Home
Latest News
SSC CHSL 2023 Notification | ఇంటర్ అర్హతతో 1600 కొలువులు.. దరఖాస్తులకు రేపే చివరితేదీ
SSC CHSL 2023 Notification | ఇంటర్ అర్హతతో 1600 కొలువులు.. దరఖాస్తులకు రేపే చివరితేదీ
SSC CHSL 2023 Notification | ప్రభుత్వ కొలువు సాధిద్దామనుకుంటున్నారా? జీవితంలో త్వరగా స్థిరపడాలనుకుంటున్నారా? కేవలం ఇంటర్ ఉత్తీర్ణులైతే చాలు. ఆకర్షణీయమైన జీతభత్యాలు, పదోన్నతులకు అవకాశాలు. వీటన్నింటి సమాహారమే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇటీవల విడుదల చేసిన సీహెచ్ఎస్ఎల్ 10+2 ఎగ్జామ్-2023. ఈ నోటిఫికేషన్‌తో 1600 పోస్టులను భర్తీ చేయనుండగా.. దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది.
సీహెచ్ఎస్ఎల్ (10+2)-2023
- కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్ ఎగ్జామినేషన్-2023. ఈ పరీక్ష ద్వారా కేంద్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పరీక్షను జాతీయస్థాయిలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది.
- మొత్తం ఖాళీలు: 1600
నోట్: ప్రస్తుతానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌కు అందిన ఖాళీలు ఇవి. వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
భర్తీ చేసే పోస్టులు - లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్డీసీ)/ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జేఎస్ఏ)
- పేస్కేల్: లెవల్-2, రూ.19,900-63,200/-
- డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈవో)
- పేస్కేల్: లెవల్-4, రూ.25,500-81,100 & లెవల్-5, రూ.29,200-92,300
- గ్రేడ్ ఏ డేటా ఎంట్రీ ఆపరేటర్
- పేలెవల్-4 రూ.25,500-81,100
అర్హతలు
వయస్సు: 2023, ఆగస్టు 1 నాటికి 18-27 ఏండ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు 1996, ఆగస్టు 2 నుంచి 2005, ఆగస్టు 1 మధ్య జన్మించి ఉండాలి. - ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు: 2023, ఆగస్టు 1 నాటికి కాగ్, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్‌లో డీఈవో పోస్టులకు సైన్స్ స్ట్రీమ్‌తో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. - ఎల్డీసీ/జేఎస్ఏ, డీఈవో పోస్టులకు (పైన పేర్కొన్న డిపార్ట్మెంట్లు కాకుండా) ఇంటర్ ఉత్తీర్ణత.
నోట్: ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాసి ఆగస్టు 1నాటికి ఉత్తీర్ణత సాధించే వారు కూడా
దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం - కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా రెండంచెల విధానంలో ఎంపిక చేస్తారు.
- టైర్-1, టైర్-2 విధానంలో
టైర్-1 - నాలుగు భాగాలు ఉంటాయి. వీటిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ (బేసిక్ నాలెడ్జ్), జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటీవ్ ఆప్టిట్యూడ్ (బేసిక్ అర్థమెటిక్ స్కిల్), జనరల్ అవేర్నెస్ నుంచి 25 ప్రశ్నల చొప్పున మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు.
- టైర్-1 పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు.
- పరీక్ష ఇంగ్లిష్‌తోపాటు 14 భాషల్లో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం తెలుగులో కూడా ఉంటుంది.
అభ్యర్థి ఎంపిక చేసుకున్న భాషలో పరీక్ష రాయవచ్చు.
టైర్-2 - రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు. దీనిలో మూడు సెక్షన్లు ఉంటాయి. వీటిలో మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యుల్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎల్డీసీ/జేఎస్ఏ పోస్టులకు స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్‌ను నిర్వహిస్తారు.
- టైర్-2లో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది.
ప్రతి తప్పు జవాబుకు 1 మార్కు కోత విధిస్తారు.
నోట్: టైర్-1, 2లో వచ్చిన మార్కుల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. స్కిల్ టెస్ట్ కేవలం క్వాలిఫయింగ్ పరీక్ష మాత్రమే. దీనిలో అర్హత సాధించిన వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్‌ల ద్వారా తుది ఎంపిక చేస్తారు.
ముఖ్యతేదీలు - దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: జూన్ 8
- ఫీజు చెల్లించడానికి చివరితేదీ: జూన్ 10
- పరీక్ష తేదీలు: టైర్-1 పరీక్షను ఆగస్టులో నిర్వహిస్తారు. టైర్-2 పరీక్ష తేదీలను తర్వాత ప్రకటిస్తారు.
- రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, కరీంనగర్
- వెబ్సైట్: https://ssc.nic.in
Previous article
Telangana History | తూముల యుద్ధం ఏయే రాజుల మధ్య జరిగింది?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు