తెలంగాణ ఎకానమీ- వ్యవసాయరంగం
1. కింది వాటిలో సరైనవాటిని గుర్తించండి.
ఎ. రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే జిల్లా ఆదిలాబాద్
బి. రాష్ట్రంలో 2014-15లో 25 శాతం వర్షపాత లోటు నమోదైంది
సి. 2014-15లో వర్షపాత లోటు అధికంగా ఉన్న జిల్లాలు నిజామాబాద్, నల్లగొండ
డి. రాష్ట్రంలో 2013-14తో పోలిస్తే 2014-15లో వార్షిక వర్షపాత లోటు తక్కువ
1. ఎ మాత్రమే నిజం 2. ఎ, సి, డి సరైనవి
3. ఎ, బి, సి సరైనవి 4. అన్నీ సరైనవే
2. కింది వాటిని జత పర్చండి
జిల్లాలు 2014-15లో వర్షపాతం (మి.మీ.)
1. కరీంనగర్ ఎ. 588.1
2. మహబూబ్నగర్ బి. 732.9
3. హైదరాబాద్ సి. 478.5
4. ఆదిలాబాద్ డి. 569.2
5. నల్లగొండ ఈ. 889.0
1 2 3 4 5
1. డి ఎ ఈ సి బి
2. ఈ బి ఎ డి సి
3. బి డి ఎ ఈ సి
4. ఎ ఈ డి సి బి
5. సి బి ఈ ఎ డి
3. కింది వాటిలో సరికాని వాక్యాలేవి.
ఎ. వరంగల్ జిల్లాలో వార్షిక సాధారణ వర్షపాతం 993.9 మిల్లీమీటర్లు కాగా 2014-14లో 780.5 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది
బి. ఖమ్మం జిల్లాలో 2014-15లో వార్షిక వర్షపాతలోటు 26 శాతం నమోదైంది
సి. రంగాడ్డి జిల్లాలో గతేడాది నమోదైన వర్షపాతం 679.5 మిల్లీమీటర్లు కాగా, ఇది జిల్లా సాధారణ వర్షపాతంలో 19 శాతం తక్కువ
డి. మెదక్ జిల్లాలో సాధారణ వార్షిక వర్షపాతం 868.0 మిల్లీమీటర్లు కాగా 2014-15లో నమోదైనది 616.1 మిల్లీ మీటర్లు
1. ఎ, బి సరైనవి 2. సి సరైనవి
3. ఎ, బి, డి సరైనవి 4. అన్నీ సరైనవే
4. కింది జిల్లాలు, 2014-15లో వార్షిక వర్షపాత లోటును సరిగా గుర్తించండి.
1. మెదక్ ఎ. 26 శాతం
2. ఖమ్మం బి. 36 శాతం
3. మహబూబ్నగర్ సి. 6 శాతం
4. నల్లగొండ డి. 29 శాతం
1 2 3 4
1. ఎ సి డి బి
2. బి డి ఎ సి
3. సి బి డి ఎ
4. డి ఎ సి బి
5. కింది వాటిలో సరైన వ్యాఖ్యలను గుర్తించండి
ఎ. తెలంగాణలో 2011-12లో అన్నిరకాల పంటలు కలిసి 58,67,826 హెక్టార్లలో సాగవగా, 2014-15లో 53,15,33 హెక్టార్లలో సాగయ్యాయి
బి. 2014-15లో రాష్ట్రంలో ఆహార పంటల విస్తీర్ణం 30,67,786 హెక్టార్లు కాగా, వాణిజ్యపంటల విస్తీర్ణం 22,47,547 హెకార్లు
సి. 2014-15లో విస్తీర్ణం దృష్టా ఆహార పంటల సాగులో మహబూబ్నగర్ జిల్లా మొదటి స్థానంలో ఉండగా, రంగాడ్డి జిల్లా చివరిస్థానంలో ఉంది
డి. వాణిజ్యపంటల సాగులో విస్తీర్ణం దృష్టా మొదటి రెండుస్థానాల్లో మహబూబ్నగర్, కరీంనగర్ ఉన్నాయి
1. ఎ, బి మాత్రమే సరైనవి
2. బి, సి సరైనవి, ఎ పాక్షికంగా సరైనది
3. ఎ, సి, సరైనవి, బి పాక్షికంగా సరైనది
4. ఎ, బి, సి సరైనవి, డి పాక్షికంగా సరైనది
6. కిందివాటిలో సరైనవాటిని గుర్తించండి
ఎ. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో బియ్యం ఉత్పత్తిలో నల్లగొండ జిల్లా 10,41,359 టన్నులతో మొదటిస్థానంలో ఉండగా, కరీంనగర్ జిల్లా 9,90,930 టన్నులతో రెండోస్థానంలో నిలిచింది
బి. గోధుమల ఉత్పత్తిలో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి
సి. జొన్న ఉత్పత్తిలో మహబూబ్నగర్ జిల్లా మొదటిస్థానంలో, నల్లగొండ జిల్లా రెండోస్థానంలో నిలిచాయి
డి. సజ్జ ఉత్పత్తిలో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉండగా, మహబూబ్నగర్ జిల్లా రెండోస్థానంలో నిలిచింది
1. ఎ, బి, సి సరైనవి 2. ఎ, బి, సి, డి సరైనవి
3. ఎ, బి, డి సరైనవి, సి పాక్షికంగా సరైనది
4. బి, సి, డి సరైనవి, ఎ పాక్షికంగా సరైనది
7. కింది వాక్యాల్లో సరైనవాటిని గుర్తించండి
ఎ. రాష్ట్రంలో నికర సాగుభూమి విస్తీర్ణం 2013-14లో 49,23,039 హెక్టార్లు ఉండగా, 2014-15లో 43,76,576 హెక్టార్లు మాత్రమే ఉంది
బి. 2011-12 నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చిన నికర సాగు విస్తీర్ణం 2014-15లో భారీగా పడిపోయింది.
సి. సేద్యం చేయని భూములు నల్లగొండ జిల్లాలో అత్యధికంగా ఉండగా, రంగాడ్డి జిల్లాలో అతి తక్కువగా ఉన్నాయి
డి. సాగుకు పనికిరాని భూములు నల్లగొండ జిల్లాలో అత్యధికంగా ఉండగా, మహబూబ్నగర్ జిల్లాలో అతితక్కువగా ఉన్నాయి
1. ఎ, బి మాత్రమే నిజం
2. ఎ, బి, సి నిజం, డి పాక్షికంగా నిజమైనది.
3. బి, సి, డి నిజం, ఎ పాక్షికంగా నిజమైనది
8. 2014-15 గణాంకాల ప్రకారం కింది వాటిలో సరైనవాక్యాన్ని గుర్తించండి?
ఎ. మొక్క జొన్న సాగు విస్తీర్ణంలో మహబూబ్నగర్ జిల్లా మొదటిస్థానంలో ఉండగా, ఉత్పత్తిలో కరీంనగర్ జిల్లా మొదటి స్థానంలో ఉంది
బి. రాగి పంట సాగు విస్తీర్ణంలోనూ, ఉత్పత్తిలోనూ మహబూబ్నగర్ జిల్లా మొదటి స్థానంలో ఉంది
సి. రాగుల ఉత్పత్తిలో రంగాడ్డి జిల్లా మొదటిస్థానంలో ఉండగా, మహబూబ్నగర్ జిల్లా రెండో స్థానంలో ఉంది.
డి. చిరు, తృణ ధాన్యాల ఉత్పత్తిలో కరీంనగర్ జిల్లా మొదటి స్థానంలో ఉండగా, నల్లగొండ జిల్లా రెండో స్థానంలో ఉంది.
1. సి, డి వాస్తవం, ఎ, బి అవాస్తవం
2. ఎ, సి, డి వాస్తవం బి పాక్షికంగా వాస్తవం
3. ఎ, బి, సి వాస్తవం, డి పాక్షికంగా వాస్తవం
4. బి, సి, డి వాస్తవం, ఎ పాక్షికంగా వాస్తవం
9. కింది వాటిని పరిశీలించి సరైన నమాధానాన్ని గుర్తించండి
ఎ. తెలంగాణలో 2011-12 ఆర్థిక సంవత్సరం తర్వాత వేరుశనగ ఉత్పత్తి 2014-15లో అతి తక్కువగా నమోదైంది
బి. వర్షాభావ పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో నువ్వుల ఉత్పత్తి పెరిగింది
1. ఎ మాత్రమే వాస్తవం 2. ఎ, బి వాస్తవాలే
3. బి మాత్రమే వాస్తవం
4. ఎ, బి రెండూ అవాస్తవాలు
10. 2014-15లో నూనె గింజల ఉత్పత్తికి సంబంధించి కింది వాటిని జతపర్చండి
రకం ఉత్పత్తి టన్నుల్లో
1. వేరుశనగ ఎ. 3,100
2. పొద్దుతిరుగుడు బి. 2,95,235
3. నువ్వులు సి. 25,667
4. కుసుమలు డి . 9,652
1 2 3 4
1. బి సి డి ఎ
2. బి డి ఎ సి
3. బి సి డి ఎ
4. బి ఎ సి డి
11. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కింది వాటిలో సరైనవాటిని గుర్తించండి.
ఎ. మిర్చి ఉత్పత్తిలో ఖమ్మం జిల్లా మొదటిస్థానంలో నిలువగా వరంగల్ జిల్లా రెండోస్థానంలో ఉంది
బి. మామిడిపండ్ల ఉత్పత్తిలో 1,26,832 టన్నుల వార్షిక దిగుబడిలో నల్లగొండ జిల్లా మొదటిస్థానంలో ఉండగా, 1,26,770 టన్నుల దిగుబడితో ఖమ్మం జిల్లా రెండోస్థానంలో ఉంది
సి. మామిడి సాగు విస్తీర్ణంలో నల్లగొండ జిల్లా మొదటిస్థానంలో ఉండగా, ఖమ్మం జిల్లా రెండోస్థానంలో ఉంది.
డి. మిర్చి సాగు విస్తీర్ణంలో ఖమ్మం జిల్లా మొదటిస్థానంలో ఉండగా, మెదక్ జిల్లా చివరిస్థానంలో ఉంది
1. ఎ, బి, డి వాస్తవం 2. ఎ, బి, సి వాస్తవం
3. బి, సి మాత్రమే వాస్తవం
4. ఎ, డి మాత్రమే వాస్తం
12. కిందివాటిలో సరికాని వాక్యం ఏది?
ఎ. 2014-15లో పసుపు ఉత్పత్తిలో మొదటిస్థానంలో ఉన్న జిల్లా కరీంనగర్ కాగా, సాగు విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా నిజామాబాద్
బి. 2014-15లో పసుపు ఉత్పత్తిలోను, సాగు విస్తీర్ణంలోనూ కరీంనగర్ జిల్లా మొదటిస్థానంలో ఉంది
సి. హైదరాబాద్ను మినహాయిస్తే రాష్ట్రంలో గతేడాది పసుపు ఉత్పత్తిలో నల్లగొండ జిల్లా చివరి స్థానంలో నిలిచింది
డి. 2014-15లో చెరకు ఉత్పత్తిలో మెదక్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది
1. ఎ సరికాని వ్యాఖ్య
2. ఎ, సి, డి సరికాని వాక్యాలు
3. బి మాత్రమే సరికాని వ్యాఖ్య
4. అన్నీ సరైనవే
13. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కిందివాటిలో సరైనదేది?
ఎ. రాష్ట్రంలో ఆహారపంటల సాగు విస్తీర్ణం 57.72 శాతం
బి. ఆహార పంటల సాగు విస్తీర్ణంలో చిరు, తృణ ధాన్యాల సాగు విస్తీర్ణం 41.48 శాతం కాగా, తర్వాతి స్థానంలో 26.62 శాతంతో వరి రెండోస్థానంలో ఉంది
సి. వరి సాగు విస్తీర్ణంలో నల్లగొండ జిల్లా మొదటిస్థానంలో ఉండగా, ఆదిలాబాద్ జిల్లా రెండో స్థానంలో ఉంది.
డి. పొగాకు పంట మహబూబ్నగర్ జిల్లాలో అత్యధికంగా సాగయ్యింది.
1. ఎ, బి, డి సరైనవి. సి పాక్షికంగా సరైనది
2. ఎ, డి మాత్రమే సరైనవి
3. ఎ, బి సరైనవి. సి, డి పాక్షికంగా సరైనవి
4. ఎ, బి, సి, డి సరైనవి
14. వ్యవసాయంలో ఎరువుల వాడకానికి సంబంధించి 2014-15 ఆర్థిక సంవత్సర అంచనాల ప్రకారం సరైనదేది?
ఎ. రాష్ట్రంలో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ ఎరువులు కలిసి మొత్తం 11,77,545 టన్నుల ఎరువులను రైతులు వాడారు
బి. అత్యధికంగా నైజ్రోటన్ ఎరువులను వాడగా, అతి తక్కువగా పొటాష్ ఎరువులు వాడారు
సి. నైట్రోజన్ ఎరువుల వినియోగంలో కరీంనగర్ జిల్లా మొదటిస్థానంలో ఉండగా, మెదక్ జిల్లా చివరి స్థానంలో ఉంది
డి. పొటాష్ ఎరువులను ఆదిలాబాద్ జిల్లాలో అతి తక్కువగా వాడారు
1. అన్నీ సరైనవే
2. ఎ, సి, డి మాత్రమే సరైనవి
3. బి మాత్రమే సరైనది
4. ఏదీ సరికాదు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు