Telangana History March 22 | కాకతీయుల ఆలయాల్లో అతిపెద్ద నిర్మాణం ఏది?
25. ప్రముఖ ఉర్దూ పత్రిక ‘పయాం’ సంపాదకుడు ఖాజీ అబ్దుల్ గఫార్ నడిపిన తెలుగు పత్రిక ఏది?
a) విభూతి b) ఆదిహిందూ
c) తెలంగాణ d) సందేశం
జవాబు: (d)
26. మీజాన్ పేరుతో ఇంగ్లిష్, ఉర్దూ, తెలుగు భాషల్లో పత్రికలు స్థాపించింది ఎవరు?
a) గులాం మహమ్మద్ కలకత్తావాలా
b) షోయబుల్లా ఖాన్
c) ఖాజా అబ్దుల్ గఫార్
d) ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్
జవాబు: (a)
వివరణ: మీజాన్ ఇంగ్లిష్ పత్రిక నిజాం రాజును, ఉర్దూ పత్రిక ముస్లిం లీగ్ రజాకార్లను, తెలుగు పత్రిక నిజాం వ్యతిరేక వాదులను సమర్థించేవి. తెలుగు మీజాన్కు ప్రముఖ రచయిత అడవి బాపిరాజు సంపాదకుడు. మీజాన్ అంటే త్రాసు లేదా తక్కెడ.
27. నిజాం ప్రభుత్వ విధానాలను విమర్శించిన ప్రముఖ ఉర్దూ పత్రిక ‘రయ్యత్’ ఎవరి సంపాదకత్వంలో వెలువడేది?
a) సురవరం ప్రతాపరెడ్డి
b) అడవి బాపిరాజు
c) షోయబుల్లా ఖాన్
d) మందుముల నరసింగరావు
జవాబు: (d)
28. రజాకార్లు చంపిన షోయబుల్లా ఖాన్ సంపాదకత్వం వహించిన పత్రిక ఏది?
a) రయ్యత్ b) పయాం
c) ఇమ్రోజ్ d) మీజాన్
జవాబు: (c)
29. శాతవాహనుల జన్మస్థలం గురించి కింద ఇచ్చిన జతలను పరిశీలించండి.
1. కర్ణాటక: ప్రొఫెసర్ సుక్తంకర్
2. విదర్భ: శ్రీనివాస అయ్యంగార్, జోగెల్కర్
3. మహారాష్ట్ర: వీవీ మిరాసీ
పై వాటిలో సరైన జతలు ఏవి?
a) 1, 2, 3 b) 2, 3
c) 1 d) ఏవీ సరైనవి కాదు
జవాబు: (c)
వివరణ: శాతవాహనులను పురాణాల్లో ఆంధ్రభృత్యులు అని పేర్కొన్నారు. వీరు మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాలను ప్రధానంగా పరిపాలించారు. దీంతో శాతవాహనుల జన్మస్థలంపై వివిధ వాదనలు వెలువడ్డాయి. ప్రొఫెసర్ సుక్తంకర్ కర్ణాటక వాదాన్ని, విష్ణు వాసుదేవ మిరాసీ విదర్భ వాదాన్ని, శ్రీనివాస అయ్యంగార్ జోగెల్కర్ మహారాష్ట్ర వాదాన్ని ముందుకు తెచ్చారు. అయితే శాతవాహనులు ఆంధ్రభృత్యులు కాబట్టి, వీరిని తెలుగు వాళ్లుగా నిర్ణయించారు.
30. కింది రాజవంశాలు, వాటి స్థాపకులను పరిశీలించండి.
ఇక్ష్వాకులు: మొదటి శాంతమూలుడు
బాదామి చాళుక్యులు: మొదటి పులకేశి
తూర్పు (వేంగీ) చాళుక్యులు: రెండో పులకేశి
వేములవాడ చాళుక్యులు: మొదటి అరికేసరి
పై వాటిలో సరైన జతలు ఎన్ని?
a) రెండు మాత్రమే b) మూడు మాత్రమే
c) నాలుగూ సరైనవే d) ఒకటి మాత్రమే
జవాబు: (a)
వివరణ: తూర్పు చాళుక్య వంశ స్థాపకుడు కుబ్జ విష్ణువర్ధనుడు. ఈయన బాదామి చాళుక్యుల్లో ప్రముఖుడైన రెండో పులకేశి సోదరుడు. వేములవాడ చాళుక్యుల మూలపురుషుడు సత్యాశ్రయ రణవిక్రముడు. కాబట్టి మొదటి రెండు జతలు మాత్రమే సరైనవి.
31. వేములవాడ చాళుక్యుల కాలానికి సంబంధించి కింది వివరాలను పరిశీలించండి.
A. విక్రమార్జున విజయం 1. పంపకవి
B. ఆదిపురాణం 2. జినవల్లభుడు
C. కవిజనాశ్రయం 3. సోమదేవసూరి
D. కుర్క్యాల కందపద్యాలు 4. మల్లియ రేచన
కింది వాటిలో సరైన జవాబును ఎంచుకోండి.
a) A- 1, B- 2, C- 3, D-4
b) A- 1, B- 3, C- 4, D- 2
c) A- 1, B- 1, C- 4, D- 2
d) A- 1, B- 1, C- 3, D- 2
జవాబు: (c)
వివరణ: పంపకవికి కన్నడ ఆదికవి అని బిరుదు. ఈయన వేములవాడ చాళుక్య పాలకుడు రెండో అరికేసరి ఆస్థాన కవి. ఈయన కన్నడంలో ‘విక్రమార్జున విజయం’, ‘ఆదిపురాణం’ రచించాడు. ఆదిపురాణం జైన తీర్థంకరుల చరిత్ర. ఈయన తమ్ముడు జినవల్లభుడు కుర్క్యాల బొమ్మలమ్మ గుట్ట మీద శిలా శాసనం వేయించాడు. ఇందులో మూడు కంద పద్యాలు ఉన్నాయి. ఇవి తొలి తెలుగు కంద పద్యాలు కావడం విశేషం. మల్లియ రేచన తెలుగులో రాసిన ‘కవిజనాశ్రయం’ లక్షణ గ్రంథం.
32. కింది వాటిలో మల్లికార్జున పండితారాధ్యుడి రచనను గుర్తించండి.
a) పురుషార్థసారం b) శివతత్వసారం
c) బసవపురాణం d) పండితారాధ్య చరిత్ర
జవాబు: (b)
వివరణ: మల్లికార్జున పండితారాధ్యుడు శైవ భక్తి ప్రచారకుడు. శివా, భవా, మహేశా మకుటాలతో 400 పద్యాలతో ‘శివతత్వసారం’ అనే కావ్యం రచించాడు.
33. కింది వాటిలో పాల్కురికి సోమనాథుడి రచన కానిది ఏది?
a) బసవపురాణం b) పండితారాధ్యచరిత్ర
c) చతుర్వేదసారం d) పురుషార్థసారం
జవాబు: (d)
వివరణ: పురుషార్థసారం కాకతీయుల దగ్గర మంత్రిగా పనిచేసిన శివదేవయ్య రచించాడు.
34. కాకతీయుల కాలం నాటి సాహిత్యానికి సంబంధించి కింది వివరాలను పరిశీలించండి.
A. సర్వేశ్వర శతకం 1. రావిపాటి త్రిపురాంతకుడు
B. నిర్వచనోత్తర రామాయణం 2. మూలఘటిక కేతన
C. ప్రేమాభిరామం 3. తిక్కన సోమయాజి
D. దశకుమారచరిత్ర 4. యథావాక్కుల అన్నమయ్య
కింద ఇచ్చిన సంకేతాలలో సరైన దాన్ని గుర్తించండి.
a) A-2, B-3, C-1, D-4
b) A-4, B-3, C-1, D-2
c) A-4, B-2, C-3, D-2
d) A-3, B-2, C-4, D-1
జవాబు: (b)
35. కింది కావ్యాల్లో ఏది ఓరుగల్లు నగరం సామాజిక విశేషాలను వర్ణిస్తుంది?
a) శివతత్వసారం b) ధనాభిరామం
c) క్రీడాభిరామం d) బసవపురాణం
జవాబు: (c)
వివరణ: క్రీడాభిరామం కావ్యాన్ని వినుకొండ వల్లభుడు రచించాడు. ఇది నాటకంలో ఒక ప్రక్రియ అయిన వీధికి చెందుతుంది. గోవింద మంచన శర్మ, టిట్టిభ సెట్టి అనే యువకుల ఓరుగల్లు (వరంగల్లు)లో ఒక్కరోజు పర్యటనను గురించి వివరిస్తుంది. శ్రీకృష్ణదేవరాయల కంటే ముందే ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అనే వాక్యం ఇందులో కనిపిస్తుంది.
36. రంగనాథ రామాయణం ద్విపద కావ్యాన్ని ఎవరు రచించారు?
a) చక్రపాణి రంగనాథుడు
b) గోన బుద్ధభూపతి
c) గోన గన్నారెడ్డి d) నంది మల్లయ
జవాబు: (b)
వివరణ: రంగనాథ రామాయణం తెలుగులో తొలి ద్విపద రామాయణం. దీనికి కొనసాగింపుగా బుద్ధభూపతి (బుద్ధారెడ్డి) కొడుకులు గోన కాచవిభుడు, విఠలుడు ‘ఉత్తర రామాయణం’ రచించారు.
37. కింది జతలను పరిశీలించండి.
మార్కండేయ పురాణం: మారన
కేయూరబాహు చరిత్ర: కేతన
నీతిసారం: బద్దెన
సుమతీ శతకం: బద్దెన
పై వాటిలో ఎన్ని జతలు సరిగ్గా ఉన్నాయి?
a) రెండు జతలు b) మూడు జతలు
c) అన్నీ సరైనవే d) ఒక్కటి మాత్రమే
జవాబు: (a)
వివరణ: కేయూరబాహు చరిత్రను మంచన రచించాడు. నీతిసారం కాకతీయ మొదటి ప్రతాపరుద్రుడు (మొదటి రుద్రదేవుడు) రచించాడు. ఇది రాజనీతిశాస్ర్తానికి సంబంధించింది. తెలుగులో నీతి శతకాల్లో ప్రసిద్ధి చెందిన ‘సుమతీ శతకం’ను బద్దెన రచించాడు. మార్కండేయ పురాణంను మారన రచించాడు. మారన మార్కండేయ పురాణంను కాకతీయ మంత్రి నాగయ గన్నకు అంకితమిచ్చాడు.
38. ఏడో నిజాం పరిపాలనకు సంబంధించి ‘గస్తీ నిషాన్ తిర్పన్’ దేన్ని సూచిస్తుంది?
a) పరిపాలన సంస్కరణలు
b) వాక్ స్వాతంత్య్రంపై ఆంక్షలు
c) ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు
d) నిజాం రాష్ట్రంలో భూ సంస్కరణలు
జవాబు: (b)
వివరణ: హైదరాబాద్ సంస్థానంలో ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను అడ్డుకునేందుకు వాక్ స్వాతంత్య్రంపై ఆంక్షలు విధిస్తూ జారీచేసిందే ‘గస్తీ నిషాన్ తిర్పన్’ (జీ.వో.53). ఇది 1937లో అమల్లోకి వచ్చింది.
39. కింది వారిలో ఎవరు తనకు తాను ‘చెన్న బసవేశ్వరుడి’ అవతారంగా ప్రకటించుకున్నారు?
a) తుర్రెభాజ్ ఖాన్ b) ఖాసీం రజ్వీ
c) సిద్దిఖీ దీన్దార్
(d) మీర్ మహబూబ్ అలీ ఖాన్
జవాబు: (c)
వివరణ: సిద్దిఖీ దీన్దార్ తాను చెన్న బసవేశ్వరుడి అవతారంగా ప్రకటించుకున్నాడు. దీన్దార్ ప్రచారాన్ని ఆర్యసమాజ్ ప్రచారకులు మంగళ్ దేవ్, పండిత్ రామచంద్ర దహేల్వీ ఖండించారు.
40. కింది వారిలో ‘చారుచర్య’ అనే వైదిక దినచర్య గ్రంథాన్ని తెలుగులో రచించినవారు?
a) శివదేవయ్య
b) బొమ్మకంటి అప్పన
c) రావిపాటి త్రిపురాంతకుడు
d) సర్వజ్ఞ సింగభూపాలుడు జవాబు: (b)
వివరణ: ‘చారుచర్య’ను సంస్కృతంలో భోజుడు రచించాడు. అందువల్ల అప్పనకు ‘ఆంధ్రభోజుడు’ అనే బిరుదు కూడా ఉంది.
41. క్రీ.శ. 1163లో మొదటి రుద్రదేవుడు హనుమకొండలో నిర్మించిన రుద్రేశ్వరాలయం ఒక
a) ఏకకూట ఆలయం
b) ద్వికూట ఆలయం
c) త్రికూట ఆలయం
d) సర్వతోభద్ర ఆలయం జవాబు: (c)
వివరణ: దీనికే వేయిస్తంభాల గుడి అని పేరు. ఇందులో రుద్రేశ్వరుడు, వాసుదేవుడు (విష్ణువు), సూర్యుడి గుళ్లు కలిసి ఉన్నాయి. కాబట్టి, ఇది త్రికూట ఆలయం.
42. సూర్యాపేట జిల్లా పిల్లలమర్రిలో దేవాలయాలను కట్టించిన కాకతీయుల సామంతుడు ఎవరు?
a) రేచర్ల రుద్రరెడ్డి b) నామిరెడ్డి
c) గోన గన్నారెడ్డి d) బేతాళ నాయకుడు
జవాబు: (b)
42. కాకతీయ సేనాని రేచర్ల రుద్రుడు నిర్మించిన ప్రసిద్ధ రామప్పగుడిని ఆలయం ముందున్న శాసనంలో ఏమని పేర్కొన్నారు?
a) త్రికూట ఆలయం
b) స్వయంభూ దేవాలయం
c) రుద్రేశ్వర ఆలయం
d) గణపేశ్వర ఆలయం జవాబు: (c)
43. శిల్పి పేరుమీదుగా ప్రసిద్ధి చెందిన రామప్ప గుడి ఏ శైలికి చెందిన నిర్మాణం?
a) రేఖాంగ నాగర b) శిఖర
c) ద్రావిడ d) వేసర
జవాబు: (d)
వివరణ: వేసర శైలి అంటే ఉత్తర భారత నాగర (లేదా శిఖర), దక్షిణ భారత ద్రావిడ శైలుల మిశ్రమం. రామప్ప గుడి వేసర శైలికి చెందిన ఆలయం.
44. కాకతీయులు నిర్మించిన దేవాలయాల్లో అన్నిటి కంటే పెద్దదైన నిర్మాణం ఏది?
a) స్వయంభూ దేవాలయం
b) వేయిస్తంభాల గుడి (రుద్రేశ్వరాలయం)
c) రామప్ప గుడి (రుద్రేశ్వరాలయం)
d) పద్మాక్షిదేవీ ఆలయం జవాబు: (a)
వివరణ: కాకతీయుల ఆలయాల్లో ఓరుగల్లు కోట మధ్యలో ఉన్న స్వయంభూ దేవాలయం అతి పెద్దది. దీన్ని ప్రోలరాజు నిర్మించాడు. గణపతిదేవుడు, రుద్రమదేవి విస్తరించారు.
45. శాతవాహనుల చరిత్రకు సంబంధించి ‘కరుకర’ అనే పదం దేన్ని సూచిస్తుంది?
a) రహదారులపై సుంకాలు
b) వృత్తులపై విధించే పన్ను
c) పంటలపై పన్ను
d) సముద్ర వర్తకంపై పన్ను
జవాబు: (b)
46. కాకతీయుల వ్యవసాయ వ్యవస్థకు సంబంధించి పంటలు కొలిచేవారిని ఏమని పిలిచేవారు?
a) కొలుచువాండ్రు
b) తాసు న్యాయకాండ్రు
c) ప్రాడ్వివాకులు
d) తూము న్యాయకాండ్రు జవాబు: (d)
వివరణ: పంటలు కొలిచే వారిని ‘తూము న్యాయకాండ్రు’, తూచేవారిని ‘త్రాసు న్యాయకాండ్రు’ అని పిలిచేవాళ్లు.
47. కాకతీయుల పన్నుల వ్యవస్థలో ‘అమ్మడికాలు’ అనేది దేన్ని సూచిస్తుంది?
a) అమ్మకపు పన్ను b) కొనుగోలు పన్ను
c) a, b d) ఏదీ కాదు
జవాబు: (c)
వివరణ: పండిన పంటను అంగడిలో అమ్మే రైతు ‘అమ్మకపు పన్ను’, కొనుగోలుదారుడు ‘విల్చుపన్ను’ కట్టేవాళ్లు. ఈ రెండు పన్నులను కలిపి ‘అమ్మడికాలు’ అని పిలిచేవాళ్లు.
48. కింది వాటిలో బూర్గుల రామకృష్ణారావు రచన కానిది ఏది?
a) పండితరాజ పంచామృతం
b) కృష్ణ శతకం
c) తెలంగాణ ఆంధ్రోద్యమం
d) సారస్వత వ్యాస ముక్తావళి
జవాబు: (c)
వివరణ: ‘తెలంగాణ ఆంధ్రోద్యమం’ను మాడపాటి హనుమంత రావు రచించారు. ఇది నిజాం కాలం నాటి సామాజిక, రాజకీయ ఉద్యమాలను గురించి వివరిస్తుంది.
49. నల్లగొండలో ఏర్పాటైన ‘సాహితీ మేఖల’ అనే సాహిత్య సంస్థను ఎవరు ఏర్పాటుచేశారు?
a) షబ్నవీసు నరసింహారావు
b) వట్టికోట ఆళ్వారుస్వామి
c) వెల్దుర్తి మాణిక్యరావు
d) అంబటిపూడి వెంకటరత్నం
జవాబు: (d)
50. కింది రచనలు, రచయితలను సరిగ్గా జతపరచండి.
A. చిల్లరదేవుళ్లు 1. దాశరథి కృష్ణమాచార్య
B. ప్రజలమనిషి 2. దాశరథి రంగాచార్య
C. అగ్నివీణ 3. వట్టికోట ఆళ్వారుస్వామి
D. పోతన చరితం 4. వానమామలై వరదాచార్య
కింది సంకేతాల ద్వారా
సరైన జవాబును గుర్తించండి.
a) A- 1, B- 3, C- 2, D- 4
b) A- 2, B- 3, C- 1, D- 4
c) A- 2, B- 4, C- 3, D- 1
d) A- 3, B- 2, C- 1, D- 4
జవాబు: (b)
హర్షవర్ధన్ చింతలపల్లి
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు