ఉద్యమానికి ఊపిరిలూదిన టీఎన్జీఓలు
తెలంగాణ పోరాట మూలాలు..
# తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాలరాసి ఆంధ్రనాయకుల ఒత్తిడికి లొంగి, తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగించాలన్న ఎస్ఆర్సీ సిఫారసులను కూడా బుట్టదాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. పెద్ద మనుషులు కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఆంధ్రప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి ఉల్లంఘించారు. ఆంధ్రనాయకుల ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని లెక్కచేయలేదు. తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఉద్యోగులు, విద్యార్థులు, మేధావులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తూ ఉద్యమబాట పట్టారు.
# 1958 ప్రారంభంలో రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలు, పెద్దమనుషుల ఒప్పంద ఉల్లంఘన, ప్రాంతీయ కమిటీ ఏర్పాటులో ఆలస్యం తదితర అంశాలపై పోరాటడానికి రాజకీయాలకు అతీతంగా పెద్దలంతా కలిసి తెలంగాణ మహాసభ వేదికను ప్రారంభించారు. రాష్ట్రం ఏర్పడిన ఏడాదిన్నరలోపే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రయోజనాలు రక్షించబడవని నిర్ణయానికి వచ్చి తెలంగాణను వేరుచేయాలని కోరుతూ రాష్ట్రపతికి 1958లోనే తెలంగాణ మహాసభ విజ్ఞప్తి చేసింది. అయినా అన్యాయాలు, పెద్దమనుషుల ఒప్పంద ఉల్లంఘనలు అదేవిధంగా కొనసాగుతుండటంతో 1961లో ప్రధాని నెహ్రూకు, 1967లో హైదరాబాద్ సందర్శించిన నాటి ఉపరాష్ట్రపతి వీవీ గిరికి తెలంగాణ మహాసభ వినతిపత్రం సమర్పించింది.
# సుప్రీం కోర్టు తీర్పులను, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, తెలంగాణ ప్రాంతీయ కమిటీ సిఫారసులను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీఎన్జీఓ), తెలంగాణ రక్షణల యూనియన్ (తెలంగాణ సేఫ్ గార్డ్) అమలు కోసం 1968 జూలై నుంచి శ్రీకారం చుట్టింది.
తెలంగాణ హామీల దినం
# కేఆర్ ఆమోస్ ఆధ్వర్యంలోని టీఎన్జీఓ యూనియన్ 1968, జూలై 10న తెలంగాణ హామీల దినం నిర్వహించింది. ఉద్యోగుల రక్షణలను ప్రభుత్వం యథేచ్ఛగా ఉల్లంఘించడం, ముల్కీ నిబంధనలు ఉల్లంఘించడం, కోర్టు తీర్పులను, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, ఉత్తర్వులను అమలు చేయకపోవడం, బోగస్ ముల్కీ సర్టిఫికెట్లపై ఇతర కారణాలతో తెలంగాణ ప్రాంత ఉద్యోగుల్లో వేలాది మంది ఆంధ్రావారిని నియమించడం వంటి కారణంతో టీఎన్జీఓలు ‘తెలంగాణ రక్షణల ఉద్యమం’ ప్రారంభించారు. ఇందులో భాగంగా 1968, జూలై 10న తెలంగాణలోని అన్ని జిల్లాల్లో తెలంగాణ హక్కుల దినం సభలు నిర్వహించారు.
# నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ 1968, ఆగస్టు 18న 209 మందిని (నాన్ ముల్కీ), తాత్కాలికంగా నియమితులైన ఉపాధ్యాయుల సర్వీసులను పర్మినెంట్ చేశారు. వారిని నియమించినప్పుడు ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రూల్స్‌లోని రూల్ 3 ప్రకారం సడలింపు పొందలేదు. వీరంతా హైకోర్టును ఆశ్రయించగా జస్టిస్ చిన్నపరెడ్డి ఈ టీచర్లకు అనుకూలంగా తీర్పునిచ్చారు. జస్టిస్ చిన్నపరెడ్డి నల్లగొండ టీచర్ల రిట్తోపాటు ఇతర రిట్లలో సంయుక్తంగా ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం అప్పీల్ చేసింది. దీనిపై విచారించిన హైకోర్టు బెంచ్ 1969, మార్చి 21న పార్లమెంట్ వీటిని రద్దు చేసేవరకు ముల్కీ రూల్స్ అమల్లో ఉన్నట్లు పరిగణించాలని తీర్పునిచ్చింది. తెలంగాణ ఉద్యోగులపై అన్యాయాలు, చట్టాల తీర్పుల ఉల్లంఘనలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోపక్క కోర్టులో వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ముల్కీ నిబంధనలు, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టంలోని నిబంధనలు చెల్లుతాయని, చెల్లవని విభిన్న తీర్పులు వెలువడుతూనే ఉన్నాయి. మరోపక్క 1968, జూలై నుంచి టీఎన్జీఓలు ప్రారంభించిన ఆందోళన కొత్తగూడెం, ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న నిరసనలు, 1969 జనవరి 3వ వారం నాటికి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను ముందుకు తెచ్చింది. 1969 తెలంగాణ ఉద్యమానికి పునాదిగా తెలంగాణ రక్షణల ఉద్యమంగా పేర్కొనవచ్చు.
హైదరాబాద్ నాన్‌గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్
# 1956లో ఆధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు నుంచే తమకు జరుగుతున్న అన్యాయాలపై తెలంగాణ ప్రాంత ఉద్యోగులు స్పందించడం మొదలుపెట్టారు. పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగులు, హైదరాబాద్ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ను ఏర్పాటుచేసుకుని తమ హక్కుల కోసం పోరాడారు.
# ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా తెలంగాణ ఉద్యోగులు తమకు జరుగుతున్న అన్నాయాలపై ఎప్పటికప్పడు హెచ్ఎన్జీఓ అధ్యక్ష కార్యదర్శులైన గోవిందరాజ్ పిళ్లె, సురేంద్రనాథ్ నాగర్చెట్టి దృష్టికి తీసుకెళ్లేవారు. సురేంద్రనాథ్, కేఆర్ ఆమోస్ కలిసి ఉద్యోగుల సమస్యలను వివరిస్తూ రిప్రజెంటేషన్స్ తయారుచేసి సంబంధింత శాఖ మంత్రులకు, ఉన్నతాధికారులకు ఇచ్చి వాటి పరిష్కారం కోసం ప్రయత్నించేవారు. 1953లో హైదరాబాద్ ప్రభుత్వంలో (సెక్రటేరియట్) ఇండస్ట్రియల్ ట్రస్ట్ ఫండ్‌లో టైపిస్టుగా ఆమోస్ చేరారు. హెచ్ఎన్జీఓ కార్యదర్శి సురేంద్రనాథ్ కూడా పరిశ్రమల శాఖలో సెక్షన్ ఆఫీసర్‌గా ఉండేవారు.
# ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత ఏదో రకంగా ఆంధ్ర అధికారుల వివక్షకు లేదా వేధింపులకు గురికాని తెలంగాణ ఉద్యోగి లేడంటే అతిశయోక్తి కాదు. ఉద్యోగుల సమస్యలను వేధింపులను గురించి 1958లో ఏర్పడిన తెలంగాణ రీజినల్ కమిటీ దృష్టికి హెచ్ఎన్జీవో నాయకులైన సురేంద్రనాథ్, ఆమోస్లు తీసుకెళ్లేవారు. ఉద్దేశపూర్వకంగానే ఆంధ్ర నాయకులు ప్రాంతీయ కమిటీ పరిధిలోకి ఉద్యోగుల అంశం రాకుండా రాష్ట్రపతి ఉత్తర్వులు తయారుచేయించారు. ప్రాంతీయ కమిటీ ఉద్యోగుల గురించి ఎప్పుడైనా సిఫారసు చేసినా ప్రభుత్వం పట్టించుకునేది కాదు. పైగా ఉద్యోగుల సంగతి మీకెందుకని ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, ఆంధ్ర మంత్రులు ఎదురు ప్రశ్నించేవారు.
టీఎన్జీఓ ఆవిర్భావం
# తమ హక్కుల కోసం తామే పోరాడాలని నిర్ణయానికి వచ్చిన కేఆర్ ఆమోస్ 1964-65లో హైదరాబాద్ ఎన్జీఓ యూనియన్ను తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్‌గా (టీఎన్జీఓ) మార్చారు. ఆయనే ఆ సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షులుగా 1969 వరకు కొనసాగారు.
సర్వీస్ రూల్స్ ఉల్లంఘనపై పోరాటం
# ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి తెలంగాణ ఉద్యోగులకు ఇబ్బందులు, అన్యాయాలు మొదలయ్యాయి. తొలి నాళ్లలోనే ఆంధ్ర అధికారుల వివక్షాపూరిత ఉత్తర్వులు, ఆదేశాలకు వ్యతిరేకంగా ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఆయా విషయాల్లో కోర్టుల తీర్పులను కూడా ఆంధ్ర అధికారులు ఖాతరు చేయలేదు. తెలంగాణ ప్రాంతీయ కమిటీది అరణ్య రోదనే అయ్యింది.
నాన్‌ముల్కీ ఉద్యోగుల తొలగింపుకై జీఓ
# టీఎన్జీఓ అధికారుల సంఘం 1964-65 నాటి నుంచి తెలంగాణ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలపై గొంతువిప్పింది. ముఖ్యమంత్రికి, సంబంధిత మంత్రులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చారు. తెలంగాణ రక్షణలు ఉల్లంఘించబడుతున్నాయని సెక్రటేరియట్, శాఖాధిపతుల కార్యాలయాల్లో తెలంగాణ వారికి కేటాయించిన ఉద్యోగాల్లో ఆంధ్రవారిని నియమిస్తున్నారని ఆమోస్ ఆధ్వర్యంలోని టీఎన్జీఓలు ఆందోళన చేయడంతో 1968, ఏప్రిల్ 30న ముల్కీలకు కేటాయించిన ఉద్యోగాల్లో నియమితులైన నాన్ ముల్కీలను వెనక్కి పంపాలని సెక్రటేరియట్, శాఖాధిపతులను ఆదేశిస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది.
1969 ఉద్యమ మార్గదర్శులు
# తొలిదశ ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ అంతటికి వ్యాపింపజేసిన ఘనత కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రంలోని తెలంగాణ ఉద్యోగ నాయకులు, వారికి మార్గదర్శకత్వం వహించిన టీఎన్జీఓ పాల్వంచ అధ్యక్షుడు వీఎల్ నరసింహారావు, ఇల్లందుకు చెందిన కొలిశెట్టి రామదాసు, ఉపాధ్యాయ సంఘం నేత కే రామసుధాకర్ రాజులకు దక్కుతుంది. వీఎల్ నరసిం
కొలిశెట్టి రామదాసు
# 1969 ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ రాష్ట్రం సాధించేదాకా ఆపకూడదనే ఆలోచనచేసి మొదటిసారిగా కార్యాచరణకు పూనుకున్నది ఖమ్మం జిల్లా, ఇల్లందు దగ్గరి గేటుకారేవల్లికి చెందిన కొలిశెట్టి రామదాసు. ఆంధ్ర ఆధిపత్య వాదులతో ఇబ్బందులు, వివక్ష, నిర్లక్ష్యానికి, అవమానాలకు గురైన తెలంగాణ వారికి, 1954-56లో విశాలాంధ్ర వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని విఫలమై అసంతృప్తికి, అశాంతికి గురైన ఇంకెందరికో తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే ఆలోచన 1956 నుంచే ఉండి ఉంటుందనడంలో సందేహం లేదు. కానీ దాన్ని అమలు చేయడానికి కష్టాలనెదుర్కోవడానికి సిద్దమై ఒక్కొక్కరిని చేరదీసి, జిల్లాలన్ని తిరిగి, నాయకులు, కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులను కలిసి 1969 జనవరిలో ఖమ్మంలో డిగ్రీ విద్యార్థి రవీంద్రనాథ్‌తో రెండు వారాలు ఆమరణ దీక్ష చేయించిన మార్గదర్శి కొలిశెట్టి రామదాసు.
# అప్పటి ఉద్యమంలో చురుగ్గా పాల్గొని నాయకత్వం వహించిన మరి చెన్నారెడ్డి, పురుషోత్తమరావు, డా. మల్లికార్జున్, శ్రీధర్‌రెడ్డి, కేఆర్ ఆమోస్, ముశ్చర్ల సత్యనారాయణ, ఆ ఉద్యమాన్ని అణచడానికి ప్రయత్నించిన నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, వీబీ రాజు, జలగం వెంగళరావు వంటి వారికి మాత్రమే కొలిశెట్టి రామదాసు గురించి తెలుసు.
# రామదాసు ఖమ్మం ఆర్ట్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి అప్రెంటిస్‌గా సింగరేణి బెల్లంపల్లి బొగ్గు గనుల్లో కొంతకాలం పనిచేశారు. తర్వాత పై చదువులకోసం మద్రాసు వెళ్లారు. అక్కడ రెండేండ్లు ఉండి డిప్లొమా చేసి ఇల్లందుకు వచ్చారు. రామదాసు విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే నాయకుడిగా పనిచేయడంతో ఇల్లందులో బాగా ప్రజాదరణ ఉండేది.
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






