Current Affairs – Groups Special | ‘ఏక్ షాం జవానోంకే నామ్’ ప్రోగ్రామ్‌ను ఎక్కడ నిర్వహించారు?
1. జాయింట్ డాక్టోరల్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఐఐటీ హైదరాబాద్, ఏ విశ్వవిద్యాలయంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది? (3)
1) సబరగమువ యూనివర్సిటీ 2) స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ
3) కఠ్మాండు యూనివర్సిటీ 4) డైకిన్ యూనివర్సిటీ
వివరణ: పీహెచ్డీ స్థాయిలో జాయింట్ డాక్టోరల్ ప్రోగ్రామ్‌ను అందించేందుకు హైదరాబాద్‌లోని ఐఐటీ, నేపాల్‌కు చెందిన కఠ్మాండు యూనివర్సిటీలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ, వైద్య రంగానికి సంబంధించిన ఆవిష్కరణల్లో కలిసి రెండు విశ్వవిద్యాలయాల విద్యార్థులు పనిచేయనున్నారు. కఠ్మాండు యూనివర్సిటీలోని విద్యార్థులు, ఐఐటీ (హెచ్)లో అధ్యయనానికి స్కాలర్షిప్ ఇస్తారు. అలాగే ఐఐటీ (హెచ్) విద్యార్థులకు కూడా ఈ సౌకర్యం ఉంటుంది. ఈ నెల నుంచి ఇది ప్రారంభం కానుంది. ఐఐటీ (హెచ్)లో బీటెక్ చదువుతున్న 10 మంది విద్యార్థులకు తొలిసారి అవకాశం కల్పిస్తారు.
2. మణిపూర్ సంఘటనకు సంబంధించి సుప్రీంకోర్ట్ ఏర్పాటు చేసిన కమిటీలో లేని మహిళ ఎవరు? (4)
1) గీతా మిట్టల్ 2) ఆశా మీనన్
3) ఫన్సాల్కర్ జోషి 4) ఇందిరా బెనర్జీ
వివరణ: హింసాత్మక సంఘటనలతో అట్టుకుడుతున్న మణిపూర్ రాష్ట్రంలో శాంతిని ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్ట్ ముగ్గురు మహిళలతో ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. దీనికి గీతా మిట్టల్ నేతృత్వం వహిస్తారు. ఆమె గతంలో జమ్మూకశ్మీర్ రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. ఇందులో ఆశా మీనన్, ఫన్సల్కార్ జోషి సభ్యులుగా ఉన్నారు. ఆశా మీనన్ ఢిల్లీ హైకోర్టులో జడ్జిగా పని చేశారు. అలాగే బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన ఫన్సల్కర్ జోషి పదవీ విరమణ పొందారు.
3. ఆగస్టు 7ను ఏ రోజుగా నిర్వహిస్తారు? (3)
ఎ) జాతీయ చేనేత దినోత్సవం
బి) జావెలిన్ త్రోడే
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
వివరణ: 2015 నుంచి ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం నిర్వహిస్తున్నారు. 1905లో స్వదేశీ ఉద్యమం ఇదే రోజున ప్రారంభమైన నేపథ్యంలో ఈ తేదీని ఎంచుకున్నారు. ఈ ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ ఈ వేడుకలో పాల్గొన్నారు. భారతీయ ఎవం శిల్ప్ కోష్ అనే ఈ-పోర్టల్‌ను ప్రారంభించారు. దీన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అనే సంస్థ ప్రారంభించింది. అలాగే ఏటా ఆగస్టు 7న భారత్‌లో జావెలిన్ త్రో రోజుగా నిర్వహిస్తారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ఇదే రోజున భారత్ ఈ క్రీడలో బంగారు పతకాన్ని సాధించింది. నీరజ్ చోప్రా దీన్ని గెలుచుకున్నాడు. ఒలింపిక్స్‌లో భారత్‌కు వ్యక్తిగత క్రీడలో రెండో బంగారు పతకం ఇది. మొదటిసారి 2008లో బీజింగ్ ఒలింపిక్స్‌లో అభినవ్ బింద్రా
గెలుచుకున్నాడు.
4. ఐపీసీసీ వైస్ చైర్‌గా ఎన్నికైన భారతీయుడు ఎవరు? (1)
1) రామన్ సుకుమార్
2) వినాయక్ రావు
3) పల్లవీ శరత్ 4) రంజిత్ కుమార్
వివరణ: ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ ైక్లెమేట్ చేంజ్ (ఐపీసీసీ)కి వైస్ చైర్‌గా భారత్‌కు చెందిన రామన్ సుకుమార్ నియమితులయ్యారు. ఈ సంస్థ జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది. ఈ ఎన్నిక కెన్యాలోని నైరోబీలో ఉన్న ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమ కార్యాలయంలో జరిగింది.
5. ఏ రోజున ప్రపంచ జీవ ఇంధన రోజుగా నిర్వహిస్తారు? (2)
1) ఆగస్టు 9 2) ఆగస్టు 10
3) ఆగస్టు 11 4) ఆగస్టు 12
వివరణ: ఏటా ఆగస్ట్ 10న వరల్డ్ బయోఫ్యూయల్ డేగా నిర్వహిస్తారు. శిలాజేతర ఇంధనాల ద్వారా కలిగే ప్రయోజనాలను అందరికీ తెలియజేసేందుకు ఉద్దేశించింది ఇది. అలాగే ఈ తరహా ఇంధనాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పాత్రను కూడా పెంచుతుంది. ఇదే రోజును ఎంపిక చేసుకోడానికి కారణం రుడాల్ఫ్ అనే శాస్త్రవేత్త 1893, ఆగస్ట్ 10న తొలిసారిగా వేరుశనగ నూనెతో ఒక ఇంజిన్‌ను విజయవంతంగా నడిపారు. అతడి పరిశోధనలే కూరగాయలను ఇంధనంగా వినియోగిస్తూ శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయం కాగలవన్న విశ్వాసం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 9న బయో ఫ్యూయల్ డేగా నిర్వహిస్తారు.
6. ఇంటర్ పోల్ గ్లోబల్ అకాడమీ నెట్‌వర్క్‌లో చేరిన భారత సంస్థ? (3)
1) సీవీసీ 2) ఐబీ
3) సీబీఐ అకాడమీ 4) ఏదీకాదు
వివరణ: ప్రతిష్ఠాత్మక ఇంటర్‌పోల్ గ్లోబల్ అకాడమీ నెట్‌వర్క్‌లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేరింది. ఇందులో చేరిన పదో దేశం భారత్. ఇంటర్‌పోల్ గ్లోబల్ అకాడమీ నెట్‌వర్క్‌ను 2019లో ఏర్పాటు చేశారు. ఎన్ఫోర్స్మెంట్లో సభ్య దేశాలకు శిక్షణ ఇచ్చేందుకు ఉద్దేశించింది ఇది. అలాగే వివిధ దేశాల్లోని ఎన్ఫోర్స్మెంట్ శిక్షణ సంస్థల సమన్వయానికి కూడా కృషి చేస్తుంది. సీబీఐ అకాడమీ ఘజియాబాద్ కేంద్రంగా పని చేస్తుంది.
7. ఏక్ షాం జవానోంకే నామ్ అనే కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించారు? (1)
1) అట్టారి సరిహద్దు 2) జమ్మూకశ్మీర్
3) అరుణాచల్ ప్రదేశ్ 4) మిజోరం
వివరణ: సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) కోసం ఆకాశవాణి నిర్వహించిన ఒక సంగీత కార్యక్రమమే ఏక్ షాం జవానోంకే నామ్. దీన్ని అట్టారి సరిహద్దు వద్ద నిర్వహించారు. జీ-20 కూటమికి భారత్ నేతృత్వం వహిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. అన్ని దేశభక్తి గీతాలను ఇందులో పాడారు. స్థానికంగా ఖల్సా కళాశాల విద్యార్థులు నృత్యం చేశారు. భారత సైనిక పటుత్వాన్ని తెలిపేలా ఈ కార్యక్రమం కొనసాగింది.
8. ఏ దేశంలో డిజిటల్ ఐడెంటిటీ ప్రాజెక్టుకు భారత్ రూ.45 కోట్లు ఇచ్చింది? (4)
1) నేపాల్ 2) భూటాన్
3) మంగోలియా 4) శ్రీలంక
వివరణ: శ్రీలంక దేశాన్ని డిజిటల్ దిశగా తీసుకెళ్లేందుకు రూ.45 కోట్లు భారత్ ఇచ్చింది. ఆ దేశంలో పరిపాలన రంగంలో డిజిటల్ పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. పౌరులకు మరిన్ని సేవలు తక్కువ మొత్తంలో పారదర్శకంగా, అవినీతి రహితంగా అందనున్నాయి. శ్రీలంక డిజిటల్ పరంగా సాధికారత తీసుకెళ్లేలా ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడనుంది.
9. రాజ్‌మార్గ్ యాత్ర దేనికి సంబంధించింది? (3)
1) కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ
2) ప్రపంచ పర్యాటక సంస్థ
3) ఎన్హెచ్ఏఐ 4) ఏదీకాదు
వివరణ: హైవేలపై ప్రయాణించే వాళ్లకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులో తేవడం కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రారంభించిందే రాజ్‌మార్గ్ యాత్ర. పార్లమెంట్ చట్టం ద్వారా భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థను ఏర్పాటు చేశారు. రాజ్‌మార్గ్ యాత్ర అనేది గూగుల్ ప్లే స్టోర్, ఐవోఎస్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతానికి ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఇది సమాచారాన్ని ఇస్తుంది. హైవేల్లో వాతావరణ పరిస్థితులు, సమీపంలో ఉండే టోల్ ప్లాజాలు, ఆస్పత్రులు, అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు, హోటల్, ఇతర అత్యవసర సేవల అంశాలన్నీ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఫాస్టాగ్ సేవలు కూడా ఇందులో ఉంటాయి.
10. అమృత్ స్టేషన్ పథకంలో భాగంగా ఎన్ని రైల్వే స్టేషన్లను ఒకే రోజున ప్రధాని ప్రారంభించారు? (4)
1) 208 2) 300
3) 408 4) 508
వివరణ: 508 అమృత్ రైల్వే స్టేషన్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 6న ప్రారంభించారు. వీటిని రూ.24,470 కోట్లతో ఆధునీకరిస్తున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. భారత ప్రాచీన వారసత్వానికి ప్రాధాన్యం ఇస్తూ ఆధునిక సౌకర్యాలను ఇందులో కల్పిస్తారు. ఈ రైల్వే స్టేషన్లు మొత్తం 27 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ర్టాల్లో 55 చొప్పున స్టేషన్లు ఉన్నాయి. ఆ తర్వాత బీహార్‌లో 49, మహారాష్ట్రలో 44, పశ్చిమబెంగాల్లో 37, మధ్యప్రదేశ్‌లో 34 రైల్వే స్టేషన్లు ఉన్నాయి.
11. అదితి స్వామి ఏ క్రీడతో ముడిపడి ఉన్నారు? (1)
1) ఆర్చరీ 2) జావెలిన్ త్రో
3) రెజ్లింగ్ 4) చెస్
వివరణ: అదితి స్వామి ఆర్చరీ క్రీడాకారిణి. బెర్లిన్‌లో నిర్వహించిన ప్రపంచ చాంపియన్‌షిప్-2023లో విజయం సాధించింది. ఈ ఘనతను దక్కించుకున్న భారత తొలి క్రీడాకారిణి ఆమె. రెండు నెలల కిందటే ఆమె జూనియర్ వరల్డ్ టైటిల్‌ను కూడా గెలుచుకుంది. అలాగే పురుషుల విభాగంలో ఓజాస్ డియోటేల్ విజయం సాధించాడు. ఓజాస్ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన క్రీడాకారుడు. ఈ క్రీడల్లో బంగారు పతకాన్ని సాధించిన భారత తొలి క్రీడాకారుడు అతడు.
12. నేతన్న బీమా పథకానికి గరిష్ఠ వయస్సు ఎంతకు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది? (3)
1) 62 2) 65 3) 75 4) 60
వివరణ: నేతన్న బీమా పథకాన్ని 75 సంవత్సరాల వాళ్లకు కూడా వర్తింప జేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు ఇది కేవలం 59 సంవత్సరాల్లోపు వాళ్లకు మాత్రమే వర్తించేది. అలాగే చేనేత కారులకు ఈ ఏడాది పలు కీలక పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గుంట మగ్గాల స్థానంలో ఫ్రేమ్ మగ్గాలను తీసుకొచ్చారు. మొత్తం 10,652 మగ్గాలను ఇస్తారు. ఒక్కో దానికి రూ.38 వేల చొప్పున మొత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.40.5 కోట్లు కేటాయించనుంది. చేనేత కార్మికులు చనిపోయిన సమయంలో టెస్కో ద్వారా బాధిత కుటుంబానికి ఇచ్చే నష్ట పరిహారాన్ని రూ.12,500 నుంచి రూ.25 వేలకు పెంచారు.
14. ఏ సంస్థకు మహారత్న హోదా దక్కింది? (2)
1) వోఎన్జీఈ విదేశ్
2) ఆయిల్ ఇండియా
3) ఎన్టీపీసీ 4) హెచ్‌పీసీఎల్
వివరణ: ఆయిల్ ఇండియాకు మహారత్న హోదా దక్కింది. అలాగే వోఎన్జీసీ విదేశ్ సంస్థకు నవరత్న హోదాను ఇస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఆయిల్ ఇండియా గతంలో నవరత్న విభాగంలో ఉంది. ప్రస్తుతం దీనికి మహారత్న హోదా దక్కింది. దీంతో ఈ హోదా పొందిన సంస్థల సంఖ్య 13కు చేరింది. 2022-23లో ఈ సంస్థ రూ.41,039 కోట్ల టర్నోవర్‌తో రూ.9854 కోట్ల లాభాలను ఆర్జించింది. వోఎన్జీసీ సంస్థకు నవరత్న రావడంతో, ఈ విభాగంలో ఉన్న సంస్థల సంఖ్య 14కు పెరిగింది. 2022-23లో ఓఎన్జీసీ విదేశ్ సంస్థ రూ.11,676 కోట్ల టర్నోవర్‌ను కలిగి ఉంది. అలాగే రూ.1700 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
15. టెస్లా సంస్థకు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా నియమితులైన భారత సంతతి వ్యక్తి ఎవరు? (3)
1) సంసద్ సంజీవ్ 2) రామ్ శర్మ
3) వైభవ్ తనేజా 4) కల్యాణ్
వివరణ: ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు తదితర రంగాల్లో పని చేసే అమెరికా సంస్థ టెస్లాకు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా భారత సంతతికి చెందిన వైభవ్ తనేజా నియమితులయ్యారు.
ప్రస్తుతం ఆయన ఆ సంస్థలో చీఫ్ అకౌంటింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. ఆ సంస్థ భారత్‌లో తన కార్యకలాపాలను విస్తరించనుంది. ఇందుకు అనుగుణంగా ఈ నియామకాన్ని చేపట్టారు. టెస్లా సంస్థ అమెరికాలోని టెక్సాస్‌లో ఆస్టిన్ అనే ప్రాంతం కేంద్రంగా పనిచేస్తుంది. 2003 జూలై 1న ఈ సంస్థను ఏర్పాటు చేశారు.ఈ సంస్థలో ఎలాన్ మస్క్ అతిపెద్ద వాటాదారుగా ఉన్నారు.
13. ఉన్మేష, ఉత్కర్ష్ వేడుకలను ఏ రాష్ట్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు? (2)
1) జార్ఖండ్ 2) మధ్యప్రదేశ్
3) బీహార్ 4) ఉత్తరప్రదేశ్
వివరణ: సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీలు నిర్వహించిన ఉన్మేష, ఉత్కర్ష్ వేడుకలను మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించారు. వీటిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. సాంస్కృతిక, సంప్రదాయాల భిన్నత్వాన్ని చాటి చెప్పేందుకు వీటిని నిర్వహిస్తున్నారు. ఉన్మేష అనేది అంతర్జాతీయ సాహిత్య వేడుక. ఆసియాలోనే అతిపెద్ద సాహిత్యే వేడుక ఇది. దాదాపు 102 భాషలకు చెందిన 575 మంది రచయితలు ఇందులో పాల్గొన్నారు. ఉత్కర్ష్ అనేది జానపద, గిరిజన కళలకు సంబంధించింది. గిరిజనుల ప్రగతిని ఉద్దేశించి దీన్ని నిర్వహిస్తున్నారు.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
21st సెంచరీ ఐఏఎస్
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు