మొదటి ఆహార, వ్యవసాయ శాఖమంత్రి ఎవరు?

1. కింది వాటిలో సరికానిది.
ఎ. ప్రపంచంలో మొదటి లిఖిత, అతిచిన్న, దృఢమైన రాజ్యాంగం- బ్రిటన్ రాజ్యాంగం
బి. రాజ్యాంగం, భారతదేశాన్ని రాష్ర్టాల యూనియన్‌గా వర్ణించింది
సి. 1950లో అమల్లోకి వచ్చిన రాజ్యాంగంలో మొదట 395 అధికరణలు, 8 షెడ్యూళ్లు, 22 భాగాలు ఉన్నాయి
డి. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగ రచనకు పట్టిన కాలం- 2 ఏండ్ల 11 నెలల 18 రోజులు
1) ఎ, బి, సి 2) సి, డి
3) ఎ మాత్రమే 4) డి మాత్రమే
2. రాజ్యాంగ పరిషత్, 1947 ఆగస్టు 29న రాజ్యాంగ రచనా కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి అధ్యక్షుడు డా. బీఆర్ అంబేద్కర్కాగా, మిగతా 6 మంది సభ్యులుగా ఉన్నవారిలో పూర్తికాలం పనిచేయని వ్యక్తి?
1) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
2) ఎన్ గోపాలస్వామి అయ్యంగార్
3) సయ్యద్ మహమ్మద్ సాదుల్లా
4) డీబీ ఖైతాన్
3. గ్రీక్ తత్తవేత్త అరిస్టాటిల్ రాజ్యాంగాన్ని నిర్వచించడమేగాక, రాజ్యాంగాలను వర్గీకరించి రాజ్యాంగంలో ఉండవల్సిన మౌలిక లక్షణాలను పరిశీలించి రాజనీతి శాస్ర్తానికి (Father of Political Science) పితామహుడిగా నిలిచాడు, అయితే ఆయన రచించిన గ్రంథాలు
ఎ. పాలిటిక్స్ బి. రిపబ్లిక్, సోషల్ కాంట్రాక్ట్
సి. డి అనిమా, ఎథిక్స్ డి. పర్వతురాలియా
1) ఎ, డిలు మాత్రమే 2) ఎ, బిలు మాత్రమే
3) ఎ, బి, సి 4) ఎ, సి, డి
4. కింది వాటిలో సరికానిది.
1) రాజ్యాంగ పరిషత్ ఆఖరి సమావేశం-1950 జనవరి 24
2) రాజ్యాంగ నిర్మాణ సభకు సలహాదారుడు- బెనగల్ నర్సింగరావు
3) హిందీని కేంద్ర ప్రభుత్వ భాషగా రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది- 1949 సెప్టెంబర్ 14
4) రాజ్యాంగ పరిషత్‌లో సభ్యులుగా పనిచేసిన మొత్తం మహిళల సంఖ్య- 9
5. రాజ్యాంగ వికాసానికి సంబంధించి సరైన క్రమాన్ని గుర్తించండి?
1) మాగ్నాకార్టా, బిల్ ఆఫ్ రైట్స్, సెటిల్మెంట్ చట్టం, అమెరికా రాజ్యాంగం
2) బిల్ ఆఫ్ రైట్స్, మాగ్నాకార్టా, సెటిల్మెంట్ చట్టం, అమెరికా రాజ్యాంగం
3) మాగ్నాకార్టా, అమెరికా రాజ్యాంగం, బిల్ ఆఫ్ రైట్స్, సెటిల్మెంట్ చట్టం
4) సెటిల్మెంట్ చట్టం, మాగ్నాకార్టా, అమెరికా రాజ్యాం గం, బిల్ ఆఫ్ రైట్స్
6. సుప్రీంకోర్టుకు వచ్చిన ప్రసిద్ధిగాంచిన కింది వ్యాజ్యాల్లో ఆస్తిహక్కుతో సంబంధం లేని వ్యాజ్యం?
1) మినర్వామిల్స్ కేసు- 1980
2) కేశవానంద భారతీ కేసు- 1973
3) ఏకే గోపాలన్ వర్సెస్ కేరళ రాష్ట్రం- 1950
4) గోలక్‌నాథ్ కేసు- 1967
7. కింది వాటిలో కేంద్ర-రాష్ట్ర సంబంధాల అధ్యయనం కోసం ఏర్పడిన కమిటీ?
ఎ. పుంచి కమిషన్
బి. రాజమన్నార్ కమిషన్ సి. సర్కారియా కమిషన్
1) ఎ మాత్రమే 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, సి
8. 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని అనుసరించి కలకత్తా ఫోర్ట్ విలియం కోటలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. దీనికి అనుగుణంగా 1774లో మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎలిజా ఇంఫేతోపాటు ఎంతమంది సాధారణ న్యాయమూర్తులను ఎంపికచేశారు?
1) 3 2) 5 3) 7 4) 10
9. చార్టర్ చట్టాల్లో చివరిదైన 1853 అనుసరించి సివిల్ సర్వీస్ నియామకాలకు సార్వజనిక పోటీ విధానం (Open Merit) ద్వారా నియమించే పద్ధతిని ప్రవేశపెట్టారు. దీనికోసం లార్డ్ మెకాలే కమిటీని ఎప్పుడు నియమించారు?
1) 1853 2) 1854 3) 1858 4) 1861
10. కింది వాటిలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి.
ఎ. దేశంలో ఇంగ్లిష్ విద్యావిధానానికి దిశానిర్ధేశం చేసిన వ్యక్తి- లార్డ్ మెకాలే
బి. దేశంలో సివిల్ సర్వీసెస్‌కు ఒక రూపం తీసుకువచ్చిన వ్యక్తి- కారన్‌వాలీస్
సి. భారత్‌లో మతప్రాతిపదికన నియోజకవర్గాల పితామహుడు- లార్డ్ మింటో
డి. భారత చివరి గవర్నర్ జనరల్, మెదటి వైశ్రాయ్- విలియం బెంటింగ్
1) ఎ మాత్రమే 2) బి మాత్రమే
3) డి మాత్రమే 4) సి మాత్రమే
11. 1946 జూన్, జూలైలో రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికలు జరిగాయి. ఇందులో ప్రతి పది లక్షల జనాభాకు ఒక సభ్యుడి చొప్పున ప్రాతినిధ్యం కల్పించారు. ఫలితంగా రాజ్యాంగ పరిషత్‌కు మొత్తంగా 389 సభ్యులు ఎన్నికయ్యారు. దేశ విభజన తర్వాత ఉన్న సభ్యుల సంఖ్య ఎంత?
1) 2008 2) 229 3) 299 4) 292
12. కింది వాటిని జతపర్చండి.
ఎ. రాజ్యాంగ పరిషత్‌కు శాశ్వాత అధ్యక్షులు 1. బెనగల్ నర్సింగరావు
బి. రాజ్యాంగ పరిషత్ కార్యదర్శి 2. టీటీ కృష్ణమాచారి
సి. అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎంపికైన మొదటి భారతీయుడు 3. బాబూ రాజేంద్రప్రసాద్
డి. ముసాయిదా కమిటీలో న్యాయశాస్త్ర విద్యను అభ్యసించని వ్యక్తి 4. హెచ్‌వీఆర్ అయ్యంగార్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) సి-1, డి-2, ఎ-3, బి-4
3) డి-1, సి-2, ఎ-3, బి-4
4) ఎ-3, బి-2, సి-4, డి-1
13. రాజ్యాంగ రచన 1949 నవంబర్ నెలలో పూర్తయ్యింది. నవంబర్ 26, 1949లో రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించింది. భారత రాజ్యాంగం (గణతంత్ర దినోత్సవం)గా ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
1) 1950 ఆగస్టు 15 2) 1950 జనవరి 26 3) 1950 జనవరి 24 4) 1950 ఆగస్టు 14
14. 1947 ఆగస్టు 15న స్వతంత్య్ర భారతదేశ మొదటి ఆహార, వ్యవసాయ శాఖామంత్రి ఎవరు?
1) షణ్ముఖ శెట్టి 2) డాక్టర్ రాజేంద్రప్రసాద్
3) సర్దార్ బలదేవ్‌సింగ్ 4) రాజకుమారి అమృత్‌కౌర్
15. కిందివాటిని జతపర్చండి.
ఎ. రాజ్యాంగ రచనలో స్నేహితుడు, తత్వవేత్త, మార్గదర్శి 1. గ్రాన్విల్లే ఆస్టిన్
బి. భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం 2. లార్డ్ సైమన్
సి. భారత రాజ్యాంగం సామాజిక విప్లవ దీపిక 3. ఐవర్ జెన్సింగ్స్
డి. రాజ్యాంగ పరిషత్ హిందువులకు మాత్రమే ప్రాతినిధ్యం వహించింది 4. బిఎన్.రావ్
1) ఎ-4, బి-3, సి-1, డి-2
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-3, బి-4, సి-1, డి-2
4) ఎ-1, బి-2, సి-3, డి-4
జవాబులు
1-3, 2-4, 3-4, 4-4, 5-1, 6-3, 7-3, 8-1, 9-2, 10-3, 11-3, 12-2, 13-2, 14-2, 15-1
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు