Economy- Groups Special | భారతదేశంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ల ప్రధాన విధి?
1. కింది వాటిని జతపర్చండి.
అంతర్జాతీయ సిద్ధాంతం రూపకర్త
ఎ. నిరపేక్ష ప్రయోజన సిద్ధాంతం 1. ఆడమ్ స్మిత్
బి. తులనాత్మక వ్యయ వ్యత్యాసాల సిద్ధాంతం 2. డేవిడ్ రికార్డో
సి. ఆధునిక అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతం 3. హెక్స్చర్, ఓహ్లిన్
4. కైరన్ క్రాస్
1) ఎ-2, బి-3, సి-4 2) ఎ-1, బి-3, సి-2
3) ఎ-1, బి-2, సి-4 4) ఎ-1, బి-2, సి-3
2. అమెరికాలో మూలధన వస్తువుతో పాటు శ్రమసాంద్రత వస్తువులను కూడా ఎగుమతి చేస్తుందని గుర్తించారు. దీన్ని ఏ వైపరీత్యం అంటారు?
1) లియోన్టిఫ్ 2) పాల్స్ట్రీటన్
3) టాసిగ్ 4) గున్నార్ మిర్దాల్
3. అటార్కి అంటే?
1) విదేశీ వర్తకం ప్రోత్సాహం
2) విదేశీ వర్తకం లేని దేశాలు
3) విదేశీ వర్తకంలో రక్షణాత్మక విధానం
4) విదేశీ వర్తకంలో సుంకపు
రేట్లను పెంచడం
4. 1984లో ఏ కమిటీ విదేశీ వర్తకాన్ని ప్రోత్సహించడానికి ఒక పాలసీని ప్రకటించి ఎగుమతులను ప్రోత్సహించాలని సిఫారసు చేశారు?
1) ఎస్ఎస్ తారాపోర్
2) సీ రంగరాజన్
3) అబీబ్ హుస్సేన్
4) మన్మోహన్ సింగ్
5. భారతదేశంలో మొదటి విదేశీ వర్తక విధానం (ఎగ్జిమ్ పాలసీ) ఎన్ని సంవత్సరాలకు రూపొందించారు?
1) 3 2) 5 3) 10 4) 15
6. వ్యాపార శేషం అంటే ఏమిటి?
1) వస్తు సేవల ఎగుమతులు
2) వస్తు సేవల దిగుమతులు
3) అంతర్గత వ్యాపార లావాదేవీలు
4) వస్తు ఎగుమతులు, దిగుమతులు
7. మూలధన ఖాతాలో రూపాయి మార్పిడికి సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి 1997లో ప్రభుత్వం నియమించిన కమిటీ?
1) గోయిపోరియా కమిటీ
2) సుఖమోయ్ చక్రవర్తి కమిటీ
3) ఎస్ఎస్ తారాపోర్ కమిటీ
4) పద్మనాభన్ కమిటీ
8. కింది వాటిలో సరైనవి గుర్తించండి?
ఎ. 2020లో ప్రపంచ వాణిజ్యంలో సరుకుల ఎగుమతుల్లో భారతదేశం ర్యాంక్ 21
బి. 2020లో ప్రపంచ వాణిజ్యంలో సరుకుల దిగుమతుల్లో భారతదేశం ర్యాంక్ 14
సి. 2020లో ప్రపంచ వాణిజ్యంలో సేవల ఎగుమతుల్లో భారతదేశం ర్యాంక్ 7
డి. 2020లో ప్రపంచ వాణిజ్యంలో సేవల దిగుమతుల్లో భారతదేశం ర్యాంక్ 10
1) ఎ, డి 2) ఎ, బి, సి
3) బి, సి, డి 4) ఎ, బి, సి, డి
9. కృషి ఉడాన్ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1) 2020 2) 2021
3) 2022 4) 2023
10. విదేశీ వ్యాపార విధానం 2015-20 భారతదేశ ఎగుమతుల వాటాను ప్రపంచ ఎగుమతుల్లో 2 శాతం నుంచి ఎంత శాతానికి పెంచాలని లక్ష్యాన్ని నిర్దేశించింది?
1) 3 2) 3.5 3) 2.5 4) 4
11. భారతదేశ విదేశీ చెల్లింపుల స్థితిని మెరుగుపరచడానికి ఉపయోగపడని చర్య?
1) ఎగుమతులపై ఎక్కువ సుంకాన్ని విధించడం
2) దిగుమతి ప్రత్యామ్నాయాన్ని ప్రోత్సహించడం
3) దిగుమతిపై ఎక్కువ సుంకాన్ని విధించడం
4) రూపాయి మూల్యహీనీకరణం
12. విదేశీ దిగుమతులను దేశీయ ఉత్పత్తిలో భర్తీ చేయాలని సూచించే వర్తక, ఆర్థిక విధానం?
1) దిగుమతి ప్రత్యామ్నాయ పారిశ్రామికీకరణ
2) విదేశీ విధానం 3) దిగుమతి వ్యూహం
4) దేశీయ వ్యూహం
13. దేశంలో 1992-93లో సరళీకృత విదేశీ మారక రేటు పద్ధతి (ఎల్ఈఆర్ఎంఎస్)ని ప్రవేశపెట్టింది?
1) రూపాయి పూర్తి మార్పిడి
2) విదేశీ మారక పూర్తి మార్పిడి
3) రూపాయి పాక్షిక మార్పిడి
4) డాలర్ పాక్షిక మార్పిడి
14. నూతన ఆర్థిక సంస్కరణల తర్వాత దేశంలో….
1) విదేశీ మారక నిల్వల తగ్గుదల
2) విదేశీ వ్యవస్థల పెట్టుబడుల పెరుగుదల
3) ఎన్ఆర్ఐ డిపాజిట్ల తగ్గుదల 4) 1, 3
15. ఫోకస్ ప్రొడక్ట్ పథకంలో సరైనవి గుర్తించండి.
ఎ. ఈ పథకంలో ఆరు రకాల వస్తువులు ఎగుమతి చేసేవారు
బి. ఈ పథకంలో ఆరు రకాల వస్తువులు ఎగుమతి చేస్తే 10 శాతం పన్ను రాయితీ లభించేది
సి. ఈ పథకంలో పన్ను రాయితీని 2009లో 13 శాతానికి పెంచారు
1) ఎ, సి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఏదీకాదు
16. ఆర్థిక సర్వే 2021-22 భారత ప్రభుత్వం ప్రకారం దేశంలోని టాప్-10 ఎగుమతి వస్తువుల్లో కింది వాటిలో అత్యధిక శాతం వాటాను కలిగి ఉన్న వస్తువు ఏది?
1) పెట్రోలియం ఉత్పత్తులు
2) ఇనుము-ఉక్కు
3) ఎలక్ట్రిక్ యంత్రాలు
4) బంగారం, ఆభరణాలు
17. ఏ సంవత్సరంలో భారత విదేశీ వాణిజ్యంలో ఎగుమతుల విలువ దిగుమతుల కంటే ఎక్కువగా ఉంది?
ఎ. 1972-73 బి. 1976-77
సి. 1980-81 డి. 1982-83
1) ఎ, సి 2) సి, డి
3) బి, సి 4) ఎ, బి
18. 2022లో భారతదేశం అత్యధికంగా ఎగుమతులు చేస్తున్న మొదటి మూడు దేశాలేవి?
1) యూఏఈ, యూఎస్ఏ, నెదర్లాండ్స్
2) యూఎస్ఏ, యూఏఈ, సింగపూర్
3) యూఎస్ఏ, యూఏఈ, నెదర్లాండ్స్
4) యూఏఈ, సింగపూర్, నెదర్లాండ్స్
19. 2022లో భారతదేశం ఇతర దేశాల్లో చేసిన దిగుమతులను ఆధారంగా దేశాలను అవరోహణా క్రమంలో అమర్చండి?
ఎ. చైనా బి. యూఏఈ
సి. యూఎస్ఏ డి. రష్యా
1) ఎ, బి, సి, డి 2) సి, బి, ఎ, డి
3) ఎ, బి, సి, డి 4) డి, సి, బి, ఎ
20. అంతర్జాతీయ ద్రవ్యత్వ సమస్య నివారణకు ‘స్పెషల్ డ్రాయింగ్ రైట్స్’ను ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది?
1) 1969 2) 1976
3) 1973 4) 1974
21. విశేష్ కృషి ఉపాజ్ యోజన ప్రారంభమైన సంవత్సరం?
1) 2002-03 2) 2004-05
3) 2005-06 4) 2006-07
22. వ్యాపార బిందువు (ట్రేడ్ పాయింట్) అంటే ఏమిటి?
1) కేంద్రీకృతంగా నియమితమైన స్టాక్ మార్కెట్
2) ఎగుమతులు ప్రముఖంగా కలిగిన వ్యవస్థ
3) ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ డేటా నెట్వర్క్
4) భారత ఆర్థిక సంస్థల సమీక్ష
23. కింది వాటిలో సరికానిది గుర్తించండి.
ఎ. ప్రత్యేక ఆర్థిక మండళ్లను ప్రవేశపెట్టిన దేశం అమెరికా
బి. భారతదేశంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ల చట్టం చేసిన సంవత్సరం 2005
సి. భారతదేశంలో ప్రత్యేక ఆర్థిక మండళ్లు అమల్లోకి వచ్చిన సంవత్సరం 2006
1) ఎ, బి, సి 2) ఎ, సి
3) ఎ, బి 4) బి, సి
24. భారతదేశంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ల ప్రధాన విధి?
1) గ్రామీణ యువతకు ఉద్యోగిత, గ్రామీణ నవకల్పనను ప్రోత్సహించడం
2) విదేశీ పెట్టుబడిని పెంపొందించి ఎగుమతుల కోసం ఏ సమస్యల్లేని వాతావరణాన్ని కల్పించడం
3) విదేశీ మూలధన తరలింపును ప్రోత్సహించి ఏ సమస్యల్లేని దిగుమతి వాతావరణాన్ని కల్పించడం
4) అంకుర సంస్థలకు ఐదేండ్ల పాటు ప్రోత్సహించడం
25. వ్యాపార చెల్లింపుల శేషం అకౌంట్లో అదృశ్య అంశాలు అంటే ఏమిటి?
1) వస్తు లావాదేవీలు
2) సేవ లావాదేవీలు
3) భౌతికపరమైన లావాదేవీలు
4) ఏకపక్ష లావాదేవీలు
26. అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించిన భారత ఆర్థిక వ్యవస్థ అనుభవం ఏమిటి?
1) వర్తక మిగులు 2) వర్తక లోటు
3) వర్తక సమతుల్యం
4) వ్యాపార చెల్లింపుల శేష సమతుల్యం
27. సెజ్‌లు, వాటి స్థలాలను జతపర్చండి.
ఎ. ఐటీ/ఐటీఈఎస్ 1. నానక్‌రాం గూడ
బి. ఏరోస్పేస్ 2. ఆదిబట్ల
సి. ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ 3. మహేశ్వరం
డి. బయోటెక్ 4. శామీర్‌పేట్
1) ఎ-2, బి-3, సి-1, డి-4
2) ఎ-3, బి-2, సి-4, డి-1
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-2, బి-1, సి-3, డి-4
28. కింది వాటిలో సరైనవి గుర్తించండి?
ఎ. మూల్య వృద్ధి (అప్రిషియేషన్) అంటే డాలర్‌తో పోలిస్తే రూపాయి బలపడటం
బి. మూల్య వృద్ధి వల్ల ఎగుమతిదారులు నష్టపోతారు
1) ఎ, బి 2) బి
3) ఎ 4) ఏదీకాదు
29. కింది వాటిలో సరైనవి గుర్తించండి?
ఎ. మూల్య క్షయం (డిప్రిషియేషన్) అంటే డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటం
బి. మూల్య క్షయం వల్ల ఎగుమతిదారులు లాభపడతారు
1) ఎ, బి 2) బి 3) ఎ 4) ఏదీకాదు
30. 2021-22 ఆర్థిక సర్వే ఆధారంగా ప్రపంచంలో అత్యధిక విదేశీ రుణం గల మొదటి మూడు దేశాలు?
1) చైనా, భారత్, రష్యా
2) భారత్, చైనా, రష్యా
3) రష్యా, చైనా, భారత్
4) చైనా, రష్యా, భారత్
31. BOPలో అత్యధికంగా రుణాత్మకతను నమోదు చేసుకున్న ఖాతా?
1) మూలధన ఖాతా 2) ప్రస్తుత ఖాతా
3) దృశ్య ఖాతా 4) అదృశ్య ఖాతా
32. ప్రస్తుత ఖాతా రుణాత్మకత తగ్గించడానికి సహకరించే చర్య?
1) ఎగుమతులు పెంచడం
2) దిగుమతులపై నియంత్రణ
3) విదేశీ పర్యాటకులను ఆకర్షించడం
4) పైవన్నీ
33. విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో గల కరెంట్ అకౌంట్లోని ‘అదృశ్యాంశాలు’లో భాగం కానిది ఏది?
1) విదేశీ ట్రావెల్ 2) రవాణా
3) బీమా
4) విదేశీ బ్యాంకుల నుంచి రుణాలు
34. టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ దేన్ని తెలుపుతుంది?
1) ఎగుమతుల రాబడి కంటే దిగుమతుల వ్యయం ఎక్కువ ఉండటం
2) వ్యాపార ఒప్పందం
3) ఎగుమతి ధరలు, దిగుమతి ధరల నిష్పత్తి
4) BOP సమస్యను అధిగమించడానికి ఇచ్చే రుణాలపై గల షరతులు
35. టారిఫ్‌కు సంబంధించి సరైనది?
1) దీన్ని భౌతిక పరిమాణం లేదా విలువపై విధించవచ్చు
2) ప్రభుత్వ రాబడి పెంచడానికి విధించవచ్చు
3) దేశీయ పరిశ్రమ రక్షణకు విధించవచ్చు
4) పైవన్నీ
36. కింది వాటిలో ‘సాఫ్ట్ లోన్ విండో’ ద్వారా రుణాలు అందిస్తున్నది?
1) అంతర్జాతీయ విత్త సంస్థ
2) అంతర్జాతీయ ద్రవ్య నిధి
3) ఆర్బీఐ
4) అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ
37. కింది వాటిలో తప్పుగా విస్తరించబడినది?
1) ఏపీటీపీ- ఆసియా పసిఫిక్ ట్రేడ్ అగ్రిమెంట్
2) ఎన్ఏఎంఏ- నాన్ అగ్రికల్చరల్ మార్కెట్ యాక్సెస్
3) జీఏటీటీ- జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్
4) ఎంఎఫ్ఏ- మల్టీ ఫైబర్ అరెంజ్మెంట్స్
38. అభివృద్ధి చెందుతున్న దేశానికి ఏ రూపంలో విదేశీ పెట్టుబడి ఉండాలి?
1) ప్రవాస పౌరులు పంపించిన సొమ్ము
2) పోర్ట్‌ఫోలియో నిధులు
3) ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు
4) మార్కెట్ రుణాలు
39. జీఏటీటీ అనేది అధికారికంగా డబ్ల్యూటీవోగా మారిన సంవత్సరం?
1) 1994 2) 1995
3) 1996 4) 1993
40. రెండో సారి రూపాయిని మూల్యహీనీకరణ చేసింది?
1) 1991, జూన్
2) 1991, జూలై
3) 1949, సెప్టెంబర్
4) 1966, జూన్
జవాబులు
1-4, 2-1, 3-2, 4-3,
5-1, 6-4, 7-3, 8-4,
9-1, 10-2, 11-3, 12-1,
13-3, 14-2, 15-3, 16-1, 17-4, 18-3, 19-3, 20-1, 21-2, 22-2, 23-4, 24-2, 25-2, 26-2, 27-3, 28-1, 29-1, 30-4, 31-3, 32-1, 33-4, 34-3, 35-4, 36-4, 37-3, 38-3, 39-2, 40-4.
పన్నాల శ్రవణ్ కుమార్
ఎకనామిక్స్ ఫ్యాకల్టీ,
9866709280
హైదరాబాద్
సవరణ: అక్టోబర్ 11న ఇదే పేజీలో ప్రచురితమైన 19వ ప్రశ్నలో అడవుల శాతంగా, 20వ ప్రశ్నలో అడవుల విస్తీర్ణంగా చదువుకోగలరు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు