Telangana History | తూముల యుద్ధం ఏయే రాజుల మధ్య జరిగింది?
మే 24వ తేదీ తరువాయి..
335. గణపతిదేవుడు దివిసీమ ఆక్రమణకు ఎవరి నేతృత్వంలో కాకతీయ సైన్యాలను పంపించాడు?
a) రేచర్ల రుద్రుడు
b) కాయస్థ గంగయ సాహిణి
c) మల్యాల చౌండ సేనాని
d) జాయప సేనాని జవాబు: (c)
వివరణ: ఆ సమయంలో దివిసీమ అయ్య వంశానికి చెందిన పిన్నచోడుని పాలనలో ఉంది. యుద్ధంలో ఓడిన పిన్నచోడుడు గణపతిదేవుడితో సంధి చేసుకున్నాడు. తన కుమార్తెలు నారాంబ, పేరాంబను గణపతిదేవుడికి ఇచ్చి పెండ్లి చేశాడు. వారి సోదరుడు జాయప గణపతిదేవుని ఆస్థానంలో ‘గజసాహిణి’గా నియమితులయ్యాడు.
336. గణపతిదేవుడి సైన్యాలు బంతి ఆట ఆడుకున్న వెలనాటి పాలకుడు ఎవరు?
a) పిన్నచోడుడు
b) విజయగండగోపాలుడు
c) పృథ్వీశ్వరుడు d) నల్లసిద్ధి
జవాబు: (c)
వివరణ: ఈ కారణంగానే గణపతిదేవుడికి ‘పృథ్వీశ్వర శిరఃకందుక క్రీడావినోద’ అనే బిరుదు ఉంది. వెలనాడును ఆక్రమించుకున్న తర్వాత గణపతిదేవుడు తన బావమరిది జాయప సేనానిని ఆ ప్రాంతానికి రాజ ప్రతినిధిగా నియమించాడు.
337. గణపతిదేవుడికి ‘పృథ్వీశ్వర శిరఃకందుక క్రీడావినోద’ అనే బిరుదు ఉన్నట్లు ఏ రచన ద్వారా తెలుస్తున్నది?
a) తిక్కన రాసిన మహాభారతం
b) నిర్వచనోత్తర రామాయణం
c) ప్రతాపరుద్ర చరిత్ర
d) వినుకొండ వల్లభుడి క్రీడాభిరామం జవాబు: (b)
వివరణ: నిర్వచనోత్తర రామాయణం పూర్తిగా పద్యాల్లోనే ఉంది. దీన్ని కూడా తిక్కనే రచించాడు.
338. కింది వాక్యాలను పరిశీలించండి..
1. కాకతీయ మొదటి రుద్రదేవుడు ‘నీతిసారం’ అనే రచన చేశాడు
2. ఇది తెలుగులో ఉంది
3. మొదటి రుద్రదేవుడికి ‘విద్యాభూషణ’ అనే బిరుదు ఉంది
పై వాక్యాల్లో సరైనవి ఏవి?
a) 1 b) 1, 2
c) 1, 3 d) 1, 2, 3
జవాబు: (c)
వివరణ: మొదటి రుద్రదేవుడు నీతిసారాన్ని సంస్కృతంలో రచించాడు.
కాబట్టి 2వ వాక్యం తప్పు. 1, 3 సరైనవి.
339. తెలుగు ప్రాంతాల్లో రెండో మహాభారతంగా ప్రసిద్ధి చెందిన ‘పలనాటి యుద్ధం’ సమయంలో కాకతీయ ప్రభువు ఎవరు?
a) ప్రోలరాజు
b) కాకర్త్య గుండన c) బేతరాజు
d) మొదటి రుద్రదేవుడు జవాబు: (d)
వివరణ: పలనాటి యుద్ధం 1176-82 మధ్య జరిగింది. సవతి సోదరులైన నలగామరాజు, మలిదేవరాజు మధ్య జరిగిన ఈ యుద్ధంలో మొదటి రుద్రదేవుడు నలగామరాజుకు సైనిక సహాయం చేశాడు. ఇక మొదటి రుద్రదేవుడి పాలనాకాలం 1158-95.
340. ఎవరితో జరిగిన యుద్ధంలో మొదటి రుద్రదేవుడు మరణించాడు?
a) జైత్రపాలుడు b) శంకరదేవుడు
c) మహాదేవుడు d) రామచంద్రరాయ
జవాబు: (a)
వివరణ: జైత్రపాలుడు (జైతుగి) దేవగిరి యాదవరాజు.
341. అబ్దుల్లా కుతుబ్‌షా 1636లో మొగల్ సార్వభౌమత్వాన్ని అంగీకరించినప్పుడు మొగల్ చక్రవర్తిగా ఎవరు ఉన్నారు?
a) జహంగీర్ b) షాజహాన్
c) ఔరంగజేబ్ d) అక్బర్
జవాబు: (b)
వివరణ: మొగలులకు, కుతుబ్‌షాహీలకు మధ్య 1636లో సంధి జరిగింది. దీంతో గోల్కొండ మొగలుల సామంత రాజ్యంగా మారిపోయింది.
342. 1656లో గోల్కొండ ఆక్రమణకు వచ్చిన మొగల్ యువరాజు ఎవరు?
a) షాజహాన్ b) జహంగీర్
c) దారాషికో d) ఔరంగజేబ్
జవాబు: (d)
వివరణ: మొగలుల దక్కన్ ప్రతినిధి ఔరంగజేబ్ 1656లో గోల్కొండను ముట్టడించాడు. అబ్దుల్లా కుతుబ్‌షా ప్రార్థన మేరకు షాజహాన్ సంధికి ఒప్పుకొన్నాడు. ఔరంగజేబ్ కూడా సంధికి అంగీకరించాడు. ఈ సంధి షరతుల మేరకు అబ్దుల్లా కుతుబ్‌షా తన కుమార్తెను ఔరంగజేబ్ కొడుకు మహ్మద్ సుల్తాన్‌కు ఇచ్చి పెండ్లి చేశాడు. యుద్ధ పరిహారం కింద అపారమైన ధనాన్ని సమర్పించుకున్నాడు.
343. గౌతమీపుత్ర శాతకర్ణి పేరుతో పునర్ముద్రించిన శక రాజు నహపాణుడు వేయించిన నాణేలు ఎక్కడ దొరికాయి?
a) జోగల్తంబి b) ధూళికట్ట
c) కోటిలింగాల d) కొండాపూర్
జవాబు: (a)
344. గౌతమీపుత్ర శాతకర్ణి గురించి తెలుసుకునేందుకు ప్రధాన ఆధారం ఏది?
a) నానాఘాట్ శాసనం
b) నాసిక్ శాసనం
c) హాథిగుంఫా శాసనం
d) ఎర్రగుడి శాసనం జవాబు: (b)
వివరణ: నాసిక్ శాసనాన్ని గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి గౌతమి బాలశ్రీ వేయించింది. దీని నుంచి ఆయన సైనిక విజయాలు తెలుస్తున్నాయి. ఏకబ్రాహ్మణ, ఆగమనిలయ, త్రిసముద్ర తోయపీతవాహన (మూడు సముద్రాల నీళ్లు తాగిన గుర్రాలను కలిగినవాడు), దక్షిణాపథపతి అనే బిరుదులు ఉన్నట్లు తెలుస్తున్నది.
345. శాతవాహనుల పాలనకు సంబంధించి ‘గ్రామిక’ (గామిక) లేదా ‘గుల్మిక’ (గుమిక) దేన్ని సూచిస్తుంది?
a) గ్రామ పాలనా బాధ్యత అధికారి
b) జిల్లా స్థాయి అధికారి
c) వ్యవసాయానికి సంబంధించిన అధికారి
d) కొన్ని గ్రామాల సముదాయం
జవాబు: (a)
వివరణ: హిరహడగళ్లి శాసనం, గాథాసప్తశతిలో గ్రామికుల ప్రస్తావన ఉంది.
346. శాతవాహనుల సైనిక వ్యవస్థకు సంబంధించి ‘స్కందావారం’, ‘కటకం’ వేటిని సూచిస్తాయి?
a) సైనిక దళాలు
b) సైన్యాధ్యక్షులు ఉండే స్థలాలు
c) సైనిక శిబిరాలు
d) సైన్యానికి జరిపే ధన, ధాన్య చెల్లింపులు
జవాబు: (c)
వివరణ: స్కందావారం అంటే యుద్ధ సమయం లో తాత్కాలికంగా కొన్నాళ్లపాటు సైన్యం విడిది చేసే శిబిరం. కటకం అంటే శాశ్వత సైనిక స్థావరం. ఇప్పటి కంటోన్మెంట్ లాంటిది.
347. చివరి శాతవాహన రాజుల్లో ఒకడైన యజ్ఞశ్రీ శాతకర్ణి సమకాలీనుడైన మహాయాన బౌద్ధమత సన్యాసి, పండితుడు ఎవరు?
a) ఆర్య సర్వకామి
b) ఆచార్య దిజ్ఞాగుడు
c) వసుమిత్రుడు
d) ఆచార్య నాగార్జునుడు
జవాబు: (d)
348. నాగార్జునుడు బోధించిన తత్వం ఏది?
a) విజ్ఞానవాదం b) మాధ్యమికవాదం
c) సర్వాస్థివాదం d) లోకాయతం
జవాబు: (b)
349. ఆచార్య నాగార్జునుడి గురించి కింది వాక్యాలను పరిశీలించండి..
1. ఈయన ఆత్మతత్వాన్ని ఆమోదించ లేదు
2. దీన్ని శూన్యవాదం అని పేర్కొంటారు
పై వాటిలో సరైనవి ఏవి?
a) 1 b) 2 c) 1, 2
d) 1, 2 సరైనవి కావు
జవాబు: (c)
350. శాతవాహనుల కాలపు సాహిత్యం వివరాలను పరిశీలించండి..
1. కాతంత్ర వ్యాకరణం: శర్వవర్మ
2. బృహత్కథామంజరి: క్షేమేంద్రుడు
3. కుతూహలుడు: సత్తసయి
4. సుహృల్లేఖ: కుమారజీవ
పైన వాటిలో సరైనవి?
a) 1 b) 1, 2
c) 1, 2, 3 d) 1, 2, 3, 4
జవాబు: (b)
వివరణ: శాతవాహన చక్రవర్తి హాలుడు, సింహళ రాకుమారి లీలావతిని పెండ్లాడిన నేపథ్యంతో కుతూహలుడు ‘లీలావతి’ (లీలవాయి)ని రచించాడు. సుహృల్లేఖను రచించింది ఆచార్య నాగార్జునుడు.
351. కాకతీయ రెండో ప్రతాపరుద్రుడు, అతని రాణి విశాలాక్షి మరణించిన తీరును కింది ఏ కావ్యం లో వర్ణించారు?
a) ప్రతాపరుద్ర యశోభూషణం
b) పురుషార్థ సారం
c) ప్రతాపచరిత్ర
d) సిద్ధేశ్వర చరిత్ర జవాబు: (c)
వివరణ: దీన్ని రచించింది ఏకామ్రనాథుడు.
352. కింది కవుల్లో ‘సిద్ధేశ్వర చరిత్ర’ను రచించింది ఎవరు?
a) బమ్మెర పోతన b) కొరవి గోపరాజు
c) నంది మల్లయ d) కాసె సర్వప్ప కవి
జవాబు: (d)
353. కింది వివరాలను జతపరచండి.
A. శశిబిందు చరిత్ర 1. పాలవేకరి కదిరీపతి
B. వజ్రాభ్యుదయం 2. చరిగొండ నరసింహ కవి
C. హంసవింశతి 3. నెల్లూరు నారాయణ కవి
D. శుకసప్తతి 4. అయ్యలరాజు నారాయణామాత్యుడు
a) A-2, B-3, C-4, D-1
b) A-2, B-4, C-3, D-1
c) A-3, B-4, C-1, D-2
d) A-1, B-2, C-3, D-4
జవాబు: (a)
వివరణ: ఇవి కుతుబ్‌షాహీల కాలపు రచనలు.
354. కుతుబ్‌షాహీల చరిత్రకు సంబంధించి ‘ తూముల యుద్ధం’ ఎవరెవరి మధ్య జరిగింది?
a) గోల్కొండ, విజయనగర
b) గోల్కొండ, బీదర్
c) గోల్కొండ, బిజాపూర్
d) గోల్కొండ, అహ్మద్‌నగర్
జవాబు: (b)
355. తూముల యుద్ధం ఏయే రాజుల మధ్య జరిగింది?
a) జంషీద్ కుతుబ్‌షా, అలీ బరీద్
b) ఇబ్రహీం కుతుబ్‌షా, అలీ బరీద్
c) మహమ్మద్ కులీకుతుబ్‌షా, ఖాసిం బరీద్
d) కులీ కుతుబ్‌షా, అమీర్ బరీద్
జవాబు: (a)
356. క్రీ.శ. 5వ శతాబ్దంలో విష్ణుకుండినుల కాలంలో, పూర్వపు కరీంనగర్ జిల్లా ప్రాంతంలో నివసించినట్లుగా పేర్కొనే మహాయాన బౌద్ధమత పండితుడు ఎవరు?
a) ఆచార్య అసంగుడు
b) ఆచార్య కుమారజీవుడు
c) ఆచార్య దిగ్నాగుడు
d) ఆచార్య ధర్మకీర్తి జవాబు: (c)
వివరణ: ఆచార్య దిగ్నాగుడి ప్రస్తావన కాళిదాసు రచన ‘మేఘసందేశం’లో వస్తుంది.
357. మహాయాన బౌద్ధమతంలో ‘యోగాచార’ మార్గాన్ని ప్రబోధించిన ప్రఖ్యాత బౌద్ధమత పండితుడు ఎవరు?
a) ఆచార్య నాగార్జునుడు
b) వసుమిత్రుడు
c) అశ్వఘోషుడు
d) ఆచార్య దిగ్నాగుడు జవాబు: (d)
358. ప్రమాణ సముచ్ఛయం అనే సంస్కృత గ్రంథం రచయిత ఎవరు?
a) ఆచార్య దిగ్నాగుడు
b) ఆచార్య అసంగుడు
c) ఆచార్య నాగార్జునుడు
d) ఆచార్య ధర్మకీర్తి జవాబు: (a)
359. విష్ణుకుండినుల కాలానికి సంబంధించి ‘ఘటికాస్థానాలు’ అంటే ఏమిటి?
a) కుండలు తయారుచేసే స్థలాలు
b) వ్యాపార కేంద్రాలు
c) వేద విద్యాలయాలు
d) దేవాలయాలకు అనుబంధంగా ఉండే
స్వాముల మఠాలు జవాబు: (c)
360. విష్ణుకుండినుల కాలం నాటిదిగా పరిగణిస్తున్న హైదరాబాద్ చైతన్యపురి శాసనం ఏ భాషలో ఉంది?
a) తెలుగు b) ప్రాకృతం
c) సంస్కృతం d) బ్రాహ్మీ
జవాబు: (b)
వివరణ: ఇది బౌద్ధమతానికి సంబంధించినది.
361. విష్ణుకుండినుల రాజ లాంఛనం ఏది?
a) పులి b) వరాహం
c) గండబేరుండం
d) లంఘిస్తున్న సింహం జవాబు: (d)
362. విష్ణుకుండినుల శాసనంలో పేర్కొన్న గోవిందరాజ విహారం ఎక్కడ ఉంది?
a) హైదరాబాద్ b) విజయవాడ
c) ఫణిగిరి d) గాజులబండ
జవాబు: (a)
వివరణ: హైదరాబాద్‌లోని చైతన్యపురిలో విష్ణుకుండిన గోవిందవర్మ కట్టించినట్లు తెలుస్తున్నది. కాగా ఆయన పట్టపురాణి ఇంద్రపాలనగరంలో తన పేరుమీదుగా పరమభట్టారికా మహాదేవి విహారాన్ని నిర్మించింది.
363. కింది వాటిని పరిశీలించండి.
1. బాదామి చాళుక్యులు: మొదటి పులకేశి
2. రాష్ట్రకూటులు: అమోఘవర్షుడు
3. కల్యాణి చాళుక్యులు: రెండో తైలపుడు
4. వేములవాడ చాళుక్యులు: సత్యాశ్రయ రణవిక్రముడు
పై వాటిలో సరైనవి ఎన్ని?
a) 1 b) 2 c) 1, 3, 4
d) 1, 2, 3, 4 జవాబు: (c)
వివరణ: ఇచ్చిన ప్రశ్న రాజవంశాలు, స్థాపకులకు సంబంధించింది. రాష్ట్రకూట వంశ స్థాపకుడు దంతిదుర్గుడు.
364. నలభై రెండు యుద్ధాల్లో ఓటమి ఎరుగని వీరుడిగా ‘సోలదగండడు’గా ప్రసిద్ధి చెందిన వేములవాడ చాళుక్య రాజు ఎవరు?
a) యుద్ధమల్లుడు
b) బద్దెగుడు
c) రెండో అరికేసరి
d) మొదటి అరికేసరి జవాబు: (b)
365. వేములవాడ చాళుక్యుల కాలపు సంస్కృత రచన ‘యశస్తిలక చంపు’ రచయిత ఎవరు?
a) పంప b) జినవల్లభుడు
c) సోమదేవసూరి d) మల్లినాథసూరి
జవాబు: (c)
366. చాళుక్యుల కాలానికి సంబంధించి.. ఏదైనా ఊళ్లో దొంగతనం జరిగితే ఆ గ్రామం అధికారినే బాధ్యుణ్ని చేసి, వస్తువులను వాటి యజమానులకు ఇప్పించే విధానానికి ఏమని పేరు?
a) శ్రీకావలి b) అచ్చుకావలి
c) గ్రామకావలి d) ఆయగార్ విధానం
జవాబు: (b)
367. వేములవాడ చాళుక్యుల కాలంలో నిర్మితమైన శుభధామ జినాలయానికి ప్రధాన గురువు ఎవరు?
a) సోమదేవసూరి b) మల్లినాథసూరి
c) జినప్రభసూరి d) జినవల్లభుడు
జవాబు: (a)
వివరణ: శుభధామ జినాలయాన్ని బద్దెగుడు నిర్మించాడు.
హర్షవర్ధన్ చింతలపల్లి
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు