Telangana History & Culture | చంద్రపట్నం, నెలవారం ఏ జాతరలో చేపట్టే కార్యక్రమాలు?
1. కింది జాతరలు అవి జరిగే జిల్లాలను జతపర్చండి.
1. సమ్మక్క-సారలమ్మ ఎ. ములుగు
2. నాగోబా బి. మెదక్
3. ఏడుపాయల సి. ఆదిలాబాద్
4. గొల్లగట్టు డి. సిద్దిపేట
ఇ. సూర్యాపేట
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-ఎ, 2-సి, 3-బి, 4-ఇ
3) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
4) 1-ఎ, 2-సి, 3-డి, 4-ఇ
2. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి.
ఎ. రాష్ట్రంలో అతిపెద్ద జాతర, అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర
బి. రాష్ట్రంలో అతిపెద్ద రెండో గిరిజన జాతర నాగోబా జాతర
సి. రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతర గొల్లగట్టు జాతర
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
3. కింది జాతరలు, జరిగే రోజుల గురించి సరైన వాటిని గుర్తించండి?
ఎ. సమ్మక్క-సారలమ్మ జాతర- నాలుగు రోజులు
బి. గొల్లగట్టు జాతర- ఐదు రోజులు
సి. కురుమూర్తి జాతర- పందొమ్మిది రోజులు
డి. ఏడుపాయల జాతర- మూడు రోజులు
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, సి, డి
4. సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి?
ఎ. జాతర జరిగే ప్రాంతం ములుగు జిల్లా మేడారం
బి. రెండేండ్లకోసారి మాఘపౌర్ణమి నాడు జరుగుతుంది
సి. సమ్మక్క భర్త గోవిందరాజు, సారలమ్మ భర్త పగిడిద్దరాజు
డి. 1995, ఫిబ్రవరి 1న ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతరను అధికార పండుగగా ప్రకటించింది
1) ఎ, బి 2) సి, డి
3) ఎ, సి 4) బి, డి
5. నాగోబా జాతరకు సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి?
ఎ. జాతర జరిగే ప్రాంతం- ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్
బి. రెండేండ్లకోసారి నిర్వహిస్తారు
సి. ఈ జాతర సందర్భంగా నిర్వహించే ‘గోండు దర్బార్’ కార్యక్రమాన్ని ప్రారంభింపజేసింది హైమన్ డార్ఫ్
డి. ఈ జాతర సందర్భంగా భేటింగ్ నిర్వహిస్తారు
1) ఎ, బి, సి, డి 2) ఎ, సి, డి
3) బి, సి, డి 4) ఎ, బి, సి, డి
6. గొల్లగట్టు జాతరకు సంబంధించి సరైనవి?
ఎ. జాతర జరిగే ప్రాంతం- సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి గ్రామం.
బి. రెండేండ్లకోసారి 5 రోజులు నిర్వహిస్తారు
సి. ఇక్కడ పూజలందుకునే దేవతలు లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లి
డి. ఈ జాతర సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలు చంద్రపట్నం, నెలవారం
1) ఎ, బి, సి, డి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి
7. కింది వాటిని జతపర్చండి.
1. గోండులు ఎ. సమ్మక్క సారలమ్మ జాతర
2. కోయలు బి. నాగోబా జాతర
3. లంబాడీలు సి. తుల్జాభవాని జాతర
4. చెంచులు డి. సలేశ్వరం జాతర
ఇ. గొల్లగట్టు జాతర
1) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
4) 1-ఇ, 2-సి, 3-డి, 4-ఎ
8. ప్రతాపరుద్ర సింగరాయ జాతర ఏ జిల్లాలో జరుగుతుంది?
1) సిద్దిపేట 2) మెదక్
3) కరీంనగర్ 4) వరంగల్
9. కింది పదాలు, సంబంధిత జాతరలతో జతపర్చండి.
1. హైమన్ డార్ఫ్ ఎ. ఐనవోలు
2. పెద్దబండి ఆచారం బి. నాగోబా
3. సుంకు కొలవడం సి. కురుమూర్తి
4. దాసంగం డి. తేగడ
ఇ. అమృత కుండం ఇ. కేతకి సంగమేశ్వర
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి, 5-ఇ
3) 1-ఇ, 2-డి, 3-సి, 4-ఎ, 5-బి
4) 1-సి, 2-డి, 3-ఇ, 4-ఎ, 5-బి
10. కింది జాతరలు, అవి జరిగే రోజుల ఆధారంగా ఆరోహణ క్రమంలో అమర్చండి.
ఎ. కొమురవెల్లి బి. కురవి
సి. కురుమూర్తి డి. నాగోబా
1) ఎ, బి, సి, డి 2) బి, సి, డి, ఎ
3) డి, సి, బి, ఎ 4) సి, డి, బి, ఎ
11. జాతరలు, అవి జరిగే జిల్లాలను జతపర్చండి.
1. కోతదేవుడి జాతర ఎ. నిర్మల్
2. గాంధారి మైసమ్మ బి. మంచిర్యాల
3. నాంచారమ్మ సి. యాదాద్రి భువనగిరి
4. ఖాందేవ్ డి. ఆదిలాబాద్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
4) 1-ఎ, 2-సి, 3-బి, 4-ఎ
12. పండుగలు, అవి జరిగే తెలుగు నెలలను జతపర్చండి.
1. బోనాలు ఎ. ఆషాఢం
2. బతుకమ్మ బి. ఆశ్వయుజ
3. హోలి సి. ఫాల్గుణ
4. వినాయక చవితి డి. భాద్రపద
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
3) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
4) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
13. కింది పదాలు, సంబంధిత పండుగలతో జతపర్చండి.
1. మిథిలా స్టేడియం ఎ. శ్రీరామ నవమి
2. భంగు బి. బతుకమ్మ
3. అలయ్ బలయ్ సి. హోలి
4. అర్రెం డి. దసరా
ఇ. దీపావళి
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-సి, 2-డి, 3-ఎ, 4-ఇ
3) 1-బి, 2-సి, 3-ఇ, 4-ఎ
4) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
14. కింది పదాలు, సంబంధిత పండుగలతో జతపర్చండి.
1. రంగం/భవిష్యవాణి ఎ. బతుకమ్మ
2. మలీద ముద్దలు బి. బోనాలు
3. ఢిమోలి సి. పెద్దదేవుని పండుగ
4. త్రిభుజాకృతిలో ఉన్న రాయి డి. తీజ్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
4) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
15. కింది పండుగలు, అవి జరుపుకొనే గిరిజన తెగలకు సంబంధించి సరిగా జతపరచబడిన జతలను గుర్తించండి?
ఎ. పెర్సిపన్- గోండులు
బి. తీజ్- లంబాడీలు
సి. అకిపెన్- గోండులు
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, సి
16. కింది దర్గాలు, అవి ఉన్న ప్రాంతాలను జతపర్చండి.
1. జాన్పహాడ్ ఎ. సూర్యాపేట- నేరేడుచర్ల
2. షారాజు కట్టల్ బి. హైదరాబాద్
3. పహాడీషరీఫ్ సి. రంగారెడ్డి- కొత్తూరు
4. బడా పహాడ్ డి. నిజామాబాద్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
3) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
4) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
17. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి.
ఎ. మహ్మద్ ప్రవక్త జన్మదినం- మిలాద్ ఉన్ నబీ
బి. షవ్వాల్ నెలలో చంద్రుడు కనిపించగానే జరుపుకొనే పండుగ రంజాన్
సి. హిందూ ముస్లింల ఐక్యతకు గుర్తు మొహర్రం (పీర్ల పండుగ)
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, సి
18. కింది వ్యక్తులు, సంబంధిత హస్తకళలకు సంబంధించి సరైన జతలను గుర్తించండి?
ఎ. నిమ్మనాయుడు- నిర్మల్ ఆర్ట్వేర్
బి. కడార్ల రామయ్య- సిల్వర్ ఫిలిగ్రీ
సి. అయిలాచారి- పెంబర్తి హస్తకళలు
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, సి
19. కింది భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువులు, సంవత్సరాల్లో సరిగా జతపరిచిన వాటిని గుర్తించండి?
ఎ. పోచంపల్లి చేనేత- 2004-05
బి. హైదరాబాద్ హలీం- 2010-11
సి. తాండూరు కందిపప్పు- 2021-22
డి. సిల్వర్ ఫిలిగ్రీ- 2007-08
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, బి, సి, డి
20. కింది పదాలు, హస్తకళలతో సరిగా జతపర్చండి.
1. నకాషీలు ఎ. స్క్రోల్ పెయింటింగ్
2. గన్ మెటల్ బి. బిద్రి ఆర్ట్
3. బెల్ మెటల్ సి. డోక్రా మెటల్ క్రాఫ్ట్
4. టై డై ప్రక్రియ డి. తేలియా రుమాల్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
3) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
4) 1-సి, 2-బి, 3-ఎ, 4-బి
21. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి కింది వాటిలో సరైనవి గుర్తించండి?
ఎ. రూపశిల్పి- జాస్పర్ (బెల్జియం)
బి. స్థలాన్ని దానం చేసింది- మహాలఖ చందాబాయి వారసులు
సి. స్థలాన్ని ఎంపిక చేసింది- సర్ పాట్రిక్ జెడెస్
డి. స్థాపన- 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, సి
22. గోల్కొండ కోటకు సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి?
ఎ. గోల్కొండ పూర్వ నామం- మంకాల్/మంగళారం
బి. మొత్తం బురుజులు- 87, దర్వాజలు- 8
సి. ప్రధాన దర్వాజ- ఫతే దర్వాజ/ విజయ ద్వారం
డి. ఎత్తయిన ప్రాంతం- బాలా హిస్సార్
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, బి, సి, డి 4) ఎ, సి, డి
23. కింది కట్టడాలు/నిర్మాణాలు పూర్తయిన ప్రకారం కాలక్రమంలో అమర్చండి.
ఎ. హుస్సేన్ సాగర్ బి. పురానా పూల్
సి. హై కోర్టు డి. మక్కా మసీదు
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, డి, సి
3) డి, బి, సి, ఎ 4) ఎ, సి, డి, బి
24. కింది కట్టడాలు, వాటికి సంబంధించిన అర్థాలను సరిగా జతపర్చండి?
1. ఫలక్నుమా ప్యాలెస్ ఎ. ఆకాశ దర్పణం
2. ఎర్రమంజిల్ బి. స్వర్గంలో నిర్మించుకున్న అందాల భవనం
3. బెల్లావిస్టా సి. అందమైన వీక్షణం
4. దారుల్షిఫా డి. ఆరోగ్యానికి ద్వారం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
4) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
25. కింది కట్టడాలు, వాటి రూపశిల్పి/నిర్మాతలకు సంబంధించి సరిగా జతపరిచిన వాటిని ఎంపిక చేయండి?
ఎ. ఎర్రమంజిల్- ఫక్రుల్ ముల్క్ బహదూర్
బి. చార్మినార్- మీర్ మోమిన్ అస్ట్రాబాది
సి. ఫలక్నుమా ప్యాలెస్- సర్ వికార్ ఉల్ ఉమ్రా
డి. హుస్సేన్ సాగర్- హజ్మత్ హుస్సేన్ షా వలీ
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
26. అసఫ్జాహీ/ కుతుబ్ షాహీ కాలం నాటి కింది కట్టడాలు, ప్రస్తుతం వాటిలో నడుస్తున్న సంస్థలు/ వాటిని ఏ విధంగా ఉపయోగిస్తున్నారో దానికి సంబంధించి సరైన జతలు ఎంపిక చేయండి?
ఎ. బ్రిటిష్ రెసిడెన్సీ- ప్రస్తుతం కోఠి ఉమెన్స్ కాలేజీ
బి. బెల్లావిస్టా- అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా
సి. టౌన్హాల్- అసెంబ్లీ (ప్రస్తుతం)
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) బి, సి 4) ఎ, సి
27. తెలంగాణ అమరవీరుల స్థూపానికి సంబంధించిన కింది వాటిలో సరైనవి?
ఎ. రూపశిల్పి- ఎక్కా యాదగిరి
బి. శంకుస్థాపన- 1970, ఫిబ్రవరి 3
సి. నిర్మాణం పూర్తయ్యింది- 1975
డి. ఎత్తు- 25 అడుగులు
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, బి, సి, డి 4) బి, సి, డి
28. నిలోఫర్ హాస్పిటల్కు సంబంధించి ‘నిలోఫర్’ ఎవరు?
1) 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కూతురు
2) 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ భార్య
3) 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కోడలు
4) ఏదీకాదు
సమాధానాలు
1-2, 2-4, 3-3, 4-1, 5-2, 6-1, 7-1, 8-1, 9-2, 10-3, 11-1, 12-1, 13-4, 14-3, 15-3, 16-1, 17-3, 18-3, 19-3, 20-1, 21-3, 22-3, 23-2, 24-1, 25-4, 26-2, 27-3, 28-3.
గందె శ్రీనివాస్
విషయ నిపుణులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు