చరిత్రకు సాక్ష్యాలు -ఆలయాలు
తెలంగాణ ప్రాంతానికి అనంతమైన చరిత్ర ఉంది. చరిత్రకు కానరాని ఎన్నో ప్రాంతాలు, దేవాలయాలు, కోటలు, శాసనాలు, శిల్పాలు మొదలైనవి ఎన్నో శిథిలావస్థలో ఉన్నాయి.
కృత-ప్రాచీన మొదటి యుగంలో (ఆదియుగం-సత్యయుగం) అయోధ్యను పరిపాలించిన కుపేంద్ర మహారాజు (కుప్పానగర్ మాత్రమే తెలుసు) నాలుగో కుబేర పట్టణం అని చాలామందికి తెలియదు. పురాణాలను నమ్మకపోయినా శాసన చరిత్రపరంగా వేసిన శిలాశాసన, ఇతర ఆనవాళ్లు మనకు లభ్యమవుతున్నాయి. తెలంగాణను మొత్తం తీసుకుంటే ఇప్పటివరకు దక్షిణ తెలంగాణలో జరిగిన పరిశోధనలు అమోఘం. అయితే ఉత్తర తెలంగాణ చరిత్రపరంగా తీసుకుంటే తక్కువేమో. భాగ్యనగర్ (హైదరాబాద్)కు 32 కి.మీ. దూరంలో ఉన్న షాద్‌నగర్‌కు చాలా చరిత్ర ఉంది. నాటి మెదక్ జిల్లా (సిద్దిపేట) రాగి దోనెల ఎంతో ప్రసిద్ధిగాంచింది. ప్రత్యేకంగా పుల్లూరు (బండ) మరకత మణిపురం (మర్పగడ) కరీంనగర్ జిల్లా వెలిగందుల దగ్గర గల తోటపల్లి గ్రామ సమీపంలోని కాకతీయుల కాలంనాటి అపురూపమైన త్రికూటాలయం (త్రిలింగ) ఇటీవల మళ్లీ పూర్వవైభవానికి నోచుకుంది.
-శిథిలావస్థలో ఎన్నో ప్రాచీన (విష్ణుకుండినులు, చోళులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, పద్మనాయకరాజుల కాలంలో ఉన్న) దేవాలయాలు ఉన్నాయి. ఎల్లారెడ్డిపేట త్రికూటేశ్వరాలయం (త్రిలింగ), సిద్దిపేట జిల్లాలోని బ్రహ్మ సిద్దేశ్వరాలయాలు శైవ, కార్తికేయ, వైష్ణవ దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోనూ ప్రసిద్ధమైనవి కూడా ఉన్నాయి. వర్ధమానుకోటని తీసుకుంటే బుద్దిస్ట్ స్థలం అని చాలామందికి తెలుసు కానీ జైనులకు కూడా ప్రసిద్ధిగాంచిన మహాస్థలం. చందుపట్ల ప్రాంతం కూడా చెప్పకోదగింది. నారద-మార్కండేయ-విష్ణు-బ్రహ్మాండ పురాణాలను తీసుకుంటే తెలంగాణలో యుగాల చరిత్ర మనకు స్పష్టంగా తెలుస్తుంది. సాక్షాత్తు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు పాదం మోపిన స్థలం వికారాబాద్‌లోని అనంతగిరి ప్రాంతం (బలరామకృష్ణులను కాలయవనుడు తరుముకుంటూ వస్తాడు). ఇలా ఎంతో చరిత్రగలది తెలంగాణ.
నల్లగొండ మండలంలోని రాములబండ ప్రాంతానికి, సంస్థాన్ నారాయణపురం, రాచకొండ, మాన్యంకొండ, దేవరకొండ మొత్తం నాటి 10 జిల్లాలు నేటి 21 జిల్లాలు కలుపుకొంటే 31 జిల్లాలకు ఘన చరిత్ర ఉంది. బౌద్ధ ఆరామ స్థలాలు కూడా ఎన్నో ఉన్నాయి. శాసనాలు, చరిత్ర ఆధార గ్రంథాలు చాలా ఉన్నాయి. నేను చేసిన పరిశోధనలో 11 దేవాలయాలు, 2 నగరాలు కనుగొన్నాను. అలాగే 1) ఏడుపాయల నాగసానిపల్లి ప్రాంతంలో కొన్ని రాక్షసగుళ్లు, శిలాపనిముట్లు 2) తెలంగాణ సాహిత్య చరిత్రకు తెలియని కవులు, రచయితలు, పండితులు, ఆయుర్వేద వైద్యవిద్వానులు 3) ఉమ్మడి పురావస్తు శాఖ తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో 40 ప్రాచీన దేవాలయాలను కనుగొన్నారు.
-ఇలా ప్రాచీన తెలంగాణ చరిత్రను తీసుకుంటే ఎంతో ఉంది. అందులో కొంత శాతవాహన రాజుల దిబ్బలు. మహబూబ్‌నగర్ జిల్లా ఉద్గిరి మండలం కౌ(కం)కుంట్లలో ప్రాచీన ఆనవాళ్లు ఉన్న కపర్దినేశ్వరాలయం గొప్పది. కనేశ్వరుడు-శరబాంకపాలుడు , బౌద్ధులు కూడా ఇక్కడ ఉన్నట్టు చరిత్ర తెలుపుతుంది. పాటలీ(ళీ) కుసుమకూన అనే అమ్మవారు కూడా ఉండేదని చారిత్రక పరిశోధకులు వెల్లడిస్తున్నారు.
నా పరిశోధనలు
1. సింగారించుకుంటున్న యువతి – వరంగల్ కోట (క్రీ.శ.13వ శతాబ్దం – కాకతీయుల కాలం)
2. కోలాటం – రామప్ప దేవాలయం, పాలంపేట, వరంగల్ జిల్లా (క్రీ.శ.13వ శతాబ్దం – కాకతీయుల కాలం)
3. సూర్యుడు – అలంపురం, మహబూబ్‌నగర్ జిల్లా (క్రీ.శ. 7వ శతాబ్దం – బాదామీ చాళుక్యుల కాలం)
4. నాగరాజు శిల్పం – అలంపురం, మహబూబ్‌నగర్ జిల్లా (క్రీ.శ. 7వ శతాబ్దం – బాదామీ చాళుక్యుల కాలం)
5. జైనుల సరస్వతి – మహూరు, ఆదిలాబాద్ జిల్లా
(క్రీ.శ. 11వ శతాబ్దం – కళ్యాణి చాళుక్యుల కాలం)
6. అన్నపూర్ణ – చొప్పదండి, కరీంనగర్ జిల్లా
(క్రీ.శ. 11వ శతాబ్దం – కళ్యాణి చాళుక్యుల కాలం)
7. వర్ధమాన మహావీరుడు – గొల్లత్తగుడి, మహబూబ్‌నగర్ జిల్లా (క్రీ.శ. 10వ శతాబ్దం – కళ్యాణి చాళుక్యుల కాలం)
8. నమూనా దేవాలయంలో ఉమామహేశ్వరులు – ఏలేశ్వరం, నల్లగొండ జిల్లా (క్రీ.శ. 4వ శతాబ్దం – విష్ణుకుండినుల కాలం)
9. వీర వనిత – వరంగల్ కోట (క్రీ.శ. 13వ శతాబ్దం)
10. నాగిని – రామప్ప దేవాలయం, పాలంపేట, వరంగల్ జిల్లా
(క్రీ.శ. 13వ శతాబ్దం – కాకతీయుల కాలం)
11. దేవరకొండ దుర్గం – దేవరకొండ, నల్లగొండ జిల్లా (రెడ్డి రాజుల కాలం నాటి అరుదైన దుర్గం)
12. లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం శిలా విగ్రహాలు – పులిగొండ, ఖమ్మం జిల్లా (క్రీ.శ. 14వ శతాబ్దం – కళ్యాణి చాళుక్యుల కాలం)
13. లక్ష్మీనరసింహస్వామి, ఆంజనేయస్వామి విగ్రహాలు – శనిగరం, కరీంనగర్ జిల్లా
14. కుప్పానగర్ ఆనవాళ్లు యుగాల నాటిది, ఝరాసంగం.
15. పైడి గుమ్మ(ల్)ల కోహీర్ (ఓంకార పట్టణం) – కపాల కుండలి అనుష్టాన ప్రాంతం – మానసాదేవి
16. నాటి వ్యాఘ్ర (నగరి)పురి- నేటి పుల్లూరు (ఖండ) ప్రాంతం – అష్టభైరవ జపానుష్టాన(గిరి) ప్రాంతం. ఇలా ఎన్నో ఎన్నెన్నో…
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు