ఇక్షాకుల కాలంలో తెలంగాణలోని ప్రముఖ బౌద్ధ క్షేత్రాలు?
1. చివరి శాతవాహన రాజు నాలుగో పూలమావిని ఇక్షాకు రాజు శ్రీశాంతమూలుడు తొలగించి స్వాతంత్య్రాన్ని ప్రకటించుకొన్నాడు. అయితే ఇక్షాకుల పరిపాలనా కాలం?
1) క్రీ.శ. 220 నుంచి 300 వరకు
2) క్రీ.శ. 230 నుంచి 310 వరకు
3) క్రీ.శ. 240 నుంచి 320 వరకు
4) క్రీ.శ 250 నుంచి 330 వరకు
2. ఇక్షాకుల శాసనాలు, నాణేల ఆధారంగా వీరి సామ్రాజ్యం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, కర్నూలు, ప్రకాశం జిల్లాలలో విస్తరించింది. తెలంగాణలో ఏయే జిల్లాల వరకు విస్తరించింది?
1) కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్
2) ఆదిలాబాద్, వరంగల్, మెదక్
3) నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్
4) ఏదీకాదు
3. ఇక్ష్వాకుల నాణేలు మహబూబ్నగర్ జిల్లాలోని ఏ ప్రాంతంలో లభించాయి?
1) అమ్రాబాద్ 2) నారాయణపేట
3) వడ్డెమాను 4) మద్దిమడుగు
4. రాజులు తమ పేర్లకు ముందు తల్లిపేరు ధరించే సంప్రదాయాన్ని శాతవాహనుల తర్వాత ఒక్క రాజవంశం మాత్రమే పాటించింది. ఆ తర్వాత ఈ సంప్రదాయం అంతమైంది. ఈ సంప్రదాయాన్ని పాటించిన రాజవంశం?
1) శాలంకాయనులు 2) ఆనందగోత్రులు
3) బృహత్పలాయనులు 4) ఇక్షాకులు
5. కింద ఇచ్చిన ఇక్షాక రాజుల పాలనాకాలన్ని జతపర్చండి.
1) వాసిష్టీపుత్ర శాంతమూలుడు
ఎ) క్రీ.శ 283-301
2) మఠరీపుత్ర వీరపురుషదత్తుడు బి) క్రీ.శ 253-277
3) ఎహూవలశాంతమూలడు సి) క్రీ.శ 233-253
4) రుద్రపురుషదత్తుడు డి) క్రీ.శ 220-233
1) 1-డి, 2-సి, 3-బి,4-ఎ
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
4) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
6. వాసిష్టీపుత్ర శాంతమూలుడు స్వతంత్ర ఇక్షాక రాజ్య స్థాపకుడు. శాంతమూలుడి గొప్పతనాన్ని గురించి అతని కుమారడు వీరపురుషదత్తుడు వేసిన శాసనం నాగార్జునక కొండలో ఉంది. అయితే వాసిష్టీపుత్ర శాంతమూలుడు వేయించిన శాసనాలు ఎక్కడ దొరికాయి?
1) హన్మకొండ, జగిత్యాల
2) రెంటాల, కేశనపల్లి
3) వడ్డెమాను, అమ్రాబాద్
4) ఇతడు శాసనాలు వేయించలేదు
7. మఠరీపుత్ర శ్రీవీరపురుషదత్తుడు ఇక్షాక వంశంలో గొప్పవాడు. ఇతడికి ఐదుగురు భార్యలున్నారు. ఇతని మేనత్త హర్మ్యశ్రీ కూతుళ్లు బాపిశ్రీ, షష్టిశ్రీ, మరో మేనత్త శాంతిశ్రీ కూతురును వివాహం చేసుకున్నాడు. శస్తముని సంతతికి చెందిన శక క్షాత్రప రాజకుమారి (ఉజ్జయని) మహాదేవి రుద్రభట్టారికను వివాహం చేసుకొన్నాడు. అయితే ఐదో భార్య పేరు?
1) మహాదేవి భట్టిదేవ 2) కొడబలిశ్రీ
3) నాగాణిక 4) వీరాంబ
8. వీరపురుషదత్తుడు మొదట వైదిక మతాన్ని అనుసరించాడు. తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఇతని పాలనా కాలాన్ని ఆంధ్రదేశ బౌద్ధ మత చరిత్రలో ఉజ్వల ఘట్టంగా పేర్కొంటారు. అయితే ఒక శిల్పంలో రాజు తన కుడి కాలుతో శివలింగాన్ని తాకినట్లు ఉంది. ఈ శివలింగం ఎక్కడ ఉంది?
1) అమరావతి 2) భట్టిప్రోలు
3) నాగార్జునకొండ 4) జగ్గయ్యపేట
9. ఎహూవల శాంతమూలుడు మహాదేవి వాసిష్టీభట్టిదేవ, వీరపురుషదత్తుల కుమారుడు. ఇతడి శాసనాలు నాగార్జునకొండ తవ్వకాల్లో లభించాయి. శాంతమూలుని 11వ పాలనా సంవత్సరం కంటేముందే ఒక ముఖ్యమైన యుద్ధం చేసినట్లు ఈ యుద్ధంలో అతని సేనాధిపతి కృపవల్ల విజయం సాధించినట్లు శాసనాల్లో ఉంది. అయితే ఆ సేనాధిపతి ఎవరు?
1) ఎలిశ్రీ 2) నోదుకశ్రీ 3) కృష్ణశ్రీ 4) మనుశ్రీ
10. వీరపురుషదత్తుడు చివరి ఇక్షాక రాజు. ఇతను ఎగువశాంతమూలుని కుమారుడు. ఇతడి నాలుగో పరిపాలన కాలంలో ఒక వ్యక్తి తన దైవమైన హలంపురి స్వామికి కొంత భూమిని దానంగా ఇచ్చినట్లు శాసనంలో ఉంది. దీన్ని గుంటూరు జిల్లాలోని నాగులాపురంగా చరిత్ర కారులు గుర్తించారు. అయితే భూమిని దానంగా ఇచ్చింది ఎవరు?
1) ఎలిశ్రీ 2) నోదుకశ్రీ 3) కృష్ణశ్రీ 4) మనుశ్రీ
11. ఇక్షాకుల శాసనాలు మహాతలవర, మహాసేనాధిపతి, మహా దండనాయక అనే అధికారులను పేర్కొన్నాయి. మహాతలవరులు సామంతస్థాయి కలిగిన అధికారులు. వీరు శాంతిభద్రతలు కాపాడేవారు. కేంద్ర ప్రభుత్వంలో మహాసేనాధిపతి, మహాదండనాయక అనేవారు ఉండేవారు. మహా సేనాధిపతి సైనిక వ్యవహారాలు చూసేవారు. అయితే మహాదండనాయక విధి?
1) ఆర్థిక వ్యవహారాలు 2) విదేశీ వ్యవహారాలు
3) నేర విచారణ, శిక్షలు విధించడం 4) ఏదీకాదు
12. ఇక్షాకుల శాసనాలు గ్రామాధికారిని ఏమని పేర్కొంటున్నాయి?
1) రఠ 2) రథి 3) తలవర 4) మహాతలవర
13. ఇక్షాకుల కాలంలో ప్రభుత్వానికి భూమి శిస్తే ప్రధాన ఆదాయ మార్గం. దాన్ని భాగ అనేవారు. అంటే పంటలో రాజు భాగమని అర్థం. సాధారణంగా పంటలో 1/6వ వంతును భూమి శిస్తుగా వసూలు చేసేవారు. భోగ అనే మరో రకమైన భూమి శిస్తును స్థానిక పాలకులు వసూలు చేసేసుకొని అనుభవించేవారు. ధన రూపంలో హిరణ్యం లేదా దేయం అనేవారు. అయితే ధాన్య రూపంలో వసూలు చేసే పన్ను పేరు?
1) మేయం 2) తూకం 3) పై రెండూ 4) ఏదీకాదు
14. ఇక్షాక రాజులు వైదిక క్రతువులను నిర్వహించడం, బ్రాహ్మణులను ఉన్నత పదవుల్లో నియమించడం, దేవాలయాలను నిర్మించడం వల్ల బ్రాహ్మణుల ఆర్థిక స్థితి మెరుగుపడింది. రాజులు బ్రాహ్మణులకు భూమిని బ్రహ్మదేయంగా ఇచ్చేవారు. దానం చేసిన గ్రామంలోకి రాజోద్యోగులు ప్రవేశించరాదు. ఆ విషయాలన్నీ పల్లవ శివస్కందవర్మ వేయించి హీరహడగళి, మైదవోలు దాన శాసనాలు తెలుపుతున్నాయి. అయితే ఇలాంటి గ్రామాలకు ఎన్ని రకాల పన్నుల్లో మినహాయింపు ఉండేది?
1) 20 రకాలు 2) 19 రకాలు
3) 18 రకాలు 4) 17 రకాలు
15. ఇక్షాకుల్లో ఒక్క రాజు మాత్రమే బౌద్ధ మతాన్ని ఆచరించాడు. ఈ కాలం బౌద్ధమతానికి ఉజ్వలమైందిగా చెప్పవచ్చు. ఇతడి మేనత్త శాంతిశ్రీ ఇతని ఆరో పాలనా సంవత్సరంలో బుద్ధుడి ధాతువులను నిక్షిప్తం చేసిన మహాచౌత్యాన్ని నాగార్జునకొండలో నిర్మించి తొమ్మిది ఆయక స్తంభాలను నెలకొల్పింది. అయితే బౌద్ధ మతాన్ని ఆచరించిన ఇక్షాకు రాజు?
1) ఎహువల శాంతమూలుడు 2) వీరపురుషదత్తుడు
3) శాంతమూలుడు 4) ఎవరూకాదు
16. ఇక్షాకుల కాలంలో తెలంగాణలోని ప్రముఖ బౌద్ధ క్షేత్రాలు?
1) నేలకొండపల్లి 2) తుమ్మలగూడెం
3) గాజులబండ (నల్లగొండ) 4) పైవన్నీ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు