Current Affairs | తెలంగాణ
నంబర్ 1 తెలంగాణ
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 4న సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) పర్యావరణంపై ఓ నివేదికను విడుదల చేసింది. దీనిలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా అడవుల విస్తీర్ణం, పచ్చదనం పెరుగుదల, మున్సిపల్ ఘనవ్యవర్థ నిర్వహణ, మురుగునీటి శుద్ధి, పునరుత్పాదక శక్తి, భూగర్భ జలాలు, నీటి వనరులు అనే ఏడు అంశాలపై సీఎస్ఈ అధ్యయనం చేసింది. అన్నింటికీ కలిపి 10 పాయింట్లు నిర్ణయించి రాష్ర్టాలకు కేటాయించింది. దీనిలో 7.213 పాయింట్లతో తెలంగాణ దేశంలోనే టాప్‌గా నిలిచింది. గుజరాత్ (6.593) 2, గోవా (6. 394) 3, మహారాష్ట్ర (5.64) 4, హర్యానా (5.578) 5, ఆంధ్రప్రదేశ్ (5.567) 6, హిమాచల్‌ప్రదేశ్ (5.542) 7, కేరళ (5.472) 8, ఒడిశా (5.234) 9, ఛత్తీస్‌గఢ్ (5.175) 10వ స్థానాల్లో నిలిచాయి.
నైటింగేల్ నర్సెస్
రాష్ర్టానికి చెందిన ఐదుగురు నర్సులు ఆరోగ్యోజ్యోతి, కట్కూరి రాణి, ఉఫత్ ఉన్నిసా, సంజులవర్మ, సిస్టర్ సరితమేరీలకు ‘నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సెస్’ అవార్డు లభించింది. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా జూన్ 6న బెంగళూరులో నిర్వహించిన కార్యక్రమంలో వీరికి ఈ అవార్డు అందజేశారు. ఈ అవార్డును ‘ది నేషనల్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ది న్యూస్‌పేపర్స్ అసోసియేషన్ ఆఫ్ కర్ణాటక’ సంయుక్తంగా ఏటా ఇస్తున్నాయి. ఆరోగ్యజ్యోతి బాన్సువాడ ఏరియా దవాఖాన హెడ్‌నర్స్‌గా, కట్కూరి రాణి జయశంకర్భూపాలపల్లి జిల్లా చిట్యాల సీహెచ్‌సీ స్టాఫ్‌నర్స్‌గా, ఉఫత్ ఉన్నిసా నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట ఏరియా దవాఖాన స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తున్నారు. సంజులవర్మ కేర్ హాస్పిటల్లో సీనియర్ నర్సింగ్ ఆఫీసర్‌గా, సిస్టర్ సరితమేరీ సెయింట్ థెరిసా దవాఖానలో నర్సింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?