భారత రాజ్యాంగం – కీలకాంశాలు
చాప్టర్ 1: భారత రాజ్యాంగ పరిణామక్రమం స్వభావం, విశిష్ట లక్షణాలు ప్రవేశిక
ఈ చాప్టర్‌ను కింది విధంగా అధ్యయనం చేయాలి. అవి 1) భారత రాజ్యాంగ పరిణామ క్రమం అంటే భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం 2) రాజ్యాంగ పరిషత్ 3) భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు 4) రాజ్యాంగ ప్రవేశిక
భారత రాజ్యాంగ పరిణామ క్రమం: ఈ టాపిక్‌లో అభ్యర్థులకు భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం గురించి పూర్తి అవగాహన ఉండాలి. అంటే బ్రిటిష్ పాలన కాలం నుంచి కాలక్రమంలో భారత రాజ్యాంగ రచనకు దారితీసిన పరిస్థితులు, బ్రిటిష్ పాలనకాలంలో చేసిన వివిధ చట్టాల గురించి పూర్తి అవగాహన ఉండాలి. ముఖ్యంగా కింది చట్టాల గురించి విపులంగా తెలుసుకోవాలి.
1.రెగ్యులేటింగ్ చట్టం- 1773
2.పిట్స్ ఇండియా చట్టం- 1784
3.చార్టర్ చట్టం- 1813
4.చార్టర్ చట్టం- 1833
5.చార్టర్ చట్టం- 1853
6.భారత ప్రభుత్వ చట్టం- 1858
7.భారత కౌన్సిల్ చట్టం- 1861
8.భారత కౌన్సిల్ చట్టం- 1909 (మింటో మార్లే సంస్కరణల చట్టం)
9. భారత ప్రభుత్వ చట్టం- 1919 (మాంటేగ్ ఛేమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం)
10. భారత ప్రభుత్వ చట్టం- 1935
11. భారత స్వాతంత్య్ర చట్టం- 1947
పై చట్టాల్లోని ముఖ్యాంశాలను, పై చట్టాలపై ప్రముఖుల విమర్శలను అభ్యర్థులు అధ్యయనం చేయాలి. అంతే కాకుండా కింది వాటిని కూడా చదవాలి.
1.సైమన్ కమిషన్- 1927
2.లార్డ్ బిర్కెన్ హెడ్ సవాల్ నెహ్రూ రిపోర్టు- 1928
3.ఆగస్టు ప్రతిపాదనలు- 1940
4.క్రిప్స్ ప్రతిపాదనలు- 1942
5.సీఆర్ ఫార్ములా- 1944
6. వేవెల్ ప్రణాళిక- 1945
7.సిమ్లా సమావేశం- 1945
8. క్యాబినెట్ మిషన్ ప్లాన్- 1946
9.అట్లీ ప్రకటన- 1947
10. మౌంట్ బాటన్ ప్లాన్- 1947
పై అంశాల ప్రాముఖ్యాన్ని ఈ టాపిక్ కింద అభ్యర్థులు అధ్యయనం చేయాలి. తద్వారా ఈ చాప్టర్‌ను అభ్యర్థులు సంపూర్ణంగా అధ్యయనం చేసినట్లు అవుతుంది.
స్వాతంత్ర భారత ప్రథమ ప్రభుత్వం
పేరు శాఖ
1. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి, విదేశీ వ్యవహారాలు
2. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉపప్రధాని, హోంశాఖ, సర్వీసులు
3. డా. బాబూ రాజేంద్ర ప్రసాద్ వ్యవసాయం, ఆహార శాఖ
4. మౌలానా అబుల్‌కలాం ఆజాద్ విద్యాశాఖ
5. డా. బీఆర్ అంబేద్కర్ న్యాయశాఖ
6. సర్దార్ బల్దేవ్సింగ్ రక్షణశాఖ
7. షణ్ముఖం శెట్టి ఆర్థిక శాఖ
8. జాన్ మథాయ్ రైల్వేశాఖ
9. రఫీ మహమ్మద్ ఖిద్వాయ్ కమ్యూనికేషన్ శాఖ
10. డా.శ్యాంప్రసాద్ ముఖర్జి పరిశ్రమల శాఖ
11. రాజ్‌కుమారి అమృత్‌కౌర్ ఆరోగ్యశాఖ (మొదటి మహిళామంత్రి)
12. సీహెచ్ బాబా వాణిజ్యశాఖ
13. ఎన్వీ గాడ్గిల్ గనుల శాఖ
14. బాబూ జగ్జీవన్‌రామ్ కార్మిక శాఖ
రాజ్యాంగ పరిషత్
భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితుల గురించి, రాజ్యాంగ పరిషత్ కూర్పు, వివిధ కమిటీలు, వాటి నిర్మాణం, రాజ్యాంగ పరిషత్ పని విధానం, సమావేశాల వివరాలు, భారత రాజ్యాంగానికిగల ప్రధాన మూలాధారాలు అంటే భారత రాజ్యాంగంలోని వివిధ అంశాలను వేటి నుంచి తీసుకున్నారు లాంటి అంశాలను అభ్యర్థులు విపులంగా తెలుసుకోవాలి. అంతే కాకుండా రాజ్యాంగ రచనపై, రాజ్యాంగ పరిషత్‌పై ప్రముఖుల అభిప్రాయాలు తెలుసుకోవాలి.
రాజ్యాంగ పరిషత్‌లోని కమిటీలు, వాటి అధ్యక్షులు
1. సారధ్య సంఘం డా. బాబూ రాజేంద్ర ప్రసాద్
2. నియమ నిబంధనల కమిటి డా. బాబూ రాజేంద్ర ప్రసాద్
3. జాతీయపతాకంపై
తాత్కాలిక కమిటీ డా. బాబూ రాజేంద్ర ప్రసాద్
4. ఆర్థిక, స్టాఫ్ కమిటీ డా. బాబూ రాజేంద్ర ప్రసాద్
5. ముసాయిదా కమిటీ డా. బీఆర్ అంబేద్కర్
6. సలహా సంఘం సర్దార్ వల్లభాయ్ పటేల్
7. ప్రాథమిక హక్కుల కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్
8. అల్ప సంఖ్యాక వర్గాల కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్
9. రాష్ట్రాల అధికారాల కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్
10. రాష్ట్రాల రాజ్యాంగ కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్
11. కేంద్ర రాజ్యాంగ కమిటీ జవహర్లాల్ నెహ్రూ
12. యూనియన్ పవర్స్ కమిటీ జవహర్లాల్ నెహ్రూ
13. రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ జవహర్లాల్ నెహ్రూ
14. ప్రాథమిక హక్కుల ఉపకమిటీ జేబీ కృపలానీ
15. అల్పసంఖ్యాక వర్గాల ఉపకమిటీ డా. హెచ్‌సీ ముఖర్జి
16. హౌజ్ కమిటీ పట్టాభి సీతారామయ్య
17. రాజ్యాంగ పరిషత్ విధుల కమిటీ జీబీ మౌలాంకర్
18. క్రెడెన్షల్ కమిటీ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
19. రాజ్యాంగ ముసాయిదాప్రత్యేక కమిటీ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
20. ఈశాన్య రాష్ట్రాల హక్కుల కమిటీ గోపీనాథ్ బోర్డోలా
21. సుప్రీంకోర్టుపై తాత్కాలిక కమిటీ వరదాచార్య
(వీరు రాజ్యాంగ సభ్యులు కారు)
22. ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ డా. కేఎం మున్షీ
భారత రాజ్యాంగం – ప్రధాన మూలాధారాలు
అధారం గ్రహించబడిన అంశం
1. భారత ప్రభుత్వ 1. సమాఖ్య వ్యవస్థ
చట్టం-1935 2. కేంద్ర, రాష్ర్ట సంబంధాలు
3. అత్యవసర అధికారాలు
4. యూపీఎస్సీ
5. ఉద్యోగస్వామ్యం
2. బ్రిటన్ 1. ఏక పౌరసత్వం
2. సమన్యాయ పాలన
3. ఏకీకృత న్యాయవ్యవస్థ
4. పార్లమెంట్ నిర్మాణం
5. క్యాబినెట్ ప్రభుత్వం
6. స్పీకర్
7.శాసన ప్రక్రియ
8. ఎన్నికల యంత్రాంగం
9. దేశాధిపతి నామమాత్ర అధికారిగా వ్యవహరించడం
3. అమెరికా 1. ప్రాథమిక హక్కులు
2. రాజ్యాంగ ఆధిక్యత
3. న్యాయ సమీక్ష
4. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయవ్యవస్థ
5. రాజ్యాంగ ప్రవేశిక
6. దేశాధిపతి పేరు మీద దేశ పరిపాలన నిర్వహించడం
7. ఉపరాష్ర్టపతి పదవి, ఎగువసభకు అధ్యక్షులుగా వ్యవహరించడం
8. రాష్ర్టపతిని, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను పదవి నుంచి తొలగించే పద్ధతి
4. ఐర్లాండ్ 1. ఆదేశిక సూత్రాలు
2. రాష్ర్టపతి ఎన్నిక పద్ధతి
3. రాజ్యసభకు రాష్ర్టపతి 12 మంది సభ్యుల్ని నియమించడం
5. కెనడా 1. సమాఖ్య నిర్మాణం, అవశిష్టాధికారాలు కేంద్రానికిచెందడం, బలమైన కేంద్రప్రభుత్వం
2. గవర్నర్ల నియామకం
6. ఆస్ట్రేలియా 1. ఉమ్మడి జాబితా
2. వ్యాపార, వాణిజ్య చట్టాలు
3. భాష
4. ఉభయ సభల సంయుక్త సమావేశం
7. జపాన్ 1. చట్టంచే నిర్ధారించబడిన పద్ధతి
2. అత్యవసర పరిస్థితి కాలంలో జీవించేహక్కును రద్దు చేయకుండటం
8. జర్మనీ 1. అత్యవసర పరిస్థితి కాలంలో అనుసరించే పద్ధతులు
2. ప్రాథమిక హక్కుల్ని సస్పెండ్ చేయడం
9. దక్షిణాఫ్రికా 1. రాజ్యాంగ సవరణ పద్ధతులు
10. రష్యా 1. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించడం(యూఎస్ఎస్ఆర్)
2. ప్రాథమిక విధులు
11. ఫ్రాన్స్ 1. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం
2. రిపబ్లిక్ పద్ధతి
12. నార్వే 1. ఎగువసభ సభ్యులను, దిగువ సభ సభ్యులు ఎన్నుకొనే పద్ధతి
రాజ్యాంగ ప్రవేశిక
ఈ టాపిక్‌లో రాజ్యాంగ ప్రవేశికలోని ప్రతి పదం, దాని ప్రాముఖ్యాన్ని అధ్యయనం చేయాలి. రాజ్యాంగ ప్రవేశికను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడిన అంశాలు రాజ్యాంగ ప్రవేశికపై ప్రముఖుల అభిప్రాయాలు తెలుసుకోవాలి. ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగమా? కాదా? అనే చర్చను, సుప్రీంకోర్టు తీర్పులను గమనించాలి. తద్వారా ఈ చాప్టర్‌ను అభ్యర్థులు సమగ్రంగా అధ్యయనం చేసినట్లవుతుంది.భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకొనేందుకు, పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనల్లో స్వాతంత్య్రాన్ని, అంతస్తులోను, అవకాశాల్లోను సమానత్వాన్ని చేకూర్చడానికి, వారందరిలో వ్యక్తిగౌరవమును, జాతీయ సమైక్యతను, సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి సత్యనిష్ఠపూర్వకంగా తీర్మానించుకొని, 1949 నవంబరు 26న మా రాజ్యాంగ పరిషత్‌లో ఆమోదించి, శాసనంగా రూపొందించుకొన్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకొంటున్నాం
భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు
ఈ టాపిక్‌లో అభ్యర్థులు భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలను అధ్యయనం చేయాలి.
1.లిఖిత, సుదీర్ఘ రాజ్యాంగం
2.రాజ్యాంగ ప్రవేశిక
3. లౌకిక రాజ్యాంగం
4.ప్రాథమిక హక్కులు
5.ప్రాథమిక విధులు
6.ఆదేశిక సూత్రాలు
7.దృఢ, అదృఢ లక్షణాల కలయిక
8.ఏకకేంద్ర, సమాఖ్య లక్షణాల కలయిక
9.రాజ్యాంగ ఆధిక్యత
10. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం
11. సార్వత్రిక వయోజన ఓటు హక్కు
12. స్వతంత్ర ప్రతిపత్తిగల న్యాయవ్యవస్థ
13. న్యాయ సమీక్షాధికారం
14. స్వతంత్ర ప్రతిపత్తిగల రాజ్యాంగబద్ధ కమిషన్లు
15. ప్రత్యేక వర్గాలకు ప్రత్యేక అవకాశాలు
16. ఏకీకృత లేదా సమీకృత న్యాయవ్యవస్థ
17. ఏక పౌరసత్వం
రాజ్యాంగం అమలునాటికి మన రాజ్యాంగంలోని అంశాలు, ప్రస్తుత అంశాలు
1950లో 2015లో
1. అధికరణలు 395 465
2. షెడ్యూల్స్ 8 12
3. భాగాలు 22 25
మాదిరి ప్రశ్నలు
1.ప్రారంభంలో రాజ్యాంగంలో ఎన్ని భాగాలున్నాయి? (బి)
ఎ) 20 బి) 22 సి) 25 డి) 19
2.ప్రస్తుతం రాజ్యాంగంలో ఎన్ని భాగాలున్నాయి? (సి)
ఎ) 20 బి) 22 సి) 25 డి) 19
3.ప్రారంభంలో రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూళ్లున్నాయి? (డి)
ఎ) 12 బి) 10 సి) 9 డి) 8
4.ప్రారంభంలో రాజ్యాంగంలో ఎన్ని ప్రకరణలున్నాయి? (సి)
ఎ) 394 బి) 393 సి) 395 డి) 398
5.ప్రస్తుతం రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూళ్లున్నాయి? (ఎ)
ఎ) 12 బి) 10 సి) 9 డి) 8
మాదిరి ప్రశ్నలు
1.ప్రవేశిక అనే భావనను ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించారు? (బి)
ఎ) బ్రిటన్ బి) అమెరికా
సి) రష్యా డి) జపాన్
2.ఇప్పటి వరకు ప్రవేశికను ఎన్నిసార్లు సవరించారు? (ఎ)
ఎ) ఒకసారి బి) మూడుసార్లు
సి) రెండుసార్లు డి) అసలు సవరించలేదు
3.భారత ప్రజలు ఎంతో కాలంగా కన్న కలల సాకారమే రాజ్యాంగ ప్రవేశిక అని వ్యాఖ్యానించింది ఎవరు? (బి)
ఎ) జవహర్లాల్ నెహ్రూ
బి) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
సి) అంబేద్కర్
డి) గోపాలస్వామి అయ్యంగార్
4.ఏ కేసులో ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది? (బి)
1. కేశవానంద భారతి కేసు
2. బెరుబెరి కేసు
ఎ) 1, 2 బి) 1 సి) 2 డి) ఏదీ కాదు
5.రాజ్యాంగ ప్రవేశిక భారత రాజ్యాంగానికి మణిహారం, కంఠాభరణం, కొలమానం వంటిదని వ్యాఖ్యానించింది ఎవరు? (సి)
ఎ) జస్టిస్ ఎస్ఎం సిక్రీ బి) జస్టిస్ హిదయతుల్లా
సి) ఠాగూర్దాస్ భార్గవ డి) జవహర్లాల్ నెహ్రూ
6.రాజ్యాంగానికి ప్రవేశిక ఒక తాళం చెవి వంటిదని వ్యాఖ్యానించినది ఎవరు? (సి)
ఎ) ఫాల్కీవాలా బి) కేఎం మున్షీ
సి) జే డయ్యర్ డి) అంబేద్కర్
7.ప్రవేశిక రాజ్యాంగానికి గుర్తింపు కార్డు వంటిదని వ్యాఖ్యానించినది ఎవరు? (సి)
ఎ) ఎర్నెస్ట్ బార్కర్ బి) జే డయ్యర్ సి) ఫాల్కీవాలా డి) కేఎం మున్షీ
మాదిరి ప్రశ్నలు
1.ఏ తేదీన బాబూ రాజేంద్రప్రసాద్‌ను రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నుకొన్నారు? (ఎ)
ఎ) 1946 డిసెంబర్ 11 బి) 1946 నవంబర్ 11
సి) 1946 నవంబర్ 9 డి) 1946 డిసెంబర్ 9
2.రాజ్యాంగ పరిషత్‌ను ఉద్దేశించి చివరిగా ప్రసంగించింది ఎవరు? (డి)
ఎ) మహాత్మాగాంధీ బి)జవహర్లాల్ నెహ్రూ
సి) అంబేద్కర్ డి) రాజేంద్రప్రసాద్
3.రాజ్యాంగ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటున్నాము? (బి)
ఎ) జనవరి 26 బి) నవంబర్ 26
సి) ఆగస్టు 15 డి) పై అన్ని రోజులు
4.రాజ్యాంగ పరిషత్‌కు శాశ్వత అధ్యక్షునిగా బాబూ రాజేంద్రప్రసాద్ పేరుని సూచించినది ఎవరు? (సి)
ఎ) అంబేద్కర్ బి) జవహర్లాల్ నెహ్రూ
సి) జేబీ కృపలాని డి) టీటీ కృష్ణామాచారి
5.రాజ్యాంగ పరిషత్ నుంచి ఏర్పడిన అతిపెద్ద కమిటీ? (బి)
ఎ) ప్రాథమిక హక్కుల కమిటీ
బి) సలహా సంఘం
సి) జెండా కమిటీ డి) రూల్స్ కమిటీ
6.రాజ్యాంగం వైఫల్యం చెందితే రాజ్యాంగాన్ని నిందించరాదు. దాన్ని అమలు పరిచేవారిని నిందించాలి అని వ్యాఖ్యానించింది ఎవరు? (ఎ)
ఎ) బీఆర్. అంబేద్కర్ బి) జవహర్లాల్ నెహ్రూ
సి) జయప్రకాశ్ నారాయణ్ డి) వల్లభాయ్ పటేల్
7.రాజ్యాంగ సభలో ప్రాతినిధ్యంలేని ప్రజాభిప్రాయం మచ్చుకు కూడా లేదు అని వ్యాఖ్యానించినది ఎవరు? (బి)
ఎ) జయప్రకాశ్ నారాయణ్ బి) కే సంతానం సి) ఓపీ గోయల్ డి) కామత్
మాదిరి ప్రశ్నలు
1.బెంగాల్ గవర్నర్ జనరల్‌ను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎప్పుడు మార్చారు? (సి)
ఎ) 1858 బి) 1883 సి) 1833 డి) 1861
2.మొదటిసారిగా రాష్ర్టాల్లో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టిన చట్టం ఏది? (ఎ)
ఎ) గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం- 1935
బి) మింటోమార్లే సంస్కరణల చట్టం- 1909
సి) గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం- 1919
డి) ఇండియన్ కౌన్సిల్ చట్టం- 1861
3.కింది ఏ ప్రతిపాదనను భారత ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు మాగ్నాకార్టాగా పేర్కొంటారు? (సి)
ఎ) క్రిప్స్ ప్రతిపాదన బి) వేవెల్ ప్రతిపాదన
సి) విక్టోరియా మహారాణి ప్రకటన
డి) క్యాబినెట్ రాయబార ప్రతిపాదన
4.భారత ప్రభుత్వ చట్టం 1935ను బానిసత్వానికి నూతన పత్రంగా వర్ణించిన వారు ఎవరు? (ఎ)
ఎ) జవహర్లాల్ నెహ్రూ బి) సర్దార్ వల్లబాయ్ పటేల్
సి) మహాత్మాగాంధీ డి) ప్రొ. కేటీ షా
5.మొదటి భారత ప్రభుత్వ కార్యదర్శి ఎవరు? (సి)
ఎ) చార్లెస్ ఉడ్ బి) మెకాలే
సి) స్టాన్లీ డి) బెంటింగ్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు