Current Affairs – Groups Special | తెలంగాణ
గోల్డ్ మెడల్స్
ఈటీ (ఎమర్జింగ్ టెక్నాలజీ) గవర్నమెంట్ డిజిటెక్ కాంక్లేవ్ అండ్ అవార్డ్స్-2023లో రాష్ర్టానికి రెండు గోల్డ్ మెడల్స్ లభించాయి. గోవాలో ఆగస్టు 4 నుంచి 6 వరకు జరిగిన కార్యక్రమంలో ఐటీ శాఖ ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ డైరెక్టర్ రమాదేవి ఈ అవార్డులను అందుకున్నారు. రోడ్డు భద్రత నిర్వహణపై అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో చేపట్టిన ‘ఐ రాస్తే’కు అవార్డు దక్కింది. అటవీ ప్రాంతంలో జీవవైవిధ్యంపై రూపొందించిన టెక్నాలజీకి మరో అవార్డు లభించింది.
గోవాతో ఐఎస్బీ
ప్రతిష్ఠాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)తో గోవా ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) ఆగస్టు 8న కుదుర్చుకుంది. గోవా సీఎం ప్రమోద్ సావంత్ సమక్షంలో జరిగిన ఈ ఒప్పందంలో భాగంగా ఐఎస్బీలోని భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ నేతృత్వంలో ‘ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ ఫార్ములేషన్ అండ్ ఇంపాక్ట్ ఇన్ ది స్టేట్’ అంశంపై దృష్టి సారిస్తుంది. గోవా రాష్ట్ర ప్రణాళిక, స్టాటిస్టిక్స్ అండ్ ఎవల్యూషన్ డైరెక్టర్ విజయ్ బీ సక్సేనా, భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశ్విని ఛత్రే ఎంవోయూపై సంతకాలు చేశారు. దీంతో ఐఎస్బీ గోవా బయో ఎనర్జీ రిజర్వులను పొందడం, అడవుల్లో నివసించే తెగల సాధికారత కోసం పాలసీలను రూపొందించనున్నది.
సెల్ఫోన్ల రికవరీ
చోరీకి గురైన లేదా పొరపాటున పోగొట్టుకున్న సెల్ఫోన్లను ట్రేస్ చేసి, వాటిని యజమానులకు అప్పగించడంలో రాష్ట్ర పోలీసులు ముందంజలో ఉన్నారు. 67.98 శాత ఫోన్ల రికవరీలో రాష్ట్ర పోలీసులు దేశంలో అగ్రస్థానంలో నిలిచారని సీఐడీ చీఫ్, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) సూపర్ యూజర్ మహేశ్ భగవత్ ఆగస్టు 8న వెల్లడించారు. కర్ణాటక 2, ఆంధ్రప్రదేశ్ 3, మహారాష్ట్ర 4, ఢిల్లీ 5వ స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్రంలోని 780 పోలీస్ స్టేషన్లలో సీఈఐఆర్‌ను అమలు చేస్తున్నారు.
అగ్రికల్చరల్ డేటా ఎక్సేంజ్
భారతదేశపు మొదటి ‘అగ్రికల్చరల్ డేటా మేనేజ్మెంట్ ఎక్సేంజ్ (ఏడీఈఎక్స్)ను ఐటీ మంత్రి కేటీఆర్ ఆగస్టు 11న ప్రారంభించారు. దీన్ని ప్రపంచ ఆర్థిక వేదిక, జాతీయ శాస్త్రసాంకేతిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పరిశ్రమలు, స్టార్టప్‌ల ద్వారా వ్యవసాయ సమాచారాన్ని సమర్థంగా వినియోగించుకునేందుకు ఈ డేటా ఎక్సేంజ్ సెంటర్ ఉపయోగపడుతుంది. రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో నేలల రకాలు, సాగవుతున్న పంటలు, అందుబాటులో ఉన్న సాంకేతికత తదితర సమగ్ర వివరాలు ఈ ఎక్సేంజ్‌లో అందుబాటులో ఉంటాయి. ఇది ఆహార వ్యవస్థలను బలోపేతం చేయడంతో పాటు రైతుల జీవనోపాధిని మెరుగుపరచడానికి, ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానంలో రాష్ట్రం పురోగమనానికి తోడ్పడుతుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?