Telangana History – Groups Special | తెలంగాణ అన్నవరం అని ఏ ఆలయాన్ని పిలుస్తారు?
1. బిర్లా మందిర్ గురించి కింది వాక్యాల్లో సరికానిది గుర్తించండి?
1) ఇది నౌబత్ పహాడ్, కాలా పహాడ్ అనే జంట కొండలపై ఉంది
2) దీన్ని బిర్లాలు 1976లో నిర్మించారు
3) ఈ ఆలయ నిర్మాణ శైలి ఉత్కల, సౌత్ ఇండియన్ శైలి
4) దేవుడు కొలువున్న కాలా పహాడ్ కొండ ఎత్తు 300 అడుగులు
వివరణ: కాలా పహాడ్ కొండ ఎత్తు 280 అడుగులు.
2. హైదరాబాద్‌లోని జగన్నాథ దేవాలయానికి సంబంధించి సరికానిది గుర్తించండి?
1) ఈ ఆలయం పూరీలోని జగన్నాథ ఆలయానికి ప్రతి రూపం
2) ఇది 300 చ.గ. విస్తీర్ణంలో ఉంది
3) జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉంది
4) ఈ ఆలయ ప్రధానంగా పూజించే దేవుడు శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర
వివరణ: ఈ ఆలయం బంజారాహిల్స్‌లో ఉంది.
3. బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి సంబంధించి సరికానిది గుర్తించండి?
1) ఆలయాన్ని 14వ శతాబ్దంలో నిర్మించారు
2) అమ్మవారు 10 అడుగుల లోతులో దర్శనమిస్తారు
3) ఇక్కడ అమ్మవారిని జగదాంబ, రేణుక మాత అని కూడా పిలుస్తారు
4) పైవన్నీ సరైనవే
వివరణ: ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో నిర్మించారు.
4. హైదరాబాద్‌లోని పెద్దమ్మ తల్లి ఆలయానికి సంబంధించి సరికానిది?
1) ఈ ఆలయంలోని రాజగోపురాన్ని 1993లో నిర్మించారు
2) ఈ ఆలయం బంజారాహిల్స్‌లో ఉంది
3) ఈ ఆలయంలో ప్రతి ఆదివారం బోనాల ఉత్సవం జరుగుతుంది
4) ఈ ఆలయం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 55లో ఉంది
5. హైదరాబాద్‌లోని స్వయంభూ లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి సంబంధించి సరికానిది గుర్తించండి?
1) ఈ ఆలయం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 12కు దగ్గరలో ఉంది
2) ఇక్కడ స్వామి ఉద్భవ శిలలో నిలబడి ఉన్న రూపంలో దర్శనమిస్తారు
3) స్వామి విగ్రహం 7 లేదా 8వ శతాబ్దానికి సంబంధించిందని చెబుతారు
4) ఈ ఆలయంలో ఉన్న సాలి గ్రామం జలగర్భ నారాయణ సాలిగ్రామ శిల ప్రపంచంలో అతిపెద్ద సాలిగ్రామంలో ఒకటి.
వివరణ: ఈ ఆలయం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12కు దగ్గరలో ఉంది.
6. ఆదిలాబాద్ జిల్లాలోని జైనాథ్ ఆలయంలో కొలువైన దేవుడిని గుర్తించండి?
1) వేంకటేశ్వర స్వామి
2) లక్ష్మీనారాయణ స్వామి
3) ఆంజనేయ స్వామి 4) వీరభద్రస్వామి
7. కదిలే పాప హరేశ్వర ఆలయం ఏ జిల్లాలో ఉంది?
1) ఆదిలాబాద్ 2) నిర్మల్
3) ఆసిఫాబాద్ 4) ఏదీకాదు
8. భద్రాద్రి సీతారామస్వామి ఆలయాన్ని ఏ శతాబ్దంలో నిర్మించారు?
1) 15 2) 16 3) 17 4) 18
9. అలంపూర్ జోగులాంబ ఆలయానికి సంబంధించి సరికానిది గుర్తించండి?
1) ఈ ఆలయం తుంగభద్రా నది ఒడ్డున ఉంది
2) అలంపూర్‌ను శ్రీశైలం తూర్పు ద్వారంగా పరిగణిస్తారు
3) ఈ ఆలయం బాదామి చాళుక్యుల శైలిని పోలి ఉంటుంది
4) ఇక్కడ ప్రధాన దేవతలు జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర. ఇది 18 శక్తిపీఠాల్లో 5వది
వివరణ: అలంపూర్‌ను శ్రీశైలం పశ్చిమ ద్వారంగా పిలుస్తారు.
10. నల్లగొండ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం కింది ఏ జిల్లాలో ఉంది?
1) జగిత్యాల 2) కరీంనగర్
3) రాజన్నసిరిసిల్ల 4) ఏదీకాదు
11. ఖమ్మం చిన్న తిరుపతిగా పిలిచే ఆలయాన్ని గుర్తించండి?
1) ఖానాపురం వేంకటేశ్వర స్వామి
2) మామిళ్లగూడెం వేంకటేశ్వర స్వామి
3) జమలాపురం వేంకటేశ్వర స్వామి
4) ఏదీకాదు
12. తెలంగాణ అన్నవరంగా పిలిచే ఆలయం?
1) గూడెంగుట్ట 2) సిద్ధుల గుట్ట
3) పెద్ద గుట్ట 4) ఏదీకాదు
13. శివుడు, పార్వతీ దేవి పానవట్టం లేకుండా పక్క పక్కనే లింగ రూపంలో నిలబడి దర్శనం ఇచ్చే కింది ఆలయాన్ని గుర్తించండి?
1) కూసుమంచి శివాలయం
2) జోగినాథ ఆలయం, సంగారెడ్డి జిల్లా
3) కేతకి సంగమేశ్వర ఆలయం
4) ఏదీ కాదు
14. కాశీ విశ్వేశ్వర దేవాలయంగా పిలుస్తూ, అదే ఆలయ ప్రాంగణంలో వేణుగోపాల స్వామి ఆలయం, అనంత పద్మనాభ స్వామి ఆలయం గల త్రికూటాలయం ఎక్కడ ఉంది?
1) సంగారెడ్డి- కల్పగూరు గ్రామం
2) మెదక్- నాచారం గ్రామం
3) సిద్దిపేట- పందిళ్ల గ్రామం
4) మేడ్చల్ మల్కాజిగిరి- శామీర్‌పేట
15. కింది ఏ పుణ్య క్షేత్రం కృష్ణానది తీరంలో రెండు ద్వీపాల సమీపంలో ఉంది? (ఒక ద్వీపం గుర్రంగడ్డ, ఇంకొకటి నిజాం కొండ)
1) అలంపురం జోగులాంబ
2) బీచుపల్లి ఆంనేయ స్వామి
3) మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి
4) ఏదీకాదు
16. నాచారం గుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం కింది ఏ జిల్లాలో ఉంది? (600 ఏండ్ల పురాతనమైంది)
1) మెదక్ 2) సంగారెడ్డి
3) సిద్దిపేట 4) ఏదీకాదు
17. కేతకి సంగమేశ్వరాలయం సంగారెడ్డి జిల్లాలో ఉంది. కాగా ఈ ఆలయం పేరులోని కేతకికి సంబంధించి సరైనది?
1) గ్రామం పేరు 2) స్థాపించిన వ్యక్తి పేరు
3) పుష్పం పేరు 4) ఇక్కడి కొండ పేరు
18. సప్త ప్రాకారయుత దుర్గాభవానీ ఆలయం కింది ఏ జిల్లాలో ఉంది?
1) ఇస్మాయిల్ ఖాన్ పేట- సంగారెడ్డి
2) సదాశివపేట- సంగారెడ్డి
3) నారాయణరావు పేట- సిద్దిపేట
4) ఏదీకాదు
19. బొంతపల్లి వీరభద్రస్వామి ఆలయం కింది ఏ జిల్లాలో ఉంది?
1) మెదక్ 2) సంగారెడ్డి
3) సిద్దిపేట 4) ఏదీకాదు
20. కింది ఆలయాలు, అవి గల జిల్లాలకు సంబంధించి సరైన జతలు గుర్తించండి?
ఎ. నాంపల్లి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం- రాజన్న సిరిసిల్ల జిల్లా
బి. మైసిగండి ఆలయం- రంగారెడ్డి జిల్లా
సి. కాల్వ నర్సింహ ఆలయం- నిర్మల్ జిల్లా
డి. సారంగపూర్ హనుమాన్ ఆలయం- నిజామాబాద్ జిల్లా
1) 1 2) 2 3) 3 4) 4
21. నిజామాబాద్ జిల్లాలోని నీల కంఠేశ్వర ఆలయాన్ని కింది ఏ శాతవాహన రాజు నిర్మించాడని చెబుతారు?
1) శాతకర్ణి-1 2) శాతకర్ణి-2
3) హాలుడు 4) గౌతమీపుత్ర శాతకర్ణి
22. పేదల ఊటీగా పిలిచే కింది పుణ్యక్షేత్రాన్ని గుర్తించండి?
1) అనంతపద్మనాభ స్వామి ఆలయం- వికారాబాద్
2) ఉమా మహేశ్వర ఆలయం- నాగర్‌కర్నూలు
3) సలేశ్వరం ఆలయం- నాగర్‌కర్నూలు
4) ఏదీకాదు
23. ఛాయా సోమేశ్వరాలయానికి సంబంధించి సరికానిది గుర్తించండి?
1) ఈ ఆలయాన్ని కందూరు చోళులు నిర్మించారు
2) ఈ ఆలయం సూర్యాపేట జిల్లాలో ఉంది
3) ఇది ఒక త్రికూట ఆలయం
4) ఈ ఆలయంలోని శివ లింగంపై రోజుంతా నీడ ఉంటుంది
వివరణ: ఈ ఆలయం నల్లగొండ జిల్లాలో ఉంది.
24. రాముడు తాబేలు రూపంలో దర్శనం ఇచ్చే కింది ఆలయాన్ని గుర్తించండి?
1) భద్రాద్రి
2) ఖిల్లా రఘునాథ ఆలయం
3) సిర్సినగండ్ల సీతారామ ఆలయం
4) ఏదీకాదు
25. ఇందూరు ‘ఖజురహో లేదా ఖజురహో ఆఫ్ నిజామాబాద్’ అని పిలిచే ఆలయం ఏది?
1) ఖిల్లా రఘునాథ ఆలయం
2) డిచ్పల్లి రామాలయం
3) సిర్సినగండ్ల రామాలయం
4) ఏదీకాదు
26. కొండగట్టు ఆలయాన్ని నిర్మించిన కింది వ్యక్తిని గుర్తించండి?
1) సింగమ రాయుడు
2) సింగమ సంజీవుడు
3) సింగమ భట్టు 4) ఏదీకాదు
27. కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయం ఏ శతాబ్దంలో నిర్మించినదిగా చెబుతారు?
1) 11 2) 12 3) 13 4) ఏదీకాదు
28. ఈ ఆలయాన్ని నాశనం చేయాలంటే నీ గుండె చాలా గట్టిదై ఉండాలని ఔరంగజేబుని హెచ్చరించినట్టుగా ఏ ఆలయం గురించి చెబుతారు?
1) భద్రకాళి
2) కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయం
3) సారంగపూర్ హనుమాన్ ఆలయం
4) ఉమా మహేశ్వర స్వామి ఆలయం
29. చిలుకూరు బాలాజీ ఆలయానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) ఇక్కడి బాలాజీని ‘వీసా గాడ్’ అని కూడా పిలుస్తారు
2) ఈ ఆలయం నుంచి వెలువడే ధార్మిక మాస పత్రిక ‘వాక్’
3) ఈ ఆలయంపై డౌన్‌స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని రాసింది
4) ఇది ఉస్మాన్ సాగర్ ఒడ్డున ఉంది. ఈ ఆలయంలో హుండీ ఉండదు
వివరణ: వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో ఈ ఆలయం గురించి కథనం ప్రచురితమైంది.
30. సంఘీ టెంపుల్ (వేంకటేశ్వర స్వామి) ఉన్న కొండను గుర్తించండి? (చోళ-చాళుక్య శైలి)
1) నౌబత్ పహాడ్ 2) కాలా పహాడ్
3) పరమానంద గిరి 4) ఏదీకాదు
31. ఏ రాజు తన జీవిత చరిత్ర (ఆటోబయోగ్రఫీ)లో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం గురించి ప్రస్తావించాడని చెబుతారు?
1) ఇబ్రహీం కుతుబ్ షా
2) సర్వజ్ఞ సింగన
3) శ్రీకృష్ణ దేవరాయలు 4) ఏదీకాదు
32. కింది ప్రాంతాల్లో సరస్వతి ఆలయం లేని ప్రాంతాన్ని గుర్తించండి?
1) వర్గల్ 2) అనంతసాగర్
3) బాసర 4) ఏదీకాదు
33. కృష్ణా నది తీరం వెంట కొలువై ఉన్న ఆలయాలను గుర్తించండి?
ఎ. బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయం
బి. మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం
సి. వాడపల్లి మీనాక్షి-అగస్తేశ్వర స్వామి ఆలయం
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, సి
34. కింది ఆలయాలు అవి గల ప్రాంతాలు/ జిల్లాలను జపతర్చండి.
ఎ. భావిగి భద్రేశ్వరాలయం 1. వికారాబాద్
బి. అమ్మపల్లి దేవాలయం 2. రంగారెడ్డి
సి. ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయం 3. పెద్దపల్లి
డి. చాకరిమెట్ల సహకార ఆంజనేయ స్వామి ఆలయం 4. మెదక్
1) ఎ-2, బి-1, సి-3, డి-4
2) ఎ-3, బి-1, సి-2, డి-4
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-2, బి-3, సి-1, డి-4
35. వికారాబాద్ జిల్లాలో గల ఆలయాలను గుర్తించండి?
ఎ. అనంత పద్మనాభ స్వామి ఆలయం
బి. భూకైలాస్ ఆలయం
సి.దామగుండం రామలింగేశ్వర స్వామి ఆలయం
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
36. నల్లగొండ జిల్లాలో గల ఆలయాలను గుర్తించండి?
ఎ. పానగల్-ఛాయా సోమేశ్వర ఆలయం
బి. చెరువుగట్టు జడల రామలింగేశ్వరాలయం
సి. మేళ్లచెరువు శంభులింగేశ్వరాలయం
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
37. నాగర్ కర్నూలు జిల్లాలోని ఆలయాలను గుర్తించండి?
ఎ. సింగోటం లక్ష్మీనర్సింహస్వామి ఆలయం
బి. సలేశ్వరం ఆలయం
సి. సిర్సినగండ్ల సీతారామ ఆలయం
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
38. 100 స్తంభాల గుడి (సూర్య నారాయణ దేవాలయం) ఏ జిల్లాలో ఉంది?
1) నిజామాబాద్ 2) ఆదిలాబాద్
3) పెద్దపల్లి 4) మంచిర్యాల
39. కింది ఆలయాలను నిర్మించిన వారికి సంబంధించి ఎన్ని జతలు సరైనవి?
ఎ. కొండగట్టు- సింగమ సంజీవుడు (మొదట)
బి. బాసర- బీర్భలుడు
సి. భద్రకాళి ఆలయం- రెండో పులకేశి
డి. భద్రాద్రి ఆలయం- కంచర్ల గోపన్న
1) 1 2) 2 3) 3 4) 4
40. కింది వాటిలో సరైన జతలు గుర్తించండి?
ఎ. దేవాలయాల పట్టణం- అలంపూర్
బి. శ్రీశైల ఉత్తర ద్వారం- ఉమామహేశ్వరాలయం
సి. ఇందూరు ఖజురహో- డిచ్పల్లి రామాలయం
డి. రుషుల ఆరాధన క్షేత్రం- యాదాద్రి
ఇ. తెలంగాణ అన్నవరం- గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి ఆలయం
1) ఎ, బి, సి, డి 2) బి, సి, డి, ఇ
3) ఎ, సి, డి, ఇ 4) ఎ, బి, సి, డి, ఇ
సమాధానాలు
1-4, 2-3, 3-1, 4-2, 5-1, 6-2, 7-2, 8-3, 9-2, 10-1, 11-3, 12-1, 13-2, 14-1, 15-2, 16-3, 17-3, 18-1, 19-1, 20-4, 21-2, 22-2, 23-2, 24-2, 25-2, 26-2, 27-2, 28-2, 29-3, 30-3, 31-3, 32-4, 33-3, 34-3, 35-4, 36-1, 37-4, 38-1, 39-4, 40-4.
గందె శ్రీనివాస్
విషయ నిపుణులు
Dream Warriors Academy
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు