచావో’ సభ నిర్వహించిన పార్టీ?
1. తెలంగాణ విషయం చాలా తీవ్రమైనది. భావోద్వేగాలతో కూడుకున్నది. చర్చల పద్ధతిలో పరిష్కారం కావాలి. చర్చల కోసం కాంగ్రెస్ తనంట తానుగా చొరవ, అన్ని పార్టీలు, ప్రభుత్వం ఏకాభిప్రాయానికి రావలసి ఉన్నదని ప్రకటించిన వ్యక్తి ఎవరు?
1) సోనియాగాంధీ 2) అభిషేక్ సింఘ్వీ
3) చిదంబరం 4) ఎవరూ కాదు
2. కింది వాటిలో సరైనవి గుర్తించండి?
ఎ. బీజేపీ సంకల్ప యాత్ర- సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్
బి. బీజేపీ రణభేరి సభ- ఓయూ
సి. బీజేపీ పోరుసభ- కరీంనగర్
డి. తెలంగాణ పోరు యాత్ర-మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ప్రారంభం
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి
3) ఎ, సి, డి 4) బి, సి, డి
3. తెలంగాణ విషయాన్ని సున్నితమైన సమస్యగా భావించి సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలు రెండూ తనకు రెండు కండ్ల వంటివి అని పేర్కొన్న వ్యక్తి ఎవరు?
1) వైఎస్ రాజశేఖర్‌రెడ్డి
2) చంద్రబాబు నాయుడు
3) సోనియాగాంధీ
4) సుష్మాస్వరాజ్
4. కింది వ్యాఖ్యల్లో సరైనవి?
ఎ.మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకంగా ఉండి 2009 తర్వాత తెలంగాణకు అనుకూలంగా తమ వైఖరిని మార్చుకున్న పార్టీ సీపీఐ
బి.సీపీఐ కార్యదర్శి నారాయణ తెలంగాణ పోరుయాత్ర పేరుతో తెలంగాణ వ్యాప్తంగా (జోడేఘాట్ నుంచి) యాత్ర నిర్వహించారు
సి.ఈ యాత్ర ముగింపు సభను హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో నిర్వహించారు
1) ఎ, బి, సి 2) ఎ, బి
3) బి, సి 4) ఎ, సి
5. ‘తెలంగాణ జాగో హైదరాబాద్‌కో బచావో’ పేరుతో హైదరాబాద్‌లో సభ నిర్వహించిన కింది సంస్థ/పార్టీని గుర్తించండి?
1) తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్
2) తెలంగాణ ప్రజా ఫ్రంట్
3) తెలంగాణ దళిత బహుజన మహాసభ
4) ఏదీకాదు
6. ఉమ్మడి జిల్లా, టీ జేఏసీ కన్వీనర్లను
జతపర్చండి.
ఎ. ఖమ్మం 1. గోవర్ధన్
బి. ఆదిలాబాద్ 2. విఠల్
సి. మెదక్ 3. దేవీప్రసాద్
డి. రంగారెడ్డి 4. శ్రీధర్ దేశ్‌పాండే
ఇ. నిజామాబాద్ 5. మల్లేపల్లి లక్ష్మయ్య
1) ఎ-1, బి-4, సి-3, డి-5, ఇ-2
2) ఎ-1, బి-4, సి-3, డి-2, ఇ-5
3) ఎ-1, బి-3, సి-4, డి-2, ఇ-5
4) ఎ-1, బి-3, సి-4, డి-5, ఇ-2
7. కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
ఎ. కింది ఏ సంస్థ రాజకీయ పార్టీతో కలిసి పనిచేయక స్వతంత్రంగా వామపక్ష భావజాలంతో పని చేసింది
బి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగకుండా సీమాంధ్ర పెట్టుబడిదారులు అడ్డుపడుతున్నారన్న నేపథ్యంతో వారికి సంబంధించిన జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్స్‌ను ధ్వంసం చేసింది
సి. ఈ సంస్థకు అధ్యక్షుడు కేశవరావు జాదవ్, ప్రధాన కార్యదర్శి కపిలవాయి దిలీప్ కుమార్ కాగా.. ఆ సంస్థను గుర్తించండి?
1) తెలంగాణ డెమొక్రటిక్ ఫ్రంట్
2) తెలంగాణ ప్రజా ఫ్రంట్
3) తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్
4) తెలంగాణ సెటిలర్స్ ఫ్రంట్
8. తెలంగాణలో బహుజన రాజ్యం అనే నినాదం చీలికవాదం కాదని అది అణగారిన వర్గాలు, కులాలను ఏకం చేసే సమైక్య సిద్ధాంతం అని, జై తెలంగాణ అనే నినాదానికి ‘జై జై బహుజన తెలంగాణ’ అనే నినాదాన్ని జోడించాలని పేర్కొన్న వ్యక్తిని గుర్తించండి?
1) గోరటి వెంకన్న
2) మారోజు వీరన్న
3) మంద కృష్ణ మాదిగ
4) కేజీ సత్యమూర్తి
9. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసిన కింది వ్యక్తులను, వారికి సంబంధించిన ప్రాంతాలను జతపర్చండి.
ఎ. కాసోజు శ్రీకాంతా చారి 1. నాగారం
బి. కానిస్టేబుల్ కిష్టయ్య 2. పెద్ద మంగళారం
సి. యాదిరెడ్డి 3. శివాయిపల్లి
డి. సిరిపురం యాదయ్య 4. పొడిచేడు
1) ఎ-4, బి-3, సి-1, డి-2
2) ఎ-4, బి-1, సి-2, డి-3
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-4, బి-1, సి-3, డి-2
10. కింది జేఏసీలను సంబంధిత చైర్మన్/ కన్వీనర్లను జతపర్చండి.
ఎ. తెలంగాణ 1. బాలనర్సయ్య ప్రజాసంఘాల జేఏసీ
బి. తెలంగాణ ఎలక్ట్రిక్ 2. తిరుమలి ఎంప్లాయ్ జేఏసీ
సి. తెలంగాణ రైల్వే 3. కే రఘు ఎంప్లాయ్ జేఏసీ
డి. తెలంగాణ 4. మధుసూదన్ ఇంజినీర్స్ జేఏసీ
ఇ. తెలంగాణ విద్యా జేఏసీ 5. ముత్తయ్య
1) ఎ-2, బి-3, సి-5, డి-4, ఇ-1
2) ఎ-2, బి-3, సి-5, డి-1, ఇ-4
3) ఎ-2, బి-3, సి-4, డి-5, ఇ-1
4) ఎ-2, బి-3, సి-1, డి-5, ఇ-4
11. తెలంగాణ ఆత్మబలిదానాలకు సంబంధించి కింది వ్యాఖ్యల్లో సరైనవి గుర్తించండి?
ఎ. కామారెడ్డి జిల్లాకు చెందిన కానిస్టేబుల్ కిష్టయ్య 2009, డిసెంబర్ 1న తుపాకీతో కాల్చుకొని మరణించాడు
బి. 2010లో న్యాయవాది అయిన సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు
సి. రంగారెడ్డి జిల్లాకు చెందిన మందాడి యాదిరెడ్డి ఢిల్లీలోని శాస్త్రి భవన్ వద్ద ఉన్న చెట్టుకు ఉరేసుకుని మరణించాడు
డి. సిరిపురం యాదయ్య ఓయూ ఎన్సీసీ గేట్ వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, డి
3) ఎ, బి, సి 4) ఎ, సి, డి
12. తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న కింది తెలంగాణ అమరవీరులను, వారు ఆత్మహత్యాయత్నం చేసిన లేదా మరణించిన రోజును జతపర్చండి.
ఎ. శ్రీకాంతా చారి 1. 2009, నవంబర్ 29
బి. కానిస్టేబుల్ కిష్టయ్య 2. 2009, డిసెంబర్ 1
సి. బోజ్య నాయక్ 3. 2012, మార్చి 24
డి. యాదిరెడ్డి 4. 2011, జూలై 20
ఇ. ఇషాన్ రెడ్డి 5. 2010, జూలై 31
1) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5
2) ఎ-1, బి-2, సి-3, డి-5, ఇ-4
3) ఎ-1, బి-3, సి-2, డి-5, ఇ-4
4) ఎ-1, బి-2, సి-5, డి-3, ఇ-4
13. కింది వ్యాఖ్యల్లో సరైనవి గుర్తించండి.
ఎ. తెలంగాణ తల్లి అనే భావనను తొలిసారి ప్రజల్లోకి తీసుకువచ్చింది దాశరథి రంగాచార్య
బి. బీఎస్ రాములు సూచన మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి మొదటిసారి రూపాన్ని ఇచ్చింది బైరోజు వెంకటరమణాచారి
సి. తెలంగాణ తల్లి రూపం ఉన్న ఫొటో కవర్ పేజీ తొలిసారిగా జనతంత్ర పత్రికలో వెలువడింది
డి. కేసీఆర్ 2007, నవంబర్ 15న తెలంగాణ భవన్లో పసునూరి దయాకర్ చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించారు
ఇ. తెలంగాణ తల్లి తొలి విగ్రహాన్ని సిద్దిపేటకు చెందిన శిల్పి నర్సింలు తయారు చేశారు
1) ఎ, బి, సి, డి, ఇ 2) బి, సి, డి, ఇ
3) ఎ, బి, డి, ఇ 4) బి, డి, ఇ
14. తెలంగాణ హిస్టరీ సొసైటీ ప్రచురించిన పుస్తకాలకు సంబంధించిన వాటిలో సరైనది గుర్తించండి?
ఎ. తెలంగాణ చరిత్ర నిర్మాణం
బి. 1948, సెప్టెంబర్ 17 భిన్న దృక్కోణాలు
సి. ఆదివాసీ గోండుల తిరుగుబాటు
డి. ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఏర్పాటు విద్రోహ చరిత్ర
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి
3) ఎ, సి 4) బి, డి
15. కింది వ్యాఖ్యల్లో సరైనవి గుర్తించండి?
ఎ. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య స్థాపకులు విమలక్క
బి. విమలక్క ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక కమిటీ ఏర్పడింది
సి. తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో 2006, ఆగస్టులో ఏర్పడింది
డి. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణలోని పది జిల్లాల్లో బతుకమ్మ సంబరాలను మొదటిసారిగా 2010లో విజయవంతంగా నిర్వహించారు
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి
3) ఎ, సి 4) ఎ, సి, డి
16. కింది సంస్థలను, అవి ఏర్పడిన కాలక్రమంలో అమర్చండి?
ఎ. తెలంగాణ సింగిడి రచయితల సంఘం
బి. తెలంగాణ రచయితల వేదిక
సి. తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య
డి. తెలంగాణ సాంస్కృతిక వేదిక
1) డి, సి, బి, ఎ 2) డి, బి, సి, ఎ
3) ఎ, బి, సి, డి 4) ఎ, డి, బి, సి
17. కింది పుస్తకాలు, రచయితలను జతపర్చండి.
ఎ. ఎక్కడి నుంచి 1. రామాచంద్రమౌళి ఎక్కడి దాకా
బి. లాంగ్‌మార్చ్ 2. పెద్దింటి అశోక్
సి. కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్
3. కూరెళ్ల విఠలాచార్య
డి. బ్రేకింగ్ వ్యూస్ 4. కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి
ఇ. దావత్ 5. సంగిశెట్టి శ్రీనివాస్, వెల్దండి శ్రీధర్
1) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5
2) ఎ-5, బి-4, సి-3, డి-2, ఇ-1
3) ఎ-1, బి-3, సి-2, డి-4, ఇ-5
4) ఎ-5, బి-3, సి-4, డి-2, ఇ-1
18. కింది పుస్తకాలు, రచయితలను జతపర్చండి.
ఎ. సంభాషణ 1. కే శ్రీనివాస్
బి. తెలంగాణ చౌక్ 2. ఓదెల వెంకటేశ్వర్లు
సి. తెలంగాణం 3. కర్ర ఎల్లారెడ్డి
డి. తెలంగాణ 4. స్కై బాబా తిరుగుబాటు కవితా సంకలనం
1) ఎ-1, బి-3, సి-4, డి-2
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-1, బి-3, సి-2, డి-4
4) ఎ-1, బి-4, సి-3, డి-2
19. కింది పత్రికలను సంబంధిత సంస్థలను జతపర్చండి.
ఎ. తెలంగాణ ఐక్యవేదిక 1.తెలంగాణ పత్రిక
బి. తెలంగాణ జనసభ 2. తెలంగాణ మాసపత్రిక
సి. తెలంగాణ మహాసభ 3. జన తెలంగాణ
డి. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ 4. నా జన తెలంగాణ
5. మా తెలంగాణ
6. మన తెలంగాణ
1) ఎ-1, బి-3, సి-2, డి-6
2) ఎ-1, బి-4, సి-2, డి-6
3) ఎ-1, బి-4, సి-2, డి-5
4) ఎ-1, బి-3, సి-2, డి-5
20. కింది గ్రంథాలను, వాటి రచయితలను
జతపర్చండి.
ఎ. తెలంగాణ 1. వరవరరావు విమోచనోద్యమం
బి. తెలంగాణ నుంచి 2. ఎన్ వేణుగోపాల్ తెలంగాణ దాకా
సి. జూన్ 2 3. కే శ్రీనివాస్
డి. జగర్ 4. అనిశెట్టి రజిత (కవితా సంకలనం)
5. ముదిగంటి సుజాతా రెడ్డి
1) ఎ-1, బి-3, సి-2, డి-5
2) ఎ-1, బి-5, సి-3, డి-2
3) ఎ-1, బి-2, సి-3, డి-5
4) ఎ-1, బి-3, సి-5, డి-2
21. కింది సంస్థలు, సంబంధిత అధ్యక్షులు/ కన్వీనర్లను జతపర్చండి.
ఎ. తెలంగాణ బహుజన పోరాట సమితి 1. మారోజు వీరన్న
బి. ఫోరం ఫర్ సస్టెయినబుల్ తెలంగాణ 2. తేజావత్ బెల్లయ్య నాయక్
సి. తెలంగాణ 3. టీ వివేక్ హిస్టరీ సొసైటీ
డి. తెలంగాణ 4. జీ వెంకట్రాజం హిస్టరీ కాంగ్రెస్
ఇ. తెలంగాణ 5. జంజర్ల ఐక్యవిద్యార్థి వేదిక రమేష్ బాబు
6. వీరగోని చైతన్య గౌడ్
7. మణికొండ వేదకుమార్
1) ఎ-1, బి-7, సి-4, డి-3, ఇ-6
2) ఎ-2, బి-7, సి-3, డి-4, ఇ-6
3) ఎ-1, బి-7, సి-4, డి-3, ఇ-5
4) ఎ-2, బి-7, సి-3, డి-4, ఇ-5
22. కింది సంఘాలు అవి ఏర్పడిన తేదీలకు సంబంధించి సరైన తేదీలు/ సంవత్సరాలను గుర్తించండి.
ఎ. తెలంగాణ లెక్చరర్స్ ఫోరం- 2008, నవంబర్ 26
బి. తెలంగాణ ఐటీ ఫోరం- 2006
సి. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం- 2005, మే 31
డి. తెలంగాణ సెటిలర్స్ ఫ్రంట్- 2008, అక్టోబర్
ఇ. తెలంగాణ ప్రైవేట్ రంగ ఎంప్లాయీస్ అసోసియేషన్- 2008, జూన్ 15
1) ఎ, బి, సి, డి, ఇ
2) ఎ, బి, సి, డి
3) ఎ, బి, డి, ఇ
4) బి, సి, డి, ఇ
సమాధానాలు
1-2, 2-3, 3-2, 4-4,
5-2, 6-2, 7-3, 8-4,
9-3, 10-1, 11-4, 12-1,
13-4, 14-4, 15-3, 16-2,
17-1, 18-3, 19-3, 20-3,
21-2, 22-3.
గందె శ్రీనివాస్
విషయ నిపుణులు
Dream Warriors Academy
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు